ఒకటైపోదామా ఊహల వాహినిలో -34
12 గంటలకు హరిత విరాజ్ రూముకు వచ్చింది.
వెంటనే డోర్ క్లిప్ పెట్టి ఆమెని గాఢంగా కౌగిలించుకున్నాడు విరాజ్.
" విరాజ్ నేను మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని
చెప్పాలి. దానికి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకూడదు. మీ నాన్నగారి
నియమం లాగే అమ్మకు ఒక నియమం ఉంది. మీ
నాన్నగారి నియమం ఒక ఆడపిల్ల
జీవితాన్ని నాశనం చేసేది అయితే,మా
అమ్మ నియమం మనందరి బాగు కోరేది. స్నేహితుడిగా
మనిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదు అనే భావంతో ఈ విషయాన్ని మీకు
చెప్తున్నాను. ఈ విషయం నేను మీకు చెప్పినట్టుగా అమ్మకు కూడా తెలియకూడదు. చెప్పనా? "
" మనిద్దరం ఒకటైన అనుభూతిని నా జీవితాంతం
గుర్తుంచుకుంటాను హరిత. ఆ అనుభూతి
సాక్షిగా చెప్తున్నాను. నేను ఏమీ అనుకోను. చెప్పు" అన్నాడు విరాజ్.
తాను చెప్పాలనుకున్న విషయాలన్నీ స్పష్టంగా
చెప్పేసింది హరిత.
" నిన్ను స్నేహితురాలిగా
పొందడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం" అన్నాడు
విరాజ్.
" నాది అదే భావం విరాజ్ " అంది అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోతూ.
*******
బబిత ఇంటికి వచ్చారు ఇద్దరు.
అతన్ని హాల్లో కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్లిపోయింది
హరిత.
మరో ఐదు నిమిషాల్లో
" రండి సార్ కాళ్లు కడుక్కుందురు గాని. " టవల్ చేత్తో పట్టుకుని
పిలుస్తున్న
వైపు నడిచి, " ఈ అయిదు
నిమిషాల్లోనే బట్టలు మార్చేయాలా? " ఆమె నడుము మడతలో
గిల్లబోయాడు విరాజ్.
"అక్కా...నన్ను కాపాడు." అంటూ కిచెన్ వైపు
పరిగెత్తింది సరిత.
ఈసారి విస్తుపోవడం విరాజ్ వంతు అయింది.
" ఏమిటే...ఏమైంది? " అంటూ హాల్లోకి పరిగెత్తు
వచ్చింది హరిత.
అంగుళం తేడా లేకుండా ఒకే పోలికలు ఉన్న ఇద్దరిని చూసి
కంటి చూపు తప్పు నోట మాట రాని వాడిలా నిశ్శేష్టుడయ్యాడు విరాజ్.
సరిగ్గా అప్పుడే చేతులు తడుచుకుంటూ హాల్లోకి వచ్చిన
శకుంతల నవ్వుతూ అంది.
" అబ్బబ్బ. అతన్ని ఆట పట్టిస్తారు ఏమిటే... ఏమీ
అనుకోకు బాబు.. చీర కట్టింది హరిత,
హాఫ్ శారీ లో ఉన్నది సరిత... మా చెల్లి కూతురు".
" అంటే మొన్న ఒక రోజు రాత్రి డ్యూటీ పేరుతో నా రూమ్ లోకి వచ్చి పక్కలు సర్ది
వెళ్లిపోయింది... "
" నేనే సార్. మీరు బయటికి వచ్చి చూసి ఉంటే అక్క కూడా కనిపించేది. " అని వెతక
నవ్వింది సరిత.
" కవల పిల్లలను ఫోటోలలో చూడడమే తప్ప జీవితంలో ఇంత దగ్గరగా చూడటం ఇదే
మొదటిసారి. హమ్మో. ఇలా ఇద్దరు ఒకే చోట ఉండటం వల్ల ఒక లాభాలు ఒక నష్టము కూడా
ఉన్నాయి. "
" ఏమిటబ్బా అవి " అడిగింది హరిత.
" ఒకే పోలికలతో ఉన్న ఇద్దరినీ ఎదురెదురుగా
చూస్తే అదొక ప్రమోదం ... ఒకరు అనుకుని మరొకరిని పట్టుకుంటే ఇది ప్రమాదం... "
అన్నాడు విరాజ్.
