గొప్ప నేత మన జాతిపిత - అచ్చంగా తెలుగు

గొప్ప నేత మన జాతిపిత

Share This
గొప్పనేత..మన జాతిపిత
-సుజాత. పి.వి. ఎల్.అక్టోబర్ రెండున
పోరుబందరులో పుట్టి
పోరాటమే చేసి
విధి నిర్వాహణకు మించిన
దేశసేవయే లేదని
ప్రపంచానికే చాటి చెప్పిన
గొప్పనేత..గాంధీతాత!

ఒక చెంపపై కొడితే
మరో చెంపని చూపించిన
అహింసావాది.!
'క్షమ' బలవంతుల లక్షణమని
దుర్భలులు ఎన్నటికీ క్షమించలేరని
సత్య మార్గమే సన్మార్గమని
ఎలుగెత్తి చెప్పిన ధీశాలి !

ఆంగ్లేయుల దౌర్జన్యాలను
సహనంతో ఎదుర్కొని
భరతమాతను దాస్యశృంఖలాల నుండి
విముక్తి చేసి
మన స్వాతంత్ర్య జెండాను ఎగురవేసి
భారత దేశ గౌరవాన్ని నిలిపిన
త్యాగమూర్తి..గాంధీజీ.!

******


No comments:

Post a Comment

Pages