శ్రీధరమాధురి – 6 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి – 6

Share This

శ్రీధరమాధురి – 6

(నృసింహ స్వామిపై పరమపూజ్య శ్రీ శ్రీధర గురూజీ అమృతవాక్కులు )


 సర్వతోముఖం

దైవం అపారమైన శక్తి కలవారు. ఆయన సౌందర్యం అంతటా వ్యాపించి ఉంది. ఈ జగత్తు మొత్తానికి, సృష్టి అంతటికి అసలైన ముఖం ఆయనే. ఆయన ప్రతీ రూపంలోనూ ఉన్నారు. ఆయన ప్రతీ అంశంలోనూ  ఉన్నారు. హిరణ్యకశిపుడు శ్రీహరిని చూసినప్పుడు, ఆయనలో అతనితోసహా సకలజగత్తు అతనికి గోచరమయ్యింది. నృసింహునీలో అన్ని వ్యక్తిత్వాలూ అతనికి కనిపించాయి. ఆయనలో అతనికి సకల ప్రాణుల ముఖాలు కనిపించాయి. ఆ ముఖాలన్నీ చూడగానే అతని శరీరం, బుద్ధి, ఆత్మ అనే అన్ని స్థాయిల్లో ఉన్న జ్ఞానాన్ని అతను గుర్తించాడు. నృసింహ రూపంలో ఉన్న దైవం తనంతట తానే హిరణ్యకశిపుడికి ప్రకటమయ్యారు. హిరణ్యకశిపుడి అహం వెంటనే కరిగిపోయింది. అతడు ఆ రూపం చూసి నివ్వెరపోయాడు. మంత్రముగ్ధుడై గదను క్రింద పడేసాడు. ఇక నృసింహునిపై ప్రతిఘటించడం వల్ల ఉపయోగం లేదనుకున్నాడు. అతను ఎంతో కాలంగా ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాడు, ఆ క్షణం రానే వచ్చింది. తనను తాను దైవానికి అర్పించుకున్నాడు. అంతా దైవానుగ్రహం.

 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

హిరణ్యకశిపుడిని చంపడానికి మహావిష్ణువు కోపాన్ని  తెచ్చిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక రకంగా, అతనికి ముక్తిని ఇచ్చేందుకే దైవం ఆ విధంగా దయ చూపారు. దైనందిన జీవితంలో జ్ఞానులు, ప్రాజ్ఞులు కూడా కోపాన్ని తెచ్చిపెట్టుకుని, కోపంగా ఉన్నట్లు నటించాల్సి వస్తుంది. వారు పూర్తి వివేకంతో పరిస్థితిని అర్ధం చేసుకుంటారు, కాని మన కోపం అజ్ఞానం నుంచి పుట్టుకొస్తుంది. కోపంగా ఉన్న తర్వాత వారిలో అపరాధ భావన ఉండదు. ఎందుకంటే, వారు కర్తలు కాదని, వారికి తెలుసు. అదే అజ్ఞానం వల్ల కోపం వస్తే, కోపం తగ్గాకా, మనం బాధపడతాము. 

 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

హిరణ్యకశిపుడు ఒక్కడే  నృసింహుడి తొడపై  కూర్చున్న అమిత అదృష్టవంతుడు. ఆయన ప్రహ్లాదుడిని కనీసం తాకనైనా లేదు. అంతా దైవానుగ్రహం.

