ఈ చేతితోనే బువ్వ పెట్టాను - అచ్చంగా తెలుగు

ఈ చేతితోనే బువ్వ పెట్టాను

Share This
 “ఈ చేతి తోనే బువ్వ పెట్టాను “
చెంగల్వల కామేశ్వరి 

పట్టుకెళ్లాల్సినవన్ని స్టీలు డబ్బాలలో వరసగా సర్దుతోంది. దుర్గ.కళ్ళ నీళ్ళు కొంగుతో ఒత్తుకుంటూ,ఏడ్చి ఎరుపెక్కిన మోముతో,  మవునంగా అన్యమనస్కంగా మరబొమ్మలా చేసుకుపోతున్న భార్యను చూసి ధీర్ఘంగా నిట్టూర్చాడుఆంజనేయులు. 
“నీ పిచ్చి కానీ, ఎన్నేళ్ళు ఇలా వాడి గురించి బాధ పడతావు! ఎక్కెడెక్కడ ఎన్ని చోట్ల ఎంతమందికి ఎన్ని ఇచ్చినా వాడికి ఇచ్చినట్లు అవుతుందా ! రాధిక అంటే వాడి తల్లి దాని భ్రమలు దానికుంటాయి . నువ్వు కూడా ఇలా ఆలోచిస్తూ శ్రమ పడటం దేనికి ఎలాగు వాడి పేరుతో కొన్ని మంచి పనులు చేస్తున్నావు ఎన్నేళ్ళు బాధ పడితే వాడు తిరిగొస్తాడు” అన్నాడు ఆంజనేయులు .
భర్త మాటకు చివ్వున తల ఎత్తి “ఈ చేతులతో వాడిని ఎత్తుకున్నాను. అన్నం తినిపించాను. నిద్రబుచ్చాను. అమ్మలాంటి పెద్దమ్మ లా వాడి ప్రేమ పొందాను .బంగారు తండ్రి ఎంతటి వాడయ్యే వాడో !వాడిని ఎలా మరువగలనండి? వాడి ఈడు పిల్లలను ఎవరిని చూసినా గుండె కలుక్కుమంటుంది. ఎదో నా పిచ్చి నాది! ఈ రోజంతా వాడి జ్ఞాపకాలలో నన్నోదిలేయండి! .అని సర్దిన డబ్బాల మూతలు పెట్టింది .
అన్నీ అనిల్ కుమార్ చక్రవర్తికి ఇష్టమైనవే! సున్నుండలు,లడ్డూలు, సాంబార్, బంగాళదుంప వేపుడు కొబ్బరిపచ్చడి బిరియాని రవ్వకేసరి అన్నీ స్వయంగా చేసి రకరకాలుగా ప్యాక్ చేసుకుంటున్న దుర్గని ఉద్దేశ్యించి "ఇవాళెక్కడికి పట్టుకెడుతున్మావు.? ఎవరెవరు వేడుతున్న్నారు? అనడిగాడు.ఆంజనేయులు
"ఇవాళ తారనాకలో ఎస్వీ కాలేజ్ కి తీసుకెళతానంది కుసుమ. అక్కడికేమేమిద్దరమే వెడతాము.! అంది దుర్గ మోచేత్తో మొహంమీదపడుతున్న జుట్టుని వెనక్కి తీసుకుంటూ, ఇంతలో  బయటనుండి లాంఛనంగా  కాలింగ్ బెల్ కొట్టి లోపలికి వచ్చిన కుసుమని చూస్తూ
" వచ్చేసావా! నేనూ రెడీయే! నేను తేమ్మన్నవన్నీ  తెచ్చావ ? అనడిగింది “
ఆమె ప్రశ్నకు “ హా తెచ్చాను! అందుకే ఆలస్యమయింది “రాదికవాళ్ళు  గుడి లో అన్నదానం చేస్తున్నారు కదా !ఒకడుగు అటు కూడా వెళ్లి వచ్చాను !అంటున్న కుసుమ చేతికి కాఫీ గ్లాస్ అందించి
