భారతీయ చలన చిత్ర ప్రముఖుడు వి. శాంతారామ్ - అచ్చంగా తెలుగు

భారతీయ చలన చిత్ర ప్రముఖుడు వి. శాంతారామ్

Share This
భారతీయ చలన చిత్ర ప్రముఖుడు వి. శాంతారామ్
అంబడిపూడి శ్యామసుందర రావు
 
శాంతారామ్ బాపు,అన్నాసాహెబ్ అనే పేర్లతో అభిమానులతో  పిలిపించుకునే శాంతారామ్ పూర్తిపేరు శాంతారామ్ రాజారామ్ వాన్ కుద్రే భారతీయ చలన చిత్ర చరిత్రలో శాంతారామ్ ఒక విజయవంతమైన దర్శకునికిగా అద్వితీయమైన నిర్మాతగా నటుడిగా పేరుప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి.  భారతీయ చలన  చిత్ర పరిశ్రమలో ధ్వని రంగు లను ప్రవేశపెట్టి సినిమాలను కళాఖండాలుగా ప్రేక్షకుల ముందుకు తెచ్చిన ఘనత శాంతారామ్ దే ,డాక్టర్ కోట్నిస్ కి  అమర్  కహాని  (1946),అమర్ భూపాలీ(1951), జనక్ జనక్ పాయల్ బాజే(1955), డో ఆంఖే బారా హాత్ (1957), నవరంగ్ (1959) ,దునియా నా మానే(1937), పింజరా (1972) వంటి కళాఖండాలు అన  తగ్గ చలన చిత్రాలను శాంతారామ్ నిర్మించి భారతీయ సినిమా ప్రేక్షకులకు అందించాడు. 