 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

 నృసింహ అవతారం యొక్క లక్ష్యం జీవుడి అహాన్ని పరమాత్మ చేతిలో అంతం చెయ్యడం. రాక్షసుడైన హిరణ్యకశిపుడు అహంకారి. అతను తన అహాన్ని, శక్తిని, విశ్వంలోని మూలకాలన్నింటికీ , తన కొడుకైన ప్రహ్లాదుడికీ ప్రదర్శించసాగాడు. పరమాత్మ నృసింహ రూపంలో ఆ జీవాత్మను (హిరణ్యకశిపుడిని ) లొంగతీయాలని అనుకున్నాడు. అందుకే నృసింహ అవతారం దాల్చాడు. మీరు శక్తివంతులు అయ్యే కొద్దీ, రెండు విషయాలు జరగాలి. ఒకటి అహం తగ్గి, వినయం పెరగాలి. రెండు కోరికలు తగ్గాలి. ఎందుకంటే, ఆ శక్తిని ఇతరుల మేలుకై నిస్వార్ధంగా వాడేందుకు ఇది దోహదపడుతుంది. హిరణ్యకశిపుడి విషయంలో ... ఈ రెండూ జరగలేదు. అతనికి శక్తి కలుగగానే, అహం అనంతంగా పెరిగింది. అతని తర్వాత కోరిక పరమాత్మతో సహా విశ్వాన్ని జయించాలని. ఇది అతని పతనానికి దారి తీసింది. అందుకే మీ శక్తి (ఆధిక్యం) పెరిగే కొద్దీ, మీ కోరికల్ని, అహం స్థాయిని తగ్గించుకోండి.

 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

 

“గండ భేరుండ నృసింహ “

ఒకరోజు మహర్షి రాజర్ నాకు ఏదో చాలా ఆసక్తికరమైనది చూపుతానని తీసుకువెళ్ళారు. రెండు రోజులుగా నడుస్తూనే ఉన్నాము. అందుకే చిన్న ఏటి గట్టున ఆగాము. ఇద్దరం స్నానం చేసి, ఒడ్డున ఉన్న చెట్టు క్రింద కూర్చున్నాము. సాయంత్రం 5 గం. అవుతోంది. చుట్టూ ఉన్న కొండల వల్ల సూర్యాస్తమయం త్వరగా అవుతోంది. మేము చాలా విశేషమైన ఒక శబ్దం విన్నాము. అటువంటి శబ్దం నా జీవితంలో అప్పటివరకూ నేను వినలేదు. నేను మహర్షి రాజర వంక చూసాను. ఆయన మౌనంగా, పవిత్రంగా ఉన్నారు. ఆయన పెదాలపై అదే చిరునవ్వు.

మహర్షి – మనం ఇంకా కొంత దూరం ప్రయాణం చెయ్యాలేమో అనుకున్నాను. కాని ‘రాజలి’ మనం ఉండే చోటుకే దయతో వచ్చింది.

నేను – గురువర్యా, ‘రాజలి’ ఎవరు ?

మహర్షి – పురాణాల్లో చెప్పే అరుదైన పక్షి. కేవలం విశ్వాసం ఉన్నవారే దాన్ని చూడగలరు. ఆ రోజుల్లో బ్రాహ్మణులు ఈ పక్షికి ఎంతో భయపడేవారు. బ్రాహ్మలు ఎవరైనా అబద్ధాలు చెప్తే, ఈ పక్షి వారిపై దాడి చేసి, ఎట్టుకుపోయేది. ఈ పక్షికి రెండు తలలుంటాయి. నువ్వొక పని చెయ్యి, ఈ ఏటిలో నడుము లోతు నీళ్ళలో నిల్చుని, ‘గండ భేరుండ నృసింహుడిని ‘ ధ్యానించు. నీలో ఆయన నిండగానే, కళ్ళు తెరిచి చూడు.

ఆయన చెప్పినట్లుగానే, నేను ఏటిలో నిల్చుని స్వామిని ధ్యానించాను. నేను కళ్ళు తెరవగానే, ఒక అందమైన పక్షి, రెండు తలలతో కనిపించింది. దాని దేహం పెద్దగా ఉంది. తెలుపు రంగులో నెమలి కళ్ళతో, పొడవాటి ముక్కుతో ఉంది. దాని కాళ్ళు బలంగా ఉన్నాయి, అది అవతలి గట్టున చెట్టుపై కూర్చుంది. 5 నిముషాలకు పైగా అది అక్కడ కూర్చుని, వెళ్ళేముందు మరొక్కసారి అదే శబ్దం చేసింది.

