శివం-138 - అచ్చంగా తెలుగు

 శివం-138

శివుడే చెబుతున్న కథలు




దర్శకుని కధ 43

(నా ముందు బ్రహ్మ దేవుడి ముందు విష్ణు దేవుడు ముందు త్రిమాతల ముందు కార్తికేయుడు పారవశ్య స్థితిలో కథలు చెబుతున్నాడు.

కుండన్న కథ చెబుతున్నాడు కార్తికేయుడు
 కథలో కుండన్న కోసం వాళ్ళ అమ్మ రావడం , వారిద్దరూ తమ గురించి తెలుసుకోవడం , తప్పిపోయిన చిన్నప్పటి బాబే కుండన్న అని కథలో నేను చెప్పిన ఆనవాళ్ళకి తగ్గట్టుగా తెలుసుకోవడం, కార్తికేయుడు చెప్పే కథలో తల్లి కొడుకులిద్దరూ నా కోసం ఎదురు చూడటం..అది సృజించిన హర సిద్దు మహారాజు నాతో కలలో సంభాషించడం, )
 )

{నేను అనగా శివుడు }

కార్తికేయుడు మాటల్లో కథ కొనసాగుతుంది . 
"
కుండన్న కి తన తల్లి ను చూసిన దగ్గర నుండి మనసు గాలిలో విహరిస్తుంది .. అంతే కదా తనది ఒక అనాధ బతకని తనకి ఎవరూ లేరని తన బాగోగులు చూసిన తాత కూడా చనిపోయేముందు తన జన్మ రహస్యం చెప్పి చనిపోవడం వల్ల తనకేమీ తెలియకపోవటం వల్ల తన అమ్మ ఎవరో నాన్నెవరు ఎలా తెలుసుకునేది .. ఏం మార్గము లేదు అని మనసులో ఎంతో మదనపడ్డాడు. అలాంటిది తన తల్లి తన దగ్గరికే వస్తుందని ఊహించి ఉంటాడా?" 

విష్ణు దేవుడు " అవును కదా మహాదేవ! ఈ కథ అత్యంత అద్భుతంగా ఉన్నది తమరి భక్తుడు తమరి కోసం ప్రాకులాడుతూ ఉండగా మీరు తన వృత్తి అయిన కుండ లు చేసే చక్రం లో మట్టి   రూపంలో దర్శనం ఇవ్వడం.. ఆ భక్తుడు తమతో ఉండాలని, తమని తనతో ఉండిపొమ్మని కోరుకోవడం.. తనకి మీ మీద ఎంతో మమకారం ఏర్పడి మీకు దగ్గరుండి తైలాభిషేకాలతో స్నానం చేయించడం..  వెంటనే తనకి తన దగ్గరకే ఆర్తితో వచ్చిన తల్లి ఎవరో తమరు చెప్పటం, తల్లి కొడుకుల మధ్యలో ఉన్న భావోద్వేగం అత్యంత ఆనంద నియం .. నాకు కూడా కార్తికేయుడు నా మీద 
 యశోద మాత మీద రాసిన కథ గుర్తుకు వచ్చింది మహాదేవ ఈ కథ తర్వాత నాది నేను ఉదహరిస్తాను

బ్రహ్మ దేవుడు " అవునా పితా! విష్ణు దేవా , తమరి కథ కూడా తమరి నోటి ద్వారా వినాలని నాకు ఎంతో కుతూహలంగా ఉంది.." 

త్రిమాతలు " విందురు గాని ఇప్పుడు కార్తికేయుడు 
   కుండన్న   కథలో ఏటువంటి మలుపు తిప్పుతాడు 
చూద్దాం" 

కార్తికేయుడు " ఓ మహదేవ ! ఓ విష్ణు దేవా! ఓ బ్రహ్మదేవా! ఓ జగజ్జననిల్లారా తమరికి తల్లి ప్రేమ గురించి చెప్పు అంత వాడిన  , ఏదో నా కల్పనకు మీరు ముగ్ధులుఅవడం నా ఆత్మకి దక్కిన అదృష్టము మరియు గౌరవం.. ఎన్నో కోట్ల జన్మల పుణ్యాన్ని మూట కట్టుకున్నాను కాబోలు మీలాంటి అత్యుత్తమైన శ్రోతలు నాకు దొరికారు.. తమరి నన్ను అడిగి కథలు చెప్పించుకోవటం అనేది ఎటువంటి అదృష్టము తల్లి , ఆహా నన్ను కన్న నా తల్లి ఎంత గొప్పది. నా తల్లిదండ్రులు ఎంతటి పూజ చేసుకొని ఉన్నారు. నేను పుట్టిన వంశం ఎంత ఉన్నతమైనది.. నన్ను పెంచిన వారు ఏటువంటి ఘనులు, ఇటువంటి ఆత్మానందాన్ని కలగజేసిన మీకు శతకోటి వందనాలు సహస్ర కోటి వందనాలు " 

