సరస్వతి ప్రార్థన - అచ్చంగా తెలుగు

సరస్వతి ప్రార్థన

Share This
 సరస్వతి ప్రార్థన
చెరుకు రామ్మోహన్రావు



ఏ దేవి సకల కవీంద్ర జిహ్వా పుండ
రీక నివాస మంగీకరించు
ఏ దేవి జడ పైన ఎనలేని రత్నమై
ఒదుగు చంద్రుండెంతొ ఉజ్వలముగ
ఏ దేవి గళసీమ నింపునింపెడు హీర
నీహార హారాల నిండుకాంతి
ఏ దేవి ఎకిరింత ఎన్న రాయంచయై
శ్వేతపద్మాసన సేవ కొదుగు
హస్తముల కీర పుస్తక అక్షమాల
వీణ కల్గిన ఏ దేవి విధికి సుదతి
అట్టి తల్లిని తిరముగానాత్మ దలచి
వేడుకొందుము శుభముల వెల్లువలకు.

భావం :
ఏ తల్లి కవీశ్వరుల నాలుకలు అను, పుండరీకములు అంటే, ఎర్రతామరల పైన నివసిస్తుందో,ఏ తల్లి సిగపువ్వుగా జడలో నెలవంక విలసిల్లుతుందో , ఏ దేవి కంఠహారమై మంచు ముత్యాల సరాలు కాంతిని వెదజల్లుతాయో, ఏ దేవి వాహనము రాజహంసయై ఉంటుందో , ఏ దేవి చేతులలో చిలుక, పుస్తకము, అక్షమాల, కలిగియుంటుందో, ఏ దేవి బ్రహ్మదేవుని భార్యయో ఆ తల్లిని మనసులో తలచి మాకు (మనకు) శుభముల వెల్లువ ప్రసాదించ వలసినడిగా ప్రార్థించుచున్నాము.

No comments:

Post a Comment

Pages