సేవే జీవనం - వి.వి.రామయ్య - అచ్చంగా తెలుగు

సేవే జీవనం - వి.వి.రామయ్య

Share This
సేవే జీవనం - వి.వి.రామయ్య 
పరిచయం : మణీందర్ కుమార్ 


కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకుండా చేస్తేనే, ఆ దానానికి నిజమైన ఫలితం దక్కుతుందని అంటారు. అటువంటిది ఎంతో కష్టపడి పైకొచ్చి, తాను పడ్డ ఇబ్బందులు ఇతరులు పడకూడదన్న సద్భావనతో అనేక రకాలుగా సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తున్నారు సూర్యాపేటకు చెందిన వనమా వేంకట రామయ్య గారు. వీరి పరిచయం మరింత మందికి ప్రేరణగా నిలుస్తుందన్న ఆశతో వారితో ప్రత్యేక ముఖాముఖి మీకోసం...

మీ బాల్యం, కుటుంబనేపథ్యం గురించి క్లుప్తంగా చెప్పండి.

జవాబు: నా బాల్యం అత్యంత పేదరికంలో కొనసాగింది. మా అమ్మ కీ.శే.కనకమ్మ, నాన్న కీ.శే.లక్ష్మయ్యకు నలుగురు మగ పిల్లలు ,ఇద్దరు ఆడపిల్లలు. నేను నాలుగవవాణ్ణి. నా కిద్దరు చెల్లెళ్ళు. నివాసం, జననం, సూర్యాపేట. అందరు వివాహితులు, సంతానమున్నవారు. వృత్తి చిన్నవ్యాపారం.

మీ విద్యాబ్యాసం ఎలా కొనసాగింది, ఎంతవరకు కొనసాగింది.
జవాబు: నా విద్య అంత కష్టం మీద సాగింది.  చాలా సంవత్సరాలు ప్రైవేట్ పాఠశాలలో 5 వ తరగతి వరకు, చివరకు పెద్దన్నయ్య వనమా మట్టయ్యగారి వద్ద ప్రభుత్వ పాఠశాలలో మొదటి తరగతిలో ప్రవేశం దొరికింది. అలాగే 10 వ తరగతి వరకు  సూర్యాపేటలో విద్యను కొనసాగించినాను. ద్వీతీయ శ్రేణి. మా ఆర్ధిక పరిస్థితుల కారణంగా, నెలకి 2.80 /- వైశ్య హాస్టల్ ఫీజు, కాలేజి ఫీజు ఖర్చులకై ఇచ్చేందుకు అన్నగారిని వప్పించి , 2 జతల బట్టలతో వెళ్ళి 55 -56 సం.లలో నిజాం కాలేజిలో చేరాను. 49 % ప్రవేశం లభించింది – commerce-mathematics course నాకు charter accountant  కావాలని ఆశ, కాని ఆశ ఫలించలేదు. 3rd year osmania university లో commerce ప్రవేశం దొరికింది. 1st year కాగానే కుటుంబంలో ఇద్దరు అన్నలు విభాగామైనందున నన్ను చదువు ఆపు చేయమన్నారు. అన్నయ్య, మా కుటుంబ పోషకుడు. నా చదువు కొనసాగించుటకు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా చివరకు టైపు పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇంటికి చేరుకున్నాను. వ్యాపారంలో అన్నయ్యకు తోడున్నాను. మీరెంతవరకు చదువుకున్నారు, అంటే ఇంటర్ అనే చెప్పు కుంటాను. నా కెంతో ఆకాంక్ష  ఉన్నత చదువులు చదవాలని – కాచీగూడా నుండి నిజాం కాలేజికీ నడచి వెళ్ళే వాణ్ణి, అన్నయ్యకు ఆర్ధికంగా కష్టపెట్టొద్దని – university కి train లో వెళ్ళే వాణ్ణి. బాల్యం నుండి దైవభక్తి వుంది కాని ఆ దైవమే నాకు విద్యాప్రాప్తి పెట్టలేదు. వేసవికాలంలో మా షాపుకు ఎదురుగా (school) షోడాలు అమ్మి ఇంట్లోకి ఆదాయమిచ్చి అన్నయ్యకు తోడున్నాను. 1957 లో వివాహం జరిగింది.

