శ్రీథరమాధురి - 146 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 146

Share This

  శ్రీథరమాధురి - 146 

                               (పూజ్య శ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు) 




నైతికత గురించి ఎక్కువగా మాట్లాడే వారికి దాచిపెట్టడానికి ఏదో ఒకటి ఉంటుందని నేను గమనించాను. ఎవరైనా దేని గురించైనా అతిగా మాట్లాడితే, కంటికి కనపడే దాన్ని మించి ఏదో ఉందని అర్థం. అటువంటి దివ్యాత్మల పట్ల గమనింపుతో ఉండండి.

***

జీవితం వేదాంతం కాదు...
జీవితమంటే ఒక సత్యం.

***
గురువాణి
వేదాంతం
***
మన వేదాంత పరిభాషకు చెందిన గురుకులాల్లో దైవాలని, ఒకప్రక్కన  కేవలం వరాలిచ్చే వారిగా, మరొక ప్రక్కన చంపే, శపించే వారిగా చిత్రీకరించడం ఎంతో శోచనీయం.
 
***
"మీకు నా ప్రేమ" అనో, లేక 'మిమ్మల్ని ప్రేమిస్తున్నాను" అనో నేను అందరికీ చెబుతూంటాను. అంతేకానీ "నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను" అని చెప్పను.

"నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను" అని నేను చెప్తే నేను ఆ వ్యక్తిని ఏదో ఒక కారణాన్ని గురించి ప్రేమిస్తూన్నాను అన్నట్లుగా కనిపిస్తుంది. ఒకసారి కారణాలంటూ ప్రవేశించాకా, అది ప్రేమ కాదు, స్వార్థం అవుతుంది. ఆ కారణాన్ని విడిచిపెడితే, నేను ఆ వ్యక్తిని విడిచి పెట్టాల్సి రావచ్చు. నా ప్రేమ అంత చవకైనది కాదు. అది విశ్వం నుంచి జనిస్తుంది, ఈ లౌకికమైన ప్లాస్టిక్ ప్రేమల వంటిది కాదు. నేను మీ పట్ల స్వార్ధంగా ఉండను. మిమ్మల్ని బంధించడం నాకు ఇష్టముండదు. మీరు ఒక స్వేచ్ఛా విహంగం. మీకు దాహం వేసినప్పుడు, మీరు ఎల్లప్పుడూ ఈ సరస్సుకి రాగలుగుతారు. నిండు మనసుతో నేను మీకు ఈ "లైఫ్ లైన్ సపోర్ట్" ఇస్తున్నాను.

కాబట్టి, నేను మీతో "మీకు నా ప్రేమ" అంటే, అది ఎటువంటి కారణాలు లేనిదని అర్థం. మీరు స్త్రీ అయినా పురుషుడైనా, మీ వయస్సు జాతి, కులం, వర్గం, మతం, వేదాంతం, మీ ఆర్థిక స్థితి లేక అందం వీటి గురించి నాకు ఎలాంటి పట్టింపు లేదు. మీరు ఎలా ఉన్నారో అలాగే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను తప్ప మరేదీ కాదు కనుక, "మీకు నా ప్రేమ" అంటాను.
  
***
మీ గురుకులానికి ఆధారమైన క్లిష్టమైన మూల వేదాంతాల జోలికి వెళ్ళకండి. 

వాటన్నింటిని గురించిన జ్ఞానం వల్ల మీకు ప్రయోజనం ఏముంది? అవన్నీ మిమ్మల్ని మరింత గందరగోళానికి గురిచేస్తాయి.

మీకు ఒక గురువు ఉంటే, అదే మీకొక పెద్ద వరం! ఆయన మీ సమస్యలను తీర్చకపోయినా, మీ జీవితంలో అన్నింటినీ మీకు సులభతరం చేస్తారు. కేవలం ఆయన మీతో ఉండడం వల్ల మీరు పొందే శక్తే, మీ జీవితం మొత్తానికీ సరిపోతుంది.
 
అయినపట్ల సంపూర్ణ నమ్మకాన్ని కలిగి ఉండండి. అంతర్గతంగా, బహిర్గతంగా సంపూర్ణంగా ఆయనను శరణాగతి వేడండి.

జీవితంలోని ప్రతి ఒక్క అంశంలోనూ ఆయనను శ్వాసించండి, రుచి చూడండి, వాసన చూడండి, అనుభూతి చెందండి, చూడండి.

గురువు మీద ఆధారపడి ఉండడం మీ జీవితంలోను, మీ జీవితం తర్వాత కూడా, మీ ఆత్మ స్వేచ్ఛను పొందడానికి సహాయపడుతుంది.

కేవలం గురువు మాత్రమే మీ ప్రపంచం కావాలి. అప్పుడే మీరు విశ్వాసం కలవారు అవుతారు.
***

No comments:

Post a Comment

Pages