పుష్యమిత్ర - 17
- టేకుమళ్ళ వెంకటప్పయ్యజరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మాణ సమయంలో  హిమాలయాలపైన  బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. బృహద్ధ్రధుని అనుజ్ఞమేరకు ఆంధ్ర దేశానికి స్వయంవరానికి వెళ్ళిన పుష్యమిత్రుడు వసంతసేనను ఆలయంలో చూసి ప్రేమలో పడతాడు. అనుకోకుండా వారిద్దరికీ వివాహం అవుతుంది. సైనిక కవాతు సమయంలో సింహకేతనునితోబాటూ, బృహద్ధ్రధునీ వధించి సింహాసనం అధిష్టించి సుపరిపాలన సాగిస్తూ, కొంతకాలం తరవాత కుమారుడు అగ్నిమిత్రునికి రాజ్యం కట్టబెట్టి వానప్రస్థాశ్రమం స్వీకరించి, హిమాలయాలలో జ్ఞాన సమాధిలో ఉన్నప్పుడు బాబాజీని దర్శిస్తాడు. పుష్యమిత్రుడు బాబాజీ ద్వారా కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీద సంచరించాలనీ,  హిందూ దేశంలోని పరిస్థితులను చక్కబరచవలసి ఉందనీ, ఈలోపు సశరీరంగా, చిరంజీవిగా ఉంటావనీ.. అయితే ఇదే శరీరంతో నిద్రాణమైన స్థితిలో ఉండాలనీ ఆదేశించడంతో ఆశ్చర్యపోతాడు.  ఈ ఫ్లాష్-బ్యాక్ ఇది ఇలా ఉండగా,  వర్తమానంలో కరిముల్లా కూపీ లాగడానికి వచ్చిన జిలానీ బాషాను బంధించి  లై-డిటేక్టర్ తో నిజంచెప్పిస్తారు.  (ఇక చదవండి) 
"భారత ఉపఖండం ఇటు అణ్వస్త్రాల తయారీలోనూ, అటు అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగాల్లోనూ ముందంజలోఉండడం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం" అమెరికా ప్రెసిడెంటుతో టెలీ కాన్ఫరెన్సు లో పాకిస్తాన్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. విన్న అమెరికన్ ప్రెసిడెంటు మెల్లిగా నిట్టూరుస్తూ.."నిజమే భారత్ ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోతోంది. ఇండియా పీ.ఎం అన్ని దేశాలు పర్యటించి మద్దతు కూడగడుతున్నాడు. ఈ విషయాలన్నీ గమనిస్తూనే ఉన్నాను" 
"మాకు బెలూచిస్తాన్ కు లేనిపోని గొడవలు రేపుతున్నాడు"
" యా...యా... ఐ నో... ఐ నో... మెల్లిగా వీసా నిబంధనలను కఠినతరం చేసి ఇండియన్స్ ను దేశం నుంచీ  వెళ్ళగొట్టాలని నా ప్లాన్. మరి ఇక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్ విషయంలో కూడా రూల్స్ మార్చి వారిని వీలైనంతగా ఇబ్బంది పెట్టేందుకు యత్నం చేస్తున్నాం".
"మంచిదే. మాకు చైనా వారి వత్తిడి ఎక్కువైంది ఇక్కడ. సైనిక స్తావరాలను ఏర్పాటు చేస్తున్నారు. కష్మీర్ ను వశపరచుకునే విషయమై హెల్ప్ చేస్తామని చెప్తున్నారు."
"వాళ్ళు పక్కా వ్యాపారవేత్తలు. వారి మాటలు నమ్మి భారత్ పై యుద్ధానికి దిగితే నష్టపోయేది మీరే అని తెలుసుకోండి."
"తెలుసు బాగా తెలుసు. మేము మీరు అండ ఉన్నారన్న భరోసాతోనే ఇండియాపై కాలు దువ్వుతున్నాం.  చైనా అండను చూసి కాదు."
"చైనా కు ఎక్కువ అనవసర గౌరవాలు ఇవ్వకండి. అంటీ ముట్టనట్టు ఉండండి. అలా అని నెయిబరింగ్ కంట్రీతో గొడవలు వద్దు. జాగ్రత్తగా డీల్ చెయ్యండి." 
