శివం-132 - అచ్చంగా తెలుగు

 శివం-132

(శివుడే చెబుతున్న కథలు)

రాజ కార్తీక్ 




(కార్తికేయుడు చెబుతున్న కుండన్న కథ)


కార్తికేయుడు చాలాసేపటి నుంచి తీవ్రమైన ధ్యానస్థితిలో ఉండి తన కథలు చెబుతున్నాడు..
అసలు వచ్చిన ఉద్దేశం మరిచాడా ఏమి అని  మేము అనుకున్నాము.. కానీ మేము చేసిన ప్రస్తావన వల్లే కార్తికేయుడు తన కథలు చెబుతున్నాడు.. కీర్తనల వలె ఆ కథలు చాలా మధురంగా ఉన్నాయి..

విష్ణుమూర్తి " మహాదేవ ! ఇతగాడు ఇలా కథలు చెబుతుంటే వింటూనే ఉంటాము." 

బ్రహ్మ దేవులు " ఎంతైనా భక్తులు చెప్పే కదలంటే వినటం మనందరికీ ఇష్టం కదా " 

నేను " అవును ! కానీ ఈ కార్తికేయుడు తన ఆత్మతో రచనలు సృజిస్తున్నాడు.. ఏమి చెప్పినా ఎంత చేసినా. తన మనసులో కర్మ అనే పేరుమీద ఏమన్నా చెడు జరుగుతుందా అని ఎంతో మదనపడుతున్నాడు . అతడికి ఉన్న రచన భక్తీ నమ్మకం అనే భక్తి నన్ను కట్టిపడేస్తున్నాయి 
కానీ తన జీవితంలో జరిగిన దురదృష్ట సంఘటనల వల్ల భగవంతుడు తనకి సహకరిస్తాడా లేడా అని పూర్తిగా నిర్ధారించుకొని నమ్మకంగా ఉండలేకపోతున్నాడు.. అతనికి ఎదురైన కార్యాలు అటువంటివి.. అతగాడి కర్మకొద్ది తను ఏ పని చేస్తున్నా చివరకు వచ్చి ఆగిపోవడం వల్ల తన దురదృష్టవంతుణ్ణి భావనలో ఉండిపోయాడు.. అంతేకాకుండా తను మనకి ఎన్నిసార్లు మొక్కిన తనని కర్మకి వదిలేసాడు దేవుడు అనే చిరుకోపము ఉన్నప్పటికీ.. తండ్రి మీద బిడ్డకు వచ్చిన చిన్న కోపం వలె.. ఆదుకోండి ఆదుకోండి అని అరవసాగాడు.. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి సరదా సంభాషణలు చేయి సాగాడు. కథలు రాసి దర్శకత్వం చేయగల సామర్ధ్యత తప్ప మరొక పని అతనికి తెలియదు.. అతను తన ఊహ లోకంలో విహరిస్తూ మనందరికీ ఈ కథలు వినిపిస్తూ.. తన ఆశయాన్ని నెరవేర్చే విధంగా.. తన ఆరోగ్యం ఇచ్చే విధంగా 
. తన తప్పులన్నీ మన్నించమని.. కర్మా అని ఏడిపించవద్దని 
. నన్ను పదే పదే పదే ప్రాధేయ పడుతున్నాడు.. అందుకే నా కథలలో నీ పాత్ర నిజ జీవితంలో అంత కఠినంగా ఉండదయ్యా వెంటనే సులభంగా అనుగ్రహిస్తాడు అని మాట అన్నాడు . అనుగ్రహించాలి అనుగ్రహిస్తాను.."