చెమ్మగిల్లిన కళ్ళతో, నేను నా గురువుకు ప్రణమిల్లాను. ఆయన దీవెనల వల్ల నేను రాజలి – ఒక ‘గండ భేరుండ నృసింహ ‘ స్వరూపాన్ని చూడగలిగాను. దైవేచ్చ, అనుగ్రహం, దయ.


 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 


పూజ్య గురూజీచే అష్ట ముఖ గండ భేరుండ పక్షి సింహం యొక్క వివరణ...

ఇది గండ భేరుండ పక్షి సింహం...

ఇది నృసింహ రూపాలు అన్నింటిలోనూ అత్యంత సుందరమైనది. దీన్ని గండ భేరుండ పక్షి నృసింహ స్వామి అంటారు. దివం ఈ అవతారాన్ని హిరణ్యకశిపుడితో ఘర్షణకు దిగే ముందు చివరి దశలో దాల్చారని నమ్ముతారు, మంత్ర రాజ పద మూలమంత్రంలో ఈ పదాన్ని “సర్వతోముఖం “ అంటారు. హిరణ్యకశిపుడు నృసింహ స్వామిని చూసినప్పుడు చాలా ముఖాలు చూడగలిగాడు.

 1. సింహం 2. పులి 3. కోతి 4. ఎలుగుబంటి 5. వరాహం 6. గరుడ 7. గుర్రం 8.మొసలి ... 8 తలలు, 32  చేతులు . 32 చేతులు అనుష్టుప్ మూల మంత్రాన్ని లేక మంత్రరాజపద మూల మంత్రాన్ని సూచిస్తాయి. ఇందులో 32 అక్షరాలు ఉంటాయి. ఒక్కో అక్షరం ఒక్కో బీజాక్షరాన్ని, 1,00,౦౦౮ ఉప అక్షరాల్ని సూచిస్తుంది. ఇక్కడ హిరణ్యకశిపుడు దైవాన్ని హృదయంలోనూ, బయటా చూడగలిగాడు. అందుకే 2 తలల పక్షి అందుకు ప్రతిగా కనిపిస్తుంది.

కేరళ, కర్నాటకలోని కొన్ని ప్రాంతాల బ్రాహ్మల్లో ఆ రోజుల్లో వాళ్ళ అంతరంగం స్వచ్చంగా లేకపోతే, పూజా పునస్కారాలు చెయ్యకూడదని, అలా చేస్తే, రాజలి పక్షి ఎక్కడి నుంచో వచ్చి, వాళ్ళను ఎత్తుకుపోయి పాతాళంలో పదేస్తుందన్న నమ్మకం ఉండేది. అందుకే వారి ఆలోచనలు మలినంగా ఉన్నప్పుడు, వారు ఏ పూజలు, బలులు ఇచ్చేవారు కాదు.

ఈ రూపంలోని దైవం అఘోరమూర్తి. అద్భుతాన్ని అధిగమించే అందం. హిరణ్యకశిపుడిని చంపేటప్పుడు, ఆయన ఈ దర్శనం ఇవ్వడం వల్ల హిరణ్యకశిపుడు ఈ రూపాన్ని దర్శించి, ఆత్మజ్ఞానం పొందాడు. గరుడుడు అతని మరణానికి ముందు అతని చెవిలో చరమ నరసింహ శ్లోకం ఉపదేశించి, దయ చూపాడు. ఇది నిజంగా చాలా అరుదైన నృసింహ రూపం.

gandab

బోంబే శ్రీనివాసన్ – ఏది సరైనది, నరసింహ లేక నృసింహ ...

నేను – శ్రీనివాసన్ నరసింహ అంటే సగం మనిషి, సగం దైవం. కాని నృసింహ అంటే ‘అందమైన సింహం ‘, భగవంతుడి మరో అవతారం. అందుకే మంత్రరాజ పద మూల మంత్రంలో...

“ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం

నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం “

 

అని ఉంటుంది. నృసింహం... ఇక్కడ నృ అనేది వాడారు. నర్ అని కాదు. నృ అనేది దైవానికి, నర్ అంటే కేవలం సగం మనిషి సగం దైవం అనే అర్ధం కంటే బాగా సరిపోతుంది. నృ దివ్యమైనది, నర్ మనుష్య సంబంధమైనది. అంతా దైవానుగ్రహం, దయ.

 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

  అఘోర నృసింహ మంత్రం ...

‘ఓం హ్రీం క్ష్రౌం , ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం... స్ఫుర స్ఫుర , ప్రస్ఫుర ప్రస్ఫుర, ఘోర ఘోరథన, థనూరూప, చ్చట చ్చట , ప్రచట ప్రచట, కః కః , వామ వామ , బంధయ బంధయ, క్ఖాదయ క్ఖాదయ , నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుర్ నమామ్యహం స్వాహా ‘....

 

ఇది నృసింహ స్వామి మరొక మంత్రం. ఇందులో నృసింహ అనుష్టుప్ ఛందస్సు అఘోర మంత్రంలో వాడబడుతుంది. ఇది శుభాలతో దీవిస్తుంది. అన్ని చెడ్డ శక్తులూ నాశానమైపోతాయి. ఇది పఠించడం వల్ల జయాన్ని కూడా కలిగిస్తుందని గట్టి నమ్మకం. అంతా దైవానుగ్రహం... దయ.


 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

 అహోబిలం ఒక అందమైన ప్రదేశం. భూలోక స్వర్గం – ఇందులో నృసింహ స్వామి 9 వేర్వేరు ఆకృతుల్లో ఉంది, ఘనమైన ప్రహ్లాద వరదుడిగా ఆలయంలో కొలువున్నారు. ఈ అడవుల్లో అపారమైన దివ్యశక్తులు ఉన్నాయి. ఈ దేవాత్మలన్నీ పరమాత్మను ప్రార్ధిస్తూ, ఈ కొండల్లోనే కొన్ని కోట్ల సంవత్సరాల నుండీ కొలువున్నాయని నమ్మకం. ఎవరైనా ఈ అక్షరాల సామీప్యంలో దీవించబడే అవకాశాన్ని పొందుతారు. ఈ దివ్యశక్తుల దీవెనలు ప్రతీ ఒక్కరికీ జీవితపు అన్ని పార్శ్వాలలో, ఆధ్యాత్మిక క్షేత్రంతో సహా ఎదిగే అవకాశం ఇస్తాయి. మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, పరాక్రమం, శాంతి, పరిపాలన వంటివి  సంప్రాప్తిస్తాయి. మీరు అదృష్టవంతులైతే తప్ప (లక్ష్మీ నృసింహ స్వామి అనుగ్రహం లేకుండా) ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టలేరు. అందరికీ మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతిని ఇవ్వమని అహోబిలవాసుడిని ప్రార్ధిద్దాం.

 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

   అహోబిలం ఒక సుందరమైన నవ నృసింహ క్షేత్రం.....

“ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం

నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం “

 

ఉగ్రం -------------------- ఉగ్ర నృసింహ  --------------------------- సూర్య

వీరం ----------------- వీర క్రోధ వరాహ నృసింహ ----------------- చంద్ర

మహావిష్ణుం ---------- మాలోల నృసింహ ------------------------- శుక్ర

జ్వలంతం ------------- జ్వాలా నృసింహ --------------------------- కుజ

సర్వతో ముఖం ------- పావన నృసింహ --------------------------- కేతు

నృసింహం ------------ కారంజ నృసింహ --------------------------- రాహు 

భీషణం --------------- ఛత్రవట నృసింహ -------------------------- బుధ

భద్రం ----------------- యోగానంద నృసింహ ---------------------- గురు

మృత్యు మృత్యుం ---- భార్గవ నృసింహ ---------------------------  శని

నమామ్యహం -------- ప్రహ్లాద వరద నృసింహ -------------------- సర్వం

అంతా దైవేచ్చ, అనుగ్రహం, దయ.

