అన్నమయ్య సూక్తి చంద్రిక (31-60) - అచ్చంగా తెలుగు

అన్నమయ్య సూక్తి చంద్రిక (31-60)

Share This
అన్నమయ్య సూక్తి చంద్రిక (31-60)
                (అన్నమయ్య  కీర్తనలలోని  సూక్తులకు    ఆంగ్ల లిప్యంతరీకరణము, ఆంగ్లానువాదము, వివరణములు )
           -డా. తాడేపల్లి పతంజలి31
చెంత నిండుచెరువుండ చెలమలేలా(1-466)
వివరణం
  దగ్గరలో  నిండు చెరువు ఉండగా  చెలమల దగ్గరకు  పోవుట ఎందుకు?
(ఏరు ఎండిపోయిన తరువాత ఇసుకలో త్రవ్వి చిన్న గుంట చేస్తే అందులో నీరు వస్తుంది. అదే చెలమ.  చెలమ అంటే ఊట )
English transliteration
Centa niṇḍuceruvuṇḍa celamalēlā
ఆంగ్లానువాదము
Why you are  going to the CHELAMA ( a hole or pit dug for water in the dry bed of a river or rivulet etc) having the pond near by .
32
మొదలుండ గొనలకు మోచి నీళ్ళువోయనేల
యెదలో నీవుండఁగా నితరములేలా(1-466)
వివరణం
చెట్లను పెంచి ఫలమును అనుభవించాలనుకొనేవాడు దాని మొదలుండగా కొమ్మలకు మోసికొనిపోయి నీళ్లు పోయుట వ్యర్ధము. అలాగే - ఓ వేంకటేశా ! హృదయములో నువ్వుండగా నిన్ను వదలి ఇతర ఉపాయాలతో మోక్షానికి ప్రయత్నించుట వ్యర్థం. ..
English transliteration
Modaluṇḍa gonalaku mōci nīḷḷuvōyanēlayedalō nīvuṇḍam̐gā nitaramulēlā
ఆంగ్లానువాదము
The one who wants to grow in the trees and to experience the fruit of it is the wasting of the sprout in the beginning. Like wise, O venkatesa! With other musings you have left yourself in the heart trying for salvation is a waste.
33
బలు సంసారపుపొందు పాముతోడిపొత్తు సుండీ(1-494)
వివరణం
బలము కలిగిన ఈ సంసారముతో స్నేహము చేయుట - పాముతో స్నేహము చేయుట వంటిది.
English transliteration
Balusansārapupondu pāmutōḍipottu suṇḍī
ఆంగ్లానువాదము
Friendship with this powerful force SAMSARA ( life with a family,,) - is like making friends with snake.
34
పుట్టించినహరి పూరి మేపునా(1-495)
వివరణం
మనలను పుట్టించిన హరి మన చేత ( అజ్ఞానము అనే) గడ్డి తినిపించునా?( ఆయనను నమ్ముకొంటే జ్ఞానాన్ని ఇస్తాడని భావం.)
English transliteration
Puṭṭin̄cinahari pūri mēpunā
ఆంగ్లానువాదము
Will the grass(the ignorance) be eaten by us through HARI? (Believing in HARI is a sense of wisdom.)
35
ధర నహంకారులకు తాదానే దైవము
దరిద్రుడైనవారికి దాత దైవము(1-498)
వివరణం
ఈ భూమిలో అహంకారి  తనను  తానే దేవునిగా భావిస్తాడు.దరిద్రునికి దాత దైవం.
English transliteration
Dhara nahaṅkārulaku tādānē daivamu
daridruḍainavāriki dāta daivamu
ఆంగ్లానువాదము
In this land a proud or self-conceited person  feels to himself as God.The donor is the god of the poor.
36
తెలిసితే మోక్షము తెలియకున్న బంధము(2-19)
వివరణం
జీవులకు తత్త్వము తెలిస్తే మోక్షము కలుగుతుంది.. అది తెలియకున్నంత వరకు బంధము
జీవుల భావనలకు సంబంధించినవి బంధము, మోక్షము
ఆయా విషయములకు సంబంధించిన జ్ఞానముపైనను, అజ్ఞానముపైనను భావనలు ఆధారపడి ఉంటాయి.
కావుననే జ్ఞానము తెలిస్తే మోక్షము, తెలియక పోతే బంధము
. 'మవ ఏవ మమష్యాణాం కారణం బంధమోక్షయోః " ఆను ఉపనిషద్వచనం
మనో మనస్సుకు సంబంధించిన వాసనలు (జ్ఞానము అజ్ఞానము) బంధమోక్షములకు కారణములు .
