శ్రీథరమాధురి - 56 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 56

Share This
శ్రీథరమాధురి -56
(జ్ఞానం, ఆత్మజ్ఞానం గురించి పూజ్య గురూజీ అమృత వాక్కులు )

'Know' అనేది చాలా అందమైన పదం. మధ్యలో ఉన్న రెండు అక్షరాలు 'No' అనేవి నిరాకరణను సూచిస్తాయి.
అంటే మీకు ఎటువంటి పరిజ్ఞానం లేదని చెబుతూ, హృదయపూర్వకంగా మీరు 'NO' అన్నప్పుడు, జ్ఞానం మీ లోనికి ప్రవహిస్తుంది. మీకు ఏమీ తెలియదు అన్న దాన్ని అంగీకరిస్తూ, అదే ప్రతిధ్వనించేలా 'No' అని ధైర్యంగా తెలిపి, జ్ఞానాన్ని మీ లోనికి ప్రవహించనివ్వండి. ఏమీ తెలియదని అంగీకరించడమే, జ్ఞానాన్ని పొందేందుకు సరైన మార్గం.

మీ జ్ఞానం ఇంటర్నెట్, యు ట్యూబ్, గూగుల్, వీకీపీడియా, ల నుంచి వస్తుంది. ఇదంతా ఎక్కువగా భౌతిక ప్రపంచానికి చెంది ఉంటుంది. 
 గురువు యొక్క జ్ఞానం అలౌకిక జగతికి చెంది ఉంటుంది. రెండిటికీ సముద్రమంత తేడా ఉంది.

విచక్షణా జ్ఞానం అనే పేరుతో మనం జీవితంలో అన్నింటినీ విభజించుకుంటూ పోయాము. అందుకే మనం 'ఐక్యత' బదులు 'నచ్చినదే తీసుకోవడం' , 'ఎంపిక లేకపోవడం' బదులు 'ఎన్నుకోవడం' నేర్చుకున్నాము.‌ అందుకే మన బాధలన్నీ ఈ విచక్షణ వల్లనే. విచక్షణా జ్ఞానం ఉన్నా కూడా ఎటువంటి వివక్షతను చూపకపోవడమనేది యోగుల పద్ధతి.
 
మనం చేయాల్సిన ఏ పనినైనా, మనం పక్కదారి పట్టేలా విశ్లేషిస్తూ ఉంటాము. అది మంచైనా చెడైనా, తప్పైనా ఒప్పైనా, అనుకూలమైనా ప్రతికూలమైనా, అందమైనదైనా వికారమైనదైనా, మధ్యలో ఉంటూ పరిశీలించడం మనకు తెలియదు. అతిగా మారేదాకా మనం లాగబడతాం. ఏదైనా అతిగా మారినప్పుడు, మనకు చికాకు కలుగుతుంది. మన ఆలోచనలే మన చికాకుకు, దురాక్రమణకు, చివరికి 'ఒత్తిడికి', కారణం.
  
జీవితం నడుమన ఉంటుంది. మధ్యలో ఉన్న వారు ఎప్పుడు అత్యంత సంతులనంతో ఉంటూ భూతల స్వర్గాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఇతరులు కొనల్లో వారికి వారే చిక్కుకుని, బయట పడడానికి కష్టపడుతూ ఉంటారు. సంపూర్ణ ఆనందం తో నిండిన అనాయాసమైన జీవితం, ఎందుకని తో నిరాశ తో కూడుకున్న ప్రయత్నాలతో వృధా గా మారుతుంది.
 
చిలుకలు ఇతర చిలకలు పుస్తకాల్లో రాసిన వాటినే వల్లిస్తూ ఉంటాయి. వయసు మీరిన ఒక వృద్ధ చిలుక వారి పరిజ్ఞానాన్ని అంచనా వేస్తూ సర్టిఫికెట్లు ఇస్తుంది. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ పొందిన చిలుక, 'జ్ఞానం' అనే పంజరంలో బందీగా మారుతుంది.
ఇది చాలా వినోదభరితమైన అంశం.

 'ఆత్మజ్ఞానం' అనేది 'జ్ఞానం' కంటే చాలా విభిన్నమైన అంశం.