ఆ తరువాత మీరు స్వీకరించిన వృత్తి ఏమిటి?
జవాబు: ప్రత్యేక వృత్తి ఏమి లేదు. అన్నయ్య గారు చేస్తున్న హోల్ సేల్, రిటేల్ వ్యాపారం చేసినాను. జనరల్ గూడ్స్. 1962 లో మేము విభాగమై అదే వ్యాపారము చేసుకుంటున్నాము.
నా చదువు కొనసాగాకున్నా – స్వతంత్రముగా వున్నాను కాబట్టి govt. indl estate వద్ద షెడ్డు తీసుకొని ప్లాస్టిక్ సంచుల ఫ్యాక్టరీ ప్రారంభించినాను. అది నల్లగొండ జిల్లాల్లో, సూర్యాపేట మండల్లో మొదటి పరిశ్రమ – నాటి ఇండస్ట్రీ మినిస్టరు కీ.శే. బి.వి.గురుమూర్తి గారు, నాటి స్టేట్ డైరెక్టర్ అఫ్ ఇండస్ట్రీస్ ఆబిస్ హుస్సేన్ గారు,జాయింట్ డైరెక్టర్ శంకరన్ గారు అతిథులుగా పాల్గొన్నారు.
ఆనాటిరోజుల్లో ముడిసరకులు జపాన్ ఇంపోర్ట్ చేసి చాలా లాభాలు గడించి పెద్ద కూతురు హేమలత (కీ.శే) వివాహం చాలా ఘనంగా చేసినాను. 91-92 లో పెద్ద నష్టాలు వచ్చినవి. ఇండస్ట్రి నడుపుతున్న ఇద్దరు కుమారుల్లో 24 ఇయర్స్ కీ.శే. లక్షణగుప్త ఆకస్మికంగా మరణించినాడు. అతను అప్పటికి అవివాహితుడు.  17-12-83 నా పెద్దకూతురు 1 బాబుకు జన్మనిచ్చి – 2 ఇయర్స్ ప్రాయంలో ఆకస్మికంగా స్వర్గాస్తురాలైనది. వ్యాపారం ఆపుచేసినాను. మా బాబు నేత్రాలు హైదరాబాదు ఎల్.వి. ప్రసాద్ వారికి ఇచ్చినాను.
“The future depends on what we do inthe presence” – Mahatma gandhi.
సేవారంగ ప్రవేశం ఎలా జరిగింది? మీ స్వంత సేవా సంస్థలేవైనా ఉన్నాయా?

