అరచిటికెలో పుట్నాలపప్పు పొడి
 
పెయ్యేటి శ్రీదేవి
కావలసిన పదార్థాలు: పుట్నాలపప్పు - 1 గ్లాసు ధనియాలు - 1/4 గ్లాసు ఎండుమిరపకాయలు - తగినన్ని మినప్పప్పు - 1/4 కె.జి. ఉప్పు - తగినంతతయారుచేయు విధానం:
          మూకుడులో కొంచెం నూనె వేసి ధనియాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి.  ఇవన్నీ మిక్సీలో వేసి, పుట్నాలపప్పు కూడా వేసి, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చెయ్యాలి.  కావాలంటే ఎండు కొబ్బరిపొడి కూడా వేసుకోవచ్చు.  చాలా త్వరగా ఐపోతుంది.  రుచిగా కూడా వుంటుంది.ఇది అన్నంలో కలుపుకుంటే కందిపొడిలాగే మహా రుచిగా వుంటుంది.  ఇక వంకాయకూరలో గాని, కాప్సికమ్ కూరలో గాని ఈ పొడి చల్లుకుంటే ఓహో, ఏమి రుచి!మరి ఆలస్యం దేనికి?  చేసేయండి త్వరగా.
*********************

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top