ఆరు దశాబ్దాలపాటు హిందీ మరాఠీ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని ఏర్పరచుకొన్న శాంతారామ్ గురించి అయన వ్యక్తిత్వాన్ని గురించి  తెలుసుకుందాము. అయన నవంబర్ 18,1901లో కొల్హాపూరులో సాధారణ  జైన్ కుటుంబములో జన్మించాడు.తన కెరీర్ ను కొల్హాపూరులోని బాబురావు పెయింటర్ యొక్క మహారాష్ట్ర ఫిలిం కంపెనీలో చిన్న చితక పనులు చేస్తూ ప్రారంభించాడు థియేటర్ ఆర్టిస్ట్ గా ప్రారంభించిన కొద్ది కాలానికే  కొన్ని చిత్రాలకు దర్శకత్వ భాద్యతలు చేపట్టాడు 1929లో విడుదల అయిన గోపాలకృష్ణ అనే చిత్రానికి 18 ఏళ్ల  వయస్సులోనే దర్శకత్వము వహించాడు అంతకన్నా ముందే అంటే 1921లోనే సురేఖ హారన్ అనే మూకీ(మాటలు లేని) సినిమాలో నటించాడు. ఆ తరువాత అంటే 1930 నాటికి మాటల సినిమా (టాకి) లు వచ్చే నాటికి మొదటిసారిగా రెండు భాషలలో ఒకేసారి చలన చిత్రాన్నినిర్మించిన మొదటి వ్యక్తి శాంతారామ్ ఆ సినిమాలు మరాఠీలో అయోధ్యచే రాజ ,హిందీలో అయోధ్యకి రాజ 
తన 66 ఏళ్ల సినిమా కెరీర్ లో సినిమాను, సామాజిక మార్పు తీసుకురావటానికి ,మానవత్వాన్ని ప్రచారము చేయటం కోసము,సంఘములో జరుగుతున్న  అన్యాయాలను,మతాల మధ్య గల వైషమ్యాలను తొలగించటానికి ,ఒక సాధనంగా వాడుకున్నాడు తన సినిమాలలో తానూ అనుకున్న ఉద్దేశ్యాలను ప్రేక్షకుల ముందు తీసుకొని వెళ్లే  భాద్యత సినిమాలలోని స్త్రీ పాత్రలకు అప్పజెప్పేవాడు అందువల్ల శాంతారాం సినిమాలలో స్త్రీ పాత్రల ప్రభావము ఎక్కువగా ఉంటుంది ఒకరకంగా హీరోఇన్ ఒరింటెడ్ సినిమాలే బాల్య వివాహాల ప్రాబల్యము ఎక్కువగా ఉన్నరోజుల్లో,తన "బెమెల్ వివాహ్" అనే మరాఠీ చిత్రములో చిన్న అమ్మాయి ఒక వృద్దుడిని పెళ్లి చేసుకోవటము ,అలాగే "కుంకు"  అనే చిత్రములో ఒక వేశ్యకు పోలీస్ అధికారికి మధ్యగల ప్రేమ కథను చిత్రీకరిస్తాడు.  కరుడు గట్టిన ఆరుగురు నేరస్తులను మానసికము గా ఎలా పరివర్తన తేవచ్చో" దో ఆంఖే భార హత్" సినిమాలో  చూపిస్తాడు నేరస్తులకు జైలు శిక్ష ఒక్కటే పరిష్కారము కాదు అని ఆ సినిమాలో చెపుతాడు ఆ సినిమా పతాక సన్నివేశము చిత్రీకరణలో సొంతముగా ఎద్దుతో పోట్లడి కళ్ళు పోయే ప్రమాదము తెచ్చుకుంటాడు. ఆ సంఘటన తరువాత కంటికి తగిలిన గాయాల వల్ల కట్టు కట్టుకున్నప్పుడు వచ్చిన ఆలోచనల ప్రతిరూపమే నవరంగ్ ఆ సినిమాలో శాంతారాం లోని భావకవి ని చూస్తాము ఒక కళాకారుడి ఆలోచనలు కళ్ళు మూసుకున్నా ఏవిధముగా రంగుల భరితముగా ఉంటాయో ఆ సినిమా చుస్తే తెలుస్తుంది  
సినిమాలలో శాంతారామ్ కు సంగీతము పట్ల చాలా అభిమానము ఆసక్తి ఉండేవి. సినిమాలలోని పాటలకు సంగీతము సమకూర్చటంలో సంగీత దర్శకులతో పాటు పనిచేసేవాడు.అలా  చాలా సినిమాలకు అయన అజ్ఞాత సంగీత(ఘోస్ట్) దర్శకుడు ఆయనకు ఉన్న వేలాదిమంది అభిమానులలో రాజేష్ ఖన్నా ఒకడుఅంతే కాకుండా ప్రముఖ హాలీవుడ్ హాస్య నటుడు చార్లీ చాప్లిన్ "మనూస్"అనే శాంతారామ్ సినిమాకు అభిమాని ఆ సినిమాను మెచ్చుకున్నాడు. హిందీ చలన చిత్ర పరిశ్రమలో దాదాసాహెబ్ పాల్కే తరువాత అంట పేరు ప్రఖ్యాతులు గడించినవాడు శాంతారామ్. ఈయన 1955లో నేషనల్ ఫిల్మ్ అవార్డు ను,జనక్ జనక్ పాయల్ బాజే కు ప్రశాంశ పత్రాన్ని పొందాడు,దాసాహెబ్ పాల్కే అవార్డును 1985లోను,1992లో పద్మ విభూషణ్ బిరుదులతో భారత పరభుత్వము శాంతారాం ను సత్కరించింది. బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ఈయన దో ఆంఖే భారత్ హత్ సినిమాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు1952లో  కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అమర్ భూపాలీ సినిమా సౌండ్ రికార్డింగ్ కు గాను గ్రాండ్ ప్రిక్స్ బహుమతిని పొందాడు ఈ విధముగా జాతీయముగాను అంతార్జాతీయముగాను ఈయన సినిమాలు భారత దేశానికి ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. శాంతారాం భార్య సంధ్య కూడా మంచి నృత్య కళాకారిణి ఆయనతో పాటు దో ఆంఖే బారా హత్ వంటి చిత్రాలలో నటించింది కూతురు రాజశ్రీ కూడా నటియే భారత ప్రభుత్వమూ అయన గౌరవార్థము 2001, నవంబర్ 17న అయన శతజయంతి ఉత్సవాల సందర్భము గా పోస్టల్  స్టాంప్ ను విడుదల చేసింది. భారతీయ చలన చిత్ర చరిత్రలో శాంతారామ్ ఒక ధ్రువ తార అయన తీసిన సినిమాలు కళాఖండాలుగా గుర్తింపబడి అయన పేరును చిరస్థాయిగా ఉంచుతాయి. 
***    

No comments:

Post a Comment

Pages