త్రి మాతలు " అవును మహాదేవ . విష్ణు దేవా.. తప్పులు చేయటం మానవ సహజం, రాక్షసులకు వివరాలు ఇచ్చిన మీరు.. ఈ చిన్నపాటి రచన దర్శకుని   కొంచెం అతని కోరుకున్న విధంగా అనుగ్రహించండి "

కా " పరమ పితా బ్రహ్మదేవా దయచేసి తలరాత అని నన్ను ఇబ్బంది పెట్టకుండా .. కనీసం మీరైనా అనుగ్రహించండి.. మీకు దేవాలయాలు ఎక్కువగా లేవని మీ దేవాలయానికి రాలేకపోతున్న.. ఉన్న ఒక్క దేవాలయానికి నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీ దర్శనం చేసుకుని వెళ్తూనే ఉన్నాను స్వామి "

బ్రహ్మదేవుడు " ఏమిటి నాయనా తలరాత బాగా రాశావు కాబట్టి ఇలా కథలు చెప్పగలుగుతున్నావ్.. తప్పకుండా అనుకున్నది సాధిస్తావ్.. ఇంతమంది.. త్రిమూర్తులు త్రిమాతలు నీకోసం వస్తే ఎందుకు నీ తలరాత బాలేదనుకుంటున్నావ్.. నువ్వు అన్ని రకాలుగా కుదుట పడతావ్ .. స్వాంతన చేకూర్చుకుంటావు నాయనా! బేలతనం వద్దు"

నేను " మరి కుండన్న ఏమి చేశాడు "
{
కుండన్న మహాదేవుడికి స్నానం చేయించిన తర్వాత 
జటాజటాలకు సాంబ్రాణి వేశాడు..

కుండన్న " శివయ్య ! ఇప్పుడు ఎంత బాగున్నావయ్యా! 

శివుడు " అవునా నీకు సంతోషం అయితే నాకు సంతోషమే" 

కుండన్న "అవునయ్యా గంగమ్మ తలపైనే ఉంటుంది కదా ! వారానికి ఒక్కసారైనా ఆవిడ నీ ఒళ్ళంతా తడపొచ్చు కదా స్నానం చేయించిన విధంగా " 

శివుడు " మంచి సలహా  ఒకసారి చెప్పి చూస్తాను" 


కుండన్న " శివయ్య నీకు నీ మీద కీర్తనలు మంత్రాలు స్తోత్రాలు అంటే నీకు బాగా ఇష్టమా " 

శివుడు " కాదు నాయనా అవన్నీ చేయటం వల్ల మీకు ఆరోగ్యం  మీకు మానసిక ఉల్లాసం కలుగుతాయి.. అప్పుడు మీలో ఆనందం మీకు అర్థమయ్యే.. నాలో మిమ్మల్ని తెలుసుకుంటారు.. మంత్ర శక్తి కి ఆ గుణం ఉంది " 

కుండన్న " మరి నాకేమీ మంత్రం రాదు ప్రభు "

శివుడు " మీది భావశక్తి అందువల్లే నీకోసం నేను ఇక్కడికి వచ్చాను.. నేను ఎవరికైనా కనపడితే పదే పదే కోరికలు కోరుకునే వారు ఉన్నారు.. కానీ నువ్వు నన్ను ఏ కోరిక కోరిక లేదు.. కేవలం నీతో ఉండమన్నావు.. నీకు జ్వరం వచ్చిన జలుబు చేసిన అనారోగ్యం చేసిన నాకోసం మీ ప్రయత్నం ఆపలేదు"

కుండన్న " స్వామి నేను ఒక చిన్న కోరిక కోరుకొనా "

శివుడు " కోరుకో నాయనా "

కుండన్న " నాకు అమ్మ లేదు అమ్మని ఇస్తావా "

శివుడు " అమ్మ లేకపోవటం వల్ల  ఇబ్బందులు పడ్డావు నాయనా, మీ అమ్మ ఉంది , తనే నీ దగ్గరకు వస్తుంది "