నేను " బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ద్వారా లక్ష్మీదేవి ద్వారా మాతాపితల ప్రేమను గ్రహించారు.. నారాయణుడు తన అవతారాలలో తల్లి ప్రేమను తండ్రి ప్రేమను చవిచూచారు.. కానీ నేను మాత్రం కార్తికేయ, నీవు నన్ను బాలుడు అయిపోమని వరమడిగిన ఒక గొడ్రాలైన ముసలి భక్తురాలు యొక్క అమ్మ ప్రేమని పొందిన కథను నా కంటి వెంట ఆనందభాష్పాలు రాలే విధంగా మలిచావు.. ఎప్పుడూ అనంతమైన ధ్యాన జ్ఞానంలో నిమగ్నం అయ్యే నాకు భక్తుల పిలుపులే కాకుండా నీ కథలో సన్నివేశాలు నాకు హృదయం వైపు తట్టే విధంగా ఆ రచన చేశావు నిజంగా ఆ తల్లి ప్రేమని అవతారం ఎత్తి పొందాను అనే భావనలోనే నేను ఉన్నాను కార్తికేయ ! "

కా " ధన్యుణ్ణి ప్రభు! అది రాసే అంత మస్తిష్కం ఇచ్చిన వారు మీరే , అది రచించడానికి మనోవాక్కయలు ఇచ్చినవారు తమరే, అన్ని మీరే ఇచ్చారు అన్ని మీరే చేయించుకుంటున్నారు అలాగే అంతా మీరే ఆస్వాదిస్తున్నారు ఇంతకన్నా నాకు కావాల్సింది ఏముంది స్వామి, ఈ నిమ్న భక్తుడిపై మీరు కురిపించిన కరుణా కటాక్షాలకు ఎంతో గాను మీకు రుణపడి ఉన్నాను స్వామి "

నేను " సరే ముందు కథ ,ఆ తర్వాత ఏం జరిగింది"
 

కథ 
{
 
తల్లి " ఏమిటి నాయనా నీ ఒళ్లంతా వెచ్చగా ఉన్నది "

కుండన్న " అదే అమ్మ నాకు కొంచెం పడిశం చేసింది దగ్గు జలుబు కొంచెం జ్వరంగా ఉన్నది "

తల్లి " మరి మందు వేసుకున్నావా"

కుండన్న" లేదమ్మా మందు కావాలంటే ఊరిలోకి వెళ్లాలి అంత సమయం లేదు మహాదేవుల వారు కూడా నీకు జ్వరం ఉంటే ఎందుకు నాకు సేవలు చేస్తున్నావని ఒక స్నేహితుడు వలె ప్రేమతో కోప్పడ్డారు, మళ్లీ మళ్లీ తమరు దొరకరు కదా స్వామి" అని చెప్పాను 

తల్లి తన కుమారుడి మీద చెయ్యి వేసి కనబడక కనపడక కనబడిన తన కుమారుడికి ఏమిటి అస్వస్తత అని ఆందోళన పడసాగింది ..

కుండన్న " మరి ఏం పర్లేదు అమ్మ నాకు ఇదంతా అలవాటే పని భారం ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడప్పుడు రాత్రి పగలు కూడా పనిచేస్తూ ఉంటాను అప్పుడు ఇలా అవుతూ ఉంటుంది
 నాకోసం నువ్వు బెంగపడమాకు అమ్మ ఇక నువ్వు వచ్చావు కదా చక్కగా సంతోషంగా ఉంటాను నేను ఆనందంగా ఉంటే చాలు అమ్మ అన్ని వాటి అంతటఆవే పోతాయి.. నువ్వు ఆనందంగా ఉంటే చాలు అమ్మ ఏ సుఖాలైన దానంతట అదే వస్తాయి.." 
అంటూ తనకి జ్వరం వచ్చినప్పుడు గతంలో ఎవరు చూసుకునేవారు లేకపోవడం , తను ప్రాణ సమానమైన సహాయం చేసిన కొంతమంది ఆశ్రయం పొందినప్పుడు కొన్ని దినాలు చూసి నువ్వు ఎప్పుడు వెళ్తావు అని వారు అడిగినప్పుడు 
కుండన్న కి మనుషుల మీద కొద్దిపాటి వైరాగ్యం కలిగి తాను ఇక్కడ ఒంటరిగా ఉండటం మొదలుపెట్టాడు
  ఇప్పుడు తనకి తన తల్లి అండం నిలబడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది 
ఏదైనా అమ్మ తోడుంటే దేవుడు అండ కన్నా ఎక్కువ కదా