 

 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

     కొన్నేళ్ళ క్రితం అహోబిలంలో...

అతను – గురూజి, నేను జ్వాలా కి వెళ్తున్నాను.

నేను – ఇవాళ దారిలో యక్షరాజన్ ఉండవచ్చు, అందుకే ఒక బృందంతో, ఒక మార్గదర్శిని తీసుకుని వెళ్ళు.

అతను – గురూజి, నేను అనేకమార్లు వెళ్లాను. నాకు ఆ ప్రదేశం, అక్కడకు వెళ్ళే దారి బాగా తెలుసు.

యజ్ఞం నుంచి తిరిగి వచ్చిన 4 రోజులకు, నాకు అతని భార్య నుంచి, తన భర్త తిరిగి రాలేదని కాల్ వచ్చింది. నేను మరో 3 రోజులు వేచి ఉండమని చెప్పాను.

నేను అనుమానించినట్లుగానే అతను దారి తప్పాడు. అదృష్టవంతుడు... ఒక పెద్ద గరుడ పక్షి అతన్ని అనుసరిస్తోంది. అడవి మధ్యలో ఒక ఆదివాసి అతనికి కనిపించి , అక్కడి నుంచి తిరిగి అతనికి అహోబిలానికి   వెళ్ళే దారి చూపాడు.

వెనక్కు రాగానే, అతను నా వద్దకు పరిగెత్తుకు వచ్చాడు. నేనతన్ని తిరిగి ఆహోబిలానికి వెళ్ళమని చెప్పాను. అన్ని నృసింహ దేవాలయాల్ని సరైన మార్గదర్శి సాయంతో దర్శించమన్నాను.

అతను – నేను దైవానికి ఏమి సమర్పించాలి ?

నేను – చలి కాలం కనుక, ఒక 25 దుప్పటీలు కొని, స్థోమత లేని పేదలకు పంచు. దైవం చాలా సంతోషిస్తారు.

 

 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

  ఒక బృందం  ఎగువ అహోబిలంలో తప్పిపోయారు. వాళ్ళు అసహాయంగా ఉన్నారు. రెండు పెద్ద డేగలు పైనెక్కడో ఆకాశంలో ఎగురుతున్నాయి. అవి ఇచ్చాధరులు. అందులో ఆడ పక్షి క్రిందికి వచ్చి, ఒక స్త్రీగా ఆకృతి దాల్చింది. వారి వెంట ఉంటూ, వారికి వెనక్కు దారి చూపింది. ఓహ్... నల్లమల అడవుల గుండా ఒక గొప్ప మరువలేని యాత్ర చేసారు ఆ బృందంలోని వారు. అంతా దైవానుగ్రహం.

 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

మేము మంచి స్నేహితులం. ఒకరోజు నేను అతనితో సినిమాకు వెళ్లాను. పీటర్ బ్లాట్లీ ‘ద ఎక్సోర్ సిస్ట్’ అనే సినిమాకు మద్రాస్ (చెన్నై) లోని కాసినో థియేటర్ కు వెళ్ళాము. ఒకానొక సన్నివేశంలో, చర్చి ఫాదర్ అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలించేటప్పుడు , నేను అతని కుడి చెవిలో నృసింహ అనుష్టుప్ మూల మంత్రాన్ని చెప్పాను. సినిమా అయ్యాకా, అతను నన్ను ‘కుడి చెవిలో ఏం చెప్పావు, సినిమా హోరులో అర్ధం కాలేదు,’ అని అడిగాడు. నేను సినిమా టికెట్ వెనకాల ఆ మంత్రం రాసిచ్చి, వీలున్నప్పుడల్లా చదవమన్నాను. ఆ కాగితాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పాను. ఇది జరిగిన 22 ఏళ్ళకి ...

