శ్రీథరమాధురి - 145
(పూజ్య శ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)
మీరు మీ బరువులను దించుకోవాలి. మీరు ఎన్నో బరువులు మోస్తున్నారు ఆ బరువులు అన్నీ గర్వం, స్వార్థం, ద్వేషం, కోపం, పశ్చాత్తాపం, అసంతృప్తి వంటి రూపాల్లో ఉంటాయి. వాటన్నిటికీ సరిపడా చోటు మీలో లేదు. కాబట్టి మీరు ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఈ బరువులను తగ్గించుకోండి. మీలో అలౌకికమైన ప్రశాంతతకు తగిన చోటును సృష్టించుకుని, జీవితాన్ని ఆనందంగా గడపండి.
***
ఒంటరితనాన్ని అనుభవించేవాళ్లు ఇతరులను ఆకర్షించేందుకు ఎల్లప్పుడూ ఏదోక మూర్ఖమైన పనిని చేస్తూ ఉంటారు. వారు పూర్తిగా స్వీయ సానుభూతితో కూడుకుని ఉంటారు. వారు దాని నుంచి బయటపడాలంటే సానుభూతితో వారిని గురించి శ్రద్ధ వహించాలి.
***
ఒక రోజు ఒక వ్యక్తి కాకులతో ఇలా అన్నాడు.
"మీరు నల్ల రంగులో లేకపోతే ఎంత అందంగా ఉండేవారు?"
సముద్రం దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు, "నీలో ఉన్న నీరంతా ఉప్పగా లేకపోతే ఎంత బాగుండేది?"
గులాబీల దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, "నువ్వు పూసే మొక్కకు ముళ్ళు లేకపోతే నువ్వు ఇంకెంత అందంగా ఉండే దానివో!"
కాకి, సముద్రం, గులాబీ నవ్వి ఆ వ్యక్తితో ఇలా అన్నాయి.
"నువ్వు అందరిలో లోపాలు ఎంచే వాడిగా లేకపోతే ఎంత అందంగా ఉండేవాడివో!"
కాబట్టి ఇతరుల్లో లోపాలు వెతకడం మానండి. వీలైతే వాళ్లకు ఉత్సాహం కలిగించే విధంగా రెండు మాటలు మాట్లాడి, వారిని హృదయపూర్వకంగా దీవించండి.
***
కొంతమంది జీవితంలో ఏదైనా తేలిగ్గా నేర్చుకుంటారు. కానీ మరికొందరు చాలా కష్టమైన మార్గంలో నేర్చుకుంటారు. దీవించబడిన కొందరికి ఇంక నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదు. మరికొందరు ఏమీ నేర్చుకోరు. వారే ఇతరులకు ఎలా ఉండకూడదో నేర్పే ఉదాహరణలు.
ఎలా ఉండాలో చెప్పడం తేలిక. కానీ ఎలా ఉండకూడదో చెప్పడం చాలా కష్టం. ఈ రకమైన వ్యక్తులు తమ మొత్తం జీవితాన్ని పణంగా పెట్టి అజ్ఞానంతో, దురహంకారంగా వ్యవహరిస్తారు. నేను ఇటువంటి వారికి నమస్కరిస్తాను. ఎందుకంటే వారి జీవితాన్ని త్యాగం చేసి, వారితో మెలిగే ఇతరుల్లో పరిణితిని తీసుకొని వస్తారు.
***




No comments:
Post a Comment