అదీ అసలు సత్యం
- కర్లపాలెం హనుమంతరావు
ఆ సాయంత్రం సంజీవని
ఆస్పత్రి వెయిటింగ్ రూంలో ఇద్దరు వ్యక్తులు పక్కపక్కనే కూర్చుని ఉన్నారు. ఇద్దరూ వియ్యంకులే.
ఇద్దరి మొహాలలో అంతులేని ఆందోళన. ఒకరు సీటిలోని కనకదుర్గ ఆలయ ప్రధాన అర్చకులు.. మాధవశర్మగారు. మరొకరు ప్రొఫెసర్
భరద్వాజ్.. సిటీ సైన్స్ కాలేజీలో బయోలజీ హెడ్
ఆఫ్ డిపార్ట్మెంట్.
లోపల ఆపరేషన్
థియేటర్‌లో ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్న రోహిత్ మాధవశర్మగారికి అల్లుడైతే , ప్రొఫెసర్ భరద్వాజ్
కి ఒక్కగానొక్కకొడుకు!
ఆఫీసు డ్యూటీ
మీద చెన్నై వెళుతూ నెల్లూరు దగ్గర కారు యాక్సిడెంటయి
తీవ్రంగా గాయాలపాలయిన రోహిత్ ప్రస్తుతం అందుబాటులో
ఉన్న అదో మోస్తరు ఆసుపత్రిలో యమర్జన్సీ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.
"అంతా దుర్గమ్మ
తల్లి దయ. అమ్మ కరుణ ఉంటే అసాధ్యం అంటూ ఏదీ
లేదు" అన్నారు మాధవయ్యగారు వియ్యంకుడు
ప్రొఫెసర్ భరద్వాజ్ వినేటట్లు!
భరద్వాజ్ పేలవంగా నవ్వి అన్నాడు"లోపల డాక్టర్ల నైపుణ్యం, ఆధునిక
వైద్య పరికరాల సామర్థ్యం మీద మాత్రమే మనవాడి
ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి బావగారూ! దయ, కరుణ అనేవి కేవలం మన భ్రమలు మాత్రమే”
వియ్యంకుడి తత్వం
తెలుసు గనక మరింక నోరు మెదపలేదు మాధవశర్మగారు. అయినా ఇది సిద్ధాంత చర్చ చేసే సమయం కాదు, సందర్భం
కూడా కాదు కదా! ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వారు
మునిగి నిశ్శబ్దంగా ఉండిపోయారు.
సరిగ్గా అప్పుడే
ఆపరేషన్ థియేటర్ లైట్లు ఆరిపోయాయి. సర్జన్ సుదర్శన్ బయటకు వచ్చారు. ఇద్దరూ ఒక్క ఉదుటన
లేచి ఆయన దగ్గరకు వెళ్లారు.
డాక్టర్ గంభీరంగా
చెప్పారు చిరునవ్వు దాచుకుంటూ , “ఆపరేషన్ సక్సెస్!
అయితే ముందుగా మీకో విశేషం చెప్పాలి. సర్జరీ మధ్యలో పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్ వల్ల హాస్పిటల్ బ్యాకప్
సిస్టమ్ కూడా కొన్ని క్షణాలు మొరాయించింది. అత్యంత క్లిష్టమైన క్షణాలవి. కానీ, అనూహ్యంగా
పేషెంట్ కోలుకున్నాడు. నౌ .. యూ నీడ్ నాట్
వర్రీ !"అంటూ వెళ్ళిపోయారు.
"చూశారా
బావ గారు! అంతా ఆ దుర్గమ్మ తల్లి మహిమ! ఆ తల్లి దయ ఉండబట్టే పవర్ పోయినా, మళ్ళీ వెంటనే వచ్చింది. అమ్మ కరుణ వల్ల అల్లుడుగారు ప్రాణగండం నుండి బైటపడ్డారు! “అన్నారు
మాధవశర్మగారు భక్తిగా కళ్ళు మూసుకుని.
భరద్వాజ్ చిరునవ్వుతో తలాడిస్తూ "మంత్రాలు మహిమలు అంటూ ఏమీ లేవండీ బావగారు! పవర్ పోతే సపోర్టింగ్ మిస్ అవకుండా బ్యాకప్ జనరేటర్ సిస్టమ్ రడీగా ఉంది. దీన్ని ఇన్ వెంట్ చేసింది సైన్సే ! " అని తన వాదన వినిపించారు.
".. స్టార్ట్
అవ్వడానికి పట్టిన ఆ ఎనిమిది సెకన్ల విరామంలో డాక్టర్లు కంగారు పడకుండా మాన్యువల్ పంపింగ్
చేశారు. ఆ స్థితప్రజ్ఞతే పేషెంట్ ప్రాణాలని
కాపాడింది” అని మనసులోనే నవ్వుకుంది అక్కడే
ఉండి అంతా వింటున్న నర్సు
***




No comments:
Post a Comment