ప్రేమించే పెళ్ళాడు (తా) ! - అచ్చంగా తెలుగు

ప్రేమించే పెళ్ళాడు (తా) !

Share This

 ప్రేమించే పెళ్ళాడు (తా) !

         -కొడాలి సీతారామా రావు



‘య్యాహ్హూ!’ అరిచే డ్రామారావ్ సంతోషం తో పైకెగిరి. .డ్రామా వాళ్ళింటి పేరు కాదు.ఆ అరుపుకి అతనికి రిజిష్టర్డ్ లెటర్ ఇచ్చి తన బైకు దగ్గిరకి వెళ్ళబోతు న్న పోస్ట్ మాన్ గేటు దగ్గిర  ఎగిరి పడి బైకు మీ దెక్కి ఆటోమేటిగ్గా కి క్కు కొట్టి పారిపోయేడు వేగంగా.


అదే సమయంలో గేటు దగ్గిరకి రాబోతున్న


రామారావ్ మేనమామ కూడా ఒఖ్ఖ గెంతు గెంతి


ఏకంగా గేటు మీద నించి ఇంటి గుమ్మం దగ్గిరే ప డ్డాడు.


ఆ అరుపుకి పక్కన వంటింట్లో వంట చేస్తున్న తల్లి గుమ్మం దగ్గరకి వచ్చి కొడుకుని చూస్తూ ‘ఏమైందిరా నాన్నా అంత అరిచావు’  అంది పైకి ఎగిరిన తన కొడుకుని చూస్తూ.


ఆనందంగా కిందికి దిగి తల్లి దగ్గరకి వచ్చి చె ప్పాడు ‘ఐదేళ్ళ క్రితం నాన్న ప్రమాదంలో చనిపోయినప్పుడు కారుణ్య నియామకం కోరుతూ ఆర్టీసీకి పంపిన అప్లికేషన్ అప్పుడు ప్రభుత్వం మారటం వల్ల ఆగిపోయింది ఇంటర్వ్యూ చేసి కూడ.ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం వెంటనే ఆదేశాలివ్వటంతో ఇప్పుడు   నాకు ఉద్యోగం వచ్చింది.ఇక్కడే విజయవాడ ఎండీ ఆఫీసులో ఎకౌంట్స్ లో.ఈ నెలాఖరులో చేరాలి.ఇక మన కష్టాలన్నీ తీరినట్టే.’


ఆవిడ సంతోషంతో వంటింట్లోకి వెళ్ళి పంచదార తెచ్చి అతని నోట్లో వేసింది.’చాలా సంతోషంకరమైన వార్త  వినిపించావ్ అల్లు డూ.నేనే ఓ శుభవార్త మోసుకెళ్దామని వచ్చా. ఈ మంచి వార్త చెవిన వేశావ్.చెల్లాయ్ ఇక మనకి అన్నీ శుభవార్తలే.’అంటున్న చాలా ఏళ్ళ తరువాత గుమ్మంలోకి వచ్చిన తమ్ముడి నోట్లో కూడా పంచదార వేసింది. ‘నాకు చక్కెర వ్యాధి  వున్నా  ఈ పూట చక్కెర తినేస్తా చెల్లాయ్.’ అన్నాడు అయోధ్యరావ్. రామారావ్ కూడా పంచదార తల్లి నోట్లో వేసాడు.


రామారావ్ తండ్రి ఆర్టీసీలో డ్రైవర్ గా చేసేవాడు.ముఫ్ఫై ఏళ్ళ అతని సర్వీసులో ఎటువంటి రిమార్కు లేదు.అతని ప్రమేయం లేకుండా ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదంలో అతను ప్రాణాలు కోల్పోయాడు.


ఆర్టీసి ఉన్నతాధికారులు కారుణ్య నియామకాల పథకంలో కొడుకుకి ఉద్యోగం ఇస్తామన్నారు.అలా అతనిని ఇంటర్వూ కూడా చేసారు.అంతలో ప్రభుత్వం మారటంతో కొత్త ప్రభుత్వ నేత మౌఖిక ఆదేశాలతో అన్ని నియామకాలు ఆగిపోయాయి.


అప్పటివరకు రాకపోకలు బాగా వున్న అన్నగారు చెల్లెలికి ముఖం చాటేసాడు.ఏభై కిలోమీటర్ల దూరంలోనే వున్నా చెల్లెలెక్కడ డబ్బుల సాయం అడుగుతుందోనని. ఇప్పుడు భార్య పోరు పెట్టడంతో వచ్చాడు మేనల్లుడితో కూతురి పెళ్ళి విషయం కనుక్కుందామని.కారణం కొత్త ప్రభుత్వం కారుణ్య నియామకాలకి ఒప్పుకుంది కనుక మేనల్లుడికి ఉద్యోగం ఖాయం అనుకుని.


మళ్ళీ ప్రభుత్వం మారాక పాత నియామకాలకి పచ్చ జెండా ఊపింది.అలా రామారావ్ ఉద్యోగస్తుడయ్యాడు.  


