ప్రేమతో నీ ఋషి – 39 - అచ్చంగా తెలుగు
ప్రేమతో నీ ఋషి – 39
- యనమండ్ర శ్రీనివాస్

ఆ తర్వాత, అన్ని కేసుల్లోను అసలు పెయింటింగ్స్ కొనుగోలుదారులను సంప్రదించడం జరిగింది, వారంతా ఉదారంగా తాము కొన్న పెయింటింగ్స్ ను మ్యూజియంకు ఇచ్చేందుకు అంగీకరించారు, మృణాల్, అప్సరతో ఇదివరకు వారు చేసుకున్న కాంట్రాక్టును రద్దు చేసారు. కేంద్ర ప్రభుత్వ అభ్యర్ధనపై స్విస్ బ్యాంకు ఫ్రీజ్ చేసిన మినిస్టర్ల అకౌంట్ల నుంచి కొనుగోలుదారుల డబ్బు వెనక్కి ఇవ్వడం జరిగింది. స్విస్ ప్రభుత్వం మొదట ఇందుకు నిరాకరించినా, ఇందులో టాక్స్ ఫ్రాడ్ ఉంది కనుక, కేంద్ర ప్రభుత్వం చివరికి బ్యాంకు ప్రైమ్ సూయిస్ లో ఉన్న మినిస్టర్ల ఖాతాలను ఫ్రీజ్ చేసేందుకు స్విస్ బ్యాంకు వారిని ఒప్పించగలిగారు.
“దురదృష్టవశాత్తూ ఎదురైన ఎన్నో ఇబ్బందులు, ఎదురు దెబ్బల తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ ఇవాళ ఆరంభించబడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్ట్ సమర్ధవంతంగా పూర్తవ్వడానికి బాధ్యులైన ప్రత్యేక కమిటీ సభ్యులకు, స్పెషల్ ఆఫీసర్లకు నేను కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను.
మరొక రెండు నెలల్లో, మ్యుజియం కోసం పెయింటింగ్స్ సేకరణ ప్రక్రియ మొత్తం పూర్తయ్యింది. స్నిగ్దను ఆ ప్రాజెక్ట్ కు అధికారిక ఇన్ చార్జిగా, ఋషిని ఈ ప్రాజెక్టుకు స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు కేంద్రంలో స్థాపించిన ప్రత్యేక కమిటీ మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఆ రోజుకు వెలుగు చూసి, కేంద్ర పర్యాటక మంత్రిచే ఆవిష్కరింపబడుతోంది. ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ అందుకున్న మీడియా ప్రచారం, ప్రతికూల విమర్శలు చూసిన తర్వాత, ప్రత్యేక కమిటీ మార్గదర్శకత్వంలో, అన్ని విషయాల్లోనూ జాగ్రత్త వహించామని నిర్ధారించుకున్నాకా, ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చెయ్యడం మంచిదని నా భావన.
“ఆయన చెప్పేదానితో నేను ఏకీభవిస్తాను. ప్రద్యుమ్న జీవితం కూడా ఇదే సందేశాన్ని ఇస్తుంది. నీ దారిలో వచ్చే ప్రలోభాలకు నువ్వు లొంగిపోతే, ఎన్నో ఏళ్ళు కష్టపడి నీవు పొందిన స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుంది. బాగా చెప్పారు!” మినిస్టర్ చెప్పేదానికి అంగీకార్ సూచకంగా తలూపుతూ స్నిగ్ధ వ్యాఖ్యానించింది.
