సీతాన్వేషణ సందర్బంగా వానర వీరులకు సుగ్రీవుడు చెప్పిన వివిధ ప్రదేశాల వర్ణన - అచ్చంగా తెలుగు

సీతాన్వేషణ సందర్బంగా వానర వీరులకు సుగ్రీవుడు చెప్పిన వివిధ ప్రదేశాల వర్ణన

Share This

 సీతాన్వేషణ సందర్బంగా వానర వీరులకు సుగ్రీవుడు చెప్పిన వివిధ ప్రదేశాల వర్ణన

అంబడిపూడి శ్యామ సుందర రావు 




శ్రీరాముడు వానర వీరులందరు సుగ్రీవుని సమక్షం లో సమావేశమై శ్రీరాముని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నప్పుడు శ్రీరాముడు సుగ్రీవుని తో ఈ వానర వీరులందర్ నీ ఆజ్ఞలను జవదాటని వారే కాబట్టి ఈ వానర వీరులకు ఆజ్ఞాపించవలసిన వాడివే నీవే అని చెప్పగా సుగ్రీవుడు శ్రీరాముని నమస్కరించి వానర వీరులతో వారు చేయవలసిన పని అంటే నలుదిక్కుల సీతామాతను, రావణాసురుని వెదకాలి ఈ రామకార్యం కోసం సుగ్రీవుడు తన వానర వీరులు  నాలుగు దిక్కులకు వెళ్ళడానికి విభజన చేసి ప్రతి విభాగానికి ఒకరిని నాయకుని గా చేసి వారికి మార్గ మధ్యలో ఎదురయ్యేపర్వతాలను నదులను అక్కడ ఎదురయ్యే ఇబ్బందులను చాలా వివరంగా వివరించాడు,ఈ వర్ణనను బట్టి సుగ్రీవునికి గల భౌగోళిక పరిజ్ఞానము,జంబూ ద్వీపము యొక్క నైసర్గిక స్వరూపము పట్ల గల  అవగాహనను  మనము అర్ధం చేసుకోవచ్చు 
రామలక్ష్మణుల సమక్షంలో సుగ్రీవుడు తూర్ను దిక్కు సీతామాత అన్వేషణకు బయలుదేరిన వానర వీరుల సమూహానికి నాయకత్వం వహిస్తున్న వినతుడు అనే వానరయోధునికి వానర సేన చేయవలసిన కార్యం గురించి మార్గము గురించి సవివరంగా చెప్పడం ఆరంభించాడు. "ఓ వానరోత్తమా నీవు రామకార్యం పై ఒక లక్షమంది వానర వీరులను వెంటబెట్టుకొని తూర్పు దిక్కుకు పోయి ఆ దిక్కున గల పర్వత శృంగాలలోను, అడవులలోనూ,నాదీ ప్రాంతాలలోను రాజపుత్రి సీతాదేవిని, రావణాసురుడిని  వెదకాలి.రమ్యమైన భాగీరధి నదీ ప్రాంతము లోను,సరయు నాదీ తీరాలలోను,కౌశకి నదీ ప్రాంత ప్రదేశాలలోను, కళింద పర్వతం మీద పుట్టి ప్రవహించే కాళిందీ అనే యమునా నది ప్రాంతాలలోను సరస్వతి నదీ ప్రాంతాలలో ఈ నదుల మధ్య గల వివిధ దేశాల పట్టణాలను, దశరధ మహారాజు కోడలు శ్రీరాముని భార్య అయినా సీతాదేవిని వెదకాలి "అని చెప్పాడు.అంతే కాకుండా ఆ ప్రాంతాలలో ఉండే నరమాంస భక్షకులు,బంగారు దేహకాంతులతో అందముగా కనిపించే కిరాతుల గురించి కూడా చెప్పి ఆ ప్రదేశాలన్నీ వెదకాలి అని చెప్పాడు ఏఏ ద్వీపాంతరాలకు పర్వతాల మీదినుంచి ఎగిరిపోవాలో ఏ సముద్రాలలో తెప్పలు మీద పోవాలో కూడా వివరించాడు రత్నాల గనులున్న యవ ద్వీపానికి,,బంగారు గనులున్న సువర్ణ రూపకాయం అనే ద్వీపానికి కూడా దారి చెప్పి ఈ రెండు ప్రాంతాలలో  సీతామాత జాడ తెలియకపోతే యవద్వీపం అవతల దేవదానవులు నివసించే శిశిర పర్వతానికి పోయి చూడవలెనని సుగ్రీవుడు వినతుడితో చెప్పాడు ఇంకా అనేక ద్వీపాలు ప్రాంతాలను గూర్చి కూడా సుగ్రీవుడు అవగాహన కల్పించి మహా వానర సైన్యాన్ని తూర్పు దిక్కుకు పంపించాడు