కుండన్న " అమ్మ జ్వరం కన్నా తనకు ఎవరూ లేరు అని బాధపడటం చాలా ఎక్కువ అయ్యేదమ్మా , కానీ ఇప్పుడు నువ్వు ఉండటంవల్ల జ్వరమైనా కూడా పెద్దగా ఇబ్బంది కలగట్లేదు అమ్మ" అంటూ తన తల్లి ఒడిలో సేద తీరాడు ..

తన బిడ్డకు నిజంగా మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడా? లేకపోతే ఒంటరిగా ఉండటం వల్ల అత్యధిక భావుకత చెంది తన బిడ్డ కి శివుడు వచ్చినట్టు  కనిపిస్తుందని ఆ తల్లి ఆలోచించసాగింది.. అలా గనక అనిపిస్తే తనకి మోచేయి దగ్గర ఉన్న గుర్తు ఉన్నదని మహాదేవుడు చెప్పారని చెప్పాడు కదా అది ఎలా తెలుస్తుంది.. కాసేపట్లో మహాదేవుడు వస్తాడు అని అన్నాడు కదా , అప్పుడు ఆయన దర్శనం చేసుకుని తన జన్మ ధన్యం చేసుకుంటాను , తన కుమారుడు ఎలానో తనకు దొరికాడు కదా ఇక ఎటువంటి ఇబ్బంది లేదు కదా అనే ఒక ఆనందంలో ఉంటూ ప్రేమగా తన బిడ్డ తల నిమురుతూ ఉన్నది..

 కుండన్న " అమ్మ నేను మహాదేవుని వారిని ఒక విచిత్ర కోరిక కోరుకుంటాను "

తల్లి " ఏమిటి అది"

కుండన్న "నేను నీకు ఎంత కాలం దూరమయ్యాను మళ్లీ అన్ని సంవత్సరములు అన్ని రోజులు తిరిగి మా అమ్మతో గడిపే విధంగా ఎక్కువ ఆయుష్ ని నాకు మా అమ్మ కి ఇవ్వు తండ్రి అని మాత్రం అడుగుతాను " 

తల్లి " ఎంత గొప్ప ఆలోచన చేశావు నాయనా! నేను నిన్ను కోల్పోయిన ప్రతి నిమిషం తిరిగి సృష్టించుకుని మళ్ళీ కలిసి జీవించి ఆనందపడదాం అంటున్నావా?" అంటూ కన్నీరు పెట్టుకుంది 


కుండన్న " ఏమిటి అమ్మా! ఇదేమైనా విడ్డూరం గా ఉన్నదా " 


తల్లి " లేదు నాయనా!   కోల్పోయిన సమయాన్ని మళ్లీ నాతో గడపాలని అనుకుంటున్నావు కదా నాకెందుకు ఈ ఆలోచన రాలేదు పాపిష్టి దాన్ని అని నాలో నేనే మధనపడుతున్నా నాయనా " 

కుండన్న " అలా అనుకోవద్దు ఏదో కర్మకొద్ది అలా జరిగింది మళ్లీ కలిసాం కదా "

తల్లి " నీ కోరిక మన్నిస్తాడా మహాదేవుడు "

కుండన్న " మహాదేవుడు నా స్నేహితుడమ్మా ఎందుకు మన్నించడు తప్పక మన్నిస్తాడు , నా కోరికలు అత్యాశ లేదు అమ్మ ప్రేమే తప్ప "

తల్లి " మరేదీ మహాదేవుడు వస్తాడు అన్నావు కదా ఇంతవరకు రాలేదు "

కుండన్న " వస్తాడమ్మా తప్పక వస్తాడు , అందులో నా దగ్గరికి మరింత తప్పక వస్తాడు "

No comments:

Post a Comment

Pages