" బాగా చెప్పారు బాబు భోజనానికి రండి."
అంది శకుంతల.
సరితని వింతగా చూస్తూ నవ్వుతూ టవల్ అందుకని కాళ్లు
చేతులు కడుక్కొని వచ్చాడు విరాజ్.
బూరెలు,
పులిహార, పూతరేకులతో సహా షడ్రుచికరమైన
భోజనం వడ్డించింది బబిత.
అందరూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ భోం చేశారు.
" సరిగ్గా సాయంత్రం 5:00 కల్లా గుడి ప్రాంగణంలోకి వచ్చేస్తే తూర్పు గోపురం చూద్దాం. ఆ తర్వాత నేను బయలుదేరి
ఫ్లైట్ కు వెళ్ళిపోతాను. చాలా చాలా థాంక్స్ ఆంటీ. మంచి భోజనంతో ఇంత ఆప్యాయమైన
ఆతిథ్యం ఇచ్చినందుకు. ఇలా ప్రతి పుణ్యక్షేత్రం ఒక బంధువులు ఉంటే బాగుండేది..
యాత్రలన్నీ పండగే పండగ. " అన్న విరాజ్ మాటలు అందరూ నవ్వారు.
వాళ్లందరికీ
చెప్పి విరాజ్ రూమ్ కి వచ్చేసాడు.
*****
ఆ సాయంత్రం అనుకున్న సమయానికి అందరూ గుడి ప్రాంగణం
ముందు చేరారు.
తూర్పు గోపురం ముందు రంగురంగుల భారీ ఏనుగుల విగ్రహాల
ముందు అందర్నీ రకరకాల ఫోటోలు తీసాడు విరాజ్. తాను హరితతో ప్రత్యేకంగా
తీయించుకున్నాడు.
ఆ తర్వాత అందరూ కలిసి లిఫ్ట్ ఎక్కి 20 అంతస్తుల
గోపురాన్ని పైకి ఎక్కారు. అక్కడ నుంచి ఆకాశము, నీరు అంచులుగా కలుస్తున్న అరేబియా సముద్రం, శ్రీకృష్ణుడు
రథసారథిగా వెనుక కూర్చున్న అర్జునునికి బోధిస్తున్న దృశ్యం,కుడిపక్కగా
బీచ్, ఎదురుగా కొండమీద ధ్యాన ముద్రలో శివయ్య, ఆ పక్కన రావణాసురుడు వినాయకుడు, నందీశ్వరుడు,
స్టాట్యూ పార్క్.. అన్నిటినీ కవర్ చేస్తూ అద్భుతమైన వీడియో తీశాడు.
అదే వీడియోలో తమందరినీ కూడా కవర్ చేసుకున్నాడు.
" ఇంకా నేను కొన్ని చూడని ప్రదేశాలు
మిగిలిపోయాయి ఆంటీ. ఈసారి మీ ఇంట్లో ఉండి మరీ చూస్తాను మీకు అంగీకారం అయితే.
" అన్నాడు బబితతో
" అంతకన్నా సంతోషమా బాబు. ఈసారి మీరు, హరిత దంపతులుగా వస్తే నేను ఎంతో
సంతోషిస్తాను. "అంది బబిత.
" మీరు ఎప్పుడు బయలుదేరుతారు ఆంటీ? " శకుంతలని అడిగాడు విరాజ్.
" ఎల్లుండి రాత్రికి తిరిగి ప్రయాణం బాబు."
" సరే మీరు కాసేపు ఉండండి నేను బయలుదేరుతాను.
" అన్నాడు విరాజ్.
" మేము ఇంకో రెండు రోజులు ఉంటాం కదా బాబు.
కావలిస్తే మళ్లీ వచ్చి చూస్తాములే. పదండి వెళ్దాం " అంది శకుంతల
అందరూ కిందికి దిగారు. విరాజ్ అందరికీ బై చెప్పి " మీరు ఊరు
వచ్చేసాకా ఇంటికి వస్తానాంటే. హరితా...రైలు ఎక్కిన వెంటనే మెసేజ్ పెట్టు. బై
" అనేసి రెసిడెన్సీ వైపు వెళ్లిపోయాడు విరాజ్.