దక్షిణ దిక్కుకు ప్రసిద్ధి చెందిన పరాక్రమ వంతులను పంపించాలని అనుకుని అగ్నిదేవుడి పుత్రుడైన నీలుణ్ణి , వానర శ్రేష్ఠుడైన హనుమంతుని, వాలి పుత్రుడైన అంగదుని సుషేణుడిని, ఇతర  వానర వీరులను దక్షిణ దిక్కుకు పంపాలని నిర్ణయించి అంగదుణ్ణి సేనా నాయకుడిగా నిర్ణయించి దక్షిణ దిశన చోరనలవి  కానీ ప్రదేశాలను గురించి వివరించాడు.
"ఓ వానర వీరులారా వెయ్యి శిఖరాలతో నానా విధ వృక్షలతాదులతో ఉన్న వింధ్య పర్వతం గురించి,ఆ పర్వతాలకు దక్షిణాన ఉన్న నర్మదా నది దక్షిణ దేశములో గల గోదావరి కృష్ణ నదుల పరిసర ప్రాంతాలను గుడ్ వారికి వివరించాడు.నాదీ ప్రాంతాలలో కాకుండా దండకారణ్య ప్రాంతములోని కొండ గుహలలో కూడా సీతాదేవి కోసం వెదకమని కూడా చెప్పాడు. సహ్యాద్రి పర్వతాలు దాటినా తరువాత నిర్మలోదకాలతో మంగళకరమైన కావేరినది ప్రాంతములో సీతాన్వేషణ చేయాలనీ చెపుతాడు అక్కడనుండి మలయా పర్వతానికి పోయి అగస్త్య మహాముని అనుగ్రహాన్ని సంపాదించుకోవాలని చెపుతాడు దక్షిణ సముద్రములో దేదీప్యమానము అయినా లంకా ద్వీపము ఉంది దాని వైశాల్యము నూరు యోజనాలు అక్కడికి మానుషులెవరు పోలేరు లంకకు అధిపతి రావణాసురుడు ఆ ద్వీపములో సీతాదేవి జాడను కనుక్కోవాలి ఆ ద్వీపము నిరంతరం రాక్షసు;లచే కాపలా కాయబడుతూ ఉంటుంది కాబట్టి సీతాదేవిఅక్కడ లేదు అని నిస్సందేహంగా తెలిసేంతవరకు ప్రతి ప్రదేశాన్ని మీరు వెదికి చూడాలి అని సుగ్రీవుడు చెపుతాడు.,లంకాద్వీపానికి అవతల నూరు యోజనాల దూరంలో ఉన్న పుష్పితకము అనే పర్వతం గురించి అక్కడ నివసించే సిద్దులు ,చారణుల గురించి చెపుతాడు ఈ పర్వతం కృతఘ్నులు, నాస్తికులకు కనిపించదు .పుష్పితక పర్వతం అవతల పద్నాలుగు యోజనాల దూరములో ఉన్న సూర్యవంతము అనే పర్వతము గురించి చెపుతూ అభక్కడి పళ్ళను  తిని అక్కడ దొరికే తేనెను తాగి దానికి అవతల ఉన్న కుంజర  పర్వతానికి పోవాలి అని చెపుతాడు.ఆ పర్వతముపై విశ్వకర్మ అగస్త్యునికోసం నిర్మించిన భవనము గుండా యఙ్కరమైన సర్పాలతో కాపలా కాయబడుతున్న భోగవతీ పట్టణం ఆ పరిసర ప్రాంతాలను సీతామాత  కోసము వెదకాలి.అని సుగ్రీవుడు దక్షిణ దిక్కు వెళుతున్న వానర శ్రేష్ఠులకు చెపుతు  ఆ పరిసర ప్రాంతాల గురించి కూడా వివరిస్తాడు
ఆ తర్వాత సుగ్రీవుడు మేఘ సమానుడు కాంతిమంతుడు తార తండ్రి అయినా సుషేణుణ్ణి అతని వెంట మరీచ మహర్షి జేష్ఠ పుత్రుడు అయినా మారీచ మహాకపిని అతని తమ్ములను  మరికొంతమంది వానర వీరులను పడమటి దిక్కుకు పంపించాలని నిర్ణయించి వారికి వెదక వలసిన ప్రదేశాలను ఇతర వివరాలను చెప్పనారంభించాడు సుగ్రీవుడు సుషేణుణ్ణి చూసి నమస్కరించి,"మీరు మీ సోదరులు మరి రెండు లక్షలమంది వానర వీరులను వెంటబెట్టుకొని పడమటి దిక్కుకు పోయి సీతాదేవిని వేదకాలిమీరు బాహ్లిక దేశములోను, సురాష్ట్ర దేశములోను భీమ  దేశములోను,శుర దేశములోను, రమణీయమైన కుక్షి దేశములోను, ఇంకా పడమటి దిక్కున ఇతర దేశాలలోను, ఆయా దేశాల పట్టణాలు, గ్రామాల్లోను వనాల్లోనూ, నదీప్రాంత ప్రదేశాల్లోనూ వెతుకుతూ పశ్చిమ తీరానికి పోఆ  గట్టున ఉన్న కొండలలో అడవుల్లో రావణాసురుడుఉంటున్నాడేమో మీరు వెతకాలి.పశ్చిమ సముద్రములో .పారియాత్రాము అనే బంగారు మాయమైన నూరు యోజనాలు వైశాల్యం గల పర్వతం ఒకటి ఉంది అక్కడ నివసించే ఇరవై నాలుగు కోట్ల గంధర్వులు అగ్నిహోత్రముతో సమానమైన తేజోవంతులు కామరూపులు మీరు బలవంతులు అయినప్పటికీ వారిని సమీపించవద్దు మీరు అక్కడి పండ్లను ముట్టుకోవద్దు " అని పారియాత్ర పర్వతము పై తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి ఆ పర్వతం అంతా జాగ్రత్తగా సీతామాతకు వెదకమని చెపుతాడు ఆ పారియాత్రనికి అవతలసముద్రములో వైడూర్య మణి కాంతులతో తేజరిల్లె నూరు యోజనాల ఎత్తు ఉన్న వజ్రం అనే పర్వతము గురించి చెపుతాడు  ఆ లవణ సముద్రం నాల్గవ భాగములో చక్రవటం అనే పర్వతం ఉంది ఆ పర్వతం మీదే శ్రీ మహా విష్ణువు విశ్వ కర్మ చేసిన చక్రాయుధంతో హయగ్రీవుడు అనే రాక్షసుడిని  సంహరించి చక్రాయుధాన్ని తీసుకున్నాడు ఆ పర్వతం మీదే ఉండే పంచజనుడు అనే రాక్షసుడిని చంపి వాడి ఆస్తి తో పాంచజన్యాన్ని చేయించున్నాడు ఆ విధంగా శ్రీ మహావిష్ణువుకు ఆ పర్వతం మీదే  శంఖు చక్రాలను పాంచజన్యాన్ని పొందాడు ఆ పర్వతము మీది కొండ  గుహలలో సీతామాత ను అన్వేషించాలి.ఆ తరువాత నరకుడు ఉండే వరాహ పర్వతం ను కూడా వెదకమని చెపుతాడు ఆ విధముగా ఆ చుట్టూ పక్కల పరిసరాలను వివరించి వానర వీరులకు మీరు ఎంతవరకు పోవటానికి వీలు అవుతుందో వెళ్లి సీతామాతను వెదకండి అని చెప్పి వానర వీరులందరు నాయకుడు అయినా సుషేణుడి ఆజ్ఞలను పాటించాలి అని చెప్పాడు. 
తర్వాత వానర నాయకులలో శ్రేష్ఠుడైన శతవలి తో,"ఓ వానరోత్తమా నీవు నీ మంత్రులు పుత్రులతో మరియు లక్షమంది వానర వీరులతో హిమవత్పర్వతం ఉన్న ఉత్తర దిక్కుకు పోయి అక్కడ అంతటా సీతాదేవి ని వెతకవలెను మీరు అంతా ఈ కార్యములో సఫలీకృతులైతే రాముడు సంతోషిస్తాడు మనమందరం ఋణ విముక్తులవుతాము.రామప్రభువును సంతోషపెట్టడానికి నాకు మేలు చేయడానికి మీరు ఈ పని చేస్తున్నాము అని మనస్సులో నిర్ణయించుకొని జానకి దేవిని వెతకాలి"అని చెప్పి ఉత్తర దిక్కున ఉండే విశేషాలను వివరించసాగాడు. "ఓ వానర వీరులారా మీరు ఉత్తర దిక్కున మ్లేచ్ఛ దేశములోను, పుళింద దేశములోను,శురాసిన దేశములోను ప్రస్థల దేశములోను,భరత దేశములోను,కురుదేశములోను చీనాదేశములోను,హిమవత్పర్వత ,ప్రాంతములో, మీ పరాక్రమతిశయముతోను, బుద్ధి బలముతో సీతాదేవి ఎక్కడ ఉందొ తెలుసుకొని ఆమెను చూచి రావాలి. ఆయా ప్రదేశాలలో వనాలలో రావణాసురుడు వైదేహితో ఉంటున్నాడేమో మీరు వెతకాలి. కాళ పర్వతం నుండి  సుదర్శన పర్వతం అక్కడినుండి దేవసఖ మనే  పర్వతానికి వెళ్లి అక్కడ కూడా వెదకాలి. ఆ పర్వతం దాటినాక ఉన్న ఎడారిలో వెదికి ఎడారికి అవతల ఉన్న తెల్లటి కైలాస పర్వతాన్ని చేరాలి అక్కడ యక్షరాజైన కుబేరుడు యక్షులతో విలాసముగా విహరిస్తూ ఉంటాడు.ఆ కైలాస పర్వతము మీద అక్కడి గుహలలో, అవతల ఉన్న క్రౌంచ పర్వతానికి చెర్ అక్కడ కూడా సీతాదేవిని అన్వేషించాలి. క్రౌంచపర్వతానికి అవతల మైనాక పర్వతం ఉంది దానిపైనే మయుడు నిర్మించుకున్న భవనం ఉంది అక్కడిసముదాయాలలో అక్కడి గుహలలో సీతాదేవి కోసం మీరు అన్వేషించాలి.అక్కడనే వైఖానస సరస్సుఉంటుంది ఆ సరస్సుకు అవతల సూర్యచంద్రుల సంచారం ఉండదు ఆ [ప్రాంతాలన్నిటిలో మీరు సీతాదేవికోసం వెదకాలి ఆ విధంగా సుగ్రీవుడు ఉత్తర దిక్కున అనేశాను చేయు వానర వీరులకు సవివరంగా ఆప్రాంతాలను గురించి వెదక వలసిన ప్రదేశాలను గురించి వివరించి రామకార్యాన్ని సాధించుకొని వచ్చిన వారికి వారి కోరికలు నెరవేరుస్తాను అని హామీ ఇచ్చాడు. 
వానర వీరులందరు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారము వారికి నిర్దేశించిన దిక్కులవైపు వెళ్ళిపోయినారు శ్రీరాముడు సుగ్రీవుని చూచి,"ఓ వానర రాజా నీవు ఈ భూమండలాన్ని అంతా ఎట్లా ఎరుగుదువు "అని ప్రశ్నించాడు. సుగ్రీవుడు అణుకువాతో  జోడించి ,"ఓ పురుషోత్తమ మా అన్న వాలి చంపడానికి వస్తున్నప్పుడు నేను నా మంత్రులు కిష్కింద నుండి  మా అన్న నుడి తప్పించుకొనే ప్రయత్నములో నలుదిక్కుల సంచరిస్తూ నన్ను నేను కాపాడుకుంటూ చివరకు ఋష్యమూక పర్వతం  చేరాను మతంగ ముని శాపము వల్ల వాలి అక్కడకు రాలేడు   ఆ విధంగా నేను ఈ భూమండలం అంతా తిరగడం వల్ల నాకు అన్ని దిక్కులపాటల్ అవగాహన ఉంబట్టినేను వానర వీరులకు దిశా నిర్దేశము చేయగలిగాను "అని జవాబిచ్చాడు ఆ విధంగా సుగ్రీవుడు  దిక్కులను, ఆయా ప్రదేశాలలో ఉండే భౌగోళిక విశేషాలను, లోకాలను సమగ్రంగా వర్ణించి వానరులకు దిశానిర్దేశం చేశాడు。

No comments:

Post a Comment

Pages