నట శిఖరం - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ - అచ్చంగా తెలుగు

నట శిఖరం - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్

Share This
నట శిఖరం
 -  కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్

ఒక రాముడు ఒక కృష్ణుడు ఒక రావణ బ్రహ్మ ఒక ధుర్యోదనుడు ఒక కర్ణుడు ఇలా చెప్పుకుంటూ పోతే.. పౌరాణిక పాత్రలలో జీవించి.. తెలుగువారి కి ఆ పాత్రలు జ్ఞాపకం రాగానే.. గుర్తొచ్చే ఏకైక రూపం ఎన్.టి.ఆర్. 'మా ఎంటోడు'.. ఆహా.. ఎంత కమ్మదనం అ పల్లెటూరి ప్రేమ,ఆప్యాయతల కలగలిపిన పిలుపు..  కాదని అనగలమా?? 'అన్నగారు' అని తెలుగు ప్రజలు అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.ఆర్ అసలు పేరు  నందమూరి తారక రామారావు (1923 మే 28 -1996 జనవరి 18). ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. నటనకే పరిమితమవకుండా ఆయన  పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. ఆయన, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. 
తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేసారు. . 'నర్తనశాల' సినిమా కోసం ఆయన వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు. వృత్తిపట్ల ఆయన నిబద్ధత అటువంటిది.  ఆయన డైలాగులను ముందుగానే కంఠతా పట్టేసేవాడు. అందుకే ఆయన కెమెరా ముందు అంతటి గాంభీర్యాన్ని పలికించేవారు. అందుకే ఎన్.టి.ఆర్ ను విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదుతో పిలుచుకుంటారు ఆయన అభిమానులు. తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో..రామారావు 1982 మార్చి 29న 'తెలుగుదేశం' పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యాన్ని తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు సార్లు.. దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు. 
 అన్న చిన్నతనం..  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు నందమూరి తారకరామారావు 1923, మే 28 వ తేదీన, సాయంత్రం 4:32కి జన్మించాడు. మొదట 'కృష్ణ' అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ సలహా మేరకు తారక రాముడని నామకరణం చేశారు. ఆ తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది. అన్న విద్యాభ్యాసం  ---పెళ్ళి పాఠశాల విద్య -మునిసిపలు హైస్కూలు,  విజయవాడ కళాశాల -   ఎస్.ఆర్.ఆర్. కాలేజీ విజయవాడ ఆ రోజుల్లో ప్రముఖ రచయిత విశ్వనాథ సత్యనారాయణ కళాశాల తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి  ఇష్టపడక పోవటం.. మీసాలతోటే నటించడం వలన ఆయన పాత్రకు "మీసాల నాగమ్మ" అనే పేరు తగిలించారు. 1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకంను పెళ్ళి చేసుకున్నాడు.   పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పాడు. తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ (N.A.T) అనే నాటక సంస్థను స్థాపించి 'పాపం ' వంటి ఎన్నో నాటకాలు ఆడాడు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా.  1947లో రామారావు  పట్టభద్రుడయ్యాడు. తదనంతరం ఆయన మద్రాసు సర్వీసు కమీషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు. రామారావు  కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం పలు కారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్తవయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేసాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. 
 అన్న కు పిల్లలు పదకొండు మంది... తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలొ ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా;  లోకేశ్వరి (గారపాటి),  పురంధరేశ్వరి (దగ్గుబాటి),  భువనేశ్వరి (నారా),  ఉమామహేశ్వరి (కంటమనేని )కుమార్తెలు. 