“మంచి పని చేసావు మనం అక్కడ త్వరగా ముగించి అక్కడికే వెళ్ళాలి కదా ! అంటూ బొడ్లో చెక్కుకున్న చీర కుచ్చెళ్లు సరిచేసుకుని  చెమటకి కరిగిన బొట్టుని మళ్లీ పెట్టుకుని. దేముడికి దణ్ణం పెట్టుకుని ‘ఏమిటో నాకు ఈ జూన్ నెల  అంటేనే భయమేస్తుంది. రాధిక, రాఘవ బాగా డల్ గ అయిపోతారు. పైకి చెప్పరు. కానీ లోపల ఎంత బాధ వుంటుందో మనకు తెలియదా !మనకే ఇంత బాధ ఉంటె కానీ పెంచిన వారికేంతుంటుంది ? దేముడు వోర్వలేదు అంటూ
తాను సర్దినవన్నీ కుసుమకి ఎక్స్ ప్లెయిన్ చేసి అన్నింటిని డ్రైవర్ చేత కారులో పెట్టించుకుని ఆంజనేయులకి వెళ్లొస్తాము అని చెప్పి బయల్దేరారు‌దుర్గ కుసుమ.
వాళ్లని పంపి లోపలికొస్తూ అప్రయత్నంగానే పలలక్కన షెల్ఫు లో ఉన్న “అనిల్ కుమార్ చక్రవర్తి” ఫొటో పైన ఆంజనేయిలు దృష్టి పడింది.అ ఫోటో చూడగానే గుండె త్రుళ్ళి పడింది నిజంగా చూస్తున్నట్లు  సహజం గ వుంది.
  సరిగ్గా పదేళ్లయింది. వెర్రినాయన పెద్దమా! పెద్దమ్మా! అంటూ దుర్గ వెనకాలే తిరిగేవాడు. చిన్నపటినుండి తమింట్లో ఇంకో పిల్లాడిలా  తమకొడుకు సురేష్ తో ఆడిపాడేవాడు.
దుర్గ వాడిని చెల్లెలి కొడుకులా కాకుండా తన గారాల కొడుకులా ముద్దు చేసేది.ఇంట్లో అందరిపిల్లల కన్నా ఆఖరు కావటాన
వాడంటే అందరికీ ముద్దుగా ఉండేది. అందులో రాధిక వాళ్లది ఉమ్మడి కుటుంబం కావటాన పిన్నిలు బాబయ్యలు బామ్మ తాతగారికి అమూల్య అన్నా, అనిల్ అన్నా మహా ప్రాణం!
  దుర్గ కి చిన్నతనంలోనే పిల్లలు పుట్టటాన పిల్లలను సాకటంలో గల ఆనందం చాలా రోజులు తెలీదు. తనని నిద్రపోనివ్వరని,తిండి తిన్నప్పుడే ఏడుస్తారని ఉడుకుమోత్తనంథో ఏడ్చేది.కాని,సురేష్ కి గాయత్రికి నాలుగయిదేళ్ల వయసులో దుర్గ చెల్లెలు రాధిక కి  అమూల్య తర్వాత అనిల్ కుమార్ చక్రవర్తి పుట్టడాన అందరికన్నా చిన్నాడని గారంగా చూసేవారు
బొద్దుగా ముద్దుగా ఉండేవాడు.అందరి దగ్గరకి కొత్త అన్నదిలేక ఉండడం వలన దుర్గకి బాగా మాలిమి అయ్యాడు.వాళ్ల అమ్మ ఉన్నా కూడా పెద్దమ్మే కావాలన్నంతగా చేరువైపోయాడు.చిత్రంగా దుర్గ కూడా తమపిల్లలు కాస్త పెద్ద అయ్యారు కాబట్టి వాడికి అన్నం తినిపించడం, నిద్రబుచ్చడం, వంటివన్నీ ఇష్టంగా చేసేది. అవన్నీ చూసి సురేష్ కి అలకొచ్చేసేది. అలాంటప్పుడు పెద్దమ్మ నాది! నీదికాదు. అనిమరింత కవ్బించేవాడు.
వాళ్లిద్దరూ దెబ్బలాడుకుంటే “అనిల్ చిన్నాడు కదురా! అలా చేయకూడదు"అని అమ్మ తనకే తమకే నచ్చచెప్తోంది అని సురేష్ కి ఇంకా కినుక ఎక్కువయ్యేది. పిత్రు ప్రేమతో అలాంటప్పుడు సురేష్ ని వెనకేసుకొచ్చి తను కూడా దుర్గ ని తిట్టేవాడు.

