శివం – 22 - అచ్చంగా తెలుగు

శివం – 22

Share This

 శివం – 22

(శివుడే చెబుతున్న కధలు )

రాజ కార్తీక్

9290523901

(  శివభక్తుడైన ఉద్భవుడి కధను చెబుతుంటాడు శివుడు..)

 “ఉద్భవా! నీ భక్తికి మెచ్చాను, నీ అచంచలమైన విశ్వాసం, నన్ను చూడాలనే నీ కుతూహలం నాకు నచ్చినది. భక్తా, ఉద్భవా! ఇక చాలు” అని మరోసారి బిగ్గరగా వినిపించింది ఆ స్వరం ఉద్భవుడి మనసులో ఆనందం మొహంలో కనబడుతుంది. అందరిలో సంభ్రమాశ్చర్యాలు ఏమిటి ఆ స్వరం, ఎవరిదా స్వరం, ఎవరిదీ ఆకాశవాణి, నిజంగా పురాణాల్లో లాగా ఆకాశవాణి వినబడటం అందర్ని అబ్బురపరిచింది. మంత్రిగారు అయితే ఇది తన కలలో లేదు అని కొయ్యబారిబోయాడు.
ఉద్భవుడు: “భటులారా! ఇటువంటి మాయావాణికి మనం లోన్గాకూడదు, రాజ్యంలో ఎవరో మంత్రగాడు కనికట్టు చేసి ఉంటాడు, తొందరగా అందర్ని తగలబెట్టండి”, భటులు కూడా సందేహంగా చూస్తున్నారు, ఏమి చేయాలో అందరికీ అర్ధం కావటంలేదు.
ఉద్భవుడు: “ఏమి మౌనం వహించారు, మీకు కూడా రాజాధిక్కారం చేస్తారా?” అని అడిగాడు
భటులు: “అదేమీ లేదు ప్రభూ!”
మంత్రి: ఉద్భవా! ఏలా నీకు ఈ చెడు ఆలోచన, ఎవరు ఏ పూజ చేసుకుంటే నీకేలా?
ఉద్భవుడు: “భటులారా! కానీయుడు” అంటూ తన చేతిలోని ప్రేలుడు పదార్ధాన్ని గుడిగోడ పైన వేశాడు, అంతే, అసలే శిధిలావస్థలో ఉన్న గోడ ముక్కలు ముక్కలుగా అయ్యింది.
భటులు: “రాజా! మరొక్కమారు దండిద్దాం కట్టిపడి ఉన్న ప్రజల్ని” అని అడిగారు.
ఉద్భవుడు: “మీరేమిచేస్తారో నాకు తెలీదు, వారి చేత దేవుడు లేదు అనిపించండి చాలు” అంటూ నవ్వుతున్నాడు క్రూరంగా.
అక్కడి ప్రజల్లో ఒకడు మాత్రము “ ఈ రోజు ఈ రాజ్యంలో చెప్పుకోదగ్గ రోజు , ఏ రాజు ఏ ప్రజలకు దక్కని భాగ్యాన్ని మనకి దక్కిస్తున్నాడు.
ప్రక్కన్ మరోతను “ ఏమయ్యా, చావో బ్రతుకో తెలియక చస్తుంటే, ఈరోజు మంచిరోజు అంటావు ఏంటి, నాకు ఏమన్నా ఉద్భవుడిలాగా మతి చలించిందా?” అంటున్నాడు.
గోడబద్దలైన ప్రభావం ఇంకా ఉంది, మట్టిమట్టిగా ఆ ప్రాగణం అయ్యింది.
ఉద్భవుడు: ఇక ఆలస్యందేనికీ, అందర్ని తగులబెట్టండి అనేసరికీ భటులు మౌనం వహించారు.
ఒక్కసారి ఉద్భవుడు, ఆకాశంలోకి చూస్తున్నాడు, ఏదో జాడ కోసం వెతుకుతున్నాడు. కనీ అతనికీ ఏమి లభించలేదు. “చెప్పేది వినబడుట లేదా తగులబెట్టండి,
ఆకాశవాణి: “ఉద్భవా! వద్దు, వారిని వదిలెయ్!”
ఉద్భవుడు: “హే, మాయావి, ఎవరు నీవు, ధైర్యం ఉంటె ముందుకు రా! వీరుదవైతే పోరాడు, వీరందరినీ కాపాడు, రా, ధైర్యం చూపు”
మళ్ళీ అందరూ ఆశ్చర్యపడ్డారు.
మంత్రి “ఉద్భవా నాయనా”
అక్కడవున్న మిగులు తైలాన్ని మత్రిగారి మీద మరోసారి పోశాడు.
