దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో... - అచ్చంగా తెలుగు

దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో...

Share This

"దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో..."
యుగయుగాలుగా ఎంతో మంది అవతార పురుషులు, అవధూతలు పుట్టి, సంచరించిన పుణ్య భూమి మనది. లోకకళ్యాణం, సజ్జన సంరక్షణ వీరి అవతార పరమార్ధం. అలా అవతరించి, ఇప్పటివరకు 102 యజ్ఞాలు చేసిన సాక్షాత్ దత్త స్వరూపులు శ్రీ వి.వి. శ్రీధర్ గురుజి. ప్రతీ నెలా వారి బోధలు 'శ్రీధర మాధురి' లో మీ కోసం.....
ముందుగా సుదర్శన ధ్యానంతో మొదలుపెడదాం.
సుదర్శన ధ్యానం 
సుదర్శన మహాజ్వాలా కోటి సూర్య సమప్రభ |
అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్ మార్గ ప్రదర్శయ ||
సుదర్శన... సుదర్శన చక్రం మనకు మంచి దృష్టి కలిగేలా దీవిస్తుంది... మంచి అంతర్దృష్టి... ఆయన దీవెనలతో మనం ఏది చూసినా ఎల్లప్పుడూ అందంగా అనిపిస్తుంది... అది మనసుకు ఎంతో ప్రసన్నతను కలిగిస్తుంది. సుదర్శన చక్రం యొక్క ప్రకాశం చాలా శక్తివంతమైనది, కోటి సూర్యులకు సమానమైనది. ఆ తేజస్సు స్థాయి ఎటువంటిదంటే... అత్యంత సూక్ష్మమైన అందం... ఆ ప్రకాశం యొక్క సౌందర్యాన్ని మరే ఇతర మాధ్యమంతోనూ పోల్చలేము. ఈ ప్రకాశం మన మనసుల్లోని అజ్ఞానాన్ని తొలగించాలి. ఈ ప్రకాశం మనకు  'అన్ని చోట్లా దైవాన్ని చూడడం' అనే ఉత్తమమైన విశ్వ అస్తిత్వం దిశగా మార్గదర్శకత్వం చెయ్యాలి…. దేనిలోనైనా మరియు ఎక్కడైనా దైవాన్ని చూడడం... 'విష్ణు' అనే పదానికి అర్ధం సర్వవ్యాపి అని... దైవం సూక్ష్మ స్థాయి మరియు స్థూల స్థాయి రెండిటిలోనూ ఉన్నారు. కాబట్టి సుదర్శన చక్రం యొక్క ప్రకాశం మన అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి, అన్నింటా దైవాన్ని చూసే జ్ఞానాన్ని ఇవ్వాలి.
దాతృత్వం గురించి గురుజి మాటలు 
గొప్ప ధనవంతుడైన ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి ఇలా అడిగాడు...
అతను: గురూజీ, నేను ఒక వెయ్యి మందికి సరిపడా వృద్ధాశ్రమం కట్టి, అన్ని వసతులూ ఉచితంగా కల్పించాలని అనుకుంటున్నాను... నేనొక వెయ్యి మంది అనాధలకు అనాధాశ్రమం కట్టాలని అనుకుంటున్నాను...  ఏమైనా సలహాలు ఇస్తారా గురూజీ ?
నేను: సరే, నేనొక సలహా చెప్తాను. మీ బంగళాలో ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు ?
అతను: తోటమాలి, ఇద్దరు సెక్యురిటి వాళ్ళతో కలిపి మొత్తం పదిహేడు మంది.
నేను: అలాగా... అయితే ప్రతీ రోజు ఉదయం, నువ్వు కాఫీ త్రాగే ముందు వీళ్ళందరికీ మొదట తీసిన డికాషన్ తో కాఫీ ఇవ్వు. నువ్వు తినే ముందు ఈ పదిహేడు మందికి వేడి వేడి భోజనం పెట్టు. వాళ్లకు వేసుకునేందుకు మంచి బట్టలు ఇవ్వు, మరియు వాళ్ళు చేసే పనుల్లో సహాయపడు. ఒక సంవత్సరం పాటు ఇలా చేసి, మళ్ళీ నా వద్దకు రా. తరువాత ఎలా చెయ్యాలో చెప్తాను.
