ఈ దారి మనసైనది -10 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది -10
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com

                                                                    angulurianjanidevi.com(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది.  జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత.)
ఈ మధ్యన ఎక్కడ చూసినా వాళ్లిద్దరే కన్పిస్తున్నట్లు అన్పిస్తోంది మన్వితకి. అది యాదృచ్చికమో లేక కావాలనే వాళ్లలావుంటున్నారో అర్థం కావడం లేదు. మెడిసిన్ అన్న తర్వాత అది కామనేకావొచ్చు.
కానీ .. జాతరలో దీక్షితను అతను చూసిన చూపుల్లో వేరే అర్థం కన్పించినప్పటి నుండి వాళ్లను ఎక్కడ చూసినా ఆమెలో చిత్రమైన కదలిక వచ్చి గుండెలోకి పదునైన శూలం దిగినట్లు అవుతోంది. ఆ నొప్పిఆ బాధ వర్ణనాతీతం.
అదేం విచిత్రమో ఎంత వద్దనుకున్నా వాళ్లు కన్పించిన ప్రతిసారి ఆమె ఒళ్లంతా కళ్లు అయి. ఏ శబ్దాన్ని తన చెవులకి సోకనీయకుండా, అటెన్షన్  గా నిలబడి పోయి వాళ్లనే పరిశీలిస్తోంది.
దీక్షితను అనురాగ్ ప్రేమిస్తున్నాడో తెలియదు. ప్రేమించటం లేదో కూడా తెలియదు. అది తెలుసుకోవడం కోసం తన ఒంట్లో వున్న శక్తినంతా ధార పోస్తున్న దానిలా తన కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ల మీదనే పెడుతోంది. అయినా అర్థం కావడం లేదు.
ముఖ్యంగా అతనిలోని ఫీలింగ్స్ ని  పట్టుకోవడం కష్టంగా వుంది. దీక్షితనైతే మరీనూ....
ఒక వేళ అనురాగ్ దీక్షితను ప్రేమిస్తే?
ప్రేమంటేనే గాఢమైన అనుభూతులమయమట. భావాలన్నీ సమ్మిళితమైన ఒక ఉద్వేగమట. అంతే కాదు ప్రేమంటే మరో వ్యక్తి పై మనస్సు లగ్నమై పోవటం ... ఆ మనిషితోనే గడపాలని మనస్సు గాడంగా వాంఛించటం ... ఆ మనిషి లేకపోతే తన ఉనికే వ్యర్ధమనిపించడం... ఎప్పడూ ఆ మనిషే తన ఆలోచనల్లో పరిభ్రమిస్తూ వుండటం... క్షణ కాలం వియోగం కూడా భరించలేకపోవటం...దూరమైతే ఎప్పడెప్పడు కలుస్తానాచూస్తానా అని మనసు ఆరాటపడటం. ఆ మనిషి సమక్షంలో మనసు శాంతితోసంతోషంతోసంతృప్తితో నిండిపోవడం ... ఇదే ప్రేమంటే!
ఎప్పడు చూసినా వాళ్లిద్దరు పక్కపక్కన కన్పించటం ఈ ప్రేమ కోసమేనా లేకుంటే వాళ్లు ఎందుకలా దగ్గరగా వుంటారు?
దీక్షితతో మాట్లాడకపోతే అతను ప్రశాంతంగా వుండలేకనే కదా!ఆమె తనను ఎక్కడ నిర్లక్ష్యం చేస్తుందోనన్న భయంతోనే కదా! ఆమె అతనకి సొంతం ... ఆమె అతనికి కావాలి ... అతనిలోని ప్రతి అణువణువులో ఆమె ... నడిచే నడకలో ... చూసే చూపులో ... పూచే పువ్వులో .... వీచే గాలిలో ... అసలు ప్రపంచమే ఆమె....ఇలా ఆమె లేకుంటే ప్రపంచమే శూన్యంగా భావిస్తున్నాడేమో ! దీన్ని బట్టి ఆమె అతని ప్రాణం .. ఆమె అతని జీవితం ... ఆమె అతని లోకం ... ఆమె అతని ఊపిరి ... అయివుండొచ్చు.
మెడిసిన్ ఫస్టియర్ . అంటే ఒక్క సంవత్సరం పరిచయానికే ఆమె అతని ఊపిరి అయితే మరి తనో..??
ఒక్కరోజా ! రెండు రోజులా ! ఎన్ని రోజులు ... ఎన్ని నెలలు...
ఎన్ని సంవత్సరాలు ... అన్ని సంవత్సరాలు ఒకే చోట కూర్చుని కంబైన్డ్ స్టడీ చేశారు. ఒకే స్కూలు ఒకే కాలేజిలో చదివారు. కలిసి తిన్నారు. కలిసి నవ్వుకున్నారు. కలిసి కబుర్లు చెప్పకున్నారు. కలిసి ఆడుకున్నారు.
