అమ్మ గురించి - అచ్చంగా తెలుగు
అమ్మ గురించి......
   భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

అమ్మగురించి ఆలోచించనివాడు
ఆనందంగా ఉండలేడు.
అమ్మాఅని నోరారా పిలువనివాడు
ఆత్మీయతతో నిండలేడు.
అమ్మగురించి ఆత్రుత చెందనివాడు
అశాంతితీరాన్ని దాటలేడు.
అమ్మని గుండెల్లో ప్రతిష్టించుకోలేనివాడు
ఆగుడిలో దేవుని కరుణను పొందలేడు.
అమ్మవిలువను తెలుసుకోలేనివాడు
జీవితం విలువలను తెలుసుకోలేడు.
అమ్మ అనేపదానికి అర్ధం తెలుసుకోలేనివాడు
అర్ధాంగి విలువకూడా కనుగొనలేడు.
ఇంటగెలువలేనివాడు రచ్చగెలువలేడు.
అమ్మఆశీస్సులను పొందలేనివాడు
యశస్సును పొందలేడు.
అమ్మఆనందాన్ని కోరలేనివాడు
ఏ ఉషస్సును చూడలేడు.
అమ్మపాదాలను తాకలేనివాడు
ఏ పరమపదాన్నీ పొందలేడు.
అమ్మసేవ చేయలేనివాడు
ఏ సౌభాగ్యాలకు నోచుకోలేడు. 
 ***

No comments:

Post a Comment

Pages