మీ కోసం
కల్లె శాస్త్రి
అదొక సెమీ
కార్పొరేట్ హాస్పిటల్. అయితే కార్పొరేట్ హాస్పిటల్ కి ఏ మాత్రం
తీసిపోదు.అన్నిహంగులు ఉన్నాయి.అయితే చార్జీలు మాత్రం చాలా తక్కువ. అందుకే ఎప్పుడూ
ఎనభై శాతం నిండి ఉంటుంది.రాజీవ్ హాస్పిటల్ లోకి రాగానే లాంజిలో అప్రయత్నంగా అటూ
ఇటూ చూశాడు ఆ ఆంటికోసం.గత వారం రోజులుగా ఆవిడను గమనిస్తున్నాడు ఆమెని.ఎవరితోనూ
మాట్లాడకుండా కూర్చొని ఉంటుంది.చేతిలో ఓ వైర్ బాగ్ దానిలో ఓ ఫ్లాస్క్.ఒక్కోసారి
కాఫీ తాగుతూంటుంది.
రాజీవ్ మదర్ ను
అడ్మిట్ చేశారు వారం రోజులుగా రోజూ కనీసం ఓ అరగంట లాంజి లో గడుపుతుంటాడు.ఎందుకు
రాలేదు. వాళ్ల వాళ్ళను డిశ్చార్జ్ చేశారా ,ఇంతకు తనకెందుకు అంత ఇంట్రెస్ట్,ఆవిడ ఎవరో ,ఎక్కడ ఉంటుదో
తెలియదు,కనీసం పేరు కూడా
తెలియదు. తన క్యురియాసిటికి నవ్వుకుంటూ సోఫా లో కూర్చుని మెసేజ్ లు చూడసాగాడు. ఓ
పావుగంట తర్వాత,వస్తున్న ఆవిడను
గమనించాడు. ఎందుకో తెలియని ఆనందం వేసింది.వచ్చి రాజీవ్ పక్కన సోఫాలో కూర్చుని చీర
కొంగుతో చెమటను తుడుచుకోసాగింది.
‘మంచి నీళ్ళు
తెచ్చివ్వ మంటారా ఆంటీ ‘అని అడిగాడు రాజీవ్.
ఉన్నాయి! బాబు అని బాగ్ లో ఉన్న బాటిల్ తీసి నీరు తాగి మరలా లోపల పెట్టేసి, ‘మీ వాళ్ళు ఎవరున్నారు బాబు’ అంది.
మా అమ్మ ను వారం
క్రిందట అడ్మిట్ చేశాం.
ఇప్పుడు బాగానే
ఉంది. ఓ రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయవచ్చు.
మీ వాళ్ళు
ఎవరున్నారు అని అడగాలని అనిపించింది రాజీవ్ కి.
మొదటి పరిచయం
లోనే అంత చనువు తీసుకునేందుకు బిడియ పడ్డాడు.
‘బాబు కాఫీ
తాగుతావా’ అంది ఆమె.
రాజీవ్ సమాధానం
చెప్పె లోపే చిన్న కప్పు లో ఫ్లాక్ లోంచి వేసి ఇచ్చింది. ఫిల్టర్ కాఫీ అద్భుతంగా
అనిపించింది రాజీవ్ కి.
మీ వాళ్ళు
ఎవరున్నారు అని అడిగాడు.ప్రశ్న విననట్టు ఎటో చూస్తుంది.
ఇంతలో డాక్టర్
పిలుస్తున్నాడు అని నర్స్ రావడంతో వెళ్ళిపోయాడు.
డాక్టర్ తో
మాట్లాడి ,అమ్మ దగ్గరికి
వెళ్ళి టిఫిన్ తినిపించి,కాస్సేపు
అమ్మతోనే ఉండిపోయాడు.
తిరిగి
వచ్చేసరికి ఆవిడ లేదు.