కుండన్న " నిజమా స్వామి నిజమా అంటు " ఆనందభాష్పాలతో కన్నీటి పర్యంతం అయ్యాడు

శివుడు " కన్నీరు తుడచుకో నీ తల్లి నుండి నువ్వు చిన్నప్పుడు తప్పిపోయావ్.. ఆడుకుంటూ కుండల బండి ఎక్కి నీ జ్ఞాపకాలు మర్చిపోయావు.. ఇక అంతే పెరిగా వు..
పాపం మీ తల్లి నిన్ను వెతుక్కుంటూ ఇప్పుడు అంతా తిరిగి మీ ఊరి శివాలయం దగ్గరికి వచ్చింది. నీకు మోచేయి పై ఏ విధంగా మట్టి మరకలాగా పుట్టుమచ్చ ఉందో. అది నీ తల్లికి ఉంటుంది "


కుండన్న " స్వామి నువ్వు ఇక్కడే ఉంటావా! వెళ్లి మా అమ్మని తెచ్చుకో నా "

శివుడు " నువ్వు తెచ్చుకోవడం ఎందుకు ఆవిడే నీకోసం వస్తుంది ఉండు" 

కుండన్న " తను ఈ మారుమూలచోటికి క్షేమంగా వస్తుందా స్వామి ! "

శివుడు " సరే ముందు నీ ఇంటి దగ్గరికి వెళ్లి ఎవరో వస్తున్నారు "

కుండన్న " ఎవరు స్వామి " 

శివుడు " పోవయ్యా వెళ్లి చూడు.. ఈ పట్టణానికి కుండలిచ్చే గొప్ప వ్యాపారవేత్తవి నీకోసం ఎవరైనా వస్తారు మీ అమ్మాయి నా కావచ్చు " 

కుండన్న" నువ్వు కూడా నాతో రా స్వామి ,"

శివుడు "  నేను వస్తాను నువ్వు వెళ్ళు "

    కుండన్న అలా     పరిగెత్తుకుంటూ వెళ్ళాడు 
దూరం నుండి " కుండన్న బాబు కుండన్న బాబు " అనే కేకలు వినిపిస్తున్నాయి 

వాళ్ళ అమ్మ వస్తుందా నిజంగానే కుండన్న మనసు  ఉరకలేస్తుంది..

ఇతను ఎదురు వెళ్ళటం అక్కడ ఒక చిన్న మార్గంలో మరో మార్గం మారి.. ఒకరికొకరు ఎదురు పడకుండా అయోమయ పడటం జరుగుతుంది..

ఎటకెలకి కుండన్న కి అవి ఆలపనుల అనిపించి తన నివాసం దగ్గరికి వస్తాడు..

తన నివాసం దగ్గర ముందున్న బండమీద ఒక తల్లి తల పైన కొంగు వేసుకుని కూర్చోవడం గమనిస్తాడు..

ఆమె " నువ్వేనా బాబు కుండన్న బాబు అంటే.. మీ కసమే ఇచ్చాను అయ్యా.. జీవితం గడవడానికి కొంచెం కష్టంగా ఉంది. నువ్వు దయవుంచి నాకు ఈ మట్టి పాత్రలు కుండల ధనము లేకుండా ఇస్తే ఇవి అమ్ముకొని లాభం రాగానే నీ మీ పైకం నీకు ఇస్తానయ్యా  అని అడగటానికే ఒంటరి ఆడదానికి ఇంత దూరం వచ్చాను" 

అంటూ తన కొంగు సరి చేసుకున్నప్పుడు తన చేతికి ఏ విధంగా మచ్చ వుందో ఆ విధమైన మచ్చ చూసి..

కుండన్న " అమ్మ అంటూ ఏడ్చుకుంటూ తన దగ్గరికి వెళ్ళాడు" 
ఆమెకేమీ అర్థం కాలా .. అమ్మ అంటూ ఇతగాడిని తన దగ్గరికి వస్తున్నాడని..

(ఇంకా ఉంది)
.. 

No comments:

Post a Comment

Pages