*******
మూడు రోజుల తర్వాత అనుకున్న పనులు పూర్తిఅయిన
సంతృప్తితో ఇంటికి చేరుకున్నారు శకుంతల, హరిత.
నాలుగు రోజు సాయంత్రం వచ్చాడు విరాజ్
శకుంతల ఇంటికి.
మంచినీళ్లు,
టీ ఇచ్చాక అడిగింది హరిత.
" ఇంటికి వచ్చాక మీ నాన్నగారు ఏమన్నారు? " ఏమంటారు హరిత? తనని నట్టేట్లో ముంచేసి వెళ్లిపోయానట. బాధ్యత పంచుకోవాల్సిన పెద్ద కొడుకు
విదేశానికి వెళ్ళిపోయి అక్కడ పడిపోయాడు. నువ్వేమో ప్రేమ పెళ్ళంటూ దేశాలు
తిరుగుతున్నావు... అయ్యో కన్న తండ్రి మన మంచి కోరి చెప్పారు అన్న జ్ఞానం లేదు
మీకు. ఇప్పటికైనా నా మాట విని మీ మామయ్య కూతురు క్షితజను చేసుకో. మన అంతస్తుకు
తగ్గ సంబంధం. " అన్నారు ఆయన ధోరణిలో.
" నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటానంటే ఆనాడు
మీరు ఒప్పుకున్నారు. అగ్రిమెంట్ కూడా రాసిచ్చారు. తండ్రిగా మీరంటే గౌరవం ఉంది
కాబట్టే అన్ని విదేశాలు వెళ్లిపోయినా ఈ వయసులో అమ్మానాన్నలను ఒంటరిగా వదలకూడదు.
వారికి ఈ వయసులోనే ఆలంబనగా ఉండాలి అనుకున్నాను కాబట్టే
మీ వెనకాల నీడలా ఉన్నాను.
నాకు ఇష్టమైన అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను.
ఆనాడే నేను గుడ్డ పెళ్లి చేసుకుంటే మీరేం చేయగలరు? అయినా సరే మీ మాట మీద గౌరవం
ఉంచి మూడేళ్లపాటు మేము ప్రేమించుకుంటునే
ఉన్నాం. ఆ అమ్మాయి పెద్దది కావచ్చు నాన్న... గుణంలో ఆ అమ్మాయికి మనం ఏమాత్రం
సరితూగం. ఆ విషయం మీరు గ్రహిస్తే మంచిది.
మరొక విషయం. నేను కోరిన అమ్మాయిని ఇచ్చి మీ పిచ్చి
నియమాలు పక్కనపెట్టి నాకు వివాహం చేయండి.
మీ జీవితాంతం మేము మీకు తోడుగా అండగా ఉంటాం.
అలా కాదు అంటారా? జీవితాంతం పెళ్లి చేసుకోకుండా మీ
ముందే జీవచ్ఛవం లా తిరుగుతూ ఉంటాను... అది కూడా కాదంటారా... మీరిచ్చే డబ్బు ఏమీ
నాకు అక్కర్లేదు... ఆ అమ్మాయి ఇంటికి విడిపోయి
పెళ్లి చేసుకుని మా బ్రతుకు మేం బతుకుతాం. మీకు ఈ
రెండో కొడుకు లేడు అనుకోండి. లేదా అసలు పుట్టనే లేదనుకోండి. "
అని ఘాటుగా చెప్పేసాను.
" మరి ఆయన ఏమన్నారు బాబు? "అడిగింది శకుంతల.
" ఈ వయసులో ఈ తండ్రిని బాధ పెట్టడం నీకు భావ్యం
కాదురా. నాకు ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇవ్వు.
నా మనసును సమాధానపరుచుకొని, నా అంతట నేను మాట్లాడేంతవరకు నువ్వు ప్రశాంతంగా ఉండు... నన్ను ప్రశాంతంగా
ఉండని... నాకోసం కాకపోయినా కనీసం మీ అమ్మ కోసం.... అన్నారాంటీ " అని చెప్పాడు
విరాజ్.
"సరే బాబు... దేనికైనా కాలమే అన్ని సమస్యలకు
సమాధానం చెబుతుంది. అంతవరకు మనం వేచి
ఉందాం " అంది శకుంతల.
