శివం-142
శివుడే చెబుతున్న కథలు
రాజ కార్తీక్
(కార్తికేయుడు ధ్యాన స్థితిలో నిమగ్నమై చంద్రశేఖర ప్రభు మరియు అతని తల్లి కథ చెబుతూ ఉండగా, చివరికి వచ్చిన కథ విన్న త్రిమూర్తులు త్రిమాతలు, ఇక ఆ కథ అయిపోగొట్టి తమని దర్శకత్వం వహించవలసిందిగా కోరుకున్నారు)
నేను అనగా శివుడు
పార్వతీ మాత "మహాదేవుల వారు ఆదిభిక్షువు కదా అదే నేను చలో క్తి గా చెప్పాను దానికి నన్ను మహాదేవులు వారు అంతలా గొడవ పడుతున్న అని తమ భక్తుడితో అనాలా అన్నది నవ్వుతూ
విష్ణు దేవుడు " ఇక మీ సరదా సంభాషణలు అయిపోతే మిగతా కథ కూడా చెప్పించుకుందాం "
బ్రహ్మదేవుడు " విష్ణు దేవా తమ సోదరిని ఎవ్వరూ కించెత్తు ఒక్క మాట అన్నా కూడా ఒప్పుకోరుసుమి"
నేను " మరి ఏమనుకున్నారు నారాయణుడు నారాయణి జగతికే ఆదర్శం ,"
సరస్వతీ మాత " సరే కార్తికేయ ఇక చంద్రశేఖర ప్రభు కథ ముగించు "
కథలో మిగిలిన భాగాన్ని కొనసాగిస్తున్నాడు కార్తికేయుడు
{
శివుడు " తల్లి ఎంత బాగా వంట చేస్తున్నావు సువాసన ఎంత బాగా నచ్చింది నాకు తినకముందే "
తల్లి " మహాదేవ తమరు అలా మాట్లాడుతుంటేనే నా మనసు ఆనంద డోలికలలో ఊగిసలాడుతున్నది, తమరికి ఎంతో గానో ప్రతి విషయం నచ్చాలని మరింత శ్రద్ధగా నేను సిద్ధం చేస్తున్నాను"
కు "అమ్మ మహాదేవులు వారు ఈ విందుని ఎప్పటికీ మర్చిపోకూడదు.. కుండన్న విందు అని అందరూ నైవేద్యాలు పెట్టాలి"
శివుడు " ఇక కుండన్న చంద్రశేఖర ప్రభుగా పిలవబడతాడు"
తల్లి " పసిపిల్లలకి పేరు పెట్టి మూడుసార్లు చెవి దగ్గర పలికినట్టు తమరు కూడా మూడుమార్లు చంద్రశేఖర ప్రభు చంద్రశేఖర ప్రభు చంద్రశేఖర ప్రభు అని ఒకసారి వాడిని పిలవండి మహాదేవ "
శివుడు" చంద్రశేఖర ప్రభు చంద్రశేఖర ప్రభు చంద్రశేఖర ప్రభు "
చంద్ర "ఎంతో ధన్యుణ్ణి స్వామి అంటూ తన చేతులు తో వేడుకొని పరవశమైన స్థితిలో ఉన్నాడు.. నా నామకరణం రోజు నాకు ఏ పేరు పెట్టారో మళ్లీ తమరి నోటి వెంట అది అలా వినిపించుకోవడం
నాకు అత్యంత ఆనందంగా అదృష్టంగా ఉన్నది ప్రభు"
శివుడు " నా స్నేహితుడికి ఇలా జరగడం నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది "
చంద్ర " అమ్మ వంట సిద్ధమైనదా"
తల్లి " అయిపోవచ్చింది నాయన మరి కొద్దిసేపట్లో నీకు మహాదేవుడికి వడ్డిస్తాను "
శివుడు" చంద్రశేఖర చిన్నతనం నుంచి నీకు ఎప్పుడు ఎవరు ఇలా అడిగింది, వంట చేసి పెట్టలేదు కాదు, ఇప్పుడు నీ తల్లి నీకు అన్నం వండి పెడుతుంటే నీ మనసుకి ఎంతో ఆనందంగా ఉంది కదు, నిన్ను పెంచిన పెద్దాయన కూడా ఆయనతోపాటు వండుకొని నీకు పెట్టేవాడు. నీకు ఇలా రుచికరమైన భోజనం ఇక మీద ఎల్లప్పుడూ దొరుకుతూ ఉంటుంది,"