జవాబు: నా స్వంత సేవా సంస్థలేమి లేవు. నిర్వహించినవి, నిర్వహిస్తున్నవి సేవాభావం గల వారితో కలిసి ప్రారంభించినవే.కాని నేను వ్యాపారం చేస్తున్నప్పటి నుండియే ఆర్తులకు శక్తిమేరకు సేవ జేయాలని జిజ్ఞాస. దాని కారంణంగానే వేసవికాలంలో దాహార్తి తీర్చాలని చలివేంద్రాలు పెట్టినాను. ఒకనాడు వేసవికాలంలో బస్సుస్టాండ్ లో అర్ధరాత్రి ఒక స్త్రీ వారి పాపకై హోటల్ వారిని నీళ్ళ కోసం బ్రతిమలాడింది. ఆ ప్రేరణతో మున్సిపాలిటి సహకారంతో బస్సు స్టాండులో ట్యాంక్ నుండి డైరెక్ట్ పైపు లైను ద్వారా 24 గంటలు నీరు అందించి తృప్తి చెందినాను.
“When i asked god for peace – He showed me how to help others” – Swamy vivekananda
మీరు చాలా పెద్ద సంస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వివరాలు చెబుతారా?
జవాబు: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్- 24-12-1974 లో సూర్యాపేటలో 24 మంది తో ప్రారంభించినాను. ఆ సంస్థ పేరుతోనే వరదభాదితులకు, అగ్ని బాధితులకు గృహ నిర్మాణాలు, వస్త్రాలు, తినుబండారాలు,పాత్రలు తదితరములు , దివితాలుకాలో, భద్రాచలంలో, కర్నూలులో, భాగవతుల గూడెం, నూతకల్ దత్తత గ్రామమైన తాళ్ళ ఖమ్మంపాడు లో ఉడుతాభక్తి సేవలందించినాము.
దత్తత గ్రామంలో గ్రంథాలయ భవనం, పాఠశాల భవనము ఏర్పాటు చేసాము. సూర్యాపేటకు తాల్లఖమ్మంపాడు గ్రామానికి మధ్య ఒక ఏరు ఉండేది. రవాణా సౌకర్యం కష్టంగా ఉండేది. పంచాయతి సహకారం , మా విరాళాలతో రహదారి, బస్సు సౌకర్యం ఏర్పాటు చెయడమైనది. 1956 సూర్య పేట గ్రంథాలయంలో, మహిళా విభాగానికి మా అమ్మ నాన్నల జ్ఞాపకార్ధం గది ఏర్పాటు చేసినాను. క్లబ్ ద్వారా సంచార గ్రంథాలయ శకటము ద్వారా చదువరుల ఇంటికి గ్రంథాలు పంపిణి చేసి, గ్రంథ పఠనం పెంపొందాలని కృషి చేసాను. ఆనాటి నుండియే నేను క్లబ్ అధ్యక్షునిగా వుండి లయన్స్ గవర్నర్ JVGR భానుగారితో ప్రారంభించి, గ్రంథాలయ అభివృద్ధి కమిటి (మొదటిది) ఏర్పాటు చేసి వారోత్సవాలు జరిపాను. దీన్నే ప్రజల విరాళాలతో ఘనంగా ఈ రోజూ వరకు నిర్వహిస్తున్నాము.
సూర్యాపేటలో నేత్రవైద్య సౌకర్యం లేనందున, సరోజనిదేవి హాస్పిటల్ డా.శివారెడ్డి గారి టీముతో major eye surgical camps 3 నిర్వహించి, తదుపరి శాశ్వత ప్రాతిపదకంగా 30 bed eye hospital నిర్మించి, గవర్నర్ కుముద్ బిన్ జోషి గారితో ప్రారంభించినాము. తదుపరి eye bank ఏర్పాటు చేసినాము. తదుపరి గుండె జబ్బులకై మద్రాస్ నుండి డా. పంచమూర్తి గారితోనూ, gastric ulcer కు హైదరాబాద్ నుండి AK చారిగారితోను వివిధమైన ఉచిత ఆరోగ్య శిబిరాలు చేసినాము.
తదుపరి నాకు దైవసేవ, మానవసేవలనే రెండుకండ్ల వలె విద్యా-వైద్య సేవాలందించాలని సంకల్పం కలిగింది. 1980 లో శ్రీ మారుతి విద్యానికేతన్ గురుకుల పాఠశాల తెలుగు, ఇంగ్లీష్ విభాగాలతో ప్రారంభించాను .యోగా, ధ్యానం లాంటివి బాలబాలికలకు బోధిస్తూ వసతి గృహం ఏర్పాటు చేసి 36 సంవత్సరాలలో ఎంతో మందికి విద్యాదానం చేయడమైనది. 1980 లో జవహర్ బాలభవన్, మహిళామండలి కుట్టు కేంద్రంలో ఇతర సేవలు చేసినాము.
ఇప్పుడు, అప్పుడు నేను కళాకారుడిని కాకున్నను కళాపిపాసిని, రంగస్థల కళాకారులకు ఉచిత గృహాలు ఇచ్చాము. ఆ సంస్థకు  రాష్ట్ర అధ్యక్షురాలుగా జమున గారు ఉండగా, స్థానిక సంస్థకు నేను అధ్యక్షునిగా వ్యవహరించాను.