సినిమా..సినిమా.. ఎన్.టి.ఆర్ తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేసారు. ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. ఆయన నటించిన చిత్ర్రాలు... NTR MOVIES YEAR WISE 1950 లలో షావుకారు(1950), పల్లెటూరి పిల్ల(1950), మాయ రంభ(1950), సంసారం(1950),మాయరంభ(1950) (తమిళము), పాతాళభైరవి(1951), పాతాళభైరవి(1951) (తమిళము), పాతాళభైరవి(1951) (హిందీ). మల్లీశ్వరి(1951). పెళ్ళిచేసిచూడు(1952), దాసి(1952), పల్లెటూరు(1952). కళ్యాణంపన్నిప్పర్(1952) , తమిళము), వెలైకరిమగల్(1952) (తమిళము), అమ్మలక్కలు(1953), మరుముగల్(1953) (తమిళము), , పిచ్చి పుల్లయ్య(1953), చండీరాణి(1953), చండీరాణీ(1953) (తమిళము), చండీరాణీ(1953) (హిందీ), చంద్రహారం(1954), చంద్రహారం(1954) (తమిళము), వద్దంటే డబ్బు(1954), తోడుదొంగలు(1954), రేచుక్క(1954), రాజు పేద(1954), సంఘం(1954), సంఘం(1954) (తమిళము) ,అగ్గిరాముడు(1954) , పరివర్తన(1954), ఇద్దరు పెళ్ళాలు(1954), మిస్సమ్మ(1955) ,విజయగౌరి(1955), చెరపకురా చెడేవు(1955), జయసింహ(1955), కన్యాశుల్కం(1955), సంతోషం(1955), నయాఆద్మి(1956) (హిందీ), తెనాలి . మకృష్ణ(1956), తెనాలి రామకృష్ణన్(1956) (తమిళము), చింతామణి(1956), జయం మనదే(1956) , సొంతవూరు(1956), ఉమాసుందరి(1956), చిరంజీవులు(1956), శ్రీగౌరి మహాత్మ్యం(1956), పెంకి పెళ్ళాం(1956), మర్మవీరన్(1956) (తమిళము), చరణదాసి(1956), భాగ్యరేఖ(1957), మాయాబజార్(1957), మయాబజార్(1957) (తమిళము), వీరకంకణం(1957), సంకల్పం(1957), వినాయకచవితి(1957), భలే అమ్మాయిలు(1957), సతీ అనసూయ(1957), సారంగధర(1957), కుటుంబగౌరవం(1957), పాండురంగ మహత్యం(1957), అన్నాతమ్ముడు(1958), భూకైలాస్(1958), శోభ(1958), రాజనందిని(1958), మంచి , నసుకు మంచి రోజులు(1958), కార్తవరాయని కథ(1958), ఇంటిగుట్టు(1958), సంపూర్ణరామాయణం(1958) (తమిళము), అప్పుచేసి పప్పుకూడు(1959) , రాజసేవై(1959) (తమిళము), రేచుక్క-పగటిచుక్క(1959), శభాష్ రాముడు(1959), దైవబలం(1959), బాలనాగమ్మ(1959), వచ్చిన కోడలు నచ్చింది, 1959), బండరాముడు(1959) 1960 లలో కటేశ్వర మహత్యం(1960), రాజమకుటం(1960), రాజమకుటం(1960) (తమిళము), రాణి రత్నప్రభ(1960), దేవాంతకుడు(1960), విమల(196, దీపావళి(1960), భట్టి విక్రమార్క(1960), కాడెద్దులు ఎకరంనేల(1960), భక్తరఘునాథ్(1960) , గుజరాతి), సీతారామకళ్యాణం(1961), ఇంటికి దీపం ఇల్లాలే(1961), సతీసులోచన(1961), పెండ్లిపిలుపు(1961), శాంత(1961), జగదేకవీరుని కథ(1961), కలసి ఉంటే కలదు సుఖం(1961), టాక్సీరాముడు(1961), గులేబకావళి కథ(1962), గాలిమేడలు(1962), టైగర్ రాముడు(1962), భీష్మ(1962), దక్షయజ్ఞం, 1962), గుండమ్మకథ(1962), మహామంత్రి తిమ్మరుసు(1962), స్వర్ణమంజరి(1962), రక్తసంబంధం(1962), ఆత్మబంధువు(1962), శ్రీకృష్ణార్జున యుద్ధము(1963), ఇరుగు పొరుగు(1963), పెంపుడు కూతురు(1963), వాల్మీకి(1963), సవతి కొడుకు(1963), లవకుశ(1963), లవకుశ(1963) (తమిళము), లవకుశ(1963) (హిందీ), పరువు ప్రతిష్ట(1963), ఆప్తమిత్రులు(1963), బందిపోటు(1963), లక్షాధికారి(1963), తిరుపతమ్మ కథ(1963), నర్తనశాల(1963), మంచి చెడు(1963), కర్ణ(1964), కర్ణన్(1964) (తమిళము), కర్ణ(1964) (హిందీ), గుడిగంటలు(1964), మర్మయోగి(1964), కలవారి