పంచదారలాంటి పంచమి తిథి - అచ్చంగా తెలుగు

పంచదారలాంటి పంచమి తిథి

Share This

పంచదారలాంటి పంచమి తిథి

- వైజయంతి 
హిందువులు అనుసరించే చాంద్రమానమునందు తిధుల నిర్ధారణ ఖచ్చితమైన కాలమానినిగా ప్రపంచ శాస్త్రజ్ఞులచేత కొనియాడబడుతున్నది.పంచాంగము అను పదనిర్వచనము అందరికీ తెలిసినదే! తిధి, వార, నక్షత్ర, మన పంచాంగములలో తిధులకు అత్యధిక ప్రాధాన్యత ఉన్నది.
అనేకపర్యాయాలు కొన్ని పండుగను, వ్రతాలను, ఆయా తిధుల నుండి విడదీసి చెప్పడానికి వీలు అవదు. అంత అవినాభావ సంబంధ పదములుగా అవి మారినవి.
వినాయక చతుర్ధి/ వినాయక చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి, రధసప్తమి, శ్రీకృష్ణజన్మాష్టమి, భీష్మ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పారాయణము, ముక్కోటి, కాముని పున్నమ/ హోలిక పౌర్ణిమ, విజయదశమి, మహర్నవమి  (నవమి అనగా తొమ్మిది తిథికి లంకె ఉన్న వైభవ పర్వములు విజయదశమి, మహర్నవమి, చైత్ర నవరాత్రులు = శ్రీరామ నవరాత్రి మొదలైనవి.
అనేక పర్వదినములకు బొమ్మలకొలువులుగా కొన్ని నెలలు అలరిస్తూన్నవి. మార్చి నెలలో సాధారణంగా వస్తూన్నవి .
సింధూర దూజ్, గౌరీ తీజ, సౌభాగ్య తీజ్ = తృతీయ; వరద వినాయక చతుర్ధి = చవితి; స్కందషష్ఠి/ స్కాంద షష్ఠి, యమునా జయంతి, మహాసప్తమీ వ్రతము, విజయ సప్తమి, మహాసప్తమీ వ్రతము, శ్రీదుర్గా మహాష్టమి, అన్నపూర్ణ అష్టమి, చైత్ర నవరాత్రి = శ్రీరామనవరాత్రి, ఇత్యాది పేర్లు ఉన్న పట్టిక పెద్దదే ఔతుంది.
ప్రస్తుతము మనం "పంచమి తిధి"ని గమనిద్దాము.
************************,
పంచదారలాంటి పంచమి తిథి :-
యోగ, కరణములు ఐందింటిని పరిగణలకు ఆధారములుగా కాలమును కొలిచి చెప్పేది పంచాంగము. ఐదు అనే అంకెకు ప్రప్రధమ ప్రాధాన్యాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాము.
హోలీపండుగ రంగుల సరదా! హోలీ పున్నమికి ఐదు రోజుల తర్వాత వచ్చే పంచమీతిధి నాడు వ్రత, పూజాలను స్త్రీలు, పెద్దలు చేస్తూంటారు. ఉత్తరాదిన ప్రసిద్ధి గాంచిన ఈ పంచమినాడు తీజ్ పూజలు ఆనవాయితీగా జరుగుతూన్నవి.   \\ 'హర్తాళిక ' అనీ పిలుస్తున్నారు. (కొన్నిచోట్ల ఋషిపంచమి అనీ, పిలుస్తున్నారు. ఉత్తరభారతదేశాన ఆయా విశ్వాసాలకు, ఆచరణలకూ  అనుబంధమైన ఇట్లాంటి పేర్లు వైశిష్ట్యతను కలిగి ఉన్నవి.)  ఇది "రంగ పంచమి" అనే నామం కలిగి ఉన్నది. ఉజ్జయిని (మధ్యప్రదేశ్) వంటి పుణ్యక్షేత్రములలో ఈ పండుగను సరంభభరితంగా ప్రజలు చేస్తున్నారు. స్; 2014 లో బహుళ పంచమి, మార్చి 21 తేదీన వచ్చింది.
తిధి ;-
సాధారణంగా ఆగస్ట్ నెలలలో తటస్థమౌతూన్నది.
