ఈ దారి మనసైనది - 13 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది - 13
అంగులూరి అంజనీదేవి 

(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది.  జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత.) 
ప్రతి సంవత్సరం ఆగస్టులో జరిగే గణేష్ నవర్రాతులుఈ సంవత్సరం అనురాగ్ వాళ్ల బ్యాచ్ వాళ్లు నిర్వహించాలని ప్రిన్సిపాల్ నోటిస్ పంపించారు.

అందుకు అనురాగ్ ఉత్సాహంగా ముందుకి వచ్చాడు. అతని ఫ్రెండ్స్ కూడా అతని వెనక వుండి అతన్ని ముందుకి నడిపారు. ఆ తొమ్మిది రోజులు గణేష్ నిమజ్జనం వైభవంగా జరపాలని జూనియర్స్ దగ్గర హాస్పిటల్ స్టాఫ్ దగ్గరస్టాఫ్ దగ్గర గణేష్ చందా కలక్ట్ చేశాడు అనురాగ్
ముందుగా ఆడిటోరియంను అందంగా అలంకరించారు.
పదమూడు అడుగుల గణేష్ విగ్రహాన్ని ట్రాక్టర్ మీద ఎక్కించుకొని బ్యాండ్ మేళంతో తీసుకొచ్చి ఆడిటోరియంలో ప్రతిష్టించారు.
తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూజలు జరిపారు.
ప్రతి బ్యాచ్కి ఒక్కో రోజు చొప్పన పూజలు చేయించారు.
అదే విధంగా ఎగ్జామ్ గోయింగ్ బ్యాచ్ వాళ్లకి ప్రత్యేకమైన పూజలు చేయించారు.
ప్రతి రోజు కాలేజి ఆడిటోరియంలో గణేష్ విగ్రహం దగ్గర దీక్షిత తన ఫ్రెండ్స్ తో వెళ్లి  పూజలు చేయించుకొని,పూజారిగారు చెప్పే దేవుని కథలను శ్రద్ధగావింటుంది.
గణేష్ దగ్గర మన్విత కన్పించగానే ‘హాయ్చెప్పింది దీక్షిత.
ఈ మధ్యనదీక్షితతోమన్వితమనస్పూర్తిగా మాట్లాడలేక పోతోంది. తన అంగీకారం లేకుండా తన వస్తువుని తీసుకుంటే పైకి చెప్పకోలేకతిరిగి తీసుకోలేక సతమతమవుతోంది....  స్వతహాగా
విభేధాలకి దూరంగా వుండేమన్వితలోలోన బాధ పడటం తప్ప ఏం చేయలేక పోతోంది. ఆ వస్తువు ఎంత విలువైందోమన్వితకి తెలుసు. అందుకే అంత బాధ. ఆ బాధలో తానేమైపోతుందో తనకే తెలియదు. పైకి మాత్రం దీక్షితను చూసి నవ్వుతూ హాయ్” చెప్పింది మన్విత
ఆ రోజే గణేష్ నిమజ్జనం - - - - -
బ్యాండ్ మేళంతో - జూనియర్ అబ్బాయిలను తీసుకొచ్చి .... వారి చేత డాన్స్లు చేయించుకుంటూఒక పండగ వాతావరణాన్ని తలపించే విధంగా గణేష్ ని తీసికెళ్తున్నారు.
ఆ సందడిఆ కోలహలం చూస్తుంటే-సముద్రంలోని కెరటాలు పైకి లేచి దగ్గర్లో వున్న రాళ్లను తాకి ఆనందంగా కేకలేస్తున్నట్లు వుంది.
ఆ ఆది దేవుని, ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందుతూ ఆనందంతో పరవశిస్తూ వరంగల్ సిటీ అంతా అలాగే వుంది.
అది చూస్తుంటే పరిస్థితులు మనిషిని సృష్టించటంలేదు. మనిషే పరిస్థితుల్ని సృష్టిస్తున్నాడనిపిస్తోంది.
ఒక్కమాటలో చెప్పాలంటే కాకతీయ వైద్య కళాశాల ఆవరణంలో అగ్ని హోత్రం లాంటి హూషారు,అగ్నిపర్వతం లాంటి ఉత్సాహం నిండి, కొండలు కూడా కదిలి నాట్యం చేస్తున్నట్లు వుంది.
దారి మధ్యలో గణేష్ని ఆపుకుంటూ - తిరిగి కదులుతున్నారు.
‘గణేష్పప్పమోరియా’అంటూఅబ్బాయిలందరులేడీస్ హాస్టల్ వైపురాగానే ... దేవున్ని ఆపుకొని అక్కడ డాన్స్లు చేయడం ప్రారంభించారు.
అమ్మాయిలు వచ్చి కొబ్బరికాయలు కొట్టిదేవునికి కర్పూరంతో హారతి యిస్తున్నారు.
అమ్మాయిల్లో కొంత మంది . బిల్డింగ్ పై కెళ్ళివరుసగానిలబడి అబ్బాయిల డాన్స్ చూస్తున్నారు.
అబ్బాయిలింకా ఉత్సాహంగా డాన్స్ చేసున్నారు.
బాణ సంచా కాలుస్తున్నారు. అలా కాలుస్తున్నప్పడు ....
