శ్రీథరమాధురి - 143 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 143

Share This

 శ్రీథరమాధురి - 143

(పూజ్య శ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)




మాతృదేవోభవ...
పితృదేవోభవ...

- తైత్తరీయ ఉపనిషత్తు
 
వేదాలు మాతాదేవోభవ, పితాదేవోభవ అనలేదు. మాతృ, పితృ అన్న పదాలను వాడాయి. మన వంశానికి అమ్మానాన్న ప్రతినిధులు. వారి పట్ల మనం చూపే గౌరవం పూర్వీకులకు వెళ్తుంది. పితృదేవతలు వారి ద్వారా పనిచేస్తారు. కాబట్టి వారి మాటలు చర్యలు, కోరికలు అన్నీ మీ పితృదేవతలవి. వారు అంతర్గతంగా పితృదేవతలచే మార్గనిర్దేశం చేయబడతారు. అందుకే వారి ఆలోచనలు, చర్యలు, కోరికలకు అంత ప్రాధాన్యత ఉంటుంది.
 
***
మీ తల్లి లేక తండ్రి మీకు ఏదైనా ఒక ఆస్తిని లేదా ధనాన్ని ఇస్తే దానిని తిరస్కరించకండి. స్వీకరించండి. తద్వారా మీకు పితృ కటాక్షం కలుగుతుంది. వారి దీవెనలు మీకు ఆ రూపంలో అందుతాయి.
 
తల్లిదండ్రులు వారి కూతురు లేదా కొడుకుకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన కొన్ని సందర్భాలు నాకు తెలుసు. పిల్లలు వారికి ఆ ధనం లేక ఆస్తి వద్దని అన్నారు. మీరు మాకు చదువును, జీవితాన్ని ఇచ్చారు. అంతే చాలు అన్నారు.

వారి వాదన తప్పు. తల్లిదండ్రుల యొక్క ఋణం మీరు ఎన్నడూ తీర్చుకోలేరు. మీరు వారికి భారంగా మారుతున్నారని మీరు భావించకూడదు. ఒకవేళ వారు మీకు ఏదైనా ఇచ్చేందుకు ముందుకు వస్తే, మీరు దాన్ని తీసుకుని, తగిన విధంగా ఉపయోగించుకునేందుకు గానూ ముందు తరాలకు  దానిని అందించాలి.
 

మీ తల్లిదండ్రులు ఏమిచ్చినా ఎన్నడూ దానిని తిరస్కరించకండి. ఒకవేళ మీరు తిరస్కరిస్తే మీ పితరులు లేక పూర్వీకులు మీ నిర్ణయంతో సంతోషంగా ఉండరు.

No comments:

Post a Comment

Pages