(ఇంకా ఉంది)
ఒకటి అయిపోదామా ఊహవాహినిలో (30వ భాగం)
" అయితే మీకు ఒక చిన్న విన్నపం ఆంటీ. "
" ఏమిటి విరాజ్ అది? "
" హరిత ఎండలో తిరిగి ఉద్యోగం చేయడం
నాకు ఇష్టం లేదు ఆంటీ... అసలు మీకు వచ్చే జీతము, అంకుల్ ఫామిలీ పెన్షన్ మీకు
సరిపోతుంది. ఇక హరిత ఉద్యోగం చేయడం అవసరమా? "
" నేనా మాట ఎప్పుడో చెప్పాను బాబు. నా కాళ్ళ మీద
నేను నిలబడ్డ నాకు తెలియాలి కదా అమ్మ అంటుంది. "
" ఏ హరితా..నీ ఉద్దేశం ఏమిటి?"
" ప్రస్తుతానికి కొంతకాలం ఏ ఉద్యోగం చేసే
ఉద్దేశం నాకు లేదు విరాజ్. చేయదలచినపుడు మాత్రం కచ్చితంగా నీడ పట్టునుండే ఉద్యోగమే
చేస్తాను. సరేనా? "
" గుడ్ గర్ల్. మరి వస్తానాంటీ.. వెళ్లొస్తాను
హరిత!" అని చెప్పి వెళ్లిపోయాడు విరాజ్.
******
తనని చూడాలనిపించినప్పుడల్లా విరాజ్ కి మెసేజ్
పెడుతూనే ఉంది హరిత.
ఆమె మెసేజ్ పెట్టినప్పుడల్లా విరాజ్ వచ్చి హరితను
చూసి వెళ్తూనే ఉన్నాడు.
కాలగమనంలో మూడు నెలలు గడిచిపోయాయి.
"విరాజ్! ఈరోజు సాయంత్రం మనం శ్రీనగర్ కాలనీ
కోవెలకు వెళ్లాలి. వీలు చూసుకుని గలవా.?
"
" మనిద్దరమేనా? మీ అమ్మగారు కూడా వస్తారా?
"
" ఈసారి మాత్రమే అమ్మ కూడా వస్తుంది. బహుశా ఆ తర్వాత అవసరం ఉండదు."
"అంటే?"
" దానికి సమాధానం ఆవిడే చెప్తుంది లే "
*******
అనుకున్న ప్లాన్ ప్రకారం ముగ్గురు కోవెలలో కలిశారు.
భగవంతునికి పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయ
కాకుండా కళాఖండ్ స్వీట్ కూడా నైవేద్యంగా సమర్పించి, విరాజ్
గోత్రంతో అష్టోత్తర పూజ చేయించింది
శకుంతల.
దర్శనం అనంతరం వారి యొక్క స్థానాల్లో చతికిలపడ్డారు.
" నీకు శుభవార్త బాబు. " అంటూ కలాకండ్
స్వీట్ తీసి విరాజ్ కి తినిపించమని హరితకు
ఇచ్చింది శకుంతల.
కళాఖండ స్వీట్ ను విరాజ్ నోట్లో పెట్టింది హరిత. ఆ
తర్వాత శకుంతల కూడా ఒక ముక్క తీసుకుని మళ్ళీ విరాజ్ కి తినిపించింది.
" ఏమిటి
ఆంటీ అంత మంచి శుభవార్త? "
" నువ్వు తండ్రి కాబోతున్నావ్ బాబు. హరితకి మూడో
నెల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. "
జీవితంలో అత్యున్నతమైన బహుమతి పొందినంతగా
వెలిగిపోయింది విరాజ్ ముఖం.
" నిజమా నిజమా ఆంటీ.. నిజమా హరితా? " సంతోషాతిరేకంతో ప్రశ్నించాడు
విరాజ్.
అవునన్నట్టు తల ఊపి సిగ్గుతో తల దించుకుంది హరిత.
అంతటి ఆనందాన్ని భరించడం కోసం ఛాతీని విశాలం
చేసుకోవాలి అన్నట్లు ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు విరాజ్.
అతని అంతరంగంలో ఆనందపు కెరటాలు ఉవ్వెత్తున ఎగసి
పడుతున్నాయి.
రెండు నిమిషాలు గడిచేయి.
విరాజ్ వచ్చి హరిత పక్కగా కూర్చున్నాడు.
