ఇద్దరూ సమానమే! - అచ్చంగా తెలుగు

ఇద్దరూ సమానమే!

భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు



నవమాసాలు మోసిన అమ్మ దేవతైనప్పుడు

 బీజంవేసిన నాన్న దేవుడుకాదా?


పాలిచ్చిపెంచిన అమ్మ దేవతైనప్పుడు 

ప్రేమతో లాలించిన నాన్న దేవుడుకాదా?


బుజ్జగిస్తూ బువ్వపెట్టిన అమ్మ దేవతైనప్పుడు

 ఆ బువ్వకు కావాల్సిన బియ్యంతెచ్చిన నాన్న దేవుడుకాదా?


అఆలు నేర్పన అమ్మ దేవతైనప్పుడు

ఆంతర్యం గ్రహించటం నేర్పిన నాన్న దేవుడుకాదా?


నడక నేర్పించిన అమ్మ దేవతైనప్పుడు 

నడత నేర్పించిన నాన్న దేవుడుకాదా?


పాలిచ్చిన అమ్మ దేవతైనప్పుడు

 మురిపాలిచ్చిన నాన్న దేవుడుకాదా?


అమ్మబ్రహ్మ అయితే నాన్నవిష్ణువు. 

అతీతమైన ప్రేమకు నిదర్శనం అమ్మ 

అనంతమైన ప్రేమకు ప్రదర్శనం నాన్న.


అమ్మానాన్న కలిస్తే మనంపుట్టాము 

అమ్మానాన్న కరుణిస్తే మనంపెరిగాము 

అమ్మానాన్న కలిసుంటేనే మనకు కలుగుతుంది

 ఆనందం అమ్మానాన్న మనతో కలిసుంటేనే

 వారితో పెరుగుతుంది అనుబంధం.


ఇద్దరి ప్రేమా మనపై సమానమే

 మన భవితవ్యానికి ఇద్దరూ ప్రమాణమే.

No comments:

Post a Comment

Pages