నేల పై నుండి పెకి లేచిన తారాజువ్వలు ఆకాశాన్ని తాకి నక్షత్రాలను వెంట బెట్టుకొనివస్తునట్లు... భూమికి. ఆకాశానికి మధ్య కళ్ళు మిరమిట్లుగొలుపుతూ ... తమ వైపే చూస్తున్న అబ్బాయిల్ని అమ్మాయిల్ని చూసి"హాయ్ చెబుతున్నట్లు ... నెమ్మదిగా క్రిందకి రాలుతున్నాయి.
ఫ్రెండ్స్ంతా ఫోర్స్ చేసిలాగడంతో అనురాగ్ కూడా డాన్స్ చేస్తున్నాడు.
ఆ డాన్స్ లో  అతను దీక్షితకి ప్రత్యేకంగా కన్పిస్తున్నాడు. డాన్స్ చేస్తూ కూడా అప్పడప్పడుదీక్షితను చూస్తున్నాడు అనురాగ్,
దూరం నుండి అది గమనిస్తూ ... నేలకి అతుకున్నట్లుకర్రలా నిలబడ్డ మన్విత అందరిలా ఎంజాయ్ చేయలేక పోతోంది తను దేన్నో కోల్పోతున్న భావన ఎక్కువైంది.
హారతి ఇస్తున్న ఒక అమ్మాయి కర్పూరం వెలిగించిఅగ్గిపుల్లను క్రింద వెయ్యడంతో అది ఒక పేపర్పై పడి - కింద జీరాడుతున్న దీక్షిత చున్నీకి అంటుకొంది. దీక్షిత దాన్ని గమనించుకోలేదు. అక్కడున్న అమ్మాయిల దృష్టి కూడా  డాన్స్ విూద.... గణేష్ విూద వుంది.
అప్పడే అక్కడికి వచ్చిన మన్విత కాలుతున్న దీక్షిత చున్నీని చూసి అలాగే స్థంభించిపోయినిల్చుంది.
బిత్తర పోయాడు అనురాగ్...మన్వితఅప్పడేఅక్కడికి వచ్చిందన్న విషయం తెలియని అనురాగ్ గమనించలేదు.
నాలుగు అంగల్లోదీక్షితను చేరి కాలుతున్న చున్నీని పక్కకి విసిరాడు.
మన్విత వైపు కోపంగా చూశాడు. అదెలాంటికోపం అంటే మన్వితచెంపచెళ్లుమనిపించేంతటికోవం. ఆ కోపాన్ని తట్టుకోలేక పోయింది మన్వితఅతనెందుకలా కోపంగా చూశాడోమన్వితకి అర్ధం కాలేదు.
అనురాగ్ ఫ్రెండ్స్ అతని భుజాలమీద చేతులు వేసి నెమ్మదిగా తడుతూ డాన్స్ దగ్గరికితీసుకు వెళ్లారు.
మళ్లీ డాన్స్ మొదలైంది.
అనురాగ్ కొట్టక పోయినా తన వైపు చూసిన చూపులకి క్రుంగి పోతున్న దానిలా అయివెంటనే లోపలి కెల్లి బెడ్ మీద బోర్లా పడుకొంది మన్విత.
బోరున ఏడ్చింది మన్వితకదిలికదిలి ఏడ్చింది. వెక్కివెక్కి ఏడ్చింది.
“నీ కేమైనా పిచ్చా. ఎందుకలా ఏడుస్తావ్?” అంటూ ఫ్రెండ్స్ వచ్చి పలకరించింది. ఆ ఫ్రెండ్ పేరు సంజన.
అయినా అలాగే పడుకొని ఏడుస్తూ కదులుతోంది మన్విత
కూల్ మన్వితా ! కూల్ !అంది సంజనమన్విత తలపై చేయివేసి నిమురుతూ
ఏడుపుతో ఎర్ర బడ్డ ముఖాన్నిదిండులో దాచుకుంటూ ...
అనురాగ్ చూడవే నా వైపు ఎలా చూశాడో బాధగా వుంది. అసలు నేను చేసిన తప్పేంటి? " అంటూ తన మనసులో మాటని బయట పెట్టింది.
పక్కనే వున్నావు కదా! దీక్షితను పక్కను లాగివుంటే ప్రాబ్లమ్ వుండేది కాదు. అంది సంజన.
నేను గమనించ లేదు సంజనా !అప్పడే వచ్చాను అక్కడికి. లేకుంటే దీక్షితను పక్కకి లాగేదాన్ని..."అంది మన్విత,
అది అతనికి తెలియదు కదా! నువ్వు చూసి కూడా సేవ్ చెయ్యలేదని పొరబడ్డాడు. లైట్ తీసుకోమన్వితా ! అతను రావటం క్షణం లేటయినా దీక్షిత ఈ పాటికి హాస్పిటల్లో వుండేది. అంది సంజన. అనురాగ్ తన వైపు కోపంగా చూసిన ఆ చూపులు మన్విత కళ్లలో మెదిలి. చున్నీ కాలుతుంది. అంతేగా ప్రాణం పోతుందా?" అంది మన్విత,
మన్వితకి ఆ క్షణంలో ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు. యొక్క అనురాగ్ తన వైపు చూసిన చూపు తప్ప ! ఆచూపుపదునైన శూలాన్ని తనలో కసుక్కునదింపినంత బాధగా వుంది.
"ఎందుకలా. మాట్లాడుతున్నావ్?" అంది ఆశ్యర్యపోతూసంజన
అతని తొందర చూస్తుంటే నాకు అలాగే మాట్లాడాలనిపిస్తుంది.” అంది మన్విత.
(సశేషం)

No comments:

Post a Comment

Pages