రాజ్యంగాన్ని అందంగా తీర్చి దిద్దిన కళాకారుడు -శ్రీ నందలాల్ బోస్ - అచ్చంగా తెలుగు

రాజ్యంగాన్ని అందంగా తీర్చి దిద్దిన కళాకారుడు -శ్రీ నందలాల్ బోస్

Share This

రాజ్యంగాన్ని అందంగా తీర్చి దిద్దిన కళాకారుడు -శ్రీ నందలాల్ బోస్
అంబడిపూడి శ్యామసుందర రావు 

భారత రాజ్యంగాన్ని ఎందరో మేధావులు  వివిధ కమీటీలుగా ఏర్పడి చిట్టచివరకు డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ అధ్యక్షతన ఏర్పడే డ్రాఫ్ట్ కమిటీ రెండేళ్లు శ్రమించి తయారుచేశారు ఈ రాజ్యాంగాన్ని భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలతో అందముగా తీర్చి దిద్దే భాద్యత అప్పటి ప్రముఖ చిత్రకారుడు నందలాల్ బోస్, అతని శిష్యులకు అప్పగించబడింది. రాజ్యాంగ నిర్మాణ అసెంబ్లీకి,భారత దేశానికి రిపబ్లిక్ (గణ తంత్ర)హోదాను నిర్వచించటానికి   సుమారు రెండు సంవత్సరాల కాలము పట్టింది వివిధ దేశాల రాజ్యాంగాలనుండి సేకరించిన అనేక విషయాలను క్రోడీకరించి చిట్టచివరకు నవంబర్ 26,1949 నాటికి పూర్తిచేయగలిగారు.ఆ తరువాత మన రాజ్యాంగము వివిధ జాతుల భాషల, మతాల సంస్కృతుల ను ప్రతిబింబిస్తూ భిన్నత్వములో ఏకత్వానికి ప్రతీకగా ఉండాలి కాబట్టి ఈ రాజ్యాంగములో వివిధకళారూపాలను చూపే చిత్రాలతో అందముగా ఆకర్షణీయముగా తీర్చి దిద్దాలని భారత రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ఈ పనికి ప్రేమ్ బేహారి నారాయణ్ రైజద ను సంప్రదించారు కానీ అయన సలహా మేరకు ఈ బృహత్ కార్యాన్ని నందలాల్ బోస్ అతని శిష్య శిష్య బృందానికి అప్పజెప్పబడింది.