" అయితే ఈ విషయంలో నువ్వు నన్ను క్షమించాలి
బాబు." అంది శకుంతల తప్పు చేసినట్టుగా.
" మిమ్మల్ని క్షమించేంత గొప్పవాడిని కాదండి
నేను. మీరు చేసిన పని వెనక ఒక అమ్మ మనసు దాక్కుంది. సమాజానికి సమాధానం
చెప్పుకోవాల్సిన అవసరం కూడా దాక్కుంది. హరిత నాకు అని చెప్పింది. మా నాన్నగారు ఏ
ఉద్దేశంతో నేను ప్రేమ పెళ్లి చేసుకో కూడదని పథకం వేశారో... దానికి మీరు చేసిన
పద్ధతే సరిఅయినది. ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉండాలి కదా. నేను మిమ్మల్ని సమర్థిస్తాను
ఈ విషయంలో. కాదంటే ఏం చేయాలో కూడా నాకు తెలుసు. మీరు నిశ్చింతగా ఉండండి. "
అన్నాడు విరాజ్ ధైర్యం చెబుతున్నట్టుగా.
"అవునమ్మా. పెళ్లి కానంతవరకు ఆడపిల్ల కన్నా కన్నతల్లిని మించిన స్నేహితురాలు
ఉండదు. పెళ్లయ్యాక భర్తని మించిన స్నేహితుడు మరొకరు ఉండరు. అందుకే విరాజ్ తో
నువ్వు చేసింది అంత చెప్పేసాను.
నన్ను క్షమించమ్మా " అంది హరిత.
" నేను ఎంత పెద్ద తప్పు పని చేశానా... దానికి
విరాజ్ ఎంత బాధ పడతాడా? అని నిచ్చే నాలో నేను మూడు నెలలుగా కుమిలిపోతున్నానమ్మ... ఇటువంటి
ఉత్తముడైన వ్యక్తి ముందు స్నేహితుడిగా తర్వాత ప్రేమికుడిగా, ఆ
తర్వాత భర్తగా దొరకడం నీ అదృష్టం. నేను నిశ్చింతగా ఉంటాను " అంది శకుంతల.
" ఈ ఆరు నెలల పాటు మీరు హరితను జాగ్రత్తగా చూడండి ఆంటీ. పాపో, బాబో పుడితే ఆ బిడ్డ మా భవిష్యత్తు
నిర్ణయిస్తుంది.
ఏ చిన్న అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి ఆంటీ. ఏది అలా చేస్తాను అని
మాట ఇవ్వండి" అడిగాడు విరాజ్ శకుంతల ఎదురుగా చేయి చాచి.
" తప్పకుండా చేస్తాను బాబు. నీ భార్య బాధ్యత
నువ్వే తీసుకుంటానంటే నాకు అంతకన్నా కావాల్సిందేముంది? " అంది సంతోషంగా శకుంతల.
*******
ఎప్పుడూ లేనిది విరాజ్ రకరకాల పిల్లల బొమ్మలు కొని తన
గదిలో తనకి కనిపించేలా అమర్చుకోవడం చూసి ఆశ్చర్యపోయింది విశాలాక్షి.
" ఏమిట్రా ఆ పని. కడుపుతో ఉన్న ఆడవాళ్లు అలాంటి
పని చేస్తే వాళ్లకి పండంటి బిడ్డలు పుడతారని అలా చేస్తారు. నీకు ఇదేం పిచ్చి రా? "
" రేపు నా భార్యకి అలాంటి పండంటి బిడ్డ
పుట్టాలని నా కల " అన్నాడు విరాజ్.
" నువ్వేమో ప్రేమ పెళ్ళో అంటావు. మీ నాన్న ఆ క్షితిజని చేసుకోమంటాడు. అది ఇప్పటికే ఎవరితో తిరిగి
కడుపు చేయించుకుంటే దాన్ని తీయించడానికి నానా యాతన పడింది వాళ్ళ అమ్మ. ఇప్పుడు దానికి
సంబంధాలు చూస్తున్నారు. దాన్ని నువ్వు చేసుకుంటాను అని అన్నావంటే మాత్రం నేను
చస్తే ఒప్పుకోను."