కోడలు(1964), దేశద్రోహులు(1964), రాముడు భీముడు(1964), సత్యనారాయణ మహత్యం(1964), అగ్గిపిడుగు(1964), దాగుడుమూతలు(1964), శభాష్ సూరి(1964), బభ్రువాహన(1964), వివాహబంధం(1964), మంచి మనిషి(1964), వారసత్వం(1964), బొబ్బిలి యుద్ధం(1964), భక్తరామదాసు(1964) (తమిళము), భక్తరామదాస్(1964) (గుజరాతి), నాదీ ఆడజన్మే(1965), పాండవవనవాసం(1965), దొరికితే దొంగలు(1965), మంగమ్మ శపధం(1965), సత్య హరిశ్చంద్ర(1965), తోడు నీడ(1965), ప్రమీలార్జునీయం(1965), దేవత(1965), వీరాభిమన్యు(1965), విశాలహృదయాలు(1965), సి.ఐ.డి.(1965), ఆడబ్రతుకు(1965), శ్రీకృష్ణ పాండవీయం(1966), పల్నాటి యుద్ధం(1966), శకుంతల(1966), పరమానందయ్య శిష్యుల కథ(1966), మంగళసూత్రం(1966), అగ్గి బరాటా(1966), సంగీత లక్ష్మి(1966), శ్రీకృష్ణ తులాభారం(1966), పిడుగురాముడు(1966), అడుగు జాడలు(1966), డాక్టర్ ఆనంద్(1966), గోపాలుడు భూపాలుడు, 1967), నిర్దోషి(1967), కంచుకోట(1967), భువనసుందరి కథ(1967), ఉమ్మడికుటుంబం(1967), భామావిజయం(1967), నిండు మనసులు(1967), స్త్రీజన్మ(1967), శ్రీకృష్ణావతారం(1967), పుణ్యవతి(1967), ఆడపడుచు(1967), చిక్కడు దొరకడు(1967), ఉమా చండీ గౌరీ శంకరుల కథ(1968), నిలువు దోపిడి, 1968), తల్లిప్రేమ(1968), తిక్క శంకరయ్య(1968), రాము(1968), కలిసొచ్చిన అదృష్టం(1968), నిన్నే పెళ్ళాడుతా(1968), భాగ్యచక్రం(1968), నేనే మొనగాణ్ణి(1968), బాగ్దాద్ గజదొంగ(1968), నిండు సంసారం(1968), వరకట్నం(1969), కథానాయకుడు(1969), భలే మాష్టారు(1969), గండికోట రహస్యం, 1969), విచిత్ర కుటుంబం(1969), కదలడు వదలడు(1969), నిండు హృదయాలు(1969), భలే తమ్ముడు(1969), అగ్గివీరుడు(1969), మాతృదేవత(1969), ఏకవీర(1969) 1970 లలో తల్లా పెళ్ళామా(1970), లక్ష్మీకటాక్షం(1970), ఆలీబాబా 40 దొంగలు(1970) (200వ సినిమా), పెత్తందార్లు(1970), విజయం మనదే(1970), చిట్టిచెల్లెలు(1970), మాయని మమత(1970), మారిన మనిషి(1970), కోడలు దిద్దిన కాపురం(1970)(ఇది తెలుగు లొ 200వ సినిమా), ఒకే కుటుంబం(1970), తిరుదత్తతిరుడన్(1970) (తమిళము), కన్నన్ వరువన్(1970) (తమిళము), శ్రీకృష్ణ విజయం(1971), నిండు దంపతులు, 1971), రాజకోట రహస్యం(1971), జీవితచక్రం(1971), రైతుబిడ్డ(1971), అదృష్ట జాతకుడు(1971), చిన్ననాటి స్నేహితులు(1971), పవిత్ర హృదయాలు(1971), శ్రీకృష్ణసత్య(1971), శ్రీకృష్ణార్జున యుద్ధం(1972), కులగౌరవం(1972), బడిపంతులు(1972), ఎర్రకోట వీరుడు(1973), డబ్బుకు లోకం దాసోహం(1973), దేశోద్ధారకుడు(1973), ధనమా దైవమా(1973), దేవుడు చేసిన మనుషులు(1973), వాడే వీడు(1973), పల్లెటూరి చిన్నోడు(1974), అమ్మాయి పెళ్ళి(1974), మనుషుల్లో దేవుడు(1974), తాతమ్మకల(1974), నిప్పులాంటి మనిషి(1974), దీక్ష(1974), శ్రీరామాంజనేయ యుద్దం(1975), కథానాయకుని కథ(1975), సంసారం(1975), రాముని మించిన రాముడు(1975), అన్నదమ్ముల అనుబంధం(1975), మాయామశ్చీంద్ర(1975), తీర్పు(1975), ఎదురులేని మనిషి(1975), వేములవాడ భీమ కవి(1976), ఆరాధన(1976), మనుషులంతా ఒక్కటే(1976), మగాడు(1976), నేరం నాదికాదు ఆకలిది(1976), బంగారు మనిషి, 76), మాదైవం(1976), మంచికి మరోపేరు(1976), దానవీరశూరకర్ణ(1977) (250వ చిత్రం), అడవిరాముడు(1977), ఎదురీత(1977), చాణక్య చంద్రగుప్త(1977), మా ఇద్దరి కథ(1977), యమగోల(1977), సతీ సావిత్రి(1978), మేలుకొలుపు(1978), అక్బర్ సలీమ్ అనార్కలి(1978), రామకృష్ణులు(1978), యుగపురుషుడు(1978), రాజపుత్ర రహస్యం(1978), సింహబలుడు(1978), శ్రీరామ పట్టాభిషేకం(1978), సాహసవంతుడు(1978), లాయర్ విశ్వనాథ్(1978), కేడి. నెం. 