చంద్రశేఖర ప్రభు మాత్రం శివుడి చేతిలో పట్టుకొని
" శివయ్య నువ్వలా నాతో మాట్లాడుతుంటే నా మనసు పలికించిపోతున్నది.. ఎన్ని జన్మల పాపాలు చేసిన ఈ ఒక్క పుణ్యంతో నేను నీ స్నేహితుడైన గర్వంతో జీవితాంతం జీవితం తర్వాత కూడా చాలా ఆనందంగా బతుకుతాను, బోలా శంకరుడు అంటే నేను ఇప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. కానీ నీవు అడగకుండానే నా తల్లిని నాకు ఇచ్చావు , నేను నిన్ను ఏమని పొగడను.. ఏమని స్తోత్రం చేయను , ఈ మట్టి కుండలు పిసుకునే ఈ బండ చేతులతో నీకు కేవలం స్నానం అనే పేరుతో ప్రత్యక్ష అభిషేకం చేసిన పుణ్యాత్ముడు ధన్యాత్ముడను నేను. తమను ప్రసన్నం చేసుకోవడానికి మాహన్యాస రుద్రాభిషేకాలు, మంత్రపుష్పాలు, మరి ఏ క్రతువు అవసరం లేదు, నిశ్చలంగా నిన్ను నమ్మితే చాలు, ఈ జన్మ పూర్వజన్మ వచ్చే జన్మము జన్మజన్మలకి నీ దగ్గరికి చేర్చుకుంటూ నీలో కలిపేసే గొప్పగూడాన్ని ప్రసాదించగల ఎవరికి అంతుపట్టని గొప్ప దేవుడివయ్యా నువ్వు" అంటూ పాదాలు తాకాడు
తల్లి " శివయ్య వంటసిద్ధమైనది , చంద్రశేఖర మీరు కూడా స్వామికి చేతులు శుభ్రం చేసి ఆసనాన్ని పరుచు"
శివుడు " తల్లి నేను ఎందుకు చేతులు కడుక్కోవాలని అనుకుంటున్నావు:"
చంద్ర " అదేమిటి శివయ్య భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవడం ఆనవాయితీ కదా ఓహో ఓహో" అన్నాడు గుర్తొచ్చినట్టు
శివుడు " తల్లి అది చేత్తో తినేవాడికి నాకు నీవే కదా గోరుముద్దలు తినిపిస్తానన్నావు. మరి అప్పుడు నా చేత్తో నాకేం పని"
తల్లి " అలాగే అలాగే" అంటూ నమస్కారం పెట్టి అర్థం చేసుకున్న తండ్రి లోపలికి వెళ్ళినది
శివుడు " కోరుకున్న కోరిక కూడా నేనే గుర్తు చేయవలసి వచ్చినది ఏమిటో నాకు ఈ స్థితి"అంటున్నాడు సరదాగా
ఈ లోపు చంద్రశేఖర ప్రభు వెళ్లి చేతులు కడుక్కొని వచ్చాడు , భోజనం చేయడానికి వచ్చాడు..
శివుడు " ఏమయ్యా చంద్రశేఖర మీ తల్లి అనుకున్న నీవు కూడా ఇలానే ప్రవర్తిస్తున్నావ్."
ఈలోపు ఆ మహా తల్లి నాకెప్పుడూ చంద్రశేఖర ప్రభు ఒక పెద్ద వెండి పళ్ళెంలో నైవేద్యం పెట్టేవాడు.. అది కేవలం నా నైవేద్యానికి తప్ప దేనికి ఉపయోగించేవారు కాదు.. ఆ పెద్ద వెండి కంచంలో.. అందమైన మల్లెపువ్వు లాంటి అన్నంతో పాటు పాయసం,గారే, బూరె, పప్పు పచ్చడి కూర పులుసు, నెయ్యి పెరుగు అన్ని వేసింది నైవేద్యానికి సిద్ధం చేస్తున్నట్టు
చంద్ర" నేనేం చేశాను శివయ్య "
శివయ్య " అదేమిటి చంద్ర మీ మాత ఏమి కోరిక కోరుకున్నది, నీకు నాకు కలిపి గోరుముద్దలు పెడతానని అన్నది , మరి నువ్వు వేరుగా భోజనానికి కూర్చుంటావ్ ఏమిటి ?"
