క్రిస్పీ కట్లెట్స్ - అచ్చంగా తెలుగు

క్రిస్పీ కట్లెట్స్

Share This
క్రిస్పీ కట్లెట్స్
- వడ్లమాని బాలసుందరి
 ( వి.బాలా మూర్తి )
హలో ఫ్రెండ్స్! ప్రతిరోజూ  ప్రతీ గృహిణీ ఎదుర్కొనే సమస్య టిఫిన్ ఏం చెయ్యాలి?. రెండో సమస్య మిగిలిపోయిన వంటకాలు ఏం చెయ్యాలి?  ఈ రెండు సమస్యలకీ కలిపి ఒక ఉపాయం చెబుతాను.  సాధారణం గా కూర గానీ పప్పుగానీ సర్దేసుకుంటాం, కానీ అన్నం కాస్తో కూస్తో మిగిలి పోతుంటుంది. యెంత మైక్రోవేవ్ లో  వేడిచేసుకున్నా, రోజూ తినాలంటే బోర్ కదూ! అందుకే ఇవాళ నేను మిగిలిన అన్నం తో చక్కటి టిఫిన్ చెయ్యడం చెబుతాను చేసి చూస్తారు కదూ.   క్రిస్పీ కట్లెట్స్   రెండు కప్పులు మిగిలిన అన్నం,                రెండు టేబుల్ స్పూన్ల శెనగ పిండి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు,                     రెండు పచ్చి మిరప కాయలు, మూడు వెల్లుల్లి పాయలు,                        చిన్న అల్లం ముక్క, ( ఇష్టం లేనివారు మానెయ్య వచ్చు),           అర కప్పుడు తరిగిన కొత్తిమిరి, ఒకొక్క టీ స్పూన్ కారం, ధనియా పొడి, పంచదార, అర కప్పుడు వేరుసెనగ గింజలు, (అంటే పల్లీలు) తగినంత ఉప్పు చిటికెడు పసుపు,               రెండు టేబుల్ స్పూన్ల నూని, వేయించు కొనేందుకు కొద్దిగా నూని ( షాలో ఫ్రై కి ).   మధ్యాన్నం భోజనాల తరువాత మిగిలిన అన్నాన్నీ ఒక బౌల్ లో వేసి, దాన్లో పెరుగు, శెనగ పిండి, ఉప్పు పసుపు వేసి బాగా చేత్తో పిసికి మూత పెట్టి వదిలేయాలి. రెండు మూడు గంటలు నానితే బాగుంటుంది. టిఫిన్ రెడీ చేసే అరగంట ముందు దాన్ని తెసి బాగా పిసుక్కోవాలి. పల్లీలు, మిర్చి, వెల్లుల్లి కొత్తిమిరి కలిపి ముద్దలా చేసుకోవాలి. దాన్ని, నూనే, కారం, ధనియా పొడి, పంచదారల తో పిండిలో వేసి కలుపు కోవాలి. పల్చగా అనిపిస్తే కొచెం శెనగ పిండి కలుపుకోవచ్చు.  ఇంచుమించు పకోడీ పిండిలా ఉంటుంది. పాన్ వెచ్చ చేసీ కొంచెం నూనె వేసి దాంట్లో, కట్లెట్స్ షేప్ లో చేత్తోతట్టి వేయించు కోవాలి. టమాటో సాస్ గాని గ్రీన్ చట్ని తో గాని సర్వ్ చెయ్యండి. లోపల మెత్తగా పైన క్రిస్పీగా బాగుంటై.  

No comments:

Post a Comment

Pages