మీ దృష్టిలో సేవ అంటే ఏమిటి? అసలు సేవ ఎందుకు చేయాలి.
జవాబు:సేవా అంటే ఆపదలో వున్న వారిని ఆదుకొని వారిని తృప్తి పరచుట, నిస్వార్ధచింతనతో స్వలాభాపేక్ష లేకుండా చేసేది. అసలు సేవ ఎందుకు చేయాలంటే, 84 లక్షల జీవుల మనుగడకు, పంచభూతములు చేసే సేవే మనకు ప్రత్యక్ష నిదర్శనం .ఇది అనిర్వచనీయమై భాషకు, భావానికి అందకుండా మనకు జ్ఞానబోధ చేస్తున్నవి.
అలాగే తోటి ప్రాణికి సేవలందించి చరితార్దులం కావాలి. అప్పుడే మన జన్మకు అర్ధం పరమార్ధముంటుంది.
“If you can’t feed a hundred people, Then feed just one” – Mother theressa
మీరు అడిగినవారికి ‘లేదు’ అనకుండా దానం ఇస్తూ ఉంటారట. మీ సేవాదృక్పథం ద్వారా ఎవరికైనా ప్రేరణ కలిగిందా?
జవాబు:అడిగిన వారికి లేదనకుండా దానం చేసేంతటి దానకర్ణుడిని కాను కాని, శక్తి మేరకు దానం చేసి మిగులు కావలసిన దానిని వివిధ మార్గాలలో ఇప్పించేవాణ్ణి మాత్రమే. నేను చేసిన సేవల ద్వారా ప్రేరణ పొందేనవారుండబట్టే, ఆ సంస్థలన్నీ నిర్విరామంగా నిర్వహింపబడుతున్నవి. అదే నాకు తార్కాణంగా భావిస్తున్నాను.
మీ దృష్టిలో జీవితమంటే ఏమిటి? జీవనవిధానం ఎలా ఉండాలి?
జవాబు: జీవితమంటే, పంచేంద్రియాలతో కూడిన జీవన్మరణం గల దేహమని నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో నమ్మినది. జీవితం అశాశ్వతము – కాని 84 లక్షల జీవులలో మానవజీవితం అత్యంత వెలకట్టలేని పవిత్రతగలది. ఉచ్చ్వాస నిశ్వాసలు గలది, విచక్షణా శక్తి కలది. మంచి చెడు నిర్దేశించేది. కాబట్టి ఈ జీవితానికి సార్ధకత చేకూరాలంటే రామాయణం, భారతం, మహాత్మాగాంధీ, రామకృష్ణ పరమహంస, దయానందసరస్వతి, వివేకానందుడు, గౌతమబుద్ధుడు జీవిత చరిత్రలు, వేదాలు  అర్ధం చేసుకోవడం, మదర్ థెరిస్సా లాంటి వారి జీవన విధానం అలవర్చుకోవడం.
నేను బాల్యం నుండి హఠము, కర్రసాము, దైవ భజనలు ఆర్యసమాజం ద్వారా నేర్చుకొని జీవితంలో ఏ రంగంలో నైనా ఒడిదుడుకు లొచ్చినా తట్టుకునే సామర్ధ్యం సంపాదించుకుని, ఆశయసిద్ది కోసం నిర్భయంగా జీవించుచున్నాను.
మీరు జీవితంలో మరచిపోలేని సంఘటన గురించి చెప్పండి?
జవాబు:జీవితంలో మరువలేని సంఘటనల్లో మొదటిది నాకు ‘భారతీయుడిగా” పుణ్య భారతభూమిపై జన్మించే భాగ్యం కలగడం. దీన్ని నేను భగవంతుడిచ్చిన వరంగా భావిస్తాను.  శాంతమూర్తులైన నా తల్లిదండ్రులూ, సద్గురువులిచ్చే ప్రేరణ కూడా మరువలేనిది. నా పెద్దకూతురు హేమలత 24 ఇయర్స్(17-12-1983), మరియు అవివాహిత కుమారుడు లక్ష్మణ గుప్త (3-10-1992) ఆకస్మిక మరణము బాధాకరమైన జ్ఞాపకం.
మీరు పొందిన అవార్డులు , మర్చిపోలేని ప్రశంశల గురించి చెప్పండి?
జవాబు:1956 1st eye surgical camp, made me to establish permanent hospital. తదుపరి విద్యాదానానికి నా కోరిక తీరలేదు అందుకే ప్రజలకు విద్యాదానం చేయాలని, శ్రీ మారుతి విద్యానికేతన్ అనే పాఠశాల స్థాపించాను. ఎన్నో అవార్డులు పొందినా కూడా ఇవన్నీ నాకు ప్రశంసలకంటే అవార్డులకంటే అతీతమైన గొప్ప ఆనందాన్ని కలుగజేసాయి.
ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు చెప్పండి. మీ భవిష్యత్ ప్రణాళిక లేమిటి?