చంద్ర అమితానదంతో
" కోరుకున్న కోరిక మర్చిపోయా ప్రభు, తప్పక మీరిచ్చిన వరాన్ని వినియోగించుకుంటాను"
తల్లి వచ్చి శివుడి చంద్ర మధ్యలో కూర్చొని
"మీరు ఏం తింటారు ప్రభువు మొదట అని అడిగింది.. "
శివుడు "తల్లి నీవు ఏమి పెట్టిన తింటాను తల్లి."
తల్లి లాలనగా తన చేత్తో ముద్దలు కలుపుతూ.. ఎక్కువగా నెయ్యి వేసి .. అన్ని పదార్థాలతో ఇష్టంగా ఒక్కొక్క ముద్ద పెట్టినది తన కళ్ల వెంట దార పాతంగా నీరు వస్తున్నాయి , తనకు ఎదురుగా ఉన్న శివుడు కనపడకుండా ఉండటంతో తన కళ్ళను తానే శుభ్రం చేసుకుంటుంది..
చంద్ర "అబ్బా ఒక్క నిమిషం ఉండమ్మా అంటూ , శివయ్య నేను కూడా నీకు నాలుగు ముద్దలు పెడతాను దయచేసి నా కోరిక మన్నించు "
శివుడు "అలాగే కానీ "
చంద్రశేఖర ప్రభువు కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రతి పదార్థాన్ని తన ప్రేమతో రంగరించి పెద్ద పెద్ద ముద్దలు చేసి నాకు తినిపిస్తున్నాడు
చంద్ర కూడా తన కళ్ల వెంట నీళ్ళు తుడుచుకుంటూ ఆనందకరమైన స్థితిలో ఉన్నాడు ..
శివుడు " అమ్మ నీవేమన్నావు నాకు నా స్నేహితుడికి ఇద్దరికీ కలిపి ముద్దలు పెడతానన్నావు కదా "
అలాగే అంటూ ఆ తల్లి ఒక ముద్ద చంద్రశేఖర ప్రభువుకి మరొక ముద్ద శివుడికి పెడుతుంది ..
ఆహా ఏమీ ఆ అదృష్టం ప్రపంచంలో వేరే ఎవరికైనా అదృష్టం కలిగినదా.. ఒక భక్తురాలు తన భగవంతుడితో పాటు తన కొడుకుకి ఒకేసారి గోరుముద్దలు తినిపించడం .. ఇదే కదా శివ భక్తి. అదే భక్తుడు స్వయానా శివుని ప్రసన్నం చేసుకోవడం స్నేహితుడిగా పిలిపించుకోవడం ఏమిటో ఆ మహాదేవుడు లీలలు ఎవరికి అర్థం కావు
ఆ తల్లి కొడుకులిద్దరూ తమ ఆత్మ స్థితి తెలుసుకొని తీవ్రమైన ఆనందంలో నిమగ్నమై బ్రహ్మానందంలో డోలలాడిపోతున్నారు
ఇక ఆ శివుడే ఆ కంచం తీసుకొని ఆ తల్లి బిడ్డలు ఇద్దరికీ గోరుముద్దలు మళ్ళీ తినిపించాడు
ఆనందం తప్ప ఏమీ మాట్లాడలేని వాళ్ళు శివుడు పెట్టే ముద్దలు తింటూ ఇంతకన్నా మా జీవితానికి ఏం కావాలి ఇంతకన్నా మా జన్మకి ఏమి కావాలి అంటూ ప్రతి ముద్ద తింటూ శివుని యొక్క చెరి ఒక పాదానికి నమస్కారం చేసుకుంటూ తమకి ఈ అదృష్టం చాలు అంటూ కళ్ళతో మహాదేవుడికి చెప్పేస్తున్నారు
శివుడు " చంద్రశేఖర ఇందాక చేయి కడుక్కోమంటే నేను కడుక్కోలేదు కదా అందుకని నన్ను కసురుకోకు సుమీ! అమ్మ నీవు కూడా "
ఆ తల్లి బిడ్డలు ఇద్దరు ఆనందంతో కూడిన నవ్వుల నవ్వుకుంటూ శివుని చెరుక చెయ్యి పట్టుకొని
మహాదేవ మహాదేవ అంటూ ఏడుస్తున్నారు
ఆహా ఏమీ ఆ అదృష్టం ఆ తల్లి ఆ మహాదేవుడికి తన కొడుకుకి అన్నం పెట్టడమే కాకుండా ఇప్పుడు ఆ మహాదేవుడు చేతే ఇద్దరు గోరుముద్దలు తిన్నారు
ఇదే కదా దేవుడికి ఏమి ఇవ్వాలో తెలుసు అని అనేది.. వారు ఏమి కోరుకున్నారో దానికన్నా ఎక్కువగా మహాదేవుని వారు వారికి ప్రసాదించారు
ఇప్పుడు అర్థమైందా ఆ కన్నప్ప నోటితో ఉమ్మివేసిన అభిషేకం అనుకున్న శివుడు ఎందుకు స్వీకరించాడు
అలా భోజనం అయిపోయినది ..
