ఉగాది....
- నాగజ్యోతి సుసర్ల


మల్లెలు పూసే వేళ, మావిళ్ళు కాసే వేళ
మత్తెక్కిన కోయిలలే తియ్యగా పాడేవేళ
మమతల మలయానిలం వీచే వేళ
మధురోహలనే తెస్తుందోయ్ ఉగాది హేల...

రాధమ్మ దోసిట్లో నక్షత్రాలూ
మన ఇంటి ముంగిట్లో వేప ఫూలూ
కృష్ణయ్య గానములా అతి మధురాలూ
చిగురాకుల ఊయలలో వసంత గీతాలు

వాసంత లక్ష్మీ అందెలనాదాలూ
దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు
కన్నె పిల్ల ఎద దాచిన సుమభావాలు
చైత్రమే తెచ్చునులే సుముహుర్తాలూ

ఏపుగా కనిపించే ఆ చెరుకు గడలు
తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పూ,
వగరులు కలగలుపుతు చేసే ఉగాది పచ్చడీ
జగమునంతా నింపు కదా నవ జీవన సందడీ

చిన్నారి పాపలు చిగురంత ఆశలు
పట్టుపరికిణీలో తెలుగింటి కళకళలు
విలసిల్లుతు కనిపించే పండుగ రోజూ
తల్లితండ్రుల కదే కదా ఉగాది రోజు.

***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top