"సురేష్ నీ కన్నకొడుకని మర్చిపోకు ! వాడంటే ప్రేమ ఉంటే ఒకే! కాని సురేష్ ని తక్కువ చేయకు అని. దానికి దుర్గ
 " అదేంటండీ! నాకొడుకుని వెనకేసుకుని వచ్చి వీడు కొట్టినా ఏమీ అనొద్దా! ఎవరి మీద ఉండే ప్రేమ వాళ్లకుంటుంది. మధ్యలో మీరు దూరకండి !అని ఎదురు చివాట్లేసేది
అలా స్కూలుకి హైస్కూలు కి కాలేజ్ కి వెళ్లేం వాడయినా వాళ్ల ఇద్దరి అనుబంధం మరింత పెరిగింది.ఎవరి మాట వినకపోయినా పెద్దమ్మ చెప్తే వినేవాడు.  ఎవరైనా "అనిల్" అని పిలిస్తే ఒప్పుకునేవాడు కాదు  పూర్తి పేరు తో పిలవాలనేవాడు. వాడికోసం దుర్గ అందరినీ అలాగే పిలవమనేది.వాఢు  నీట్ గా  క్రాఫ్ దువ్వుకొచ్చినా ఈ పెద్దమ్మకి సంబరమే! వాడు ఏది కొనుక్కున్నా పెద్దమ్మకి చూపించాల్సిందే!
ఇంక పెద్దమ్మ దగ్గరకి వస్తే వాడికిష్టమయినవే చేయాలి. ప్రత్యేకంగా సాంబార్ చేస్తే వాడికి ఒక కప్పులో పోసి ఒక స్పూను వేసి ఇవ్వాలి. వాడు" కలిపి పెట్టు పెద్దమ్మా అందరికీ "అంటే కలిపి పెట్టాల్సిందే! కావాలని వేరేవాళ్ల వంతు వస్తే కూడా తానే ముందుకొచ్చేసి తినేసి మిగతావాళ్లని ఉడికించేవాడు.
వాళ్లమ్మా నాన్న మీద అలకొస్తే పెద్దమ్మ దగ్గరకొచ్చి ఉండిపోయేవాడు. కారణాలు అడగకుండా వాడొచ్చినందుకే ఆనందపడేదిి.
ఇంక వాడు చెప్పే మాటలు జోకుపాడేపాటలు చేసే డాన్సులు తో సురేష్ గాయత్రి అమూల్య కలగలిసి ఇల్లంతా సందడి సందడి గా ఉండేది.దుర్గ కు ఇష్టమని కాలేజ్ నుండి మిర్చి బజ్జీలు తెచ్చేవాడు. తెల్లని పమేరియన్ కుక్కలంటే ఇష్టమని ఒక ఫ్రెండ్ దగ్గరనుండి తెచ్చి ఇచ్చి దాన్నెలా పెంచాలో వాళ్ల పెద్దమ్మకి చెప్పేవాడు.
 వేసవి సెలవులకు అమ్మమ్మ గారింటికి కాస్త ముందుగ బయల్దేరిన పెద్దమ్మతో పేచీలు పెట్టి అప్పటికప్పుడు అమూల్య అనిల్ కూడా వెళ్ళిపోయేవారు . సురేష్, గాయత్రి .అమూల్య, అనిల్, లను చూసి “నలుగురూ మీ పిల్లలేనా అంటే అవును !అని నవ్వుకునేది.
 దుర్గ ని ఒకసారి ఎదో గొడవలో తను తిట్టాడని దుర్గ ఏడిస్తే అనిల్ కూడా ఏడుస్తూ “ ఎందుకండీ మా పెద్దమ్మను ఏడిపిస్తారు !
మా పెద్దమ్మను నేను  మా ఇంటికి తీసుకెళ్ళి పోతాను “ అని అంటే నవ్వాగలేదు . ఇంకా దుర్గ సంబరానికి అంతు లేదు నువ్వు మా నాన్న లా  అన్నయ్య లా చెప్పావురా !చెప్పుకోలేని కుటుంబ సమస్యలతో దుర్గ కంటతడి పెట్టడం చూసి వాడు
" పెద్దమ్మా! ఏడ్వకు పెద్దమ్మా ! నువ్వు ఏడిస్తే చూడలేను! అని ఏడ్వటం చూసి, దుర్గ తన బాధ మర్చిపోయి వాడిని ఓదార్చటం
తాము మరువలేరు. తెల్లగా మంచిపొడవుగా రాజకుమారుడిలా ఉన్న వాడిని చూసి ఏ విధి కళ్లు కుట్టాయో!
అలాంటిది సడన్ గా జరిగిన ఒక  రోడ్డు ప్రమాదంలో "అనిల్ కుమార్ చక్రవర్తి" అసువులు బాయడం అందరి గుండె బ్రద్దలు కొట్టింది. తను కుడా చలించిపోయాడు ,కుటుంబమంతా షాక్ కి గురయ్యారు ఎక్కడో వార్తల్లో వినే దుర్ఘటన తమ కుటుంబం లో జరగడం తట్టుకోలేకపోయారు.అంతకు ముందు వారం రోజులక్రితమే ,రాధిక వాళ్ళింటిలో ఫంక్షన్ జరిగింది.
అయిదుగురు కొడుకులు, కోడళ్ళు, ఆడపడుచు, ఇంటిఅల్లుడు,వియ్యపురాళ్ళు,వియ్యంకుల హడావిడి మనవలు మనవరాళ్ళు ఇతర బందువుల సమక్షం లో అంగరంగ వైభవముగా జరిగిన’ గోల్డెన్ జూబ్లి వేడుక’అందరిని ఆనందపరిచింది . ఎవరి కళ్ళు అ ఇంటి మీద పడ్డాయో, కానీ,కాలేజ్ నుండి ఫ్రెండ్ బైక్ మీద ఫ్రెండ్ తో వస్తున్న అనిల్ ని లారీ ఒకటి డీకోందని,అనిల్ అక్కడిక్కడే పోయాడని తెలిసి ఇంటిల్లిపాదీ కుప్పకూలిపోయారు.
వేడుక ఆనందంలోంచి తేరుకోకుండానే ఇంతటి ఘోరం జరిగేసరికి వెళ్ళిన బంధువులందరూ హుటాహుటిన వచ్చేసారు.రోదనలతో ఆ ఇల్లు దద్దరిల్లిపోయింది .ఎవర్ని ఎవరూ ఓదార్చాలో తెలీని పరిస్థితి! బామ్మతాతలు,అమ్మమ్మ తాతలు, పిన్న్నిలు బాబయ్య లు, అత్తఃలు మామయ్య లు, ఒక్కగానొక్క పెద్దమ్మ దుర్గ తోటి పిల్లలు అందరుతల్లడిల్లిపోయారు. ఒకరొకరుగా వస్తున్న జనాలతో, ఆ వీధంతా నిండిపోయింది.
కాలనీలో జనం  కాలేజ్ ఫ్రెండ్స్తో  రాఘవ ఆఫీస్ స్టాఫ్  రోడ్డంతా క్రిక్కిరిసి పోయింది. జనంతో, పద్దెనిమిదేళ్లుగారంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న చేతికందొచ్చిన కొడుకుని పోగొట్టుకుని పుత్రశోకంతో తల్ల డిల్లుతున్న రాధికను, రాధిక భర్త రాఘవను,చూసి హృదయం ద్రవించని.వారు లేరు!కంట తడి పెట్టని వారు లేరు .అంత బాధలో కూడా అనిల్ కుమార్ చక్రవర్తి కనులు  నేత్రదానం,అవయవ దానం , చేసిన ఆ దంపతులను మనసులోనే కొనియాడ ని వారు లేరు.  