English transliteration
Telisitē mōkṣamu teliyakunna bandhamu
ఆంగ్లానువాదము
If creatures know the truth (opp. to what is illusory), Moksham occures. If not unknown the RELATIONSHIP continues.
Moksham means
release from worldly existence, final emancipation or exemption from further birth or transmigration
37
పొంచినకోపము విడువక భోగము విడిచిననేమి(2-55)
వివరణం
కోపమును విడువకుండా భోగాన్ని విడిచిపెడితే ఏమి ప్రయోజనం?
English transliteration
Pon̄cinakōpamu viḍuvaka bhōgamu viḍicinanēmi
ఆంగ్లానువాదము
What is the purpose of leaving the enjoyment (possession) without leaving the anger?
38
తలఁపులు గడుగక వొడ లటు తాఁ గడిగిన నేమి(2-55)
వివరణం
మనస్సు శుద్ది కాకుండా శరీర శుద్ది వలన ప్రయోజనం లేదు
English transliteration
Talam̐pulu gaḍugaka voḍa laṭu tām̐ gaḍigina nēmi
ఆంగ్లానువాదము
The cleansing of the body does not get benefit without cleansing of the mind
39
యోగము దెలియక పలుచదువులు దెలిసిన నేమి(2-55)
వివరణం
adRShTamu teliyakumDaa enni chaduvulu telisinaa Emi phalitamuMdi?
English transliteration
Yōgamu deliyaka palucaduvulu delisina nēmi
ఆంగ్లానువాదము
What is the use of many studies have been known without knowing fortune?
40
భావించి యన్ని నేరాలు పరిహరించు నతడే
ఆవటించు సూర్యునికి నంధకార మెదురా(2-72)
English transliteration
Bhāvin̄ci yanni nērālu pariharin̄cu nataḍē
āvaṭin̄cu sūryuniki nandhakāra medurā
వివరణం
శ్రీ వేంకటేశుని శరణు కోరితే అన్ని నేరాలు అతను పోగొడతాడు .
సూర్యుడు పూనుకొంటే (ఆవటిస్తే) చీకటి ఒక లెక్కా?
ఆంగ్లానువాదము
If you seek the refuge of Sri Venkatesa , he will destroy all the crimes.
If the sun is to be indulged , then is the darkness a calculation?
41
గోవు మీద విసరీగుక్కమీద విసరీని
పావనపు గాలికిని పాపమంటీనా(2-129)
English transliteration
Gōvu mīda visarīgukkamīda visarīni
pāvanapu gālikini pāpamaṇṭīnā
వివరణం
ఆవు మీద, కుక్క మీద ఒకటే గాలి వీస్తుంది. కాని పవిత్రమైన గాలికి పాపము రాదు.
ఆంగ్లానువాదము
On the cow, the dog is the same one.
But the holy wind does not get sin.
42
యేవల నరుడు లేక యెద్దే తా దున్నునా
వేవేగ నీకృపగాక విజ్ఞానినౌదునా(2-130)
English transliteration
Yēvala naruḍu lēka yeddē tā dunnunā
vēvēga nīkr̥pagāka vijñāninaudunā(2-130)
వివరణం
వేంకటేశా !
మానవుడు లేకుండా ఎద్దు స్వయంగా తనంతట తాను దున్నుతుందా?
నీ దయ లేకుండా నాకు విజ్ఞానము వస్తుందా?
ఆంగ్లానువాదము
venkatesaa !
Does the bull itself self-sustain without human being?
Will I have knowledge without your compassion?
43
దేవుఁడ సూర్యుఁడు రాక తెల్లవారునా రేయి
వేవేగ నీకృపఁగాక విజ్ఞానినౌదునా(2-130)
English transliteration
Dēvum̐ḍa sūryum̐ḍu rāka tellavārunā rēyi
vēvēga nīkr̥pam̐gāka vijñāninaudunā
వివరణం
వేంకటేశా !
సూర్యుడు రాకుండా తెల్లవారుతుందా?
నీ దయ లేకుండా నాకు విజ్ఞానము వస్తుందా?
ఆంగ్లానువాదము
There is no dawning  without the Sun.