తన తల్లి తనను లోలోన ఎన్ని తిట్లు తిట్టుకుంటున్నా తను వాళ్ల ఇంటికి వెళ్లని రోజంటూవుందాఅనురాగ్ కూడా తన మీద ఈగవాలనిచ్చేవాడు కాదు. మరిప్పడెందుకిలా జరుగుతోంది. అనురాగ్ తనకి దూరమవుతున్నాడా ?
ఆ ఊహకే వణుకు పుడుతోంది.
కళ్లు కూడా తిరుగుతుంటే కంట్రోల్ చేసుకొంది.
ఆ ఊహే నిజమైతే !
అనురాగ్ తనకి పూర్తిగా దూరమవుతాడు. తనతో మాట్లాడడు. తన గురించి ఆలోచించడు. తన సమస్యల్ని వినడు. తన భావాలను పంచుకోడు. అప్పడు తను ఎవరూ లేని ఒంటరిదైపోతుంది. ఒక్కసారి అనురాగ్ పరిచయం కాకముందు జీవితం కళ్లముందు మెదులుతూ దేన్నో కోల్పోతున్న దానిలాకలలో నడుస్తున్నట్లు నడుస్తూ వెళ్లి ... అనురాగ్ టేబుల్ మీద వున్న బుక్స్ ని  విసురుగా తాకడంతో ఆ బుక్ క్రింద పడింది.
ఆ బుక్ తియ్యడం కోసం అనురాగ్దీక్షిత ఒకేసారి వంగటంతో ఇద్దరి తలలు గట్టిగా తాక్కున్నాయి.
ఆ ఇద్దరు ఒకేసారి "సారి అనుకోవడం" తర్వాత"ఇట్స్ ఓకే ?" అనుకోవటం చూసిన మన్విత ..
"అయ్యో ! తన వల్లనే కదా ! వాళ్లు తలలు తాకిచ్చుకున్నది తన పరధ్యానం వల్ల ఎంత ప్రమాదం జరిగింది.అనిమనుసులో అనుకుంటూ బాధ పడింది.
అలా బాధపడుతూ కూర్చుందే కాని, బుక్స్ రీడింగ్ మాత్రం చెయ్యలేదు.
కొద్ది సేపు అయ్యాక...
"ఓకే. నాకు టైం మయిందిఅంటూ దీక్షిత అక్కడనుండి లేచి వెళ్లిపోయింది.
ఎటో చూస్తూ ఆలోచనగా...విప్పారిన నేత్రాలతోనిశ్చలత్వాన్ని ఆపాదించుకొనిగంభీరంగాదిగులుగా అందరికి దూరంగా కూర్చుని వున్న మన్వితను అక్కడ నుండే చూస్తూ ...
ఏంటి డా.మన్వితా ! లైబ్రరీకి చదువుకోవాటానికి వచ్చావాఆలోచించడానికి వచ్చావాఏదైనా అర్థం కావడం లేదా బుక్స్ లో?" అని ఆప్యాయంగా అన్నాడు అనురాగ్.
అతను అప్పడప్పుడు ఆమె పేరుకి ముందు డాక్టర్ని చేర్చి పిలుస్తుంటాడు. ఫ్రెండ్స్ తప్ప మిగతావాళ్ళు డాక్టర్ అనే సంభోదిస్తుంటారు. అది కామన్
‘కానీ మీరు మాత్రం నేను డాక్టర్ అయ్యాకనే అలా పిలవండి.’ అంటుంది సరదాగా...
"ఏం నమ్మకం లేదాడాక్టర్ అవుతానని... అందరి కన్నా నువ్వే ముందు మెడిసిన్ పూర్తి చేస్తావు మన్వితా! అంత పట్టుదల వుంది నీలో ...అంటుంటాడు ఆమె ఎంసెట్ అప్పడు ఎంత కష్టపడి చదివిందో గుర్తు చేసుకుంటూ ...
అప్పటి దాకా వాల్చి వున్న కనురెప్పల్ని ... కంటి నిండా నీటితో తెరిచి అనురాగ్ వైపు చూసింది.
‘హే ...వాట్హేపెండ్ మన్వితాఅంటూ వెంటనే తన చెయిర్లోంచి లేచి వెళ్లిమన్విత చేయిపట్టుకున్నాడు.
‘నాకేమిఅర్థం కావడం లేదు అనురాగ్ ! నేనేదో తప్పు  చేస్తున్నానని పిస్తోంది. నా బాధను ఎవరు అర్ధం చేసుకోవడం లేదు’ అంటూ కళ్లనీళ్లు తుడుచుకుంటూ తలకిందకేసుకుంది.
'నువ్వేంచెబుతున్నావో నా కర్ధంకావడం లేదు. ఏదైనాసబ్జెక్ట్ ప్రాబ్లమ్ అయితే నేనున్నాను కదా ! లేక ఇంట్లో ప్రాబ్లమా ప్రతి ప్రాబ్లమ్ కి నేనున్నాను కదా ! నాకు చెప్పొచ్చుకదా!అన్నాడు.
మాట్లాడకుండా అలాగే అతనివైపు చూస్తున్న మన్విత పసిపిల్లలా అనిపించింది.
స్కూల్ యూనిఫాంలోరెండు జడలతోస్కూల్ బ్యాగ్ తగిలించుకొని అనురాగ్అనురాగ్అంటూ తన వెంటే తిరుగుతూ.. ఎవరైనా ఏదైనాఅన్నప్పడు ...'అనురాగ్ తో చెబుతాఅని వాళ్లను బెదిరిస్తూ, 'చూడు అనురాగ్ వాళ్ళూ. అంటూ వాళ్లపై కంప్లెంట్ చేస్తూ'మన్విత జోలికి ఎవరైనా పోయారో... అని తను చేయి చూపినప్పడు. ప్రపంచాన్ని జయించినట్లు  నవ్వుకునే మన్విత గుర్తొచ్చింది.
(సశేషం)

No comments:

Post a Comment

Pages