తల్లి కొడుకులిద్దరూ " సంతోషం మహాదేవ చాలా సంతోషం అమితానందం బ్రహ్మానందం "అంటూ శివుడి యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు
చంద్రశేఖర ప్రభు " స్వామి మీరు ఒక షరతు ఉందన్నారు కదా ఏమిటది "
శివుడు " అదా చంద్ర అదే నీవు కోరుకున్న కోరిక ఎప్పుడు నీతో ఉండి పోవాలని కోరుకున్నావు కదా మనిద్దరిమే ఉండమని కోరుకున్నావు కదా.. మరి నువ్వు నాతో పాటు వస్తే ఇద్దరం కలిసి వెళ్లి ఉందాం "
ఇక తల్లి బిడ్డల మొహం చూడాలి కలవక కలవక ఇప్పుడే కలిసాడు అప్పుడే వేరు చేస్తావా ప్రభు అన్నట్లు దీనంగా చూస్తున్నది
చంద్ర "ప్రభు కోరుకున్న మాట వాస్తవమే కానీ మా అమ్మ ..."
శివుడు "అదేమిటయ్యా నువ్వు కోరిక కోరుకున్నావు నీ అనుగ్రహించాను కదా ఆ షరతు మీరు నెరవేరుస్తానంటేనే కదా భోజనానికి కూడా ఒప్పుకున్నాను "
చంద్ర మరీ అతని తల్లి "ప్రభు మరి అది ప్రభువు మరి అది..."
అనగానే శివుడు పక్కను నవ్వాడు
శివుడు " ఏమయ్యా చంద్ర నీకు ఎవరు లేకపోతే నేను కావాల్సి వచ్చినదా అదే నీ తల్లి దగ్గరికి రాగానే ఇప్పుడు ఈ శివుడు అవసరం లేదా ఆహా ఎంత గొప్ప చతురడివి నువ్వు "
చంద్రశేఖర ప్రభు మాత్రం తన చేతితో తలని తప్పైపోయింది అన్నట్లు తిప్పుతున్నాడు
శివుడు "అదేంటయ్యా నాకు రోజు స్నానం చేయిస్తా అన్నావ్ అవన్నీ మర్చిపోయావా మీ అమ్మ కనపడగానే "
ఆ తల్లి కూడా ఎందుకు నువ్వు ఈ మాట అన్నావురా ఆయనతో అన్నట్లు ఒక చూపు చూసినది చంద్రశేఖర మీద
కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత శివుడు చిలిపి కృష్ణుడు వలె ఒక ఆనందకరమైన నవ్వు నవ్వాడు
శివుడు " చంద్ర మీ అమ్మ మీద నీకున్న ప్రేమ మీ అమ్మకి నీ మీద ఉన్న ప్రేమ నాకు ఎంతో గాని నచ్చినది.. నీవే కాదు ఏ బిడ్డ తన తల్లి మీద ప్రేమ చూపించిన అది నా మీద ప్రేమ గానే భావిస్తాను. నీవు కోరుకున్న విధంగా పూర్ణా ఆయుష్షు తోపాటు ఎన్ని సంవత్సరాలు నీ తల్లిని నువ్వు కోల్పోయావో అన్ని సంవత్సరాలు అంతకన్నా మూడు రెట్లుగా మీ తల్లితో నీవు సుఖంగా జీవిస్తూ తదుపరి నా దగ్గరికి చేరుకుంటావు .. అంతేకాకుండా కాలక్రమైన మట్టికుండని పోలిన శివలింగం ఒకటి ఇక్కడ వెలిసి
కుండన్న లింగంగా పేర్కొనబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ నైవేద్యాన్ని వెండి పళ్ళెంలో పెట్టావో ఆవిడి పళ్లెం లోనే నాకు పెడుతూ కుండన్న
నైవేద్యముగా నీ కోరిక మేరకు ప్రసిద్ధి అవుతుంది
నాకు ప్రతిరోజు ఇలా మీ అమ్మ నాకు ఏ ఏ పదార్థాలు భోజనం నెయ్యితో పెట్టినదో అదే నైవేద్యం పెట్టవలసిందిగా కాలక్రమేణ ప్రసిద్ధికి ఎక్కుతుంది
భక్తులలో భక్తిలో నీ స్నేహ భక్తితో నన్ను ఎంతోగాని ఆకట్టుకున్నావు.. నీవు సుఖంగా సమృద్ధిగా కళ్యాణం చేసుకొని వంశాభివృద్ధి తో కలకల్లాడుతూ నీవనుకున్నది సాధించి గొప్పవాడై పది మందికి సహాయం చేయాలని నిన్ను నేను దీవిస్తున్నాను.