There is  no  knowledge without the  compassion of venkateswara
44
కుమ్మరవాఁడు లేకే కుండ రాఁ బుట్టునా(2-130)
English transliteration
Kum'maravāḍu lēkē kuṇḍa rābuṭṭunā
వివరణంవేంకటేశా ! కుమ్మరవాడు లేకుండా కుండ రాదు నువ్వు లేకుండా నేను లేను
ఆంగ్లానువాదము
Venkatesa! The pot does not come without a potterI'm not without you
45
మక్కువ మగడులేని మనువు గలుగునా
లెక్కించి యంతర్యామివి లేని నే నున్నాడనా(2-130)
English transliteration
Makkuva magaḍulēni manuvu galugunā
lekkin̄ci yantaryāmivi lēni nē nunnāḍanā
వివరణం
వేంకటేశా !
భర్త లేకుండా వివాహము లేదు.
అంతర్యామివి నీవు లేకుండా నేను లేను
ఆంగ్లానువాదము
Venkatesa!
There is no marriage without a husband.
  I'm not without you(The indweller)
46
మాపులే మరణములు రేపులే పుట్టువులు(2-157)
English transliteration
Māpulē maraṇamulu rēpulē puṭṭuvulu
వివరణం
raatrulE maraNamulu . vEkuvalE puTTukalu
ఆంగ్లానువాదము
Nights are deaths.  Morning  are births.
47
దరిద్రునిమాట కలవానికింపుగాదు(2-247)
English transliteration
Daridrunimāṭa kalavānikimpugādu
వివరణం
బీదవాని మాటని డబ్బున్నవాడు ఇష్టపడడు
ఆంగ్లానువాదము
A wealthy man does not likes a Poorman's word.
48పొరుగువాని చేత ఆపొరుగువాడు మెచ్చడు((2-247)
English transliterationPoruguvāni cēta āporuguvāḍu meccaḍu((2-247)
వివరణంపొరుగువాని పనిని పొరుగువాడు మెచ్చుకోడు మానవుల పనులు వివిధ రకాలు.
ఆంగ్లానువాదముNeighbor do not praise the neighbor's work
49అతిసంపదలు దేహి నజ్ఞాని జేయు(2-267)
English transliterationAtisampadalu dēhi najñāni jēyu((2-267)
వివరణంఎక్కువగా ఉన్న సంపదలు ఈ మానవులను అజ్ఞానులుగా చేస్తాయి. ఆంగ్లానువాదముThe wealth that is high will make these humans ignorant.
50పరమశాంతునకు బాపము రాదు(2-307)
English transliterationParamaśāntunaku bāpamu rādu(2-307)
వివరణంSaaMtamu kalavaaniki paapamu raadu
ఆంగ్లానువాదముThere is no sin for the one who is patient and gentle.
51
విరతిగలవానికి వెరపు లేదు(2-307)
English transliteration
Viratigalavāniki verapu lēdu(2-307)
వివరణం
ఆలోచనలను నశింపచేసిన వానికి భయము లేదు..
ఆంగ్లానువాదము
There is no fear for the one who is ceasing thoughts.
52
మౌనికి కలహమే లేదు(2-307)
English transliteration
Mauniki kalahamē lēdu(2-307)
వివరణం
ఆలోచనలను నశింపచేసిన వానికి భయము లేదు..
మౌనం పాటించేవాడు మౌని. ముని అంటే ఋషి. ముని వేరు, మౌని వేరు.
విభూషణం మౌనమపండితానాం (silence does credit to the ignorant).మౌనంసర్వార్థసాధనం (silence will conquer every difficulty) ఇటువంటి వాక్యాలే.
మౌనము మూడు రకాలు
1. వాఙ్మౌనము,
2. అక్షమౌనము (పదునాలుగింద్రియములను  విషయాదులందు చొరనీక పరబ్రహ్మమందే లగ్నము చేయుట),
3. కాష్ఠ మౌనము (మూలబంధ, ఉడ్యాణబంధ జాలంధర బంధముల చేతను, పద్మాసనాదుల చేతను శరీరమును నిలుపుకొనుట).
ఆంగ్లానువాదము
There is no contention  to  silence follower  (2-307)
53
చే వదలితే పెంచిన చిలుకైనా మేడ లెక్కు
రావించి గూట బెట్టితే రామా యనును(2-349)
English transliteration
Cē vadalitē pen̄cina cilukainā mēḍa lekku
rāvin̄ci gūṭa beṭṭitē rāmā yanunu(2-349)
వివరణం
స్వేచ్చగా విడిచిపెడితే చిలుక కూడా మేడలు ఎక్కుతుంది.
దానిని కుదురుగా పంజరంలో బంధించి చెబితేనే రామా అంటుంది
నా మనస్సును కూడా స్వేచ్చగా విడిచిపెడితే ఎటువైపయినా పరుగులు పెడుతుంది.
