క్రీం ఆఫ్ పాలక్ సూప్ - అచ్చంగా తెలుగు

క్రీం ఆఫ్ పాలక్ సూప్

Share This

క్రీం ఆఫ్ పాలక్ సూప్

- అక్కిరాజు ప్రసాద్ 


కావలసిన పదార్థాలు:
  1. 2-1/2 కప్పుల కడిగి సన్నగా కోసిన పాలకూర
  2. 2-1/2 కప్పుల ఫ్రెష్ క్రీం (సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది)
  3. 2 స్పూన్ల వెన్న (బటర్)
  4. 1/2 కప్ సన్నగా కోసిన ఉల్లిపాయ
  5. 2 స్పూన్ల మొక్కజొన్న పిండి
  6. కాసిని చల్లపాలు
  7. ఉప్పు, మిరియాల పొడి
తయారు చేసే పద్ధతి:
నాన్‌స్టిక్ ప్యాన్‌లో ముందుగా కాస్త వెన్న వేసి కరిగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను 1-2 నిమిషాలు రంగు మారేంతవరకు వేయించండి. కోసిన పాలకూరను వేసి ఒక నిమిషం పాటు అందులో తిప్పుతూ వేగనివ్వండి. రెండు గ్లాసుల నీళ్లు పోసి బాగా కలిపి ఐదు నుండి ఏడు నిమిషాల పాటు ఉడికించండి. అప్పుడప్పుడు కలియబెట్టండి. దీనిని స్టవ్ మీదనుండి దించి చల్లారనివ్వండి. తరువాత మిక్సరులో వేసి బ్లెండ్ చేయండి. దీనిని వడపోయండి. చిక్కటి ద్రవపదార్థం పాత్రలో దిగుతుంది. మొక్కజొన్న పిండిని చల్లటి పాలలో ఉండలు లేకుండా కలపాలి. దానిని ఈ పాలకూర ద్రవంలో వేసి బాగా కలియబెట్టండి. ఈ ద్రవాన్ని పొయ్యిపై ఒక రెండు నిమిషాలు వేడి చేయండి. తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి మరో నిమిషం కలియబెడుతూ వేడి చేయండి. స్టవ్ మీదనుండి దింపి కాస్త ఫ్రెష్ క్రీం వేయండి. క్రీం ఆఫ్ పాలక్ సూప్ రెడీ!

No comments:

Post a Comment

Pages