నందలాల్ బోస్ 3,డిశంబర్ 1882లో ముంగేర్ లో ఒక మధ్యతరగతి కుటుంబములో జన్మించాడు అతని కుటుంబము నుండి అతనికి చిత్రకళలో ప్రావీణ్యత సంపాదించటానికి సరిఅయిన సపోర్ట్ లభించలేదు అయినప్పటికీ అయన తనకు  ఉన్న ఆసక్తి  ,అభిమానము ప్రేమ వల్ల కళల పట్ల కృషిని కొనసాగించి 20వ శతాబ్దపు అత్యున్నత కళాకారుడిగా ఎదిగాడు. నందలాల్ బోస్ విశ్వకవి రవీంద్రనాధ్ టాగోర్ మేనల్లుడు అయిన అబనింద్ర నాధ్ టాగోర్ కు అభిమాని కలకత్తా స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో చేరిన బోస్  అతి కష్టము మీద ఒక స్నేహితుని ద్వారా టాగోర్ ను కలిసి తాను గీసిన యూరోపియన్ పెయింటింగ్స్ ను టాగోర్ కు చూపించి అయన అభిమానాన్ని చూరగొన్నాడు టాగోర్, బోస్ ను తన శిష్యుడిగా చేర్చుకోవటానికి అంగీకరించాడు అనతి కాలం లోనే  బోస్ టాగోర్ ప్రియా శిష్యుడు అయినాడు. 
నందలాల్ బోస్ తన కెరీర్ లో సుమారు 7000 పోర్ట్రైట్స్ (వ్యక్తుల పటాలు)గీశాడు అవన్నీ ప్రస్తుతము ఢిల్లీ లోని నేషనల్ గేలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ లో ప్రదర్శింప బడుతున్నాయి  అయన గీసిన పటాలు "శివ ,సతి" ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ లో ప్రదర్శింపబడి ఆ రోజుల్లోనే 500 రూపాయల నగదు బహుమతి వచ్చింది. ఆ డబ్బుతో బోస్ భారత దేశము అంతా  తిరిగి తన చిత్రాలకు కావలిసిన ప్రేరణలను పొందేవాడు. మనము చూసే ఉప్పు సత్యాగ్రహమునాటి చేతిలో కర్రతో ఉన్న మహాత్మాగాంధీ చిత్రపటము బోస్ గీసినదే ఈ నాటికి ఆ బ్లాక్ అండ్ వైట్ చిత్ర పటము అహింసా నిరసనలకు ఒక గుర్తుగా ప్రజల మదిలో నిలిచిపోయింది 
ఈ విధమైన ప్రతిభాపాఠవాలు ఉన్న బోస్ కు రాజ్యాంగాన్ని అందముగా ఆకర్షిణీయముగా తీర్చి దిద్దే భాధ్యతను భారత ప్రభుత్వము  అప్పజెప్పింది.ప్రతి పేజీని కళాత్మకంగా తీర్చి దిద్దటంలో బోస్ సఫలీకృతుడైనాడు. రాజ్యాంగాన్ని అందముగా తీర్చిదిద్దటమేకాకుండా భారత ప్రభుత్వము  వార్షికంగా ఇచ్చే పద్మశ్రీ ,పద్మభూషన్ ,భారత రత్న వంటి గౌరవ పురస్కారాలను డిజైన్ చేసినఘనత బోస్ కె దక్కుతుంది.రవీంద్రనాథ్ టాగోర్ కోరిక మేరకు బోస్ టాగోర్ స్థాపించిన శాంతి నికేతన్ లోని కళా భావం కు ప్రిన్సిపాల్ గా సుదీర్ఘ కాలము అంటే 1922 నుండి 1951వరకు ఉన్నాడు. శాంతినికేతన్ లోని బోస్ శిష్యుల ఒకడైన బీహార్ రామ్ మనోహర్ సిన్హా రాజ్యాంగములోని పీఠిక కు రూప కల్పన  చేసాడు
రాజ్యాంగము యొక్క చేతివ్రాత ప్రతికి చుట్టూ బోర్డర్ హెడ్డింగులు మొదలైన పనులన్నీ బోస్ స్వయముగా చేశాడు కవర్ పేజీని అజంతా చిత్రాల మాదిరి బంగారు రంగుతో అలంకరించాడు రాజ్యాంగములోని ప్రతిభాగము మన దేశ చరిత్రకు సంబందించిన ఒక సన్నివేశంతో ప్రారంభించాడు ఈ విధమైన కళాఖండాలు వేదకాలం నుండి,గుప్తుల మౌర్యుల ,మొఘలుల పరిపాలనాలకు సంబంధించినవి బోస్ కళాత్మకముగా  పూర్తిచేసిన భర్త రాజ్యాంగ చేతివ్రాత ప్రతిని రాజ్యాంగ అసెంబ్లీ లోని 284 మంది సభ్యులు వారి సంతకాలతో ఆమోదించారు ఈ ప్రతిని డెహ్రడూన్ లోని సర్వేఆఫ్  ఇండియా వారు ఫొటోలిథోగ్రాఫ్ కాపీలు  తయారుచేశారు అసలు ప్రతిని ప్రత్యేకమైన హీలియం తో నింపబడిన కేస్ లో భద్రపరచి భారత పార్లమెంట్ లైబ్రరీలో జాగ్రత్త చేయబడింది.
 భారతీయ కళా సంప్రదాయాన్ని దిగంతాలకు విస్తరింపజేసిన మహాశిల్పి. భారతీయ కళా హృదయాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప కళాకారుడు.ఆయన గాంధీజీ, రవీంద్రుల ప్రేమాదరరాలను చొరగొన్న గొప్ప కళాకారుడు ఆయనకు 1954లో భారత ప్రభుత్వము పద్మ విభూషణ్ బిరుదు తో సత్కరించింది అయన గొరవర్థము అయన చిత్రముతో పోస్టల్ 
స్టాంప్ ను కూడా విడుదల చేసింది ఏప్రిల్ 16,1966లో ఈ గొప్ప కళాకారుడు మరణించాడు కానీ భారత రాజ్యాంగము ద్వారా అయనను భారత దెస ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారు  
*** 

No comments:

Post a Comment

Pages