మంత్రి “నిన్ను చిన్ననాడు ఆడించినందుకు తగిన మూల్యం చెల్లిస్తున్నావ్” బాధగా
ఉద్భవుడు: హే ఆకాశవాణి, నీకు ఉన్నది స్వరమే కదా? ఇప్పుడు చూడు ఏమి చేస్తానో, కనికట్లు, మాయలు నా దగ్గర పనిచేయవు అని కాగడ వెలిగించి గాలిలో విసిరేశాడు.
ప్రజలు “పరమేశ్వరా కాపాడు. హరహరమహాదేవ నన్ను రక్షించు అని ఎవరికి వారే మూకుమ్మడిగా ప్రార్ధించారు”.
ఉద్భవుడు:”హా హా హా మీరందరూ భాగావోత్తములు, అందులకే మరణ సమయంలో మహేశ్వరుడ్ని కీర్తిస్తున్నారు” కాగడాలో మంట గాలి వీచి ఆరిపోయింది అందరూ మౌనంగా ఉన్నారు. కొంతమంది ప్రజలు “చూశావా, కాగడా గాలితో ఎలా ఆరిపోయింది”
ఉద్భవుడు:”నిజమే, ఈసారి ఇంకా, జాగ్రత్తగా దాహిస్తా” మర్యాదగా దేవుడు లేదు అని ఒప్పుకోండి లేకపోతే, ఇక్కడ కొన్ని గంటల్లో సామూహిక స్మశానం తయారవుతుంది. ఇందాక సుదినం అన్నవాడు “ఎంతగొప్ప ప్రజలు, ప్రాణాల మీదకు వచ్చిన వీడట్లేదు, వీరందరికీ కైలాసప్రాప్తి ఖాయం”
ఉద్భవుడి ఆరాచాకత్వం పెట్రేగిపోయింది, వందలమంది ప్రజల్ని సామూహికంగా దహించడానికే సిద్ధపడ్డారు. ఈసారి తైలాన్ని ఒక మార్గానుసారంగా పోసి నిప్పు అంటించాడు. ఇపుడు అందరు దహించుకు పోవడం ఖాయం.
నిప్పు వెలిగించాడు... అది తన దారి గుండా వెళ్తుంది, అక్కడ మొట్టమొదటి మనిషిని తాకబోతుంది.. అంతే..
పెనుగాలి... ఆ గాలికి మనుషులు కూడా కదులుతున్నారు, ఆ గాలికి ఇందాక వేసిన తైలం సైతం ఇసుకరేణువు అయ్యింది.. అందరూ కల్లు తెరవబోతున్నారు....
ఉద్భవుడు మనసులో “నేను అనుకున్నది నెరవేరబోతున్నది... నన్ను క్షమించండి నాతల్లిదండ్రులారా! ధ్యేయం మంచిదైనందువల్ల  ఈ పని చేయవలసి వచ్చింది”  గాలి వీస్తుంది గట్టిగా.. అందరూ వెనక్కిపోతున్నారు... కానీ ఉద్భవుడు శక్తిమాల తీసుకొని ముందుకు అడుగులు వేస్తున్నాడు...
ఉద్భవుడు:”రావయ్యా..రా..రా.. ఆలోచించకు...పాపం,పుణ్యం,అర్హత, జ్ఞానం చూచుటకు నీవు తలచుకుంటే వస్తావు... రావయ్యా రా.. వచ్చి ఈ పాపానికి ఒడిగట్టిన నన్ను నీకిష్టమొచ్చినట్టు చెయ్యి, అంతేకాని రావటం మానొద్దు...
గాలి ఆగింది...పెద్ద మెరుపు మెరిసింది... అందరూ కళ్ళు మూసుకున్నారు మహా తేజస్సు...
ఉద్భవుడు:రావయ్యా..రా..రా..” అని తమకంతో ఊగుతున్నాడు. అందరికీ ఏమిటో అర్ధం కాలేదు..ఉద్భవుడు ఏమిటి.. ఆ తమకం ఏంటి, అతని ఆగడం ఏమయ్యింది అని...
ఉద్భవుడు: రావయ్యా అందరికీ కనబడు, రాలేదో వీరందర్నీ...” అంటూ ఆకాశవాణి “ఉద్భవా! లింగోద్భవా ! తథాస్తు..” అని అందరికి వినబడుతుంది.
మహారాజు పేరు “లింగోద్భవుడా “..... ఏమి జరగబోతుంది.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages