శివం-139 - అచ్చంగా తెలుగు

 శివం-139

శివుడే చెబుతున్న కథలు

రాజ కార్తీక్ 




(కార్తికేయుడు తన కథ చెబుతూ ఉన్నాడు 

నేను నాతోపాటు విష్ణు దేవుడు బ్రహ్మదేవుడు మీ త్రిమాతలు కథ వింటూ ఉన్నారు , కార్తికేయుడు తన కథలో భాగంగా కుండన్న కి తన తల్లికి జరిగిన సంభాషణ మొత్తం చెబుతున్నాడు )

నేను అనగా శివుడు.

కథ లో 
{


కుండన్న " తప్పక వస్తాడు అమ్మ మహాదేవుడు నా దగ్గరికి కాకపోతే ఇంకెవరి దగ్గరికి వస్తాడు ,' నీవు నీకోసం ఏమీ అడగలేదు' అనే ఉద్దేశంతోనే నా స్నేహితుడైన మహాదేవుడు నిన్ను నాకు చేరవేసి ,నీవు వస్తున్న సమాచారం ముందుగా తెలిపి ఇక్కడ ఉండమని పంపించాడమ్మా ," 

తల్లి " నీవు చెప్పినట్టు మహాదేవుడు ఇక్కడికి వస్తే నేను కూడా నమస్కరించి నా జన్మని ఆయన దర్శనంతో ధన్యత చేకూర్చుకుంటాను " 

కుండన్న " ఏమనుకున్నావ్ మరి మహాదేవుడంటే ఏమనుకున్నావ్ అసలు ఆయనని నాతోపాటు ఉండిపోమని చెప్పాను తెలుసా ఎప్పుడు ఆయనతోనే ఉండాలని అనిపించింది అని ఆయనకే చెప్పాను తెలుసా " 

తల్లి " పోనీ మహాదేవుడు వస్తున్నాడు రావట్లేదు నువ్వు వెళ్లి చూసి వస్తావా, లేకపోతే మన పురాణ కథ లాగా అక్కడ ఆయన ఏమన్నా లింగ దారి రూపంలో వెలిశాడా ఇంతసేపైనా రాకపోవడ0 ఏమిటి?"
 అని అన్నది మహాదేవుని చూడాలని కుతూహలంతో

  
కుండన్న " వస్తాడులే అమ్మ మహాదేవుడు వస్తానని మాట ఇచ్చిన తర్వాత రాకుండా ఉంటాడా "అంటూ తన తల్లిని తను ఒక్క నిమిషం కూడా వదిలి వెళ్ళకుండా గడుపుదామనే చూస్తున్నాడు

}

పార్వతీ మాత " చూశారా మహాదేవ ! ఈ కార్తికేయుడు ఎంత గొప్ప కల్పన చేశాడో , కనుల ముందు లేని తల్లిని మహాదేవుడు ఆ కథలో భాగంగా సాక్షాత్కరించినప్పుడు ఆఖరికి తల్లి కోసం ఆ దేవున్ని కూడా వెనక్కి నెట్టిన ఆ రచన శైలిని చూశారా ఇదే కదా భగవంతుడు కూడా కోరుకునేది.. తల్లి తండ్రి గురువు దైవం అని తమరు ఊరికే ఉపదేశించారా? 
దేవుడు ఉంటే చూపించమని అడిగే వారికి, తన తల్లిని చూపిస్తే తన తండ్రిని చూపిస్తే తనకి ఆత్మ నిదర్శనం చేసిన గురువుని చూపిస్తే సరిపోతుంది కదా తల్లిలో తండ్రిలో గురువులు లో దైవాన్ని చూడ చేతకాని  వారికి తమ ఇష్టదైవం కళ్ళ ముందే ప్రత్యక్షమైనా కూడా వారిని గుర్తించగల సామర్థ్యం లభిస్తుందా ? తపస్సు అంటే తల్లి తండ్రుల సేవ కూడా తపస్యే కదా , గురుసేవ కూడా తపసే కదా, అలాగే సమాజ శ్రేయస్కరం కోసం తోటి మనిషికి చేసే సాయం కూడా తపస్సే కదా ? ఆహా ఎంత బాగుంది ఈ రచయిత భావన సాక్షాత్తు సృష్టికే అధిపతి అయిన ఆ మహాదేవుడు కనపడి తన తల్లితో కలిపితే ఆ తల్లిని ఎక్కడ ఒక నిమిషం వదిలి ఉండాల్సి వస్తుంది అని ఆ మహా దేవుడి కోసం వెనక్కి వెళ్ళటం కూడా మానేసి మాట ఇచ్చాడు కదా తానే వస్తాడు కదా అని అమ్మ మీద ప్రేమతో శివుడి మీద భక్తితో అన్న ఈ యొక్క భావం నాకు ఎంతో గా నచ్చింది "

