పోటీలో గెలిపించే విజయ సూత్రాలు - అచ్చంగా తెలుగు

పోటీలో గెలిపించే విజయ సూత్రాలు

Share This
పోటీలో గెలిపించే విజయ సూత్రాలు
- ప్రముఖ మానసిక నిపుణులు, మైండ్ ఫౌండేషన్ అధినేత,
డా.బి.వి.సత్యనగేష్  

నేటి సమాజంలో ఎక్కడ చూసినా పోటీ. అసాధారణ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించేవాళ్ళు ఎక్కువయ్యేరు. పోటీలో నిలబడాలంటే సాధారణ శక్తి సామర్థ్యాలు అస్సలు సరిపోవు. కనుక పోటీలో నెగ్గి ప్రతిభావంతులుగా గుర్తించబడాలంటే ఏం  చెయ్యాలనే విషయానికి వద్దాం:
1. నిర్దిష్టమైన లక్ష్యం వుండి తీరాలి. లక్ష్యం చేరడానికి కావలసిన లక్ష్యాలను అలవాటు చేసుకోవాలి.
2. ఒకటే లక్ష్యాన్ని పెట్టుకొని పక్క చూపులు  లేకుండా ఒక ప్రేమపిపాసిలా లక్ష్యమార్గంలో పనిచెయ్యా లి
3. మీకు ఎంతో శక్తి సామర్ధ్యాలున్నప్పటికీ మీ విజయం మీ పోటీదారుల ప్రదర్శన పై ఆధారపడి వుంటుందనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా తలచుకుంటూనే వుండాలి.
4. పరుగుల పందెంలో గమ్యం చేరేవరకు నిర్విరామంగా పరిగెట్టినట్లు లక్ష్యం చేరేవరకు పట్టుదల, రగిలే జ్వాలతో వుండాలి. 
5. నేను ఎంచుకున్న రంగంలో నేను బెస్ట్ అయి తీరాలి. అనే విషయాన్ని నరనరాన జీర్ణించుకు పోయేలా "I must become the best" అనే ఐదు పదాల వాక్యాన్ని మంత్రంలా జపిస్తూ, దానికి తగ్గట్లు కృషి చేస్తూ వుండాలి. ఈ వాక్యంలోని సారాంశం సబ్ కాన్సస్ మైండ్లోకి చేరి. మానసిక ముద్రగా మారిపోయి ప్రతిక్షణం .
స్పూర్తిని కలిగించేటట్లు వుండాలి. 
6. బలహీనతలన్ని, భయాలను అధిగమించే దిశలో కఠినంగా వ్యవహరించాలి. మనిషి శక్తి సామర్థ్యాలను సమూలంగా నశింపచేయగల శక్తి బలహీనతలు, భయాలకు వుందనే విషయం మనసులో మెదులుతూ వుండాలి. 
7. ఎట్టి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ వెనకడుగు వెయ్యను  అనే మొండి పట్టుదలతో ముందడుగులు వేస్తూనే ఉండాలి. 'నన్ను జయించడం కష్టం' అనే మనస్తత్వంతో వుండాలి.
8. నిత్యస్పూర్తి కలిగేలా మానసిక, ఎక్సర్ సైజులు చెయ్యాలి.
9. అమోఘమైన విజయం కావాలంటే ఘోరమైన తపస్సులాంటి పరీక్షలు చేపట్టాలి. 
10. పోటీ ప్రపంచంలో మన పోటీదారులకంటే ముందంజ వెయ్యాలంటే అన్ని విషయాల్లో క్రమశిక్షణ పాటించాల్సిందే 
11. ప్రపంచంలో ఎక్కడ అవకాశమున్నా అందిపుచ్చుకోడానికి సిద్ధంగా వుండాలి
12.మూడు విషయాల మీద హెచ్చు స్థాయిలో పట్టు సాధించాలి. అవి....భాష, పరిజ్ఞానం, ఆత్మవిశ్వాసం, వీటినే ఇంగ్లీషులో Language,Knowledge,  confidence అంటారు. LKG చదివే సమయం నుంచి LKC లేకపోయినా పరవాలేదు. కానీ తర్వాతయినా అవసరం వచ్చినప్పుడు క్రమశిక్షణతో సాధన చేస్తే " మర్చిపోకుండా తలచుకుంటూనే వుండాలి. సాధ్యం చెయ్యొచ్చు.
13. కాలం వృధా అయితే జీవితంలో ఒక భాగం వృధా అయినట్లే కనుక కాలం అనేది ఒక ముఖ్యమైన పెట్టుబడిగా భావించి ప్రతీ క్షణాన్ని సద్వినియోగపరచుకోవాలి.
14. ఆధునిక కాలంలో మానవ మేధస్సును మేల్కొల్పడానికి ఎన్నో సాధనాలొచ్చాయి. స్పూర్తిని కలిగించే వాళ్ళు, శిక్షణనిచ్చేవాళ్ళు,వారి నుంచి సమాచారాన్ని సంపాదించి పోటీ ప్రపంచంలో మన పోటీదారుల కంటే  ముందుండాలి.
15. విజయాన్ని సాధించిన వారికి, విజయపు టంచుల వరకు వెళ్ళి పరాజయం పొందిన వారి మధ్యనున్న తేడా - వ్యక్తిత్వ/ ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు (బిహేవియరల్ ప్రోబ్లెమ్స్) మాత్రమేనని మానసిక శాస్త్రవేత్తలు విశ్లేషించేరు. మీకు తెలుసున్న వారిలో మీ దృష్టికి వచ్చిన వారిలో ఎవరైనా విజయాన్ని కొద్ది దూరంలో చేజార్చుకున్నారని తెలిస్తే ఒకసారి వాళ్ళ మానసిక ప్రవర్తనను పరిశీలించండి. మానసిక నిపుణుల పరిశీలనతో మీరు ఖచ్చితంగా ఏకీభవిస్తున్నరు. కనుక మానసిక సమస్యలుంటే వాటి నుంచి విముక్తులవ్వాలి.

No comments:

Post a Comment

Pages