మీ అమ్మ నీకు నాకు గోరుముద్దలు తినిపించిన ఘట్టం.. నేను మీ ఇరువురికి గోరుముద్దలు తినిపించిన ఘట్టం అందరికీ తెలిసి ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా పరిగణింప పడుతుంది
నేను వెళ్లి వస్తాను నిర్విఘ్నమస్తు తథాస్తు అంటూ బయలుదేరబోగా
శివుడు "అమ్మ నీ పేరు ఏమిటో కూడా నీ బిడ్డకు చెప్పు"
ఆ తల్లి "కైలాసమ్మ " అంది
శివుడు అంతర్దానం అయిపోయాడు కానీ అక్కడ వారి ఇరువురి మనసులో చిరస్థాయిగా నిలబడిపోయాడు
}
గురువా! అలా చంద్రశేఖర ప్రభు కథను నేను పూర్తి చేశాను ఇటువంటి కథలను కో కొల్లులుగా నీ మీద రాసే అదృష్టాన్ని ప్రసాదించిన వాడివి నీవే కదా ఇందులో నాదేముంది, నేను సిరా మాత్రమే కలము నీవు కల్పన నీవు
త్రిమూర్తులు త్రిమాతలు ఇలా అనుకోసాగారు
"ఇక ఏమని చెప్పను ఈ కార్తికేయుడు చెప్పిన చివరి ఘట్టం, బాగున్నది బాగున్నది అని పదేపదే చెప్పటం కూడా సమంజసం కాదేమో అనిపిస్తున్నది మనవాడు సాక్షాత్తు ఒక పుణ్యక్షేత్రాన్ని ఆ స్థల పురాణాన్ని రచించాడు.. ఈ మధుర ఘట్టానికి ఏమని పేరు పెట్టాలి ,
నేను " నా లీలలు నేనే తెలుసుకొని రచనల ద్వారా
నేను ఆనంద పడటం అనేది చేసిన ఈ కార్తికేయుడికి ఎంతైనా తన ప్రతిభ తగిన గుర్తింపు ఇవ్వవలసిన బాధ్యత నాది"
ఇంకా ధ్యాన స్థితిలో నిమగ్నైయున్న కార్తికేయుడికి
త్రిమూర్తుల త్రిమాతల ఆజ్ఞ
" కార్తికేయ నువ్వు కార్తికేయ స్థితికి మళ్లీ వచ్చి మాకు మీ కథ కథనం అంతా చెప్పి మా చేత అభినయించుకోవలసిందిగా , దర్శకత్వం చేయవలెనని ఆజ్ఞ "
ఆ ధ్యాన స్థితిలో " తను చేయబోతున్న నాటకం కథ అంతా చెప్పి వారి చేత ఆమోదింప చేసుకొని దర్శకత్వం మొదలుపెట్టాడు ఈ నిమిషం నుంచే"
నేను ఇక సాధారణ స్థితికి రా దర్శక రచయిత కార్తికేయ
అనగానే మళ్లీ సాధారణ స్థితికి వచ్చాడు
ఇక ఇప్పుడు మొదలైంది కదా .. అసలైన కళా ప్రదర్శన




No comments:
Post a Comment