నాకు నచ్చదు
 భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

అమ్మానాన్నలను విడిచి 
పిల్లలుదూరంగాఉండటం నాకునచ్చదు.
పెద్దలు పిల్లలఅల్లరిని 
భూతద్దంలో చూడటంనాకునచ్చదు.
బంధువులు రాబందుల్లా
పీక్కుతినటం నాకునచ్చదు.
స్నేహితులు ఏసంబంధం లేనివారిలా
దూరంగాఉండటం నాకునచ్చదు.
ఆడపిల్లలని,మగపిల్లలని
భేదభావంతో చూడటం నాకునచ్చదు.
పిల్లలను శాసిస్తూ,వాళ్ళనుండి ఏవేవోఆశిస్తూ
పెంచటం నాకునచ్చదు.
అమ్మని, అర్ధాంగిని
సమానంగా చూడకుంటే నాకునచ్చదు.
ఒకరికోసం ఇంకొకరిని 
దూరంచేసుకోవటం నాకునచ్చదు.
చుట్టుపక్కల వారితో
స్నేహంగా ఉండకుంటే నాకునచ్చదు. 
ఎదుటివారి విషయాలలో జోక్యం ,
అనవరమైన సలహాలనివ్వటం
నాకునచ్చదు.
చేసినసాయం మరువటం నాకునచ్చదు.
ఎవరికీ గాయంచేయటం నాకునచ్చదు.
చిలువలుపలువలు కల్పించి 
చెప్పటం నాకునచ్చదు.
ఒకరి రహస్యాలను వేరొకరికి చెప్పటం
నాకునచ్చదు.
 ***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top