శివం (శివుడు చెప్పిన కధ)

ఫణి రాజ కార్తీక్

భక్తుల కోసం ఏమైనా చేసే తత్త్వం నాది. అందుకే మార్కండేయుడికీ తలరాత మార్చాను. అల్పాయుష్కుడైన మార్కండేయుడ్ని విధి నియమాలు సడలించి యముడినై యముడ్ని సైతం శిక్షించాను. అతనికి మహర్షి సైతం జ్ఞానం ప్రసాదించి చిరంజీవిని చేశాను. నన్ను ఎన్నోసార్లు తెలియక దూషించి ఆనండపడ్డ మంజునాథుని నా జ్ఞానం ప్రసాదించి భక్తమంజునాథునిగా వచ్చాను. మోక్షాన్ని ప్రసాదించాను. మూఢభక్తితో మాంసం పెట్టి తన చెప్పులతో తినడు నా శివలింగమును శుభ్రం చేసిన ఆనందపడ్డాను. ఉమ్మివేసిన అభిషేకం చేశాడనుకున్నాను. నేను మీ యందు భక్తి మాత్రమే చూస్తాను. ఇలా ఒకటా రెండా ఎన్ని చేశానో చెప్పుటకు ఒక కల్పం సరిపోదు. నిజంగానే భక్తులు ధన్యులు. ఎంతోమంది ఎన్నో సాధనాల ద్వారా సాధించలేనిది నా భక్తులు వెంటనే సాధిస్తారు. అదియే వారి ఆదర్శం, జ్ఞానం అనే మాటకు అర్థం నన్ను తెలుసుకోవడమే. తపస్సు అంటే నన్ను తలవడమే. నన్ను తలుస్తున్నపుడు మీకు రోమాంచితమై కళ్ళవెంట నీరు వస్తాయో అప్పుడు మీరు నాకు సర్వం నివేదించినవారు అయ్యారు. దానిని ఆత్మనివేదన అని అంటారు. అందరూ రావణాసురుడు అంటే మీకెందుకు అంత ఇష్టం అని నా అర్ధాంగి పార్వతి, దేవతలు అడుగుతారు. అతను నాకోసం ఏమి చేశాడో తెలుసా? నాకోసం కఠిన తపస్సు చేశాడు. తన పది తలలను నాకు సమర్పించాడు.పిచ్చివాళ్ళు నేను తలలు తీస్తే వచ్చాను అనుకుంటారు, కానీ నేను వచ్చింది అతని ప్రాణాలు సైతం లెక్కచేయకుండా చూపిన నిశ్చల భక్తి కోసం నేను అతని యందు ప్రత్యక్షమయ్యాను. “రావణా, ఏమికావాలి పుత్రా?” అని అడిగాను. నన్ను చూసిన రావణాసురుడు పిల్లవాని వలె మారిపోయాడు. నిశ్చేష్ఠుడై నిలబడ్డాడు. “కనిపించవా మహాదేవా” అని తన్మయత్వం చెందాడు. నన్ను చూసినప్పుడూ అతను పడ్డ ఆనందం ఏమని వర్ణించను. నేను అతని శరీరం తిరిగి అతనికి స్పృజింపజేశాను. “చెప్పు నాయనా ఏమి కావాలి అని అడిగాను. అందుకు అతను “ఎల్లప్పుడూ నీ మీద భక్తి మాత్రమే నిశ్చలంగా ఉండాలి” అని అర్థించాడు. “భక్తి మాత్రమే కావాలి” అని అడిగాను అతని వరం విని నేను తాదాత్మ్యం చెందాను. భక్తి మాత్రమే కావాలా నాయనా అని మరొకసారి అన్నాను. “ హా నీయందు భక్తి చాలు శివయ్యా నీవు నాకు అన్నీ ఇచ్చావు” అని అడిగాడు, అన్నీ తెలిసిన నేను “నీవు సన్మార్గంలో ఉన్నంతవరకూ అది ఉంటుంది రావణా” అని పలికాను. లోతులు తెలియని రావణుడు “అలాగే ప్రభూ! నేనెప్పుడూ న్యాయంగానే ఉంటాను” అని నన్ను చూసిన ఆనందంలో భజన చేయసాగాడు. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు బలం నా భక్తులే కదా! అని రావణుడు నన్ను ఇంకా నా తత్త్వం చెప్పమని ప్రార్థించాడు. నేను రావణా! నేనంటే ఏదో కాదు నేనంటే ఎవరో కాదు. నేనంటే నీవు నీలో ఉన్న నేనే నాకు నేను లాగా కనబడ్డాను. వ్యాకులత కలిగి ఉన్నావు నాకోసం కాబట్టి నాకు నేను కనబడ్డాను. నేను ఒక్కడ్నే అను అనుకోవడమే నాయనా జ్ఞానం నా పట్ల ప్రేమ పెంచుకో అన్నీ అవే వస్తాయి. అని చెప్పాను, నా బిడ్డనైనా తెలియక నన్ను దూషిస్తే నా త్రిశూలం వెళ్ళి తన తలను తీసివేసింది కానీ నా భక్తులను అది నేను ఏమీ చేయలేం రావణా ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ సృష్ఠిలో అన్నిటికన్నాగొప్పదైనా ఆయుధం నా పట్ల మీకున్న భక్తి మాత్రమే. అది ఉన్నంతవరకూ మిమ్మల్ని ఏదీ చేయలేదు. అని రావణుడికి అన్నీ విశదీకరించాను. అలా చాలాసేపు రావణుడు నా పాదాలయందు తలపెట్టి నన్ను ఎన్నో రకాలుగా ప్రార్థించాడు. నా భక్తులు ఆనందపడితే అందరికన్నా ఆనందపడేది నేనే కదా రావణుడు తనకు తోచినవిధంగా కొన్ని సంగీతస్వరాలు నాపై పాడాడు. తనకీ కళ్లవెంట ఆనందభాష్పాలు ఉండడం చేత మధ్యమధ్యలో పాట ఎంతో మధురంగా ఉంది. ఎందుకంటే అది భక్తితో పాడాడు కదా నాకు అవి ఎంతో నచ్చాయి కాబట్టే అతనికీ నామీద స్తోత్రాలు రాసే వరం ప్రసాదించాను. రావణుడు పాడిన స్తోత్రాలు కీర్తనలతో నేను ఎంతో సంతుష్టుడనయ్యాను. రావణుడు ఇంకనూ పారవశ్యస్థితిలోనే ఉన్నాడు. రావణ అని నేను స్పృశించి తట్టి పిలిచాను. “నాయనా! నీవు నాకోసమే కదా తపమొనర్చావు. నేను కనబడి నీతో ఉన్నాను కదా. ఇంకా పారవశ్యస్థితిలోనే ఉన్నావు” అని అన్నాను. “ప్రభూ! మహాదేవా ఎప్పుడూ ఎరగని ఆనందం నామదిలో ప్రస్పుటంగా ఉంది. మీ స్పర్శతో నా దేహం ఆనందగోళంలాగా మారిపోయింది. మిమ్ము సరిగా చూడలేకపోతున్నా ప్రభూ అని అన్నాడు. నేను ఏం అని అడిగాను. ప్రభూ మీరు సాక్షాత్కరించిన మొదలు నా కళ్ళవెంట నీరు వస్తూనే ఉంది. అవి ఆగుటలేదు. భజన చేసిన స్తోత్రం చేసిన కీర్తించిన మోకరిల్లిన ధ్యానించిన నీవు కనబడడం లేదు. ఒక్కనిమిషం కూడా ఒక ఘడియ కూడా నా నేత్రాలలోనుండి అశ్రువులు రావడం మానలేదు. అప్పుడూ మిమ్ము ఎట్లా స్పష్టంగా చూసేది. మహాదేవా అని అన్నాడు. నేను ఎంతో ఆనందపడ్డాను. “ప్రభూ ఒక్కసారి మిమ్మల్ని తాకవచ్చా, మిమ్మల్ని మీ ముఖారవిందమును స్పృశించవచ్చా’ అని అడిగాను. ‘బిడ్డ తండ్రిని తాకవచ్చా?” అని అడగవచ్చా’ అని అన్నాను. అతడు నన్ను ఆశీనుడిని చేశాడు. తన దగ్గర ఉన్న విబూధిని తీసుకొని నాకు రాశాడు. ‘ఆకారం లేని నేను నా భక్తులకోసం ఈ సృష్టికోసం అకారం దాల్చాను. అలాంటి నా ఆకారాన్ని నా భక్తుడు పరికిస్తుంటే నేను సైతం పరవశించాను. రావణూడి తన్మయత్వం తీవ్రస్థితికీ చేరింది. ప్రభూ మనస్పూర్తిగా నిన్ను చూచుటకే ఈ నేత్రములు చాలవు. అలాంటిది నిన్ను పట్టుకొనుట,  శరీరమునకు చందనాది విభూతులతో మిమ్ము కొలుచుట, ఇంతకన్నా నాకు మాటలు రావట్లేదు ప్రభూ” అని మరొకసారి తన ఆనంద భాష్పాలను తుడుచుకున్నాడు. అలా తుడుచుకున్నపుడు తన చేతిలో ఉన్న విభూది రావణుడి కళ్లలో పడింది ‘ప్రభూ’ అని అన్నాడు. (సశేషం...)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top