రుద్రదండం (జానపద నవల ) - అచ్చంగా తెలుగు

రుద్రదండం (జానపద నవల )

Share This
రుద్రదండం (జానపద నవల )
-       ఫణి రాజ కార్తీక్
(జరిగిన కధ : పార్వతికి తంత్ర విద్య నేర్పుతూ,ఆమె పరధ్యానానికి కోపించిన శివుడు శక్తులను ఆపాదించిన రుద్రదండం త్రిశూలంతో విరిచేస్తాడు. ముక్కలైన రుద్రదండం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు మాంత్రికుడైన మార్తాండ కపాలుడు. ఆ దండంలోని ముక్కలు అనేక చోట్ల జంబూ ద్వీపంలో పడతాయి.   అవి దక్కించుకుని, వాటితో తిరిగి రుద్రదండం తయారు చేసినవాడు దైవసమానుడు అవుతాడు.తన కధను డింభకుడికి చెప్తూ ఉంటాడు మాంత్రికుడు.బీదవాడైన మాంత్రికుడి రాజ్యంలో యువరాణికి అంతుబట్టని జబ్బు చేస్తుంది. అరణ్యంలోని ముని అందించిన శక్తులతో యువరాణి జబ్బును నయం చేస్తాడు మార్తాండ కపాలుడు. అయినా రాజు అర్ధరాజ్యం, యువరాణతో వివాహం చెయ్యక అతడిని బయటకు వెళ్ళగోడతాడు.వికల మనస్సుతో ఒక గుహలోకి వెళ్ళిన అతడికి, శుద్రదేవి విగ్రహం ముందు, ఒక మొండెం, దూరంగా దాని తల కనిపిస్తుంది. ఆ కధంతావిన్న డింభకుడు ఇలా అడుగుతాడు  ...) డింభకుడు ఈ కధ మొత్తం శ్రద్ద గా విని  ఎంతో ఆశ్చర్యపడ్డాడు . డింభకుడు ఇలా అడిగాడు .”ప్రభూ ఇప్పటి మన స్థావరం ఆనాటి మీ గురుదేవుల గుహలోని బిలం అన్నారు కదా.ఇప్పుడు అది ఎలా ఇంత లోయలోకి వచ్చింది .”అని అన్నాడు .మార్తాండుడు “డింభకా ! నా  వజ్రశరీరం రాగానే ఉరుములు ఉరిమాయి.మెరుపులు మెరిశాయి.నేను వికటాట్టహాసం చేశాను .నా బిలంలోకి మళ్ళి మా గురుదేవులను ఓడించిన ఆ దేవతల సైన్యం లోని ఇద్దరు వెతుక్కుంటూ వచ్చారు .వారు నాతో పోరాడారు .కాని నన్ను ఏమి చేయలేకపోయారు .ఈ సారి వారి దగ్గర ఉన్న ఆయుధాలు విరిచి పారేసాను.వారు నాతో పోరాడారు .నా గురుదేవులు నాలో ఉన్నందున ఈ సారి ప్రతి అవయవం వజ్రతుల్యం కావటం వల్లన వారు నన్ను ఏమి చేయలేకపోయారు .వారిని చిత్తు చిత్తు గా కొట్టి ఓడించాను .వారు అమృత౦ తాగ బట్టి చనిపోలేదు .వారు ఇంక భయపడి నా స్థావరం వదిలి వెళ్ళిపోయారు .ఇలా పలుమార్లు నా వెంట బడ్డారు. నన్ను ఏమి చేయలేక పోయారు .నేను కొన్ని సంవత్చరాలు ఈ గుహ లో వారిని ఎదిరిస్తూ గడిపాను .వారు పదే పదే నన్ను,నా తపస్సు ను భంగం చేయసాగారు.ఇంక నాకు చిరాకు పుట్టింది .ఒకసారి గుహ బయటకి వచ్చి  చూసాను అడవి ఎంత గానో రూపాంతరం  చెందింది.నాకు తళుక్కున ఒక ఆలోచన వచ్చింది .నాకు ఎవరు అడ్డురాకూడదు అనుకోని ,గుహని దాచదలిచాను.అది నాకు తప్ప అన్యులకి కనపడకూడదని  అనుకుంటూ మంత్రి౦ చాను .అందుకే ,గుహలోకి రాదల్చుకునే ముందు మొదట వెలుగు వస్తుంది .అందులోకి నడవాలి ,ఎలాగూ నాకు ఎక్కడికి అంటే అక్కడికి పోయే విద్య తెలుసు కాబట్టి గుహని ఒక వంద అడుగుల నేలలోకి దింపాను .అటు పిమ్మట ,రుద్రదండంకై  తీవ్రంగా యోచించి తిరుగుతూ ఉండేవాడిని .ఒకానొకనాడు ,కొన్ని వందల మంది రాక్షసులు నా స్థావరం ముందు వచ్చి నన్ను బైటకి రమ్మని గేలి చేసారు .నేను బైటకి వచ్చి వారితో మైత్రిగా ఉండమని  నాతో స్నేహం చేయమని ప్రతిపాదించాను.కాని వారు “ ఓయి మనవుడివి నీతో మాకు వైరమే సమంజసం .