ఫ్రూ మి ల్వా.... - అచ్చంగా తెలుగు

ఫ్రూ మి ల్వా....

Share This

ఫ్రూ మి ల్వా....

గోపీనాథ్ పిన్నలి 


సాధారణంగా కొందరికి ద్రాక్ష నచ్చదు. కొందరికి బనానా అంటే ఏవగింపు. బాదం పగలగొట్టుకుని తినాలంటే బద్ధకం. అలాగే దానిమ్మ కూడా వలుచుకోవడమూ చిరాకేనంటారు ఇంకొందరు. కనుకే ఈ వెెరైటీ వింత వంటకం.
-------------------------------------------
ఫ్రూ మి ల్వా....
-------------
కావలసినవి....
తెల్ల ద్రాక్ష
కిస్మిస్ తెల్లదే
బాదం పప్పులు
తీపి దానిమ్మ
జామకాయలు
(మరీ పండినవో లేదా మరీ పచ్చివో కాకుండా గిచ్చితే గోరు దిగితే చాలు)
అరటి పండ్లు కొంచెం గట్టిగా ఉన్నవి
నల్ల కిస్మిస్
జీడి పప్పు
ఏలకుల పొడి
 పంచదార
మైదా లేదా సెనగ లేదా గోధుమ పిండి
నెయ్యి
................
తయారీ......
ముందుగా జామకాయలు ముక్కలు ముక్కలు చేసుకోవాలి. పిండిలో పంచదార, నెయ్యి, ఈ ముక్కలు, దానిమ్మ గింజలు, బాదం పప్పు ముక్కలు, జీడి పప్పు బద్దలు, తెల్ల ద్రాక్ష, తెల్ల కస్మిస్, చివరగా  అరటి పండ్లు ముక్కలు వేసి బాగా కలియబెట్టి సన్నని సెగపై గానీ, వోవెన్ లో గాని పెట్టండి. ఓ పావుగంట తర్వాత తీసి మరోసారి గరిటెతో బాగా కలిపి దానిపై యెలకుల పొడి, నల్ల కిస్మిస్ జల్లి తగినంత సేపు ఫ్రిజ్జులో ఉంచుకుని తర్వాత చెంచాతో తినవచ్చు. పిల్లలు కూడా ఇష్ట పడతారు.
సలాడ్ కీ దీనికీ తేడా ఉంది. దానిలో పాలూ గట్రా కలుపుతారు. దీనిలో కలపం కనుక దానికన్నా యెక్కువ సేపు నిల్వ ఉంటుంది.కదా...
రకరకాల పండ్లతో చేసే హల్వా గనుక ఫ్రూట్స్ మిక్సెడ్ హల్వా.....ఫ్రూ మి ల్వా...
---------------------------------------------
గమనిక.... ఇది పూర్తిగా సొంతంగా ఊహించి వ్రాసినదే. కుదిరితే, ఆ విషయం తెలిపితే ధన్యవాదాలు. కుదరకపోతే మాత్రం తిట్టుకోవద్దు మరి.

No comments:

Post a Comment

Pages