"అదే చేస్తున్నాం. కానీ భారత్ తో భయంగా ఉంది. మా బంకర్లపై దాడి ముమ్మరం చేస్తున్నారు. మమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలన్న ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు"
"జాగ్రత్తగా ఉండండి. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేనట్టు మాట్లాడి,  చైనాను ఈవిషయంలో ఉసిగొల్పాము.  చైనాకు జవహర్ లాల్ టైములో సభ్యత్వం ఇండియా వల్లనే వచ్చిందన్న మిషతో మొదట చైనా వ్యతిరేకించడానికి ఒప్పుకోలేదు. కానీ వారిని ఒప్పించి ఇండియాకు మేము ఈ విషయంలో సయోధ్యగా ఉన్నామని, చైనాదేశం మాత్రమే ఇండియా సభ్యత్వానికి వ్యతిరేకం అనే భావన  ప్రపంచ దేశాలకు కలిగించాం".
"కానీ ఇండియా పీ.ఎం అంత అమాయకుడు కాదు. అన్నీ అర్ధం చేసుకో గలడు. ఇదివరకటి ప్రభుత్వాల్లా స్వార్ధంకోసం పనిచేయడు. దేశం కోసం పని చేస్తాడు.  మీ మీద ఏదో అస్త్రం ఈ పాటికి రెడీ చేసి ఉంటాడు. ఎప్పుడు వదులుతాడో తెలీదు. మాకు బెలూచిస్తాన్ లాగా మీ మీదకు ఏ క్యూబానో లేక ఏ అరేబియా కంట్రీనో ఉసిగొల్పితే ప్రమాదం""
"యా...యా... ఐ నో ది క్యాపబిలిటీ ఆఫ్ దట్ మ్యాన్.  సైలెంట్ గా ఉండి చాపకిందికి నీళ్ళు తెచ్చే రకం. అందుకే రష్యాతో కూడా నేను కొన్ని రహస్య ఒప్పందాలు చేసుకున్నాను.  అవి నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు."
"సార్!  మరి....  మాకు పంపాల్సిన ఆయుధాలు.... చాలా కాలంగా పెండింగ్ ఉంది.  ఏ.కే 47 లు అర్జెంటుగా కావాలి. ఈక్వలైజర్స్ కూడా.. ప్లీజ్... త్వరగా పంపండి. అమౌంటు మీకు అల్రెడీ చెల్లించాం."
"హుమ్మ్.  నీకు తెలీదు మిత్రమా! ఇండియన్ గ్లోబల్ఐ ద్వారా వాళ్ళు అన్నీ గమనిస్తున్నారు. నీ వద్ద ఎన్ని అణ్వస్త్రాలు, క్షిపణులు ఉన్నాయో కూడా తెలుసుకోగలరు"
"యెస్. కరిముల్లా అని ఒక ఇండియన్ ఏజెంటు ఒకడు మా సైన్యంలో చేరి మాకే వెన్నుపోటు పొడిచాడు. వాడి కధ త్వరలో ముగించేస్తున్నాం. జిలానీ బాషా అనే కాంఫిడెన్షియల్ పర్సన్ను ఇండియా పంపాము. వాడు రాగానే కరిముల్లా కధ ఫినిష్ చేస్తాము"
"మీ సైన్యం లో ఎంత మంది కరిముల్లాలు ఉన్నారో నీకేం తెల్సు?  భారత్ను తక్కువగా అంచనా వేయకు. ఈ పాటికి మీ జిలానీ వారి చేతుల్లో బందీ అయినా నీవు ఆశ్చర్యపోనక్కరలేదు. అన్నిరకాలుగా న్యాయం చేస్తాం. కష్మీర్ విషయంలో యూ.ఎన్.వో లో మాట్లాడేట్టు వేరే కంట్రీస్ వాళ్ళ ద్వారా ట్రై చేస్తాను. మళ్ళీ మాకు చెడ్డపేరు రాకూడదు కదా! ఆ విధంగా మీకు ఓటు వేసి కష్మీర్ మీకు వచ్చే విధంగా చేస్తాం.  అన్నిటికీ మీ మత పెద్దలను కన్సల్ట్ చెయ్యడం మానేయండి. మాతో సంప్రదించండి. మేము మీకు సహాయం చేస్తామన్న నమ్మకం ఉంటే!"
