విటమిన్ డి గురించి కొన్ని విషయాలు 

అంబడిపూడి శ్యామసుందర రావు ,గుంటూరు

ఫోన్ నం 9440235340.


పోషక పదార్ధాలలో విటమిన్ డి ని చాలా తక్కువగా విలువ కడతారు. ఎందుకంటే అది ప్రకృతిలో ఫ్రీగా లభ్యమవుతుంది కాబట్టి ! సూర్యరశ్మి లోని అతినీలలోహితకిరణాలను చర్మములోని మెలనిన్ అనే వర్ణ పదార్ధము విటమిన్ డి గా మారుస్తుంది. విటమిన్ డి ఆస్టియోపొరోసిస్ ,డిప్రషన్ ,ప్రోస్టేట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్,వంటి వ్యాదులనుండి రక్షణ కలుగజేస్తుంది. అటువంటి విటమిన్ డి గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాము. .
1. ముందుగా చెప్పినట్లుగా విటమిన్ డి సూర్యరశ్మివల్ల మన చర్మము తానే తయారు చేసుకుంటుంది కాని సూర్య రశ్మిలోని అతినీలలోహిత కిరణాలు గాజు ద్వారా ప్రయాణించవు కాబట్టి ఎక్కువగా కార్లలో తిరిగేవాళ్ళు ఏసీ రూం లో ఉండేవాళ్లకు డి విటమిన్ సరిగా లభ్యముకాదు.
2. పూర్తిగా అహారముద్వారా విటమిన్ డి లభ్యము కావటము అసాధ్యము. సూర్యరశ్మిసోకేటట్లు గా తిగితేనే విటమిన్ డి లభ్యముతుంది .ప్రస్తుతము పిల్లలు ఆటలకు దూరమై క్లాసు రూములకు పరిమితము అవటమువల్ల విటమిన్ డి లోపము ఏర్పడుతుంది. ఒకవ్యక్తి రోజు పది పెద్ద గ్లాసుల మంచి పాలు త్రాగటము ద్వారా అవసరమైన విటమిన్ డి ని పొందగలడు.
.3. కెనడా అమెరికా వంటి దేశాల ప్రజలు భూమధ్య రేఖకు దూరముగా ఉండటమువల్ల ,వారు ఎక్కువ సూర్యరశ్మి  తగిలేటట్లు చూసుకోవాలి.
4. నల్లగా ఉండే వారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వీరు ఎర్రగా ఉండెవారికన్నా దాదాపు ఇరవై రెట్లు అధికముగా సూర్యరశ్మి శరీరానికి సోకేటట్లుగా చూసుకోవాలి.
5. ప్రేగుల్లో క్యాల్షియమ్ శోషణకు శరీరములో  విటమిన్ డి నిల్వలు  చాలా అవసరము. క్యాల్షియం శోషణ తగినంతగా లేకపోతే ఎముకలు దంతాలు గట్టి పడవు .
6. దీర్ఘకాలిక విటమిన్ డి లోపాన్నివెంటనే సరిచేయలేము. విటమిన్ డి లెవల్ పెంచటానికి చాలా కాలము సూర్య రశ్మికి శరీరానికి తగిలేటట్లుగా చూడాలి. అప్పుడుగాని శరీరము గట్టి ఎముకలను బలమైన నాడి వ్యవస్తను అభివృద్ధి చేసుకోలేదు.
7. చాలామంది చర్మాన్ని కాపాడుకోవటము కోసము సన్ స్క్రీన్ లోషన్లను ఇతర పదార్ధాలను ఉపయోగిస్తు ఉంటారు. ఇవి చర్మము సహజసిద్దముగా విటమిన్ డి తయారుచేసే శక్తిని దాదాపు 95% తగ్గిస్తాయి. ఈ సన్  స్క్రీన్ ఉత్పత్తులు శరీరములో విటమిన్ డి  లోపాన్ని కలుగ జేస్తాయి ఈ విషయాన్ని సన్ స్క్రీన్ ఉత్పత్తుల కంపనీ వారు ప్రజలకు చెప్పరు ఎందుకంటే వారి ఉత్పత్తుల అమ్మకాలు పడిపోతాయి కాబట్టి.
8. ఎండలో ఉంటే ఎక్కువ డి విటమిన్ తయారి అవుతుంది అనేది అపోహ మాత్రమే మన శరీరము తనకు కావలిసిన పరిమాణములో విటమిన్ డి ని తయారు చేసుకుంటుంది.
9. చాతీ ఎముకలను గట్టిగా ఒత్తినప్పుడు నొప్పి అనిపిస్తే విటమిన్ డి లోపము ఉన్నట్లే గుర్తు ..