ఏదో తెలియని వెలితి , అస్పష్టమయిన నిరాశ కలిగింది. ఏమిటీ అనుభూతులు,కొన్నిరోజుల క్రితం ఆవిడేవరో తనకు తెలియదు.మౌనంగా కొద్దిసేపు కూర్చొని ఏదో గుర్తొచ్చి నట్టు ,రిసెప్షన్ లో ఆవిడ గురించి వాకబు చేద్దామని వెళ్లి, 'మేడమ్ కొద్ది సేపటి క్రితం అని ప్రారంభించి ఆమె ను ఎలా కలిసింది ,కాఫీ తాగింది వివరించాడు.ఆమె ఓ క్షణం ఆలోచించి బహుశా మీరు యశోద గారి గురించి అనుకుంటా అని .ఆవిడ వాళ్ళు ఎవరూ ఇప్పుడు లేరు.అయితే ఏడాది క్రితం వాళ్ళ అబ్బాయి చేరాడు.మేజర్ ఏక్సిడెంట్ అయి అడ్మిట్ అయ్యాడు.దాదాపు మూడు నెలలు ఉన్నాడు. అయితే బ్రతక లేదు.ఆవిడ డీప్ షాక్ లో కి వెళ్ళింది.ఇప్పుడిప్పుడు పరవాలేదు.అయినా వాళ్ళ అబ్బాయి లేడన్న నిజాన్ని ఆమె ఒప్పుకోవడం లేదు.రోజు వచ్చి ఓ రెండు గంటలు ఉంటుంది.ఆమె ను సానుభూతితో అర్థం చేసుకున్న మా హాస్పటల్ యాజమాన్యం ఆమె రాకపోకల గురించి ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు.ఎందుకో ఈ రోజు రాలేదు. బహుశా ఆరోగ్యం సరిగా లేదేమో అనింది.
నిజం గ్రహించ
దానికి ఓ పది నిమిషాలు పట్టింది రాజీవ్ కి.
థాంక్స్ చెప్పి
వెళ్ళిపోతూ మరలా వెళ్లి .మేడమ్ ఆవిడ అడ్రస్ దొరుకుతుందా అడిగాడు.
ఓ నిమిషం
ఆలోచించి
మీకెందుకు అంత
ఇంటరెస్ట్ ఆవిడ పై అంది.
వెంటనే సమాధానం
చెప్పలేక పోయాడు.
వీలయితే కలవాలని
అన్నాడు.
మరింత ఆశ్చర్య
పోయింది.
మరోమాట కు అవకాశం
ఇవ్వకుండా వచ్చేశాడు.
తరువాత కొన్ని
రోజులు ఆ విషయం గుర్తుకు రాలేదు.
ఒక రోజు అమ్మను
చెకప్ కోసం హాస్పిటల్ కి తీసుకెళ్ళాను. హాస్పిటల్ లోపలికి వెళ్ళగానే ఆవిడ
గుర్తొచ్చింది.ఈ వీకెండ్ లో తప్పకుండా వెళ్లాలని డిసైడ్ చేసుకున్నాడు.
కాలింగ్ బెల్
నొక్కాడు.తలుపు తీసేంత లో,అమే తన రాకను ఎలా
తీసుకుంటుందో , అలా
చెప్పాచేయకుండా వచ్చి తప్పుచేసాడా,ఎందుకొచ్చావని
అడిగితే ఏం చెప్పాలి, అని ఆలోచించ
సాగాడు.ఏదో తెలియని అత్రత,కొంచం ఆలోచించి
ఉండాల్సింది.వెళ్లి పోదాం అని వెనక్కి తిరిగే లోపలే తలుపు తీసిన శబ్ధం అయింది.అమే
తలుపు తీసి ఎవరు కావాలి అని , రాజీవ్ ను చూసి,
ఓ క్షణం ఆశ్చర్య పోయింది.
ఏమిటి బాబు ఇలా వచ్చావు ,అని రా లోపలికి అంటూ ఆహ్వానించింది. మీ అమ్మ
ఎలా ఉన్నారు అంది
బాగున్నారా మేడమ్,
మిమ్మల్ని చూడాలనే
వచ్చాను.