ఈ వేడుకను విశేషించి, విశ్వామిత్ర పెయింటింగ్ కు తెర తీయడం ద్వారానే ఆరంభించాలని నేను ఎందుకు ఎంచుకున్నానంటే, మనిషి తన ప్రలోభాలకు లేదా ఒత్తిళ్లకు తలొగ్గినప్పుడు, అతడి శక్తి నాశనమౌతుందని ఇది సూచిస్తుంది. ఇదే అంశం దురదృష్టవశాత్తూ, ఒక నాయకుడు కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గాలని ఎంచుకున్నప్పుడు, అతడి వ్యాపార సామ్రాజ్యం పతనమవడాన్ని కూడా సూచిస్తుంది. ఆ రకంగా, దైనందిన జీవనంలో ఒక వ్యక్తి ఎదుర్కునే కష్టకాలపు పరీక్షను ఈ పెయింటింగ్, మ్యుజియం పోలి ఉంటాయి. “ మ్యుజియం ఆరంభం సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ ఉన్నారు. “కాని విశ్వామిత్ర జీవితం మనకిచ్చే సందేశం ఇది కాదనుకుంటాను.” ఋషి స్నిగ్ధ చెవిలో గుసగుసలాడాడు. వారు ముందు వరుసలో ఒక మూల కూర్చుని , మంత్రి ఇచ్చే ప్రసంగం వినసాగారు. “కాని నేను ఆయనతో ఏకీభవించట్లేదు.” అన్నాడు ఋషి. “ఎందుకు? నాకర్ధం కాలేదు.” బదులిచ్చింది స్నిగ్ధ.
“ప్రద్యుమ్న లేక మహేంద్ర తమ జీవితాల్లో చేసిన తప్పు అదేనని నా అంచనా. రాకుమారితో ప్రేమలో మునిగిపోయి, ప్రద్యుమ్నకు ఇంకా మంచి భవిత ఉండేది. రాకుమారితో మధురక్షణాలను గడుపుతూనే, అతడు తన ప్రతిష్టకు, భవితకు భంగం కలగకుండా ప్రేమకు, భవితకు మధ్య ఒక గీత గీసుకుని ఉండాల్సింది. ఇక్కడ విషయం ఏమిటంటే ప్రలోభం వలన కలిగే ఆనందం చిన్న మోతాదులలో ప్రారంభమవుతుంది, కాని దాన్ని త్వరగా వదిలేయడమే ఇక్కడ అసలైన కిటుకు. కొన్నాళ్ళు దాన్ని ఆస్వాదించి, దానికి మీరు పూర్తిగా అలవాటుపడేలోగా వదిలెయ్యాలి.”
“చూడు, విశ్వామిత్ర జీవితం మనకు మనిషి యొక్క శక్తి నాశనం కావడాన్ని గురించి బోధించట్లేదు. దీనికి బదులుగా, ఒక వ్యక్తికి ఉన్న సంకల్ప బలం యొక్క శక్తిని ఇది ఉదహరిస్తుంది. ఒక వ్యక్తి తన జీవితంలోని దీర్ఘ కాలిక లక్ష్యాన్ని గురించిన అవగాహనతో ఉన్నప్పుడు, దానిపైనే దృష్టి పెట్టినప్పుడు, ఒక తాత్కాలిక వికర్షణ అతన్ని లక్ష్యం వైపు వెళ్లడం నుంచి ఆపలేదు. ఒక వ్యక్తి తన జీవిత లక్ష్యం యొక్క ప్రబలతను,ధృడత్వాన్ని అనుసరించి, క్షణికమైన ఆనందం వలన అతడు పొందే తాత్కాలిక వికర్షణ నుంచి తొందరలోనో లేక కాస్త ఆలస్యంగానో వెంటనే వెనక్కు తిరిగి వస్తాడు. “ఋషి వివరించాడు. “అవును, నీ విశ్లేషణ బాగుందని నాకనిపిస్తోంది. కొనసాగించు,” స్నిగ్ధ తలూపుతూ అంది. స్నిగ్ధ ఋషి మాటలను శ్రద్ధగా వినసాగింది. అతనిలా కొనసాగించాడు,” మహేంద్ర కూడా ఇదే తప్పు చేసాడు. మొదట అతడి లక్ష్యం కొంతమంది రాజకీయనాయకుల దన్నుతో తన వ్యాపారాన్ని కొనసాగించడం. కాని, చట్టవిరుద్ధమైన కార్యకలాపాల ద్వారా అతడు ఈ పద్ధతిని చాలాకాలం కొనసాగించాడు. ఈ ప్రక్రియలో, అతడు ప్రజలను మోసం చేసేంత ఆత్మవిశ్వాసాన్ని పొందాడు, ఇది అతడిని కళ్ళున్న గుడ్డివాడిని చేసింది, జనాలను చంపించే దాకా తీసుకుని వెళ్ళింది. తన కంపెనీ నిలబడడం కోసం మంత్రులకు లంచాలు ఇచ్చినప్పుడు అతడి పతనం మొదలవలేదు, కాని, ఆ మంత్రుల నుంచి అనైతికంగా లాభాలు దండుకోవాలన్న ఆత్రంలో మునిగిపోయి, తన దీర్ఘకాలిక లక్ష్యమైన తన కంపెనీని రక్షించుకోవడం అనే దాన్ని కూడా మరచినప్పుడే అతడి పతనం మొదలయ్యింది.” ఋషి తన విశ్లేషణ ముగించాడు.
