సమసమాజం
       -ప్రతాప వెంకట సుబ్బారాయుడు

ఎలకలకు చిన్నబోను
పులులకు పెద్దబోను
చేపలకు వలలు
చీమలకు మందు
ఏనుగుకు అంకుశం
ఎడ్లకి చెర్నాకోలు
ఇలా..సమస్త జీవజాలాన్ని
పట్టుకుని, చెప్పుచేతల్లో పెట్టుకోడానికి
మట్టు పెట్టడానికి
ఎన్నో ఎన్నెన్నో ఉపాయాలు
తనకి అన్యాయం జరిగితే మాత్రం
దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు
హర్తాళ్లు, ధర్నాలు..
చట్టాలు, న్యాయాలు
మానవ హక్కుల ఫోరాలు
సమసమాజం అంటే
ఆర్థిక అసమానతలు సమసిపోవడమే కాదు
సమస్త జీవాలతోటీ సహజీవనం కూడా!
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top