శ్రీథరమాధురి - 144 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 144

Share This

                                                              శ్రీథరమాధురి - 144

(పూజ్య శ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)






వాళ్ళు ఏమి తప్పు చేసారో తెలుసుకోవడానికి కొందరికి చాలా సమయం పడుతుంది.

వాళ్లకు మంచి కళ్ళు ఉంటాయి కానీ చూడలేరు.
వాళ్ల చెవులు బాగా పనిచేస్తుంటాయి కానీ వినలేరు.

జ్ఞానం అనేది ఆత్మ నుంచి వస్తే తప్ప మీరు ఎంతగా చెప్పినా కూడా వారు తమ తప్పును తెలుసుకోలేరు.

అజ్ఞానంతో ఉన్నవారు ఎన్నడూ తమ తప్పును తెలుసుకోలేరు. నిజానికి వాళ్లు తెలుసుకోవాలి అని అనుకోరు. వాళ్ళ మటుకు, వాళ్ళు ఏమీ ఆలోచించినా, చేసినా అదే ఎల్లప్పుడూ సరైనది.

కాబట్టి వాళ్లకు అవగాహన కలిగించాలని ప్రయత్నిస్తూ మీ సమయాన్ని, శక్తిని వారిపై వృథా చేసుకోకండి. నిజానికి అది మీ పని కాదు కూడా!

***
బేషరతుగా ప్రేమించే వ్యక్తిని అందరూ లోకువ కడతారు. వారిని యథేచ్చగా భావిస్తారు. కానీ మీరటువంటి ప్రేమలో ఉన్నప్పుడు ఇతరులు మిమ్మల్ని యథేచ్ఛగా భావిస్తున్నారని మీకు తెలియదు. అలా తెలిసినప్పుడు ప్రేమ అనేది లేదని, మీ వైపు నుంచి కూడా అదంతా బూటకమని తెలుస్తుంది.
 
***
ఇతరులు బాధలో ఉన్నప్పుడు మీరు ఆనందంగా ఎలా ఉండగలుగుతారు? మనం మనల్ని మనుషులుగా భావిస్తాము కదా? ఇతరులు వేదనలో ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉండగలమా? అహంకారం, మదం ఒకరిని పూర్తిగా ఆవహించినప్పుడు దానివల్ల ఇతరులు బాగా బాధపడాల్సి ఉంటుంది. దీనికి తోడు మోసం, అసూయ కూడా జత కూడినప్పుడు, వారు ఇతరులకు కలిగించే నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. మనం మానవులమని, Man-Kind అని చెప్పుకుంటాము. మనిషి(Man) ఉన్నారు, కానీ దయ(kind) ఉందంటారా? మనిషిలో ఉండే ప్రేమ, దయ అని దివ్య లక్షణాలు ఏమైపోయాయి? ఎందుకని అవి మరుగున పడిపోయాయి?

***
గుంపులో కలిసి ఉండడం తేలికే. కానీ అందులో ఉంటూ కూడా మూస పోసిన భావాలను వదుల్చుకుని, తిరుగుబాటు ధోరణితో ఉండాలంటే ఎంతో ధైర్యం, నమ్మకం కావాలి. వినమ్రంగా ఉండటం చాలా తేలిక. ఎందుకంటే దానికి ఇతరులు చెప్పింది పాటిస్తూ ఉంటే సరిపోతుంది. అలా ఉండడం వల్ల ఒకరి నెత్తి మీద నిజమైన బాధ్యత ఏమీ ఉండదు.

***

No comments:

Post a Comment

Pages