"యెస్.. ఎంతమాట! అలాగే మిస్టర్ ప్రెసిడెంట్. కానీ... మా పరిస్థితి మీకు అర్ధమయ్యేది కాదు. మేమూ నటించాలి. ఇక్కడి మతపెద్దల జోక్యం లేకుండా నిర్ణయాలు చేయడం అంత సులభమైన విషయం కాదు. 1947 నుండీ ఇదే తంతు నడుస్తోంది ఇక్కడ. అడుగడుక్కూ వాళ్ళ మనుషులు... మతపెద్దలకు అన్నీ పూస గుచ్చుతూ ఉంటారు."
" మీ ప్రయోజనం కోసం ఇచ్చే సలహాలను మూర్ఖంగా తిరస్కరిస్తే నష్టపోయేది మీరే. మెల్లిగా నచ్చ జెప్పాల్సిన అవసరం ఉంది. పెంటగాన్ వెళ్తున్నా. అక్కడ వేరే అర్జెంటు మీటింగ్ ఉంది. బై. "
టెలి కాన్ ఫరెన్సు ముగిసింది. అమెరికా చెప్పేది నిజమే. చైనా వాళ్ళను నమ్మినట్టు నటించాలి అంతే. పూర్తిగా నమ్మకూడదు. చైనా బార్డర్లో వీలైనన్ని ఎక్కువ అండర్గ్రౌండ్ బంకర్లు పాక్ కూడా నిర్మించే పనిలో ఉండాలి.
అర్మీ మొబైలో కాల్ వస్తోంది. "హెలో..యెస్..  వ్హాట్. జిలానీ బాషా పట్టుబడ్డాడా?  అన్ని విషయాలు చెప్పేశాడా.. అల్లా.... మీరు అక్కడ ఏం చేస్తున్నారు? వెంటనే ఏదో విధంగా వాడు బయటకు రావాలి. ఎన్ని బాంబులు పేలినా పరవాలేదు. ఎన్ని భారత్ కుక్కల ప్రాణాలు గాలిలో కలిసినా భయపడకండి. జిలానీని వెదికి తీసుకురండి. బై." 
ఈ ఇండియా వాళ్ళు తెలివి మీరారు. చేయాలి ఏదో చేయాలి ఇవాళ. మొబైల్లో సైన్యాధికారిని ఆదేశించాడు "ఒక గంటలో కరిముల్లా నా ముందు వుండాలి అంతే!". 
* * *
"సార్! జిలానీ బాషా బాగా గాయపడ్డాడు. ప్రాణం పోకుండా వుండాలంటే ట్రీట్మెంట్ తప్పదు." అన్న కల్నల్ మాటలకు బ్రిగేడియర్ నవ్వి "చాలా సీక్రెట్ గా ఆర్మీ డాక్టర్లతో ట్రీట్మెంటు చేయించండి.  నేను వాటికి వ్యతిరేకిని కాదు. నీకు తెలుసు. మన హిందూ మతానికి విస్తృతి ఎక్కువ. ఔదార్యం కూడా చాలా ఎక్కువే. జాలి ఇంకా బాగా ఎక్కువ. సంయమనం సంగతి చెప్పనక్కరలేదు.  మన దేశం నలుగురు ముస్లింలను రాష్ట్రపతుల్ని చేసింది. ఇద్దరు ముస్లింలను  ఉప రాష్ట్రపతుల్ని చేసింది. మరే ముస్లిం దేశంలోనూ  హిందూమతస్తుడు ఏ విధమయిన పదవిలోనూ నిలిచిన దాఖలాలు ఉన్నాయా? లేవు. అందుకే మనది సెక్యులర్ స్టేట్. నీకో విషయం తెలుసా? ఇందిరాగాంధీ చనిపోయే ముందు మిలిటరీ అధికారులు "కొందరు సిఖ్ కాపాలాదారుల ప్రవర్తన వింతగా ఉంది. వారిని మార్చే పర్మిషన్ ఇవ్వండి" అని అడిగితే.. ఆమె సింపుల్ గా "హౌ కెన్ ఇట్ బీ ఎ  సెక్యులర్ స్టేట్?" అని నోట్ రాసి ఫైలును వెనక్కు పంపింది. అలా పంపిన కొద్ది రోజులకే వారి తూటాలకు కన్నుమూసింది. ఇదీ మన ఔన్నత్యం.  ప్రాణాలు ఎవరివైనా ఒకటే! కానివ్వండి. కానీ జాగ్రత్త! జిలానీ బాషా ఏ పేరుతో మనదేశానికి వచ్చాడో ఆ పాస్ పోర్టు ఎవ్వరికీ దొరకనివ్వకండి. లాకర్లో పెట్టి సీల్ చెయ్యండి. నా అనుమతిలేనిదే ఎవ్వరికీ ఇవ్వకండి. వీడిని పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోవాలంటే జిలానీ బాషా పేరుతో ప్రయత్నిస్తారు. ఆ పేరుతో మన దేశానికి ఎవ్వరూ రాలేదు కాబట్టి వాళ్ళు మనలను ఏమీ పీకలేరు. కరిముల్లా వచ్చాక వీడి చరిత్రకు ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టేద్దాం.  లెఫ్టినెంటు జెనెరల్ తో మాట్లాడాల్సిన అర్జెంట్ మీటింగ్ ఉంది. బీ కేర్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ హిం. కన్ను ఆర్పేలోపు చెక్కేస్తాడు. జాగ్రత్త. బై.