చాలా సంతోషం బాబు,కూర్చో! కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని రాజీవ్
వద్దని వారిస్తున్నా వెళ్లి పదినిమిషాల్లో కాఫీ రెండు కప్పుల్లో తెచ్చి రాజీవ్
చేతికిచ్చి తను ఎదురుగా సోఫాలో కూర్చుంది.
ఓ పది నిమిషాలు
మాట్లాడుకున్నారు.
ఆవిడ మాటల్లో
ఎంతో ఆత్మస్తైర్యం.జీవితం పై ఎంతో అవగాహన.ఎంతో నేర్చుకోవచ్చు అమే దగ్గర
అనిపించింది రాజీవ్ కి.
మీ అబ్బాయి
గురించి చెప్పండి అన్నాడు.
వెంటనే సమాధానం
చెప్పక పోయోసరికి, అరే ఎందుకాడిగానా
అనుకున్నాడు.
'సారీ! మిమ్మల్ని
ఇబ్బంది పెట్టాను అన్నాడు నోచ్చుకుంటు.
'అదేమీ లేదు!
ఎక్కడనుండి చెప్పాలా అని ఆలోచిస్తున్నాను '.
వాడి పేరు శ
శాంక్ ,ఇంజనీరింగ్ రాంక్ లో పాసై
మంచి సాప్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం చేసేవాడు.
ఏదో సాధించాలన్న
పట్టుదల ఉండేది..ఈ ఇయర్ లో పెళ్లి చేయాలని అనుకున్నాను.
అయితే విధి మరోలా
చేసింది.తన స్నేహితుడు ఆస్ట్రేలియా నుండీ వస్తున్నాడని, ఎయిర్పోర్ట్ కెళ్ళి తీసుకురావాలని బయలుదేరాడు.,మధ్యలో ఏక్సిడెంట్ అయింది. మల్టిపుల్ ఆర్గాన్స్
డ్యామేజ్ అయ్యాయి.దాదాపు నాలుగు నెలలు హాస్పటల్ లో ఉన్నాడు.ఎంతో శ్రమ పడ్డాం.అయితే
వాడు బ్రతక లేదు.ఎంతో బాధాకరమైన విషయాన్ని చాలా క్లుప్తంగా గా,నిబ్బరంగా చెప్పింది.
ఆరే చాలా ఘోరం
జరిగిపోయింది అమ్మగారు.అయామ్ సారీ! అన్నాడు అప్రయత్నంగా,
పరవాలేదు.ఇప్పుడు
అంత బాధ కలగడం లేదు. బహుశా నా గుండె అలవాటు పడిందనుకుంటా, కొన్ని రోజులు బ్రతుకు శూన్యంగా అనిపించింది.
అందుకే రోజు
హాస్పటల్ కి వచ్చేదాన్ని.ఒకటి రెండు గంటలు కూర్చొని వెళ్ళేదాన్ని .అయితే రాను రాను
అలవాటయింది.
అమ్మగారూ మీకు
పెన్షన్ వస్తుందా!
నాకు ఆర్థికపరమైన
ఇబ్బందులు ఏమి లేవు!.అంతవరకు నేను అదృష్ట వంతురాలనే.
అయితే ఒంటరిగా,ఏమి పని చేయకుండా ఉండటానికి నేను
ఇష్టపడను.ఏదయినా చేయాలి అంది.
మీరు ఏమి
అనుకోకపోతే ,నేనేమైనా మీకు
సహాయపడగలనా. శని ఆదివారాలు నేను ఫ్రి నే
అవసరం లేదు బాబూ!
అని అన్నట్టు నీకు పెళ్లయిందా అంది
సెటిల్ అయింది,మా చుట్టాలమ్మాయే, ఈ సంవత్సరం లో చేసుకోవాలని.అమ్మకు కూడా ఏమి
చేతకావడం లేదు అన్నాడు రాజీవ్..
కాసేపయ్యాక నేను
వస్తాను మేడమ్.అని బయలు దేరాడు.
సరే బాబు థాంక్యూ
వచ్చినందుకు అని లోనికి వెళ్ళిపోయింది.
బయటికి వచ్చిన
రాజీవ్,ఆరే!ఫోన్ నంబరు
తీసుకోలేదే? అని అనుకొన్నాడు.
మరలా వెళ్లి అడగటం మర్యాద కాదని వెళ్ళిపోయాడు.
రాజీవ్ వెళ్ళగానే
' ఈ అబ్బాయి మంచి కుర్రాడే!
, ఫోన్ నంబర్ తీసుకోలేదని
గుర్తొచ్చింది.
***
హాస్పిటల్
రిసెప్షన్ లో చాలా రష్ ఉంది. శనివారం అవటం వల్ల డిస్చార్జ్ లు ఎక్కువ ఆరోజు.
సాఫ్టువేర్ వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు.
యశోద గారిని
చూడగానే
ఎలా ఉన్నారు
మేడమ్. ఏమయినా పని పైన వచ్చారా , ఆదరంగా
పలకరించాడు అడ్మిన్. నేను మీ తోనే కాస్త మాట్లాడాలి .
రండి మేడం నా
చేంభర్ లోకి.
వెళ్ళగానే
కూర్చోండి ,కూల్ డ్రింక్
తాగుతారా అన్నాడు.
ఇప్పుడేం వద్దు
అని
చూడండి మా
అబ్బాయి పోయాకా కొన్ని రోజులు బ్రతుకు చాలా పేలవంగా గడిచి పోయింది.
ఏమయినా చేయాలన్న
ఆలోచన వచ్చింది.ఇప్పుడు మిమ్మల్ని కలిసే ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే.మా అబ్బాయి పోయాక
వచ్చిన ఇన్సూరెన్స్ మొత్తంలో కొంత భాగాన్ని మీ హాస్పటల్ లో స్టాఫ్ కి ఇయ్యాలని
ఉన్నాను. అలాంటి స్కీమ్ ఏదయినా ఉందా అంది.
చాలా థాంక్స్
మేడం.స్టాఫ్ వెల్ఫేర్ ఫండ్ అని ఒకటి ఉంది.ఈ హాస్పిటల్ లో పనిచేసే మెత్తం స్టాఫ్,
వెల్ఫేర్ కోసం ఏర్పాటు
చేసింది.దానికి ఒక కమిటీ ఉంది.స్టాఫ్ లో ఎవరికైనా సహాయం కావాలంటే ఆ కమిటీ కి
అప్లికేషను పెట్టుకోవాలి. మీ డబ్బు సురక్షితంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు
తీసుకుంటుంది ఆ కమిటీ.
సరే అయితే! నా
డబ్బు గురించిన ఆలోచన లేదు. అయితే అది అన్ని రకాల సిబ్బందికి అందాలి,అదే నా కోరిక అన్న యశోద తో తప్పకుండా జాగ్రత్త
తీసుకుంటాం. అన్నాడు హాస్పిటల్ సి ఇ ఒ.
కొన్ని
డాక్యుమెంట్స్ పైన మీ సంతకం కావాలి.అని అకౌంటెంట్ పిలిచి, రెడీ చేయమని చెప్పాడు.
బాబు ఇంకో చిన్న
అభ్యర్థన అన్న అమే తో ఏమిటి మేడమ్ అన్నాడు.
నేను మీ
హాస్పిటల్ లో ఒక హెల్ప్ డెస్క్ ఓపెన్ చేయాలని ఉన్నాను. మీరు పర్మిషన్ ఇవ్వాలి.ఒక
చిన్న టేబుల్ కుర్చీ వేసుకొని,నాకు తోచిన
విధంగా ,వచ్చిన రోగులకు,వాళ్ళ ను తీసుకొచ్చిన వాళ్లకు సహాయ పడుతూ
ఉంటాను.నాకు తెలిసి వచ్చిన వాళ్ళలో చాలా మంది చదువుకోని వారు,లోపలికి వచ్చాక,ఎవరిని కలవాలో తెలియదు.జబ్బు గురించి అవగాహన
ఉండదు.ముఖ్యంగా సీరియస్ నెస్ ఉండదు.అలాంటి వారికి నాకు తోచిన సలహా ,లేదా నా కు తెలియని వాటిని మీ ద్వారా
తెలుసుకొని ,వాళ్ళ కు అర్థమైన
భాష లో చెప్పి వాళ్ళను,మానసికంగా తయారు
చేయాలని ఒక సంకల్పం. ఇంకో ముఖ్యమైన పని ఏమంటే,మెడికల్ ఇన్సూరెన్స్ గురించి,వాటి ఉపయోగాలు,,ఒకటి, రెండు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా సమాచారం సేకరించడం,లేదా అవసరమైనప్పుడు ,వాళ్ళ నుండి సహాయం అర్తించడం లాంటి పనులు
చేయాలని.ఇవన్నీ చేయాలంటే ముఖ్యంగా మీ సహకారం కావాలి.మీరు నా కీ సహాయం చేయగలరా.