సరస్వతీ మాత " అవును ! తమరు చెప్పినది ఎంతో ఉత్తముగా ఉన్నది , నాకు కూడా అది ఎంతో గాను నచ్చింది " అంటూ ఇద్దరూ మీ లక్ష్మీమాత వైపు చూశారు 

లక్ష్మీ మాత " మీరు నా వైపు చూసినా చూడకున్నాను నాకు మాత్రం నచ్చినది అని చెప్పకుండా ఉండలేను కదా , ఎలా అయితే అమ్మవారు అనుకొని మీ ఇరువురికి చేసే పూజ నాకు చెందుతుందో అలాగనే మీ ఇరువురికి నచ్చిన భావన నాకు కూడా నచ్చుతుంది " అంటూ త్రిమాతలు సరదాగా సంభాషించారు

తల్లి ప్రేమ గురించి గొప్ప సన్నివేశం చూడటంతో తన కుమారుడైన బ్రహ్మదేవుడి వైపు లాలనగా చూసింది లక్ష్మీమాత 

అలాగే పార్వతీమాత కూడా తన బిడ్డలైన కుమారస్వామిని వినాయక స్వామిని తలుచుకున్నది 

కుమారస్వామి వినాయక స్వామి తమ మనసుతో పార్వతీదేవితో సంభాషించసాగారు 

కుమారస్వామి " తల్లి నీ మనసుకు నచ్చిన భావం నాకు ఎంతో గాన నచ్చింది " 

వినాయక స్వామి " భలే భలే కార్తికేయుడు వాళ్ళమ్మ కార్తికేయడ్ కి కథలో కుడుములు ఉండ్రాళ్ళు వండి పెడుతుందా మా అమ్మ లాగా " అంటూ బొజ్జ గణపయ్య సరదాగా వాళ్ళమ్మని నవ్వించాడు 

విష్ణు దేవుడు కూడా " ఏమయ్యా మేనల్లుడు తొందరగా మీ అమ్మ కైలాసానికి వచ్చేస్తే కుడుములు తినాలనే కదా నీ ఉద్దేశం , ఇక్కడ మీ తండ్రిగారు మిమ్మల్ని కూడా పిలుస్తాడు మీ అమ్మగారు కైలాసం రావాలంటే మరికొన్ని మధుర ఘట్టాలు ఆవిష్కరింపబడాలి " 

కుమార స్వామి " అంతేలే మామయ్య నీకు ఎంతైనా పెద్దల్లుడు అంటేనే ప్రేమ గణపతి అన్నయ్యని పలకరించావు గాని ఈ చిన్నల్లుడు ఏమైపోయాడు అని నన్ను పలకరించలేదు కదా అంటూ తన ముద్ద మనోహరమైన రూపంతో బుగ్గల మీద అలక పూనుకున్నాడు" కార్తికేయుడు తన మేనమామ విష్ణుమూర్తి మీద 

విష్ణు దేవుడు " అలా ఏం లేదు చిన్నల్లుడు ! మొదట గణపయ్య మాట్లాడాడు కాబట్టి గడపకి సమాధానం చెప్పాను తదుపరి నీ తో మాట్లాడేవాడిని ," 

లక్ష్మీ మాత " కుమారా ! నీవు మావయ్య మీద అలక పూనుతావా , మావయ్యకి మీరంటే పంచప్రాణాలయ్యా, "

కుమార స్వామి " చూడు అత్తయ్య ! నేను మామయ్య పక్షం నుంచి నీ పక్షానికి వచ్చేస్తాను "

నేను " అందరూ ఆమెపక్షమే కదా ! ఈ యుగంలో ప్రతి ఒక్కరూ ఆమె యొక్క అనుగ్రహం కోసం ఆశీర్వాదం కోసం కరుణ కోసం మిక్కిలిగా ఎదురు చూస్తూ ఉంటారు లక్ష్మీమాత మీ అనుగ్రహం కూడా నా బిడ్డల పైన కార్తికేయను పైన చూపవలసిందిగా కోరుకుంటున్నా "

లక్ష్మీ మాత నవ్వుతూ " తధాస్తు " అన్నది 

విష్ణు దేవుడు " అల్లుల్లారా ! లక్ష్మీ మత
 ఎవరిని అనుగ్రహించిన దానికి నా సమ్మతం ఆమోదం కూడా ఉండాలి సుమీ ఒత్తినే ఆదిపక్షాన చేరిపోతే ఎలా నాపక్షం కూడా ఉండండి "

గణపతి " నేను నాన్న పక్షం నీ పక్షం బ్రహ్మదేవుల పక్షం ఎప్పుడూ మామయ్య "