అయోధ్యరావ్ చెల్లెలితో తన కూతురుని కొడుక్కి చేసుకుంటే బాగుంటుందని.ఆవిడ చెప్పింది రామారావ్ ఇష్టపడితే తన అభ్యంతరం ఏమీ లేదని.రామారావ్ ని చెల్లెలి ఎదురుగా అడిగాడు అయోధ్యరావు.రామారావ్ చెప్పాడు తన మనసులో మాట చాలా స్పష్టంగా ‘నేను ప్రేమించే పెళ్ళాడుతా’ .అలా అంటూ అమ్మ వంక చూసాడు.ఆవిడా తనకి అంగీకారమే అన్నట్లు తల ఊపింది నవ్వుతూ.


అయోధ్యరావ్ నవ్వుతూ ‘ప్రేమించే పెళ్ళాడవయ్యా. ‘అన్నాడు మనసులో నవ్వుకుంటూ.


 


                         ###


రామారావు ఉద్యోగంలో  చేరాడు.హెడ్డాఫీసులో ఆడిట్ విభాగంలో.అతనికి కేటాయించిన సీటు కిటికీ పక్కన వుండటం,బయట బస్ స్టాప్ ఎదురుగా కనపడుతుండటంతో అతనికి చాలా నచ్చింది.మొదటి నెల అతనికి ట్రైనింగ్ లో భాగంగా అన్ని విభాగాలలో  ప్రతి పని నేర్చుకునేలా ఏర్పాటు చేసారు.


తరువాత నించీ అతనికి పని నిర్ణయించటంతో తన సీట్లో కూర్చుని పని చేసుకోవచ్చు. పని చేస్తూ మధ్య మధ్య కిటికీ లోంచి ఎదురుగా కనపడే సిటీ బస్ స్టాప్ వేపు చూడటం అలవాటయ్యింది.అక్కడ అందమైన అమ్మాయిలు కనపడతారు.అదో ముఖ్యమైన పనైపోయిం దతనికి   


ఓరోజు సన్నగా పొడవుగా వున్న ఒకాయన అతన్ని వెదుక్కుంటూ వచ్చాడు.పొడవాటి లాల్చీ,లూజు పైజమా,చేతిలో గొడుగు అతని రూపం గమ్మత్తుగా అనిపించింది రామారావ్ కి.


‘రామూ, నా పేరు మన్మధరావ్.బ్రహ్మచారిని.నా హాబీ – యువతీ యువకుల మధ్య ప్రేమ కలిగేలా చేసి వారిని ఒక ఇంటి వారిని చేయటం.ఇప్పటికి ఓ ఐదొందల జంటలు ఏకమయ్యారు.అందరూ సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. ఎక్కడ పెళ్ళికాని వారు వున్నా అదేంటో తెలిసిపోతుంది నాకు .  అలా నీ సంగతి నాకు తెలిసింది.అందునా నువ్వు ‘ప్రేమించే పెళ్ళాడా లనుకోటం’ నాకు మరీ మరీ నచ్చింది.అంచేత నువ్  ప్రేమలో పడేలా నీకు సాయం చేస్తా.నువ్ కాదనవ్ నాకు తెల్సు.రేపే రంగంలోకి  దిగుతా.వస్తా.’అంటూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు.అతను వెళ్ళిన వేపు అలా చూస్తూ కూచున్నాడు రామారావ్.


మరునాడా మన్మధరావ్ అన్నట్టే వచ్చేసాడు పదకొండింటికి.రామారావ్ ని కిటికీ దగ్గిరకి తీసుకెళ్ళి బస్ స్టాపులో వున్న ఓ అమ్మాయిని చూపిస్తూ ‘అదుగో ఆ ఆకుపచ్చ వోణి వేసుకున్న యువతే నీ పార్ట్నర్.సాయంత్రం సరిగా ఐదున్నరకి ఎదురుకుండా బస్ స్టాపులో  నుంచుంటుంది.పొద్దున కాలేజీకి వెళ్ళటానికి నెంబర్ తొమ్మిది బస్ కోసం,సాయంత్రం గరల్స్ హాస్టల్ కి వెళ్ళటానికి రెండో నంబరు బస్సు కోసం సరిగ్గా ఎదురు స్టాపులోనే.ఆదివారం కనపడదు.ఎందుకంటే కాలేజీ వుండదు కనుక. రెండు రోజులలో నీకు పరిచయం చేసుకో.మంచి పిల్ల. నాది హామీ.బి టెక్ నాలుగో ఏడు చదువుతోంది.తల్లీతండ్రీ పల్లెలో వుంటారు.అదీ సంగతి.నీకేమైనా సాయం కావాలంటే ఇదుగో నా విజిటింగ్ కార్డ్.24×7 అందుబాటు గేరంటీ.మరి వస్తా.’వచ్చినంత వేగంగా వెళ్ళి పోయాడు.