గతం లో ఈ గుహలో 2000 సం||లకు పూర్వం మేము ఉండేవాళ్ళము .తర్వాత కాలకూటుడు మమ్మల్ని మోసగించి ఈ స్థావరం తీసుకున్నాడు. మా స్థావరం మాకు ఇచ్చెయ్యి అన్నారు .నా సాధనలకి ఎంతో అనువైన ఈ ప్రదేశాన్ని వారికి ఇవ్వటానికి నిరాకరించాను.వారు నాతో తలపడ్డారు .నా మంత్ర శక్తి ప్రభావంతో స్థావరాన్ని వారికి కనపడకుండా మాయం చేసాను .వారు నాతో మాయ యుద్ధం చేశారు , ఆ రాక్షస నాయకుడు దగ్గర ఒక మంత్ర దండం  ఉంది ,దాంతో వాడు ఎన్నో మాయలు చేసి ,నన్ను సమానం గా ఎదిరిస్తున్నాడు .ఒకాకొక సందర్భం లో  వాడు నన్ను ఓడిస్తాడేమో అనుకున్నాను .మిగిలిన రాక్షసులు చుట్టూ ఉన్న జంతువులను చంపి రాక్షసం గా వాటిని ఆకలితో తింటున్నారు .ఆ రాక్షసులకు  లేడి మాంసం బహుప్రీతీ అని వారి మాటల ద్వారా కనుగొన్నాను .నేను వెంట నే  నా మయా శక్తి తో కొన్ని లేళ్ళను సృష్టించాను .వాటి వెంట పడుతూ  మంద బుద్ది గల  రాక్షసులు పరిగెత్తారు .నాతో యుద్ధం చేస్తున్న రాక్షసుడు ,”శివంగి ,శివంగి మాంసం “ అని అరిచి ,భీకరం గా నవ్వి నన్ను ఎదిరిస్తున్నాడు . ఈ మంద బుద్ది రాక్షసుడిని కుయుక్తి తో తెలివితో ఓడించాలని నిర్ణయించుకున్నాను . నేను నా శరీరాన్ని వేరు చేయగలను కాబట్టి  ఆ రాక్షసుడు  తను విసిరిన మంత్ర బల్లానికి నా తల వేరైనట్లు దృశ్యం కల్పించాను.మిగిలిన రాక్షసులు కూడా కొన్ని లేళ్ళను వారి తలకు చుట్టుకొని వచ్చారు .కొంతమంది చెట్లకు తల క్రిందులుగా వ్రేలాడుతున్నారు.వారందరినీ చూస్తూనే నేను మరణి౦ చినట్లు నటించాను.అక్కడ ఉన్న వారందరూ ఆ రాక్షస రాజు గెలిచాడని జయ ద్వనులు చేస్తున్నారు .వాళ్ళ రాజు కోసం శివంగిని కట్టి తెచ్చారు .ఆ రాక్షస రాజు లొట్టలు వేస్తూ “ ముందు ఈ మనిషి మాంసం తి౦దా౦ తర్వాత అది అని ఆబరాగా దగ్గరకు వచ్చాడు.ఒక్క క్షణ వేగం లో నేను మళ్ళి నా శరీరాన్ని యదా స్థితి కి తెచ్చుకొని,ఆ రాక్షసుడి పంటికి ఉన్న కోరను పీకాను.అతని మీద దాడి చేసి అతని చేతిలో మంత్రదండం లాక్కున్న.దాంతో అప్పటి దాక పిచ్చి కేకలు వేస్తున్న రాక్షస సమూహం నివ్వేరపోయింది.స్వయానా నేను మంత్రవేత్తను కాబట్టి నేను ఆ రాక్షస మయాదండాన్ని ఎలా వాడాలో తెలుసుకున్నా క్షణంలో దాంతో ఆ రాక్షసులని వారు ఇష్టం గా తినే జంతువులుగా మారి పోవాలని ఆజ్ఞాపించా,అక్కడ ఉన్న వందల రాక్షసులు ,కోతులు ,కుక్కలు ,లేళ్ళు,పాములు ,కప్పలుగా మారి వింత చేష్టలు చేయసాగారు.నేను నవ్వు అప్పుకోలేకపోయి,మిగిలిన ఆ రాక్షస నాయకుడు పారిపోబోయాడు.ఎదురుగా కట్టి పది ఉన్న శివంగి శవం వల్ల కింద పడ్డాడు .నేను నవ్వి మంత్రదండంతో వాడిని ఆ శివంగి లోకి ప్రవేశపెట్టాను .ఇంకా కొన్ని౦టిని డేగలు ,గబ్బిళాలుగా  మార్చాను .ఆ రాక్షసులలో కొంత మందికి అద్బుత శక్తులు ఉన్నాయని గ్రహించి వారిలో కొంతమందిని ఇప్పుడు నువ్వు చూస్తున్న వరుసలో ఉన్న దెయ్యాలు ,భూతాలుగా ఉంచాను .అవే ,ఇందాక నాకు జయద్వనులు చేసాయి.ఆ తర్వాత ఆ మంత్రదండ శక్తులు నాలోకి లాక్కొని ,దానిని విరిచాను.సరిగ్గా అప్పుడు జరిగింది ఒక వింత .అక్కడి నేల క్రిందకి పోసాగింది ,లోయలాగా అవ్వసాగింది. (సశేషం...)

No comments:

Post a Comment

Pages