తమకి ఎంత దుఃఖమున్నా దాచుకుని, రాధికనూ, రాధిక భర్త రాఘవను ఓదార్చడం కోసం లేని ధైర్యాన్ని నటించాల్సి రావడం ఎంత బాధాకరమో! అందరికీ అనుభవములోకి వచ్చింది.
"నేను పెద్ద ఉద్యోగం చేస్తాను! పేద్ద కారు కొంటాను.! అమెరికా వెడతాను వడుగు చేసుకోవాలంటే  అందరూ నాకుగొలుసులే కొనాలి, అలా అయితే మొత్తం నాకు పదిహీను గొలుసులు ఒస్తాయి.! అని లెక్కలు వేసి చెప్పి వాడి కోర్కెలన్ని చెప్పి,ఉవ్విళ్లూరే 'బంగారుకొండ' ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోతే,ఎ దేముడ్ని అడగాలి ?
ఆ దుఖం నుండి కోలుకోవడానికి ఎన్నేళ్లో పట్టింది.
ఎంత కోలుకున్నా, ఏటేటా వాడి పుట్టినరోజువచ్చినా,వాడు పోయిన రోజు వచ్చినా, వాడి జ్ఞాపకాలతో బాధపడుతూనే వాడికిష్టమయినవి.
 వాడి ఈడు పిల్లలకి తాను స్వయంగా చేసి పట్టుకెళ్లి పెట్టేవరకు నిశ్శబ్దంగా ఉన్నా, అంతమందిలో వాడు లేడని, ఉంటే,పెళ్లిపేరంటం అయి, పిల్లల తండ్రి అయి ఉండాల్సిన వాడిని,ఎవరిలో చూసుకోగలం ! అని కుమిలిపోతారు.
ఒకరినొకరు పలకరించుకోవటానికి కూడా భయపడతారు, "అనిల్ కుమార్ చక్రవర్తి "గురించి కాక మరేదీ మాట్లాడుకోలేరు ,మాట్లాడుకుంటే, సంభాళించుకోలేక వాడి స్మృతులతోనే గడిపే దుర్గను చూస్తే  "పెంచిిన  ప్రేమ ఎంత గొప్పదో ! అనిపిస్తుంది .ఎందుకో దేముడు ఈ అనుబందాలేందుకు పెంచుతాడో !మృత్యువు ని పంపి దూరమెందుకు చేస్తాడో అగమ్య గోచరం”