* * *
" సార్! కరిముల్లా మన దేశంలో లేడు. ఏదో పని మీద ఇండియా వెళ్ళాడట."
"డ్యాం ఇన్సల్ట్. వెదకండి 12 గంటల్లో నా ముందు నిలబెట్టాలి. ప్రెసిడెంటుకు ఏమి సమాధానం చెప్తాం మనం?"
"యెస్. సర్"
తలపట్టుకున్నాడు పాకిస్థాన్ ఛీఫ్. పరిస్థితులన్నీ ఒక్కసారిగా ఎదురు తిరుగుతున్నాయి. కరిముల్లా గురించి ఎంక్వైరీ అని వెళ్ళిన జిలానీ బాషా ఏమయ్యాడో తెలీడం లేదు. ఏ పేరుతో వెళ్ళాడో తెలీదు. ఎలా వెళ్ళాడో తెలీదు. ఇండియా వెళ్ళాక ఒక్కసారి మాట్లాడాడు అంతే. ఏమయిందో తెలీదు.
* * *
ప్రైం మినిస్టర్ ఆఫీసు. అత్యంత రహస్య సమావేశం. కేవలం హోం, డిఫెన్సు, మిలిటరీ అధికారులు మాత్రమే ఉన్నారు.
"లెట్ అజ్ స్టార్ట్ మీటింగ్" పీ.ఎం అనగానే..
"సర్. పాకిస్థాన్ వాళ్ళు మన గ్లోబల్ ఐ విషయం తెలుసుకున్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు" అర్మీ జెనెరల్ చెప్పగానే
"ఓకే" అన్నాడు పీ.ఎం.
శ్రీహరికోట (షార్) పై బాంబింగ్ చెయ్యడానికి రెండు సబ్మెరైన్స్ ను బే ఆఫ్ బెంగాల్ ద్వారా విశాఖపట్టణం దాటి కృష్ణాపట్నం ఓడ రేవు వైపు వస్తున్నట్టు మన గ్లోబల్ ఐ ఇండికేషన్ ఇచ్చింది." 
"వాటిని పట్టుకున్నారా?"
"యెస్ సర్. అన్నీ స్వాధీనం చేసుకున్నాం. ఇవి వాటికి సంబంధించిన ఫొటోలు”. అందించాడు.`"
"వెరీ గుడ్. వాళ్ళను వదిలెయ్యొద్దు. వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు తీసుకోండి. సంతకం పెట్టకపోతే వారికి ఇండియా మిలిటరీ అంటే ఏంటొ రుచి చూపించండి. అక్కడే బంధించండి. పేపర్ వాళ్ళకు ఏమాత్రం లీక్ కానివ్వకండి. శ్రీహరికోట ఎస్.సీ.ఎఫ్. (కామన్ ఫెసిలిటీస్) వద్దనుండి బందోబస్తు ముమ్మరం చెయ్యండి. ఈగ కూడా లోపలికి పోవడానికి వీలులేదు. ఎంప్లాయీస్ తప్ప ఎవ్వరూ వెళ్ళడానికి లేదు. అందరికీ రాకెట్ లాంచింగ్ టైంలో లాగా డేంజర్-యేరియా పాస్ లను ఇవ్వండి. ఆ 30 కిలోమీటర్ల చుట్టూ ఫర్లాంగుకు ఒక కోస్టు గార్డ్స్ ను ఏర్పాటు చెయ్యండి. "
"అలాగే సర్!"
"వాళ్ళ వినాశనానికి వాళ్ళే గోతులు తీసుకుంటున్నారు. కానివ్వండి". (సశేషం)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top