1(1978), డ్రైవర్ రాముడు(1979), మావారి మంచితనం(1979), శ్రీమద్విరాటపర్వం(1979), వేటగాడు(1979), టైగర్(1979), శ్రీ తిరుపతి , శ్వర , (1979), శృంగారరాముడు(1979), యుగంధర్(1979) 1980 లలో ఛాలెంజ్ రాముడు(1980), సర్కస్ రాముడు(1980), ఆటగాడు(1980), సూపర్ మాన్(1980), రౌడీ రాముడు కొంటె కృష్ణుడు(1980), సర్దార్ పాపారాయుడు(1980), సరదా రాముడు(1980), ప్రేమ సింహాసనం(1981), గజదొంగ, 81), ఎవరు దేవుడు(1981), తిరుగులేని మనిషి(1981), సత్యం శివం(1981), విశ్వరూపం(1981), అగ్గిరవ్వ(1981), కొండవీటి సింహం(1982), మహా పురుషుడు(1981), అనురాగదేవత(1982), కలియుగ రాముడు(1982), జస్టిస్ చౌదరి(1982), బొబ్బిలిపులి(1982), వయ్యారిభామలు వగలమారిభర్తలు(1982), నాదేశం(1982), సింహం నవ్వింది(1983), చండశాసనుడు(1983), శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర(1983), 1990 లలో బ్రహ్మర్షి విశ్వామిత్ర(1991) (ఇది 300వ సినిమా), సామ్రాట్ అశోక్(1992), మేజర్ చంద్రకాంత్(1993), శ్రీనాథ కవిసార్వభౌమ(1993), దర్శకునిగా ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన ' సీతారామ కళ్యాణం'. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని "నేషనల్ ఆర్టు ప్రొడక్షన్సు" పతాకంపై విడుదల చేసాడు. 1977లో విడుదలైన 'దాన వీర శూర కర్ణ'లో ఆయన మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా , త్వం చేసాడు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించాడు. అంతే కాక ఆయన దర్శకత్వం లో .. గులేబకావళి కథ (1962), శ్రీకృష్ణ పాండవీయం (1966), వరకట్నం (1969), తల్లా పెళ్ళామా (1970), తాతమ్మకల (1974), దానవీరశూరకర్ణ (1977), చాణక్య చంద్రగుప్త (1977), అక్బర్ సలీమ్ అనార్కలి (1978), శ్రీరామ పట్టాభిషేకం (1978), శ్రీమద్విరాటపర్వం (1979), శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం (1979), చండశాసనుడు (1983), శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర (1984), బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991), సామ్రాట్ అశోక్(1992) నిర్మాతగా సామ్రాట్ అశోక్ (1992)]], శ్రీనాథ కవిసార్వభౌమ (1993)]], దానవీరశూరకర్ణ(1977)]], శ్రీమద్విరాటపర్వం(1979), శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం(1979),చండశాసనుడు(1983), శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర(1984), బ్రహ్మర్షి విశ్వామిత్ర(1991) రచయితగా బిదాయి(1974) (హిందీ), , , ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోల గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. 1991 ఎన్నికల ప్రచారం కోసం ఆయన నటించి, దర్శకత్వం వహించిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర(1991)  లో విడుదలైంది. 