బతికినన్నాళ్ళు గుండెల్లో పోయినవారి దుఃఖాన్ని మోస్తూ,తిరగడమొక ఎత్తు ! సానుభూతి భరించలేక  ధైర్యం గ తిరుగుతున్నట్లు మిగతావారి వేడుకలలో పలు పంచుకోవడం కూడా ఒక ఇబ్బందే కానీ తప్పదు. మరుపు వరమిచ్చాడు దేముడు అంటారు.కానీ అది తప్పు నిజం కాదు కళ్ళల్లో నీళ్ళు ఇంకి గుండె కడవ నిది భారం పెరుగుతుంది కానీ పోయినవారిని ఎన్నడు ఎవరూ మరువలేరు. మనిషిని పోగొట్టుకోవదాన్ని మించిన బాధ మరోటి లేదు ,అనిల్ అని పేరుంటే చాలు వాళ్ళని విపరీతంగా ఇష్టపడిపోవటం వాళ్లకు ఏవేవో చేసివ్వడం, వాళ్ళు మొహమాటపడుతున్న సరే! తినేదాక వదలకపోవటం విషయం తెలిసి వాళ్లు జాలి పడటం చూసి మండలించేవాడు తను.
ఎవరి సానుభూతి పోయిన వాళ్ళని తీసుకురాదు.కాస్త మనసు స్థిమిత పరచుకోవాలి అని చెప్పేవాడు తను.నిజానికి పోగొట్టుకున్నదానికే విలువ ఎక్కువ!అలా పోయిన వారితో కల సంబంధ భాంధవ్యాలు  అ వ్యక్తి కి సంబంధించిన ప్రతి ఒక్కరిని బాధ పెడతాయి.కాకపోతే కాస్త ఎక్కువా తక్కువ అంతే ! అలా తనకి కూడా రాధికా రాఘవ అంత కాకున్నా, దుర్గ అంత కాకున్నా,వాడితో కల అనుబంధమేన్తుందో అంత బాధ తనది కూడా,
"కంటే నే అమ్మ అని అంటే ఎలా?"కడుపు తీపి తెలియకుంటే బొమ్మే కదా! రాతిబొమ్మే కదా! పిల్లలనయినా పెద్దలనయినా ప్రేమించే కమ్మని మనసున్న ప్రతీ ఆడదీ అమ్మే కదా!
మనిషి జన్మ ఎత్తాక మరణ దుఖం ఎవరిదయినా ప్రతీ మనసుకి తాకకుండా ఉండదు. ఆపాటి మానవత్వం లేకుంటే మనిషే కాదు.
అహర్నిశలు ఇంతగా ప్రేమించే కుటుంబ సభ్యులున్నఅనిల్ కుమార్ చక్రవర్తికి మరణమేక్కడిది? తను చేసిన నేత్రదానం తో అవయవ దానంతో, అజరామరంగా చక్రవర్తిలా ఎందరిలోనో జీవిస్తుంటాడు. మరెందరినో తనలా జీవించమంటాడు.
తమవారిని పోగొట్టుకున్నవారెవరయిన  తన తల్లితండ్రులు లాగ శోకం లో కూడా పలువురి క్షేమం కోరాలి   పలువురికి మార్గ దర్శకం కావాలి అని, శాసిస్తాడు. వాడు  ఎంతయినా“అనిల్  కుమార్ చక్రవర్తి కదా!అనుకుని నిట్టూర్చాడు ఆంజనేయులు,
***

No comments:

Post a Comment

Pages