ఆత్మజ్ఞానులంతా జ్ఞానం కలవారే, కానీ జ్ఞానం ఉన్న అందరికీ ఆత్మ జ్ఞానం ఉండదు.
 
జ్ఞానం అనేది ఆత్మజ్ఞానం గా పరిణామం చెందినప్పుడు, మనం ఒక విద్యావంతుడిని చూస్తాము. అయినా పూర్తి జ్ఞానంతో నిండుకుని ఉంటారు. ఆయన జీవితం అనే ప్రవాహంతో పాటు గా ప్రవహిస్తూ ఉం టారు. అయినా ఇప్పుడు ఆనందంగా ఉంటూ, చుట్టూ ఏమి జరుగుతుందో కూడా తెలియని విధంగా ఉంటారు. ఆయన తన లోపల లయమై, అమితమైన ధ్యానం చేస్తూ ఉంటారు. ఆయన అని అందరి బాగుకోసం ప్రార్థిస్తూ ఉంటారు.
 
కానీ జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు ఎక్కువగా అహంకారాన్ని కూడా కలిగి ఉంటారు. ఆయన స్వార్థపూరితంగా ఉంటూ, తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఆయన మార్గాలు బోల్తా కొట్టించే విధంగా ఉంటాయి. అతడు జీవిత కాలమంతా దురాక్రమణ చేస్తూ ఉంటాడు. వాస్తవానికి అతడు సంతోషంగా ఉండు, కానీ అలా ఉన్నట్టుగా పోసు కొడతాడు. 
 అతడిదంతా మిడిమిడి జ్ఞానం, అతడి జ్ఞానం సంఘాల్లోని ఐక్యతకు ప్రమాదకరమైనది.

జ్ఞానం పేరుతో మీరు ఎంత చెత్తను ప్రోగు చేసుకుంటే, అంతగా మీరు ప్లాస్టిక్ లా మారి పోతారు.
 
మనలో చాలా మందికి అసంపూర్ణమైన జ్ఞానం ఉంది. ఏ విషయాన్ని గురించి అయినా ముందే ఊహలు,  అభిప్రాయాలు ఏర్పరుచుకునే స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఈ వ్యాధితో బహిరంగంగా విర్రవీగుతూ తిరుగుతూ ఉంటాం. జ్ఞాని ఇటువంటి వారిని చూసి నవ్వుతారు.

జీవితం గుహ్యమైనది. అది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తునే ఉంటుంది. జీవితమనే మిస్టరీ ని మీరు ఎన్నటికీ ఛేదించలేరు. మీరు దాని గురించి విచారణ చేయగలరు అంతే. మీరు సైంటిస్టులను అడిగితే వారు ఏదో చెప్తారు. మీరు మత నాయకులు ని అడిగితే వారు దానికి విరుద్ధంగా మరొకటి చెబుతారు. కానీ నిజానికి జీవితం అనేది పెద్ద మిస్టరీ. అది మిమ్మల్ని సంపూర్ణ జ్ఞానం పొందినివ్వదు, అది మన అందరి కంటే చాలా తెలివైనది. దానిలోని గోప్యతను చూసి ఆశ్చర్యపోతూ జీవితాన్ని ఆస్వాదించండి. 

జ్ఞానం ఉందన్న అపోహతో మెలగడం, జ్ఞానాన్ని కలిగి ఉండడం, రెండూ విభిన్నమైనవి.
 
జ్ఞానం, ఆత్మజ్ఞానం రెండూ విభిన్న ధ్రువాలు.
నేర్చుకోవడం అనేది జ్ఞానం, నేర్చుకున్నవన్ని వదిలి వేయడం అనేది ఆత్మజ్ఞానం.
చుట్టుకోవడం అనేది ప్రజ్ఞ, చుట్టుకున్న వన్నీ వదిలివేయడం అన్నది ఆత్మజ్ఞానం.
తెలివితేటలు అన్నవి జ్ఞానం, విజ్ఞత అనేది ఆత్మజ్ఞానం.
***
 

No comments:

Post a Comment

Pages