“బి.వి.మల్లిక్” హాస్యనందనం - అచ్చంగా తెలుగు

“బి.వి.మల్లిక్” హాస్యనందనం

Share This
“బి.వి.మల్లిక్” హాస్యనందనం  



జిడ్డు జోగినాధం ఒక బేకరీ లోకి వెళ్లి ఆ షాప్ యజమానితో... “బ్రిటానియా బిస్కెట్లు ఉన్నాయా? ప్యాకెట్ యెంత ?” “పది రూపాయలండి. ఇమ్మంటారా?” “వద్దులే. ఆరంజ్ క్రీం బిస్కెట్లు ఉన్నాయా? చిన్న ప్యాకెట్ యెంత ?” “పదిహేను రూపయలండి. కావాలా?” “వద్దు. ఓరియో బిస్కెట్లు ఉన్నాయా? పెద్ద ప్యాకెట్ యెంత ?” “ఇరవై రూపాయలండి. ఇవ్వనా?” “వద్దులే. కుక్క బిస్కెట్లు ఉన్నాయా? కిలో యెంత ?” “ఇక్కడే తింటారా? ఇంటికి పట్టికెళ్ళి తింటారా?”
“ఆ !”
****
“ఒరేయ్ రమణా ! అర్జెంటుగా అయిదొందలు కావాలి. నా పర్సు ఇంట్లో మర్చిపోయాను. వెంటనే ఇయ్యి, చాలా అవసరం !” అడిగాడు అప్పారావు. “అయ్యో పాపం ! స్నేహితుడిగా నీకు తప్పక సాయం చేస్తాను. ఇంద, ఈ పది రూపాయిలు తీసుకుని, సిటీ బస్సు ఎక్కి, ఇంటికెళ్ళి పర్సు తెచ్చుకో!”
“ఆ !”
****
ఘటికారావు తన గడియారాన్ని వాచ్ బాగు చేసే అతనికి ఇస్తూ,” చూడండి, నా వాచ్ పని చెయ్యట్లేదు. పొరపాటున అది క్రింద పడిపోయింది ,” అన్నాడు.
అతను వాచ్ పరిశీలించి, “అదేమీ పెద్ద పొరపాటు కాదులెండి, కాని క్రింద పడేసిన దాన్ని పైకి తీసి తేవడమే పెద్ద పొరపాటు అయ్యింది .” అన్నాడు.
“చల్లటి గాలి చాలా శ్రేష్టం. మందులేవీ అక్కర్లేదు.అన్ని జబ్బులూ పోతాయి. రాత్రిళ్ళు తలుపులూ, కిటికీలు తీసి పడుకోమని సలహా ఇచ్చాను. పాటిస్తున్నవా ?” అని అడిగాడు డాక్టర్ శతభిషం. “పాటించానండి. జబ్బులతో పాటు ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిజ్, సోఫా, డబ్బు, అన్నీ పోయాయి. అందుకే ఇలా వచ్చా,” అన్నాడు పేషెంట్ కొరకొరా చూస్తూ.
****

No comments:

Post a Comment

Pages