అతి సర్వత్ర వర్జయేత్!
పెయ్యేటి రంగారావు

అతిగా ప్రేమ చూపకు
అది దగ్గరతనాన్ని దూరం చేస్తుంది.

అతిగా వినయం చూపకు
అది నక్కను గుర్తుకు తెస్తుంది.

అతిగా కోపం తెచ్చుకోకు
అది విచక్షణను పోగొడుతుంది.

అతిగా భుజించకు
అది ఆరోగ్యానికి చేటు తెస్తుంది.

అతిగా నిద్రపోవకు
అది ఏబ్రాసితనాన్ని కలిగిస్తుంది.

అతిగా మేలుకోకు
అది మందమతిని చేస్తుంది.

అతిగా మాట్లాడకు
అది వదరుబోతుని చేస్తుంది.

అర్థం చేసుకో
అతి సర్వత్ర వర్జయేత్.

____________

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top