మహానుభావుడు..మహాత్ముడు.. - అచ్చంగా తెలుగు

మహానుభావుడు..మహాత్ముడు..

Share This

మహానుభావుడు..మహాత్ముడు..

సుజాత తిమ్మన..

93 91 34 10 29


 
కట్టింది కుళ్లాయి గుడ్డ..
చేటిలో పట్టింది..కర్ర..
వడివడిగా పడే అడుగులతో...
నిరంతర శ్రామికుడై...
మురికి వాడల శుబ్రం చేసి..
కులాలకు ...మతాలకు అతీతమై ..
మానవ మతం ఒకటేనని చాటిన ..
మహానుభావుడు ..మహాత్ముడు..గాంధీ...
ఆయుధాలు లేకుండా...
అహింస అను .. ఔషధంతో..
సత్యాగ్రహం అనే సాధనతో...
మొత్తం భారతీయులనంతా...
ఒకే ఒక శక్తి అయి..
‘వందేమాతరం ‘ అనే నినాదంతో....
 రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని..
కఱకు తేలిన అధికారులను ....
గడ గడ లాడించి...ఆగ్లేయుల పాలన నుంచి..
భారత మాత సంకెళ్ళను విప్పి..
స్వతంత్రం సంపాదించి పెట్టిన అగ్ర నాయకుడు..
మహనీయుడు..మహాత్ముడు...గాంధీ...
 పుత్లిభాయి.కరంచంద్ గాంధీలముద్దు బిడ్డై .
 గుజరాత్ లోని పోర్బందరులో..
సంప్రదాయ సామాన్య కుటుంబంలో జన్మించిన గాంధీ
అలవరచుకున్నాడు ..చిన్నతనం నుంచే సత్యాన్ని పలకటం ..
నిజాయితీ, అహింస, సౌభ్రాతృత్వము అనే సుగుణాలతో ..
పరిపూర్ణం చేసుకున్నారు జీవితాన్ని...
మహనీయుడు..మహాత్ముడు ..గాంధీ...
భగవత్గీత చదవడం వాళ్ళ ఆత్మ జ్ఞానాన్ని
తెలుసుకోవడానికి ఆలోచనలతో..
 నిష్కామ కర్మ విధానాన్ని అనుసరిస్తూ..
సదా సీదా జీవితం గడిపుతూ...ఉన్నదానిలో..
నలుగురుకీ పంచుకుంటూ ఉండాలని..
శ్రమకి బయపడకుండా ప్రతి ఒక్కరు..
 సేవా దృక్ పథాన్ని,... ఆధ్యాత్మిక దృక్కోణముతో చూస్తూ..
ఎదుటి వాని హృదయంలో బగవంతుడు ఉన్నాడనుకుంటూ మెలగాలి..
తనే స్వయంగా వంటలు చేసి మరి పెట్టేవారు...
పంతులుగా ఉంటూ...పదిమందికి విద్యాబుద్దులు చెప్పేవారు..
శుచి సుబ్రత తెలియజేస్తూ...మరుగుదొడ్లు కడిగె వారు...
మురికి వదలను ఉద్చేవారు...చెప్పటమే కాదు చేసిచూపిస్తూ...
సమ సమాజ అభివృద్ధి కై..తనవంతు కృషి సల్పినవారు...
అందుకే ...అయన మనకి పూజనీయుడు ....
మహాను భావుడు..మహాత్ముడు..గాంధీ...!!
*****     *****    ******

No comments:

Post a Comment

Pages