10. శరీరములోని విటమిన్ డి  కిడ్ని,లివర్ ద్వారాయాక్టివేట్ అయి వాడబడుతుంది. కాబట్టి కిడ్ని,లేదా లివర్ వ్యాధులు విటమిన్ డి పై ప్రభావాన్నిచూపుతాయి.
11.రోజు కొంచము సేపు ఎండలో నడిస్తే మందుల షాపులలో కొనవలసిన అవసరము లేనిది  విటమిన్ డి.
12. దానిమ్మ లాంటి పండ్లలో గల యాంటి ఆక్సిడెంట్లు చర్మములో సహజ సన్ స్క్రీన్లుగా పనిచేస్తాయి. వీటిలో అష్టాజాన్తిన్ అనేది ముఖ్యమైన సన్ స్క్రీన్ .
విటమిన్ డి లోపము వల్ల కలిగే వ్యాధులు:-
క్యాల్షియం శొషణము సరిగా జరగకపొతే ఆస్టియోపొరోసిస్ వ్యాధి వస్తుంది . విటమిన్ డి లోపము పలురకాల క్యాన్సర్ లను కలుగజేస్తుంది. రికెట్స్ వ్యాధినికలుగజేసెది విటమిన్ డి లోపమె విటమిన్ డి లోపము పాంక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తిని సక్రమముగా జరగనివ్వకుండా టైప్ 2 దయబిటిస్ ను అధికము చేస్తుంది .ఊబకాయులకు విటమిన్ డి  మాములు వాళ్ళకన్నా రెట్టింపు కావాలి ఎందుకంటే ఊబకాయత్వము విటమిన్ డి వాడకాన్నిఅడ్డగిస్తుంది. సోరియాసిస్ను నయముచేయతములో విటమిన్ డి బాగా ఉపయోగ పడుతుంది. విటమిన్ డి లోపము షిజోఫ్రేనియా అనే వ్యాధికి కారణము.
దీర్ఘకాలిక విటమిన్ డి లోపము కండరాల లో నొప్పిని(ఫైబ్రోమైఅల్జియ) కలుగ జేస్తుంది. ప్రతివారము రోజులో రెండు మూడు సార్లు ఎండలో కొంచము సేపు గడిపితే క్యాన్సర్ డయబిటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశము 50% తగ్గుతుంది . కాని ప్రస్తుత కాలుష్యము వల్ల ఒజోన్ పొర క్షీణించటమువల్ల అతినీల లోహిత కిరణాల తీవ్రత పెరిగి చర్మ సంభందమైన క్యాన్సర్ వస్తోంది . పిల్లలకు ప్రతిరోజు 2000యూనిట్ల విటమిన్ డి లభ్యమైతే వారిలో టైప్ I డయబిటిస్ వచ్చే అవకాసము 80%తగ్గుతుంది.
విటమిన్ డి లోపము గురించి కొన్ని ఆశ్చర్యము కలిగించే నిజాలు :-
  • 32%డాక్టర్లు వైద్య విద్యార్ధులు విటమిన్ డి లోపముతో భాధపడుతున్నారు,
  • అమెరికా జనాభాలో 40%ప్రజలు విటమిన్ డి లోపముతో భాధపడుతున్నారు.
  •  తోమ్మిది నుండి  పదకొండు సంవత్సరాల వయస్సు గల 48% ఆడపిల్లలు విటమిన్ డి లోపముతో ప్రపంచవ్యాప్తముగా భాధపడుతున్నారు .
  • పిల్లలను కనే వయస్సులోని 42%ఆఫ్రికన్  అమెరికన్ స్త్రీలు విటమిన్ డి లోపముతో భాధపడుతున్నారు.
  • ప్రపంచవ్యాప్తముగా ఆసుపత్రులను దర్శించే రోగులు 60%మంది విటమిన్ డి లొపించినవారే .
  • గర్భిణీ స్త్రీలలో 76% మంది తీవ్రమైన విటమిన్ డి లోపముతో భాదపడుతూ పుట్టే పిల్లలలో కూడా ఈ లోపానికి కారణభూతులు అవుతున్నారు.
కాబట్టి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న విటమిన్ డి ని అలక్ష్యం చెయ్యకుండా పలు మార్గాలలో పొంది, ఆరోగ్యంగా జీవిద్దాము. ఆరోగ్యమే మహాభాగ్యం కదూ !
********

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top