కుమార స్వామి " సరే నేను కూడా మా అత్తయ్య కోసం మావయ్య పక్షాన చేరిపోతాను సరే మావయ్య నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు నీ మీద అలకలేదు సంతోషమేనా "

విష్ణు దేవుడు " పోనీలే నా ముద్దుల మేనల్లుడు స్కందనాథుడు నామీద కోపం పోగొట్టుకొని నా పక్షానికి వచ్చేసాడు నా మేనల్లుడు నా వైపు ఉంటే నాకు చాలు " ఏమంటారు మహాదేవ 

నేను" నాకు చాలా సంతోషంగా ఉంది మనందరం ఇలా కలిసి సరదాగా సంభాషించుకుంటూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతుంది ఈ ఆనందానికి అలవాటయ్యనేమో మానవులు తమ వారు దూరమైతే బాధపడుతూ ఉంటారు, కార్తికేయ వినాయక మీ ఇరువురు ఎప్పుడూ ఇలా మావయ్యని ఆటపట్టిస్తూ ఉండాలి,"

బ్రహ్మదేవుడు " వినాయక, కుమారా ! ఈ కథ విన్నారా" 

ఇరువురు "  ఓ "అన్నారు

సరస్వతీ మాత " మీకు ఏం నచ్చింది నాయనలారా"

వినాయక స్వామి కుమారస్వామి మాట్లాడుతూ 

" 
త్రిమూర్తులారా త్రిమాత లారా! తల్లిదండ్రుల గొప్పతనం మాకు తెలియనిది కాదు, కానీ మా యొక్క అదృష్టం ఏమిటంటే మా తల్లిదండ్రులు జగత్ పితా జగన్మాత లు.. అందరికీ తల్లిదండ్రులు ఎవరో వారే మాకు తల్లిదండ్రులు అవ్వటం నిజంగా మా యొక్క అదృష్టం , మనుషులందరికీ భగవంతుడు కన్నా తల్లిదండ్రులే మిన్న , మాకు భగవంతుడు వారే తల్లిదండ్రులు వారే, అదఒక్కటే మాకు తమరి అందరి ఆశీర్వాదములు వల్ల వచ్చిన గొప్ప
 ఘనత , మా తల్లిదండ్రులని మేము సేవించుకోవడం మాకు మా దైవాలను సేవించుకోవడం రెండూ ఒకటే, ఈ కార్తికేయుడు కల్పించిన భావనని మేము కూడా ఎంతగానో మెచ్చుకుంటున్నాము"


----------

హర సిద్ధుడు శయన మందిరంలో ఒంటరిగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు తనకి కూడా కార్తికేయుడు చెబుతున్న కథ లీలగా గోచరిస్తుంది ఎవరో చెవు దగ్గర కథ చెబుతున్నట్టు  మొత్తం వినిపిస్తూనే ఉంది ..

హర సిద్దు " ఆహా ఏమిటి ఈ కార్తికేయని కథలు నాకెందుకు గోచరిస్తున్నాయి. వీటిలో ఏదో పరమార్థం ఉంది మహాదేవుడు నాకెందుకు గోచరింప చేస్తున్నాడు నా చేత ఏమన్నా పని చేయిద్దామని అనుకుంటున్నాడా , ఏం జరగబోతుందో.. ఆ మహాదేవుడు ఆ విష్ణు దేవుడు నా చేత ఏ మంచి పని చేయించ బోతున్నారు అని ఆశగా ఎదురు చూడ తప్ప నేను మాత్రం ఏమి చేయగలను, కార్తికేయుడు పొందిన అదృష్టానికి అసూయ పడటం తప్ప ఆ అసూయని భక్తిగా మార్చుకోవటం తప్ప కార్తికేయని మనస్ఫూర్తిగా ఆభరణాన్ని ఇంచటం తప్ప నేను మాత్రం ఏమి చేయగలను.. ఒక రాజుగా చేయవలసింది చేశాను అలాగని ఒక సోదరుడిని గౌరవించినట్టు గౌరవించడమే కాకుండా నాకు చేతనైన సహాయము మహారాజు హర సిద్ధుడు లాగా కాకుండా ఒక సోదరుడు గా నేను చేశాను, గడువు సమయంలోపు కార్తికేయుడు నెగ్గాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను కళాకారుల భూమి కళాకారుల కి వారి యొక్క కళా ప్రదర్శనకి వారి భవిష్యత్తుకు మాత్రమే దక్కాలని నేను సైతం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలాగైనా కార్తికేయుడు ఆశని కార్తికేయడం ఆశయాన్ని సిద్ధింప చేసే విధంగా అతని కరుణించండి మహాదేవ " }

***

No comments:

Post a Comment

Pages