ప్రస్తుతం నేను 1980 నుండి ఇప్పటివరకు శ్రీ మారుతి విద్యానికేతన్ పాఠశాల వ్యవస్థాపక కార్యదర్శి, కరస్పాండెంట్ గా వ్యవహరిస్తున్నాను.  “స్పందన సేవా సంస్థ” ద్వారా శరీర అవయవాదానము – వికలాంగులకు సేవలు అందిస్తున్నాను.
నా కుటుంబ పోషణకై స్మార్ట్ హెల్త్ భీమా, బజాజ్ జీవిత భీమా, ఆదర్శ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ , నూతనంగా బిల్డింగ్స్ బ్లాక్స్ సంస్థ ద్వారా ప్లాట్స్ విక్రయ ఏజెంట్ గా ఉన్నాను. నా భవిష్యత్ ప్రణాళిక “ఆరోగ్యంగా ఉన్నపుడే ఈ జీవితం చాలించి నేత్ర శరీరదానం చేసే భాగ్యం ఇమ్మని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
మీ జీవితంలో అత్యంత ఆనందమయమైన క్షణాలు ఏవి?
జవాబు: 1956 లో ఒక పెద్ద ఐ సర్జికల్ క్యాంపు ను నిర్వహించి, 546 మంది గుడ్డి వారికి కేటరాక్ట్ ఆపరేషన్లు చేయించడం ద్వారా తిరిగి చూపు వచ్చేందుకు సహకరించడం నాకు అత్యంత ఆనందాన్ని కలిగించే అంశం.
ఇతరులకు సేవ చెయ్యడాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు?
దీన్ని నిర్వచించడం చాలా సులభం. మీ ఆనందాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు, వారిని ఆపదల నుంచి కాపాడినప్పుడు వారు కూడా ఆనందిస్తారు. వేదాలు, పెద్దలు చెప్పిన విధంగా ఇతరులకు సేవ చేసేవారు వివిధ క్షేత్రాలలో విజయం సాధిస్తారు.
విజయం సాధించాలంటే మొదలు చేసే పనిని ప్రేమించాలి.- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
నేటి సమాజం మీద, సమాజంలో జరిగే సేవల మీద మీ అభిప్రాయం ఏమిటి?
నా అభిప్రాయంలో ప్రస్తుత సమాజానికి పరిస్థితులకు అనుగుణంగా మారే విద్యా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఉండాలి. దీనివల్ల శాంతియుత భారతం ఏర్పడుతుంది. ఈ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరూ వారి బాధ్యతను సరిగ్గా నిర్వర్తించి, నమ్మకము, ప్రేమ, నిజమైన విలువలు అంకితభావంతో మన దేశ పతాకాన్ని సమున్నతంగా ఎగిరేలా చేసి, మనం గర్వపడేలా చెయ్యాలి. మీరు అవసరంలో ఉన్నవారికి సాయం చెయ్యడం మాత్రమే కాదు, ఇతరుల్ని కూడా మనఃశాంతిగా జీవించేలా చెయ్యాలని నేను భావిస్తాను.
శ్రీ రామయ్య గారి జీవన విధానం మనందరికీ ఆదర్శం, అనుసరణీయం. వారి వెబ్సైటును క్రింది లింక్ లో దర్శించండి.
http://www.vvramaiah.in

1 comment:

  1. జీవిత సారాన్ని తెలుసుకున్న రోజున ఎంత జ్ఞానోదయం కలుగుతుందో ఈ రోజు రామయ్య గారి నేపధ్యం కూడా అంతే జ్ఞానోదయాన్ని కలిగించింది.
    ఇటువంటి మహనీయులను కాపాడుకోవడం మన బాధ్యత.
    వృద్ధాప్యంలో కూడా కుటుంబ పోషణకు ఆయన పడుతున్న జీవిత పోరాటం కన్నీరు తెప్పిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
    సెల్యూట్ టు రామయ్య గారు.
    మీరు కలకాలం ఇలాగే సేవ చేస్తూ, మా లాంటి వాళ్ళను కూడా సేవా మార్గం వైపు నడిపించేలా ప్రేరేపించాలని కోరుకుంటున్నాను.
    వీలు చూసుకొని మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. మీ గురించి మీ వెబ్ సైట్ (http://www.vvramaiah.in/) లో పూర్తి వివరాలు సంపాదించి కలుస్తానని తెలుపుతున్నాను.
    ధన్యవాదములు....!!!

    ReplyDelete

Pages