వర 'భాష తెలుగు ' - అచ్చంగా తెలుగు

వర 'భాష తెలుగు '

Share This
వర 'భాష తెలుగు '
- సుజాత. పి.వి.ఎల్తెలుగు వారిమైనట్టి
తెలుగు మాట్లాడక
ఆంగ్ల భాషకు హారతులు పట్టుటేల ?
'వర 'భాష అయినట్టి
మన భాషనొదిలి
పర భాషని కీర్తిస్తూ బ్రతుకుటేల ?
రాయలేలిన సీమ రతనాల సీమని ..
రత్నమై తెలిపే మన తెలుగు భాష
తేట తెల్లనైన మన తెలుగు మాటలు ..
తేట గీతిని తెలుపు మన తెలుగు పాటలు..
మన భాషకే సొంతమని మరిచినారా ?
పద్య కవితలతో పరమాన్నమే చేసి
చంపక ,ఉత్పల మాలతో మాలలే అల్లి
కందము , సీసములతో వచనాలు కూర్చి
తెలుగు తల్లిని పూజింప పుణ్యమొచ్చున్ ..!
గర్వమంతా ప్రోగు చేసుకుని పలకరా..తెలుగుని
నీ భాష 'తెలుగుని 'చాటరా ఎలుగెత్తి ..
దేవ భాషకి ధీటైన భాషరా.. మన తెలుగు
తెలుగులో మాట్లాడి పొందరా ఎనలేని గౌరవం ..!

*******

No comments:

Post a Comment

Pages