"మాఘమాసం, మంచిరోజు, ముహూర్తం బాగున్నది ........"  కలిగి, మంచి ముహూర్తాలుపెళ్ళిళ్ళు విరివిగా  జరిగేదే ఉన్నవి శ్రావణం, మాఘం. పున్నమికి అనుబంధం కలిగినవి కార్తీకపౌర్ణిమ, మాఘ పౌర్ణిమ, గురు పూర్ణిమ,ఇత్యాది పౌర్ణిమ సంబంధితములు.
కార్తీకమున జలాశయాలు, నదులు, చెరువులు మున్నగునవి తేలి ఆడే దీపాలతో భక్తులు కాంతుల  తోరణాలనుగా నీటి అలలను మారుస్తూంటారు. "కార్తీక దీపం" పేరు పైన సినిమాలను నిర్మించారు, ఆ సబ్జక్టుతో పాటలు, కవితలు ఉన్నవి అంటే వాని విలువ- అమూల్యతల బిందువులు అని తెలుసుకోగలుగుతున్నాము.
************************,
ఇక ప్రస్తుతాంశము , పంచమి దగ్గరికి వద్దాము.
1. ఋషి పంచమి:- హోలీ / మాఘ పౌర్ణిమ - తర్వాత 5 రోజులకు
    :-  ఋషి పంచమి /హర్తాళిక/ తీజ్ పూజ/
2. నాగచతుర్ధి, నాగపంచమి:-
"పుట్టమన్ను"కు బంగారములా భావిస్తారు. పసిపిల్లలకు చెవులు కుట్టే సందర్భములందు పుట్టమన్నును చెవులు కుట్టే చోట పూయడం కొన్ని ప్రాంతాలవారికి ఆనవాయితీ. "దేవదాసు" సినిమాలో చంద్రముఖి (మాధురీదీక్షిత్) పార్వతి కోరికపై - పుట్టమన్నును తెచ్చి ఇవ్వవలసిన ఘట్టాన్ని ఆవిష్కరించారు సినీదర్శకులు.
"నాగులచవితి నాగన్నా! పుట్టలోన పాలు పోస్తాము" అంటూ స్త్రీలు పూజలు చేస్తారు. వరాహమిహిరుడు "పుట్ట ఉన్నచోట నుండి దూరాన్ని, దిక్కును వివరిస్తూ, 'ఆ ప్రాంతంలో జల పడుతుందని" నీళ్ళు ఉన్న జాగాలను కనుగొనే విధానాలను నిర్ధారణ చేసాడు.
దీనినే మరికొంతమంది పంచమి రోజున జరుపుకుంటారు. అందుకనే నాగచతుర్ధి, నాగపంచమి రెండూ వాడుకలో ఉన్నవి. శ్రావణ మాసంలో శుక్లపక్షమును ఈ సర్పపూజకు ఎన్నుకున్నారు ప్రాజ్ఞులు.
శుక్ల పంచమినాడు చేయవలసిన ఈ నోము, ప్రస్తుత సంవత్సరమైన 2014లో, ఆగస్ట్ 1 వ తేదీన వచ్చినది.
ఇతర వ్రతాలు పుష్కలంగా ఉన్న ఈ శ్రావణమాసమున వచ్చింది నాగపంచమి.
లలితా పంచమి :- ఆశ్విన్/ ఆశ్వియుజ మాసంలో, దసరా నవరాత్రులకు ముందు పౌర్ణమి రోజున వచ్చే తిధి లలితా పంచమి. 2014 సంవత్సరమున సెప్టెంబరు 29 వ తేదీన వచ్చునది. అశ్వినీ/ ఆశ్వయుజ మాసమున శుక్లపక్ష పంచమినాడు "ఉపాంగ్ లలితా వ్రతము" ను చేస్తారు. ఆరంజ్ వర్ణ దుస్తులను ఉపాంగ లలితా పంచమివ్రతం జరిపే సందర్భంగా రోజున ప్రజలు ధరించడానికి ఆసక్తి చూపిస్తారు.లలితా త్రిపురసుందరీ ఉపాంగ వ్రతము తేజస్సు వరప్రసాదంగా భక్తులకు లభిస్తున్నది.
************************,
క్లబ్బులు, పబ్బులు వంటి సెంటర్లు ఉద్రేకాలను రెచ్చగొడుతూ, హింసాప్రవృత్తిని పెంచుతున్నవి.
ఇలాంటి కొన్ని నోములు, పండగలు చక్కెర చిలకలు. పేరంటములలో అందరూ కలిసి సెనగలు, వాయనాలు, ప్రసాదాలు ఆదానప్రదాన కార్యాక్రమాలతో పుష్కలమై అందచందాల ఆహ్లాద ఆచారసంప్రాదాయాల కూటమిలు ఇవి, ఔను కదూ!
(వ్యాస రచయిత్రి:-  వైజయంతి)

No comments:

Post a Comment

Pages