చిటికెలో వంట - అచ్చంగా తెలుగు

చిటికెలో వంట

Share This

                                                                                           "చిటికెలో వంట.."

భావరాజు పద్మిని.

నాకు పది నిముషాలు మాత్రమే సమయం ఉందని అనుకుందాం... అప్పుడు నేను ఏమి చేస్తానంటే... పెసరకట్టు : అన్నం కుక్కర్ లోనే కాస్తంత పెసరపప్పు నీళ్ళు పోసి పెట్టాలి. కుక్కర్ మూత రాగానే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కర్వేపాకు పోపు వేసి, ఉప్పు కలిపేస్తే సరిపోతుంది. మంచి చలవ చేసే పెసరకట్టుకు సరైన కాంబినేషన్ 'మెంతికాయ, మాగాయ, లేక ఆవకాయ...'. మాగాయ పప్పు : కుక్కర్ లో కందిపప్పు పెట్టాలి. పప్పు పోపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కర్వేపాకు వేసి, అందులో కాస్త మాగాయ పచ్చడి వేసి, పప్పు వేసి కలిపెయ్యాలి. ఇది మామిడికాయ పప్పు లాగా ఉంటుందండోయ్... కారెట్ కూర : కారెట్ సాధారణంగా ఉడకడానికి సమయం తీసుకుంటుంది. అయితే, కారెట్ తురిమి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, రెండు ఎండు మిర్చి, కర్వేపాకు వేసిన పోపులో వేసి, చివరగా ఉప్పు కలిపి, తీసేస్తే ఆ రుచి అద్భుతః. ఈ కూరకు ఐదు నిముషాల కంటే ఎక్కువ సేపు పట్టదోచ్... ప్రయత్నించండి...

carot

 *******************************************************************************************************************************************************
వసంత శ్రీ కేప్సికం కూర కేప్సికంతొందరగా ఉడికిపోతుంది.ఇట్టే చేసెయ్యొచ్చు.ముందు ఉల్లి,,కేప్సికం,టొమేటొ ముక్కలు రెడీ చేసి ఉంచుకోవాలి. మూకుట్లో నూనె వేసి కొద్దిగ ఆవాలు,జీలకర్ర కర్వేపాకు వేసి వేగాక- ఉల్లిముక్కలు,కేప్సికం,టొమేటొ ముక్కలూ వేసి ఉప్పు,కారం కలిపినీళ్ళు జల్లి మూత పెట్టి,ఉడికాక కొద్దిగా గరం మసాల జల్లి దింపేయ్యొచ్చు.ఇది చపాతి తో బాగుంటుంది.

 capsicum

 ఇడ్లీలు మిగిలితే-అదీ స్నాక్ లా చెయ్యొచ్చు. ఉప్మా కి వేసినట్టే పోపు వేసి, ఇడ్లీలను చిదిమి,కలిపి మూత పెడితే కొత్త టిఫిం రెడీ. పచ్చడో,ఆవకాయ తోనో తినొచ్చు..  
వసంతశ్రీ పిల్లలు స్కూల్ నుంచీ వచ్చాక ఆటలకి,ట్యూషంస్కీ వెళ్తారు కదా!! కాస్త హెవీగానూ,హెల్దీ గా ఉండలంటే.. రెడీగా అన్నం ఉన్నా,లేదా వండినా సరే.. మూకుట్లో కాస్త నూనె వేసి, ఉల్లి ముక్కలు కొద్దిగా వేగాక,కేరట్ ముక్కలూ, ఉడికించిన బఠాణీ వేపి ఆపై అన్నాన్ని వేసి,ఉప్పు,కారం కొద్దిగా గరం మసాలా వేస్తే ... ఇంకా శెనగ పలుకులూ,జీడిపప్పు వేపి కలపచ్చు కూడా.. పిల్లలు ఇష్టం గా తింటారు.మనకీ వాళ్ళకి మంచి ఫుడ్ ఇచ్చామని ఆనందం .ఇంక జంక్ ఫుడ్స్ జోలికీ పోరు కదా!!.   వసంత శ్రీ మామిడికాయ,కొబ్బరి పచ్చడి మామిడికాయ,కొబ్బరి ముక్కలు చేసి, మిక్సీ లో ముక్క లు వేసి,ఉప్పు,పచ్చి మిర్చి వేసి. ఒక్కసారితిప్పి,పోపుకలిపి ఒక్కసారితిప్పితే చట్నీ రెడీ పోపుకి- మూకుట్లో కొద్దిగా నూనె వేసి,వేడయ్యాక -ఆవాలు,సెనగపప్పు,మినపప్పు,ఎండుమిర్చి,కర్వేపాకు,ఇంగువ. ఇంకా మెంతి వాసన ఇష్టం ఉ్న్నవాళ్ళు మెంతుల పొడి కూడా కలప వచ్చు . చూసారా ఎంత సింపులో..
 