దానిని వేంకటేశుని పాదపంజరాల దగ్గర బంధిస్తేనే చెప్పిన మాట వింటుంది.
ఆంగ్లానువాదము
If you give liberty to the parrot ,it goes upstairs.
parrot says Rama only , when it is captured in cage
Even if I leave my mind freely, it runs out anyway.
It listens to me when it binds to the VENKATESAs footpath.
54
నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే
అండనే బంటు నిద్రదియు నొకటే(2-385)
English transliteration
Niṇḍāra rāju nidrin̄cu nidrayu nokaṭē
aṇḍanē baṇṭu nidradiyu nokaṭē(2-385)
వివరణం
రాజనిద్ర, సేవకుని నిద్ర  రెండూ ఒకటే.
ఆంగ్లానువాదము
The kings sleep , the servant's sleep is the same.
55
పిండంతే నిప్పటి యన్నట్లు(2-393)
English transliteration
Piṇḍantē nippaṭi yannaṭlu
వివరణం
వేంకటేశ్వరా !  ఎవ్వరెవ్వ రు  ఎంతంతమాత్రముగా నిన్ను తలుస్తారో , వారివారికి   అంతంత  మాత్రముగానే నీవు తోస్తుంటావు.   పిండికొలది పిండివంట ఉన్నట్లు
నిప్పటి=   ఆకులు మీద కప్పి నిప్పులో కాల్చెడి పిండి వంటకం
వెన్నకొద్దీ నెయ్యి, తూరినంతే వాకిలి,  పైడంతే తూనిక  (బంగారమెంత ఉంటుందో దాన్ని బట్టే ఆభరణం)  మొదలగు ప్రయోగముల వరుసలో  అన్నమయ్య ఈ  పిండంతే నిప్పటి  ప్రయోగం చేసాడు.
ఆంగ్లానువాదము
O venkateswara ,
you are just about as much as one imagines you to be.
As they say, the more dough , the more bread ( God on the hill courtesy)
56
కోటి చదువగవచ్చు కోపము నిలుపరాదు(2-474)
English transliterationKōṭi caduvagavaccu kōpamu niluparādu(2-474)
వివరణం
మానవుడు కోటి చదివినా కోపమును ఆపుకోలేడు.ఆంగ్లానువాదముNo matter how much human being reads, he can not stop the anger
57
వెదకనేటికి నేయి వెన్న చేతబట్టుకొని(2-506)
English transliteration
Vedakanēṭiki nēyi venna cētabaṭṭukoni(2-506)
వివరణం
చేతిలో వెన్నను పెట్టుకొని నేతికి వెతకటం వ్యర్థం.
ఆంగ్లానువాదము
Holding  the butter in hand the  wandering of  GHEE  is  a waste programme
58
ముడిచివేసిన పువ్వు ముడువ యోగ్యముకాదు  (2-494)
English transliteration
Muḍicivēsina puvvu muḍuva yōgyamukādu(2-494)
వివరణం
ఒకరు తలపై ధరించిన  పూవు మరొకరికి  ధరించటానికి పనికిరాదు.
ఆంగ్లానువాదము
The one wearing on the head is not worth it to wear to another.
59
వుమిసిన తమ్మలో నొకకొంత కప్రము
సమకూర్చి చవిగొని చప్పరించనేల (2-494)
English transliteration
Vumisina tam'malō nokakonta kapramu
samakūrci cavigoni capparin̄canēla (2-494)
వివరణం
ఒకడు రుచి చూసి ఉమ్మివేసిన తాంబూలములో కొంత కర్పూరము కలిపి రుచియని చప్పరించకూడదు. ఒకని కవిత్వాన్ని దొంగిలించి అందులో తమ మాటలు కొన్ని కలిపితే దేవుడు నవ్వడా ?
ఆంగ్లానువాదము
In the spittle , some camphor can not be tasted
60
పెంచి తమ పెట్టుజెట్టు పెరికివేయ రెవ్వరు(3-70)
English transliterationPen̄ci vāri peṭṭujeṭṭu perikidē revvaru(3-70)
వివరణం
ఓ వేంకటేశా ! తను స్వయంగా పెంచిన చెట్టును ఎవరూ స్వయంగా నరికి వేయుటకు ఇష్టపడరు. (ఆవిధంగానే నెను మంచి వాడిని కాకపోయినంత మాత్రాన నన్ను విడిచివేస్తావా?)
ఆంగ్లానువాదముO venkatesa ! No one wants to cut his own tree.

No comments:

Post a Comment

Pages