 తెలుగు ప్రజల ఆత్మాగౌరవం కోసం తపన - రాజకీయ ప్రవేశం 1978లో ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన కాంగ్రేసు పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో శాసనసభ్యులచేత నామకార్థం ఎన్నిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలయింది. 1982 మార్చి 29 సాయంత్రము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించాడు ఎన్.టి.ఆర్. తన పార్టీ పేరు 'తెలుగుదేశం'గా నిర్ణయించి, ప్రకటించాడు. పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు. దానిపై నుండే ఆయన తన ప్రసంగాలు చేసేవాడు. దానిని ఆయన "చైతన్యరథం" అని ప్రజలను చైతన్య పరిచే రధచక్రాల్ అనే విధంగా నామకరణం చేశారు.. ఆ రథంపై "తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!" అనే నినాదం మ్రోగించారు. ప్రజలు ఆయన నినాదం పట్ల ఆకర్షితులయ్యారు.  ఎన్నో రథాలకు ఈ 'చైతన్యరథమే' స్ఫూర్తి. తన పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణ రధ సారధిగా ఎన్టీఆర్ ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్యరథంపై ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించాడు. 
చైతన్యరథమే ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసాడు. కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసిన ప్రచార ప్రభంజనమది. గతంలో ఎన్నడూ ఏ నాయకుడు తిరగనంత దూరం ఆంధ్రప్రదేశ్ లో తిరిగారు ఎన్.టి.ఆర్. 97 ఎళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ 1983 లో జరిగిన ప్రతిష్టాత్మక 9 నెలల క్రితం పురుడుపోసుకున్న ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. తెలుగుదేశం 199 సీట్లు గెలుచుకొని డంకా భజాయించి ఎన్.టీ.ఆర్ ను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టారు తెలుగు ప్రజలు. ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. 1984లో సినిమారంగంలో "స్లాబ్ విధానము"ను అమలుపరిచాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ.. గంభీరంగా ఉండేవారు ఎన్.టి.ఆర్ . 1970లలో ఎదుర్కొన్న చిన్నపాటి ఒడిదొడుకులు తప్పించి, ఎన్టీఆర్ సినిమా జీవితం విజయవంతంగా, అప్రతిహతంగా సాగిపోయింది. 
అయితే ఆయన రాజకీయ జీవితం అలా - నల్లేరుపై నడకలా సాగలేదు. అద్భుతమైన విజయాలకూ, అవమానకరమైన అపజయాలకూ మధ్య తూగుటూయలలా సాగింది.  శాసనసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ ఏస్థాయిలో ఉండేదంటే - ఈ కాలంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులను 9 సార్లు సభనుండి బహిష్కరించారు. ఈ కాలంలో నాలుగు సినిమాలలో నటించాడు కూడా. తన జీవితకథ రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 సెప్టెంబర్‌లో పెళ్ళి చేసుకున్నాడు. రామారావు వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మలుపు. ఆయన వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులతో ఆయన సంబంధాలపై ఈ పెళ్ళి కారణంగా నీడలు కమ్ముకున్నట్లు కనిపించాయి. 1994లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మధ్య నిషేధం, వంటి హామీలతో, మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. 
ప్రభుత్వ ఖజానాకు ఎంత భారంపడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచాడు. అయితే ఆయన రెండవ భార్య లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగజేసుకోవటం వలన ఆయన చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చింది. పార్టీలో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు. పార్టీలో ముదిరిన సంక్షోభానికి పరాకాష్టగా ఆయన అల్లుడు, ఆనాటి మంత్రీ అయిన నారా చంద్రబాబునాయుడు తిరుగుబాటు చేసాడు. అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. అనతికాలంలోనే, 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించాడు. ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1996 లో నెలకొల్పింది. 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తరువాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా 2006 జనవరి 18 న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన తెలుగు నట దిగ్గజం ఆయన తెలుగు వాచక గాంభీర్యం ఆయన తెలుగు ఆత్మగౌరవ నినాదం ఆయన  తెలుగు సినీ లోకంలో ఎవరెస్టు శిఖరం తెలుగు మనసుల నిండిన ఏకైక రూపం..ఆయనే ఎన్.టి.ఆర్ ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు.   (  సమాచారం.. అంతర్జాలం)

No comments:

Post a Comment

Pages