*************************************************************************************************************************************************************** గోపీనాథ్ పిన్నలి
చిటికెలో వంట... ................ చక్కగా నల్లగా నిగనిగలాడే వంకాయలు తెచ్చుకుని స్టవ్వుపై బాగా కాల్చాలి. తర్వాత కంచం పెట్టుకునే ముందు వాటి తోలు తీసేసి అన్నం లో పడేసుకుని పిసుక్కుంటూ, పచ్చిమిర్చి, ఉప్పూ కలుపుకుని తింటే వోహ్ .. పచ్చి వంకాయ పచ్చడి ...( నాటె జోక్...నేను చాలా సార్లు తిన్నా.) సమయం ఉన్నవారు కాస్త పోపు, వేయించిన ఉల్లిపాయలు వేసుకుని తింటే బాగుంటుంది.

vankaya

  *************************************************************************************************************************************************************
గీత కురుగంటి చిటికెలో వంట ************* బాణాలి లో కొంచెం నూనె వేసి పల్లీలు మినప్పప్పు ఆవాలు వేసి సన్న గా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించి అందులో మరమరాలని (నీళ్ళ లో తడిపి పిండి )వేసి కొంచెం జీలకర్ర పచ్చి మిర్చి పేస్ట్ తగినంత ఉప్పు కలిపితే.....2ని॥లో ఘుమ ఘుమ లాడే స్నాక్స్ రడీ!
 
గీత కురుగంటి చిటికెలో వంట ************ రెండు కాప్సికమ్ చిన్న ముక్కలు గా కట్ చేసి కాస్త క్యారెట్ తురుము కొంచెంగా అల్లం పచ్చి మిర్చి ముద్ద ...గిన్నెలో బియ్యం కడిగి నీళ్లు పోసి కాసిని క్యాప్సికమ్ ముక్కలు క్యారట్ తురుము అల్లం పచ్చి మిర్చి ముద్ద ఉప్పు వేసి బాగా కలిపి కుక్కర్లో పెట్టాలి ...10 ని॥లలో వేడి వేడి గా తినొచ్చు!
పెరుగులో ఉల్లి పాయలు కొత్తిమీర ఉప్పు కలిపి దీనికి చట్ని గా బాగుంటుంది. **************************************************************************************************************************************************************
కళ్యాణి గౌరీ కాశీభొట్ల // చిటికెలో వంట // రోటీ తడ్కా..
ముందు రోజు చేసిన రోటీలు మిగిలిపోతే వాటిని చిన్నచిన్న ముక్కలుగా తుంపుకోవాలి. పోపులోకి ఉప్మా లాగ ఉల్లి ముక్కలు,టమాట ముక్కలు పచ్చ్చి మిర్చి తరిగిపెట్టుకోవాలి మూకుడులో నూనె వేసుకుని అందులో కొద్దిగా ఆవాలూ,జీలకర్ర వేసుకుని.అవివేగాక,అందులో మిరపముక్కలు,ఉల్లి ముక్కలూ,.టమాటా ముక్కలు కరిపేప ఆకు వేసుకుని,సన్నటి మంటమీదవేగ నిచ్చి.చివరిగా తుంపుకున్న రోటీ ముక్కలువేసుకోవాలి..కొద్దిగా నీళ్ళు జల్లి చిటికెడు పంచదార,కాస్త ఉప్పు తగిలిస్తే మంచి ఇన్స్టెంట్..స్నాక్ రెడీ.....కావాలంటే.కొత్తిమిరి,జీడిపప్పు,వేరు శనగ గుళ్ళు... మన ఇష్టం...  
 

No comments:

Post a Comment

Pages