ప్రస్తతానికైతే
నేను ఒక్కదాన్నే,చూద్దాం తరువాత
వాలంటీర్స్ దొరుకు తారేమో.
హాస్పిటల్ C
E O ఏమి మాట్లాడాక పోయేసరికి
' ఏమి సార్! నా
ఉద్దేశ్యం మీకు నచ్చలేదా,లేక నావల్ల ఏం
అవుతుందని అనుమానమా!'.అంది యశోద.
అలా కాదు మేడమ్ !
మీ అభిప్రాయాలు ఆలోచనా విధానం బాగా నచ్చాయి.అయితే అవి ఎంతవరకు కార్యరూపం లోకి
వస్తాయి,వచ్చే పేషంట్స్
మీ సలహాలను ఎలా తీసుకుంటారు అని ఓ చిన్న అనుమానం అన్నాడు.
బాబూ! ఇక్కడ
మీకొక విషయం స్పష్టం చేయాలి.నా హెల్ప్ డెస్క్ కి వచ్చే వాళ్లకు ,నేను ఒక మాట చెబుతాను.నేనిచ్చే సలహాలకు,
హాస్పిటల్ కి ఏమి సంబంధం
లేదు.నేనిచ్చే సలహాలు కేవలం నా వ్యక్తిగత అభిప్రాయలు మాత్రమే.దాని వల్ల మీ
హాస్పిటల్ రెపుటేషన్ ఏ మాత్రం భంగ కలగ నీయను.
బాబూ! ఈ
హాస్పిటల్,మా అబ్బాయిని
ఉన్న ఆరు నెలలు జాగ్రత్తగా చూసుకుంది.వాడి ఆయుస్సు తీరి వాడు పోయాడు.అందుకే నాకు
ఏది సెంటిమెంట్ ఇక్కడ అంది యశోద.
అలాగే మేడమ్ !
మీకు కావల్సిన ఏర్పాట్లూ చేస్తాం అన్నాడు.
ఇంతలో హాస్పిటల్
అకౌంట్స్ ఆఫీసర్,డొనేషన్ కి
సంబంధించిన పేపర్స్ రెడీ చేసి తెచ్చాడు.
యశోద చేతికి
ఇచ్చాడు చూడమని.ప్రతి పేపర్ క్షుణ్ణంగా పరిశీలించి,సరిగా ఉంది అని తన పేరున్న చోట సంతకం చేసి.25 లక్షల చెక్ సైన్ చేసి ఇచ్చింది.
హాస్పిటల్ C
E O కూడా సంతకం చేసి,ఒక కాపీ యశోద గారి కిచ్చాడు.. చెక్ అకౌంట్స్
ఆఫీసర్ కిచ్చి రిసిప్ట్ ఇవ్వమని చెప్పాడు.
ధన్యవాదాలు అంటూ
! వెళ్ళడానికి బయలు దేరింది.
మేడమ్ మేము మీ
హెల్ప్ డెస్క్ కి సంబంధించిన పని పూర్తి చేసి మీకు కబురంపుతాం.మీరు మొదలు
పెట్టచ్చు అన్నాడు.
థాంక్యూ అని
చెప్పి బయలు దేరింది .
ఓ వారం లో అమే తన
పని ప్రారంభించింది.
.....
***




No comments:
Post a Comment