పెద్ద జోక్ ఏమిటంటే, ఇది చెప్పి ఇప్పటికి ఏడేళ్ళు అయ్యింది. అతను నా వద్దకు తిరిగి రాలేదు. చాలా సంతోషం... మరొక్క వికెట్ పడింది...  హ హ .
ఔదార్యం కల హృదయం, వాత్సల్యంతో నిండిన పలుకులు, ప్రేమ మరియు దయతో గడిపే నిండు జీవితం... అటువంటివారే  నాకు దైవ స్వరూపులు.
దాతృత్వం కలిగి ఉండండి. ఉదార గుణం జీవితపు ప్రాధమిక పునాదుల్లో ఒకటి. నేను దాతృత్వం అనగానే, అంతా నేను డబ్బును ఉద్దేశించి చెబుతున్నానని అనుకుంటారు. కాదు, డబ్బు కేవలం ఒక భాగం మాత్రమే. కొంతమంది గురించి శ్రద్ధ వహించేందుకు, వారికి ప్రేమను పంచేందుకు ఎవరూ ఉండరు. ఉదారంగా వారికవి ఇవ్వండి. ఒకరికి మరొకరికి సహాయం చేసే సమయం లేదు, అది మీ వద్ద ఉంటే, ఆ వ్యక్తికి ఉదారంగా సాయం చెయ్యండి. మీరు ఉదారులు అవుతున్న కొద్దీ, మీ  జన్యువులు దాతృత్వంతో చైతన్యవంతం అవుతాయి. నిజానికి దీన్ని ప్రతీ వ్యక్తి గ్రహించి ఆచరించినప్పుడు మొత్తం సమాజం ఉదారంగా అయ్యి, అదే వారసత్వంగా అందించబడుతుంది... అంతా దైవానుగ్రహం మరియు దయ.
ఇతరుల్ని అర్ధంచేసుకోండి, ఔదార్యాన్ని కలిగి ఉండండి. ఏ చిన్న అవకాశం దొరికినా ఇతరులకు సహాయపడండి.
మీరు మీ సమయం, మనసు, శ్రద్ధ మరియు డబ్బు విషయంలో ఉదారంగా ఎందుకు ఉండకూడదు? అటువంటి ఉపకారగుణం వల్ల మీరు ప్రశాంతతను, ఆనందాన్ని అనుభవిస్తారు.
మీరు చచ్చే ముందు వరకు దానం చేసేందుకు వేచి ఉండకండి. మరణ సమయంలో మీరెన్ని దానాలు చేసినా, స్వర్గానికి వీసా దొరికే గారెంటీ ఇవ్వవు. కాబట్టి, మీరు జీవిస్తూ ఉండగానే దానం చెయ్యండి.
మనమంతా అనుకున్నది జరిగాకా ఇస్తామని ప్రమాణాలు చెయ్యడంలో దిట్టలం. మేము వ్యాపారంలో సంపాదిస్తే దానం చేస్తాము... ఇలా అనుకుంటాము. దానం చెయ్యడం అనేది హృదయానికి సంబంధించింది, దానికి మీరు వ్యాపారంలో పొందే లాభంతో సంబంధం లేదు . జీవితంలో, దైవం ఇప్పటికే మనకు ఇచ్చిన వాటన్నిటికీ అనుగుణంగా దానం చేస్తున్నామా, అనేది అందరూ ఆలోచించాలి.
మీరు కోపాన్ని వాయిదా వెయ్యటాన్నిఇష్టపడాలి... అహాన్ని వాయిదా వెయ్యటం ఇష్టపడాలి... స్వార్ధాన్ని వాయిదా వెయ్యటం ఇష్టపడాలి... అసూయను వాయిదా వెయ్యటం ఇష్టపడాలి ... కాని ఇవన్నీ ఒక్కొక్కటిగా మరియు తక్షణమే జరుగుతాయి. ఇక్కడ మూర్ఖత్వం ఏమిటంటే నేర్పుగా మనం నిత్యం జీవిస్తామని అనుభూతి చెందుతాం. కాబట్టి పూజలు, ధ్యానం వేచి ఉండగలవు. వీటిని వాయిదా వెయ్యచ్చు. అంతా వాయిదా వేసేందుకు ఇష్టపడే అంశం దైవం. ఇవాళ కాదు, ఇప్పుడు కాదు, మరెప్పుడైనా చూద్దాం. జీవితం అశాశ్వతం మరియు క్షణికం. కోపాన్ని, గర్వాన్ని, అహాన్ని, స్వార్ధాన్ని, లోభాన్ని, మోహాన్ని వాయిదా వెయ్యండి... దైవాన్ని వాయిదా వెయ్యకండి. ప్రార్ధనలను వాయిదా వెయ్యకండి, ధ్యానాన్ని వాయిదా వెయ్యకండి.... దానాన్ని వాయిదా వెయ్యకండి.

No comments:

Post a Comment

Pages