నా ఫ్రెండ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి, వెస్ట్రన్ యుఎస్ఏ లోని అరిజోనా ఎడారిలో హైవె పై డ్రైవ్ చేస్తున్నాడు. కార్ హఠాత్తుగా ఆగిపోయింది. దానికి ఏదో అడ్డుపడింది. మరొక కార్ వచ్చింది. అందులో డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. వీళ్ళు కార్ ఆగగానే ఎక్కారు. వారు డ్రైవర్ తో మాట్లాడసాగారు. చీకటి పడుతుండడంతో వారతని మొహం చూడలేకపోయారు. అతను వీరు చెప్పిన దారిలో వెళ్లక,  వేరే దారి తీసుకుని, ఎక్కడో చీకట్లోకి తీసుకెళ్ళి ఆపాడు. అంతా కార్ దిగారు. కాగడాలు పట్టుకున్న 10 మంది వాళ్ళను చుట్టుముట్టి, దగ్గరలోని కొండల్లోకి తీసుకువెళ్ళారు. వాళ్ళు వీళ్ళందరినీ చాలా లోపలికి తీసుకువెళ్ళారు. చివరికి, నా స్నేహితుడు వారంతా ‘వూడూ’ చేసే వారని తెలుసుకున్నాడు. ‘వూడూ’ అనేది ఒకరకమైన వామాచారం. ఇది పశ్చిమ దేశాల్లో వాడుకలో ఉంది. నా స్నేహితుడు వణుకుతూ, నెమ్మదిగా పర్స్ తెరిచి, సినిమా టికెట్ వెనుక నేను రాసిచ్చిన నృసింహ అనుష్టుప్ మూల మంత్రాన్ని తీసాడు. పెద్ద గొంతుకతో చదివాడు. ఆ గుంపు నాయకుడు ఆ టికెట్ లాక్కుని లైటర్ తో కాల్చాడు. హఠాత్తుగా పెద్ద నాగులు, రక్త పింజారులు, క్రేట్స్ వంటి విషపు పాములు ఎక్కడినుంచో వచ్చి, వారి మీద దాడి చెయ్యసాగాయి. నా స్నేహితుడు తన ఇతర మిత్రులతో కలిసి, ఆ ప్రాంతం నుంచి బయటపడి, సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాడు. నాకు ఫోన్ చేసి, జరిగింది చెప్పాడు.

ఇదీ లక్ష్మీ నృసింహ స్వామి శక్తి, మంత్రరాజపద మూల మంత్రం శక్తి.

 

“ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం

నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం .”

 

దైవాన్ని ప్రార్ధించండి. అంతా దైవేచ్చ, అనుగ్రహం, దయ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

దక్షిణ భారతంలో నాకు తెలిసిన ఒక నృసింహ స్వామి ఆలయం శిధిలావస్థలో ఉంది. ఆలయ పునర్నిర్మాణానికి వారు చందాలు వసూలు చేసి, ఒక కమిటీ ని ఏర్పరిచారు. తర్వాత నిపుణులు సన్నివేశంలోకి ప్రవేశించారు. ప్రతీ నిపుణుడూ, తన ఐడియా నే గొప్పదని చెప్పుకోసాగాడు. బయల్పడిన అహాల పోరాటం మొదలయ్యింది. ఒక వైపు నిపుణులు, మరో వైపు ప్రభుత్వం... వేరొక వైపున జ్యోతిష్కులు... ఇంకో వైపు పూజారులు... మరో ప్రక్క శ్రేయోభిలాషులు... ఇంకో ప్రక్క దాతలు... రాజగోపురం నిర్మాణంలో ఉంది. చాలా గొడవలు జరగసాగాయి. దైవంతో నా సంభాషణలో... ఆయన తాను శిధిలాలయంలోనే ఎక్కువ సంతోషంగా ఉన్నానని చెప్పారు. కేవలం దేవుని దయ, ఇచ్చ, అనుగ్రహం మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం చూపగలదు.

 

|| శ్రీ గురుపాదుకాభ్యోం నమః ||

 

 

No comments:

Post a Comment

Pages