" అమ్మ నువ్వే ఒక న్యాయం చెప్పు. పెళ్లికి ముందు
కడుపు చేయించుకుందని దాన్ని చేసుకోవద్దు
అంటున్నావ్. నీకే ఒక ఆడపిల్ల ఉండి ముందు బిడ్డని కని అప్పుడు పెళ్లి చేస్తాను అని ఎవరైనా నియమం పెడితే ఒప్పుకుంటావా? "
" ఆనియమం పెట్టినవాడిని చెప్పు పుచ్చుకొని
కొడతాను. ఆడదంటే అంత లోకువా మగవాడికి?
అడిగిన వెధవ కూడా ఒక అమ్మకు పుట్టి ఉంటాడు కదా. ఏమనుకుంటున్నాడు
అసలు వాడు ఆడది అంటే? ఆడదంటే భద్రకాళి రా... ఇక జీవితంలో ఈ
దుర్మార్గున్ని భరించలేను అనుకున్నాక ఆడది
చివరగా తీసుకునేటువంటి నిర్ణయమేరా భద్రకాళి అవతారం. అలాంటి వెధవల్ని వాడి పాపిష్టి
ఆలోచన మరొకరికి చేరకముందే వాడిని నరికి పాతేయాలి. "
" అదిగో ఆనియమమే పెట్టాడమ్మా మీ ఆయన.
"అసలు మీ నాన్న ఆ నియమం ఎందుకు పెట్టారంటావ్? "
" ఏముంది.. నేను ఏ బీద అమ్మాయినో ప్రేమించాను
అనుకో. అది డబ్బుకి ఆశపడి నన్ను ప్రేమిస్తుందో, లేదా నిజంగా ప్రేమిస్తోందో
తెలుసుకోవడానికిట. నేను నా మనసుకు నచ్చిన అమ్మాయిని మూడేళ్లు
ప్రేమించాలట. ఆ అమ్మాయి గర్భవతి అయ్యాక
ఆ బిడ్డను తీసుకొచ్చి ఆయనకు
చూపించాలట. అప్పుడు కూడా ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తూ ఉంటే ఆ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడట. అలా
అయితేనే నా పెళ్లి చేస్తానని నాకు మూడేళ్ల క్రితమే అగ్రిమెంట్ కూడా
రాసిచ్చాడు. నువ్వు బాధ పడతావని ఇంతకాలం నీకు చెప్పలేదు.
ఆయనకేం?
బంగారం లాంటిది నిన్ను చూసి పెళ్లి చేసుకున్నాడు. చక్కగా పిల్లల్ని
కన్నాడు. జీవితంలో ఆనందాలన్ని అనుభవించేసాడు.
మూడేళ్ల క్రితమే నాకు పెళ్లి చేసి ఉంటే నా పెళ్ళాంతో సుఖంగా సంసారం చేసుకుని
ఉండేవాడిని కదా. మూడేళ్ల సంవత్సరాల జీవితాన్ని కోల్పోయిన నేను ఇంకో నాలుగు ఏళ్ళు
పోతే ముదురు బెండకాయనైపోతాను.
జీవితంలో పెళ్లి యోగ్యత లేని నాకు ఇలా పిల్లల
బొమ్మలతో అయినా ఆడుకుందామని నా గదిలో పెట్టుకుంటున్నాను అమ్మ. " అన్నాడు
విరాజ్ దీనంగా.
" మీ నాన్న అంత పని చేశారా?ఉన్న ఇద్దరు కొడుకులు ఒకడు విదేశాలు
పట్టిపోయాడు. ఉన్న ఒక్క కొడుకుకి సుఖంగా పెళ్లి చేయకుండా ఈయనకి ఈ దరిద్రపు ఆలోచనలు
ఎవరి నేర్పారో?
మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం తుంగలో తొక్కేటువంటి
వాళ్ళు, ఆ ఇంగ్లీష్
వాళ్ళని చూసి ఇలా తయారయ్యారు.
అవ్వ! ఎవరైనా వింటే
నవ్విపోతారు. ఇంక ఈ సమాజంలో పెళ్లిళ్లు, సాంప్రదాయాలు, పెటాకులు
ఏవీ ఉండవు. నాన్న తల్లిగా నీకు ఒక్క మాట చెప్తున్నాను.
నీకు ఇష్టమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా. నేను మీ ఇద్దరికీ
హారతిచ్చి లోపలికి తీసుకొచ్చేస్తాను."




No comments:
Post a Comment