ఆ అమ్మాయి బస్ ఎక్కే దాకా అటే చూస్తూ కూచున్నాడు.వాళ్ళ సూపర్వైజర్ పిలవటంతో ఈ లోకంలోకి వచ్చాడు.సాయంత్రం త్వరగా తెమిలి బస్ స్టాపుకి చేరుకున్నాడు.ఆమె ఎటూ చూడటం లేదు.బస్ రాగానే ఎక్కేసింది.అతనూ ఎక్కేసాడు.ఆమె మారుతీ నగర్ లో దిగి గరల్స్ హాస్టల్ లోకి వెళ్ళిపోయింది.రెండు రోజులు ఆమెని గమనించాడు.


మరునాడు ఉదయం ముందే మారుతీ నగర్ బస్ స్టాపుకి చేరుకున్నాడు.ఆ అమ్మాయి వచ్చింది స్నేహితులతో.బుధ్ధి మంతురాలిగా అనిపించింది.తొలి చూపులోనే ప్రేమంటే తెలిసింది. రెండు రోజులు అలా ఆమెని అనుసరించాక ఆమెని పరిచయం చేసుకున్నాడు.


ఆమె పేరు అనుపమ.తండ్రి  వ్యవసాయం చేస్తారు.అతనూ తన పరిచయం చేసుకున్నాడు.ఆ సంభాషణ జరుగుతున్నంత సేపూ ఆమె చిరునవ్వుతోనే వుంది.’నువ్వంటే నా కిష్టం.నీ ఇష్టం చెప్పు.నీ నవ్వు బాగుంటుంది.’


ఆశ్ఛర్యంగా ఆమె తన అభిప్రాయం చెప్పేసింది తనకీ ఇష్టమేనని.రెండు రోజులుగా తనని అనుసరించటం కూడా గమనించినట్టు  చెప్పింది.అప్పటి నించీ వారిద్దరూ సాయంత్రం కాసేపు కబుర్లు చెప్పుకునేవారు.ఆదివారాలు బేరేజి మీద గడిపేవారు.రెస్టారెంట్లకి వెళ్ళారు.


చాలా సరదా కబుర్లు చెప్పుకునేవారు.ఏ నాడూ హద్దులు దాటలేదు.ఓ రోజు అతను తన కుటుంబం గురించి చెప్పాడు.  తన ఆశయం ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకోటం గురించి చెప్పాడు.ఆమె మెచ్చుకుంది. ఆమె ఓ క్షణం తరువాత తన కుటుంబం గురించి కూడా దాపరికం లేకుండా చెప్పింది.ఆ విషయాలు వింటూ అతను కూడా ఆశ్చర్యపోయాడు. ‘నువ్ చెప్పిన విషయాలు నాకు చాలా సంతోషం కలిగించాయి. అయితే ఈ విషయాలు మరెవరితో చెప్పకు. ఆఖరికి మీ ఇంట్లో కూడా.గమ్మత్తుగా వుంటుంది మన నిర్ణయం తెలిసాక.’ ఆమెతో చెప్పాడతను.ఆమె నవ్వి వూరుకుంది.


ఆమె పరీక్షలయ్యే దాకా అలా కలిసి తిరిగారు.పరీక్షలయ్యాక వూరు వెళ్ళిపోయేటప్పుడు ఆమె చాలా దిగులుగా వుంది.


అతను చెప్పాడు మనం రిజిష్టర్ మేరేజి చేసుకుని మనవాళ్ళకి షాక్ ఇద్దామా?’ అన్నాడతను.ఆమె ఒప్పుకోలేదు.’నేను మా అమ్మానాన్నలను మీ అమ్మగారితో మాట్లాడేందుకు పంపిస్తా’ అందామె.


అలాగే ఆమె తల్లి తండ్రి అతని ఇంటికి పెళ్ళి విషయాలు మాట్లాడటానికి వచ్చారు.ఆ రోజు శెలవు కావటంతో ఇంట్లోనే వున్నాడు రామారావ్.


తల్లి అతన్ని పిలిచింది పెళ్ళివారొచ్చారు హాల్లోకి రమ్మని.అతను వచ్చి కూచోగానే ఆయన అడిగాడు ‘మా అమ్మాయి అంటే ఇష్టమేనా.మా అమ్మాయికి ఇష్టమే.’అని.


     రామారావు చెప్పాడు ‘మామయ్యా, నాకు అంతా తెలుసు.నువ్వూ,మన్మధరావుగారు ఆ డిన నాటకం అని. ఐనా నేను ప్రేమించి పెళ్ళి  చేసుకుంటా అన్నాను కానీ  నీ కూతురంటే ఇష్టం లేదు అనలేదు.ఏమైనా  నేను ప్రేమించి న అనుపమ నా మేనమామ కూతురు   అవ టం నా అదృష్టం. ఇంకో  విషయం నేను అ మ్మకి అన్నీ చెప్పేసా.’


    ‘ఏదైనా ప్రేమించే పెళ్ళాడుతున్నావుగా అల్లుడూ.  నీ కోరిక నా కోరిక తీరినట్టే.శుభం’ అన్నాడు  అయోధ్యరావు.


***

No comments:

Post a Comment

Pages