ఋషి ఒక్క క్షణం ఆలోచించి, ఇలా అన్నాడు,” నేను నీతో ఏకీభవిస్తున్నాను. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే, మనకు ఆనందాన్నిచ్చే ఏ సంతోషాలనైనా మనం కొంతకాలం ఆస్వాదించవచ్చు, కాని మన జీవితాన్నే నాశనం చేసే విధంగా వాటిలో మునిగిపోకూడదు. జీవితంలో నీవిచ్చిన ఈ సందేశానికి గాను, “నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను విశ్వామిత్ర ఋషి,” ఇలా అంటూ ఋషి స్నిగ్ధ చేతిని పట్టుకున్నాడు. స్నిగ్ధ కూడా మంత్రి ప్రసంగం తర్వాత గట్టిగా మ్రోగిన చప్పట్ల మధ్యన నవ్వుతూ అతడి చేతిని మరింత గట్టిగా పట్టుకుంది.
స్నిగ్ధ ఋషి ఏం చెప్పదల్చుకున్నాడో అర్ధం చేసుకుంది. ఋషి జీవితంలో జరిగినవాటితో కూడా ఆమె వీటన్నింటినీ పోల్చుకుంది. “దీన్నే మరోవిధంగా తీసుకున్నప్పుడు, అది నీకు కూడా వర్తిస్తుంది ఋషి. అప్సరతో సంబంధం పెట్టుకోవడం విషయంలో కాని, ఆమెతో తాత్కాలికమైన సుఖాలను పొందడం గురించి కాని, నిజానికి, నీకూ అభ్యంతరం లేకపోవచ్చు. కాని నీ తండ్రి మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలన్న నీ లక్ష్యం పదేపదే నీ మనసులో మెదులుతూ ఉంది; అందుకే నీ నిర్ణయాలు దారి తప్పలేదు. ఇదొక్కటీ తప్ప, ఆమె ఆశించిన విధంగా నువ్వు ఆమెతో సంబంధం పెట్టుకోకపోవడానికి వేరే ఏ కారణమూ లేదు.” ఋషి వదనంలో ఒక జీవం లేని నవ్వు కనిపించింది. ఈ విషయంలో అతడు స్నిగ్ధతో వాదించలేడు. “కాబట్టి, నా దృష్టిలో నేర్చుకోవడం అంటే అన్వేషించడం, ఆస్వాదించడం, ఇంకా శతాబ్దాల క్రితమే బ్రహ్మర్షి విశ్వామిత్రుడు నిర్దేశించుకున్న విధంగా, లేక ఈ ఆధునిక ఋషి కొన్ని వారాల క్రితమే ఏర్పరుచుకున్న విధంగా మన లక్ష్యాలను నిర్దేశించుకోవడం. ఆ విధంగానే మనం అప్పటి మేనక లేక ఇప్పటి అప్సరల ద్వారా కలిగే తాత్కాలిక ఆకర్షణల వల్ల జనించే క్షణికమైన విక్షేపణల నుంచి బయటపడగలుగుతాము. కాని ఆ క్షణికమైన ఆనందాలు ఆ వ్యక్తిని తమలో పూర్తిగా ముంచెయ్యకుండా వారు జాగ్రత్తపడాలి.” స్నిగ్ధ తన దృక్పధాన్ని జోడించింది.
(అయిపొయింది.)


No comments:

Post a Comment

Pages