ఒకటైపోదామా ఊహల వాహినిలో -30
మరో పావుగంటలో
ఇద్దరు అచ్చు ఒకేలా తయారై బయటికి వచ్చిన హరిత, సరితలను చూస్తూనే విస్తుపోయారు
శకుంతల,బబిత.
" అదేంటి సరిగాడు... ఈ టైంలో ఇద్దరు ఒకలాగే
తయారయ్యారు. ఇదంతా నీ బ్యూటీ కోర్స్ ప్రతిభేనా? " కూతుర్ని అడిగింది బబిత.
" అవునమ్మా. ఒకసారి హరీష్ మావయ్య దగ్గరకి వెళ్ళి
వస్తాం."
" ఇప్పుడు ఎందుకమ్మా..."
" చిన్న పని ఉంది వచ్చాక చెప్తాను గా. రా అక్క
" అని అర్థం తీసుకుని వెళ్ళిపోయింది సరిత.
*****
కాలింగ్ బెల్ శబ్దం కావడంతో స్నానం చేద్దామని టవల్
చుట్టుకుని బాత్రూంలోకి వెళ్ళబోతున్న
విరాజ్ డోర్ బోల్టు తీసి
" ఏం కావాలి? " అని అనబోయి ఎదురుగా ఎదురుగా
నిలబడిన వ్యక్తిని చూసి " హరిత
నువ్వా!" అన్నాడు విస్తుబోయి
" హరిత?
హరిత ఎవరండీ? మై నేమ్ ఈజ్ సరిత."
"ఓహో. ప్రాస ఉన్న పేరు పెట్టుకుంటే
గుర్తుపట్టలేను అనుకున్నావా?
లోపలికి రా!"
అన్నాడు
ఆమె ధైర్యంగా లోపలికి వచ్చి కాట్ మీద పరిచిన బ్లాంకెట్, దిళ్ళు కొద్దిగా నలిగినట్టు గమనించి
వాటిని ముడతలు పోయేలా సరిచేసి
వెనుదిరిగింది.
అమాంతం అమలు వెనకనుంచి వాటేసుకున్నాడు విరాజ్.
" అమ్మ దొంగ!. నన్ను ఇవాళ కవ్వించి ఏడిపించాలని
వచ్చావు కదూ " అన్నాడు ఆమె చెవుల్లో గుసగుసగా.
" ప్లీజ్ వదలండి సార్. నా పేరు నిజంగా సరిత నైట్
డ్యూటీ చేయడానికి వచ్చాను. రూమ్ లో కస్టమర్ పడుకునేటప్పుడు అన్ని వసతులు సరిగ్గా
ఉన్నాయో లేదో చూడడం నా బాధ్యత"
అంది ఆ అమ్మాయి.
విరాజ్ ఒక్కసారిగా అమ్మాయిని వదిలేసి జారిపోబోయిన
టవల్ని సరిగా కట్టుకున్నాడు.
ఆమె చటుక్కున బయటకి వెళ్ళిపోయి తలుపుల నుంచి మొఖం
ఒకటి లోపలికి పెట్టి
" ఇలా అబద్దం చెబితేనే వదిలేస్తే ఇక నా బతుకు
శివరాత్రే. గుడ్ నైట్ విరాజ్ " అని చెప్పి పారిపోయింది.
విరాట్ ఒక్కసారిగా అయోమయంగా కాట్ మీద
కూర్చుండిపోయాడు.
అంటే వచ్చింది హరితే అన్నమాట.ఛ. మంచి ఛాన్స్ మిస్
చేసుకున్నాడు. ఒక్క ముద్దు పెట్టుకుని ఉంటే
ఎంత బాగుండేది?
" నువ్వు ఎంత చవటవి రా బంగారు లాంటి ఛాన్స్ మిస్
చేసుకున్నావు కదరా!" తాను అన్న మాటలు విని
అద్దంలో తన ప్రతిబింబం తనని వెక్కిరిస్తుంటే
" ఈసారి హరిత ఒంటరిగా దొరికితే వదిలేది లేదురా
" అని ఆ ప్రతిబింబానికి సవాల్ విసిరి
నిరాశగా లేచి బాత్రూం లోకి దూరాడు విరాజ్.
ఇద్దరు కిందకు దిగి వచ్చేసాక హరితతో సరిత
" బావగారు చాలా కసిగా ఉన్నారక్క.
రేపు పెళ్లయ్యాక ఎలా తట్టుకుంటావేమో? "
అన్న సరిత నెత్తి మీద ఒక చిన్న మొట్టికాయ మొట్టి
" ఛీ పోవే" అని సిగ్గు పడిపోతూ
చెల్లి వెంట నడిచింది హరిత.
సరిగ్గా అక్కడ అదే సమయంలో విరాజ్ ఇంట్లో...!
పిల్లాడు మధ్యాహ్నం కూడా భోజనానికి రాలేదండి. అలా
రాకపోతే అమ్మ రావట్లేదు అని చెప్పి ఫోన్ చేస్తాడు. రాత్రి 10 గంటలు దాటింది. ఈ
రెండో షాపు పెట్టాక ఎట్టి పరిస్థితులలోను 9గంటలకు
ఇంటికి వచ్చేస్తుండేవాడు.
షాప్ లో ఉన్నప్పుడైనా కనీసం 'అమ్మా ఏం చేస్తున్నావ్ అని ఫోన్
చేసేవాడు' వాడు ఇంతవరకు రాలేదంటే నాకు చాలా కంగారుగా ఉండండి.
" భర్తకి టిఫిన్ పెడుతూ అంది విశాలాక్షి.
" కుర్ర వయసు. ఏ ఫ్రెండ్స్ ఇంట్లోనే
ఉంటాడు"
అని తేలికగా తేల్చేసి మాట్లాడకుండా టిఫిన్ ముగించాడు
గవర్రాజు.
డైనింగ్ టేబుల్ దగ్గర కబుర్లు అస్సలు అతనికి నచ్చవని
అప్పుడు గుర్తొచ్చింది విశాలాక్షికి.
టీవీ ముందు సోఫాలో కూలబడ్డ గవర్రాజు వార్తలు
చూడసాగాడు. విశాలాక్షి మందులు పెట్టె తీసుకొచ్చి అతను ముందు పెట్టి కూర్చుంది.
అతను మందులు పెట్టి తెరిచాడు.
అందులో పైనే నాలుగు మడతలుగా అసోసియేషన్ లెటర్ హెడ్
కాగితం.
" నాన్న నాకోసం వెతక వద్దు. రావాలనిపిస్తే
ఇంటికి వస్తాను. ఎప్పుడో తెలీదు - విరాజ్ "
" వీడికి మధ్య ఏదో రిమ్మ తెగులు పుట్టిందే. మీ
మీ రాజ్యం పెద్దమ్మ కొడుకు క్షితిజని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను.
పెద్దవాళ్లు చూపించిన సంబంధం చూసుకోక
ప్రేమో అంటూ తగిలిపోతున్నాడు. ఆ పిల్ల వాళ్ళ అమ్మ వాడికేదో మందో మాకో
పెట్టేశారు. దాని వెనకాల తిరుగుతున్నాడు. వాడితో మోజు తీరిపోయాక పొమ్మందేమో...
ఇంకేముంది మనసు పాడై ఏ పబ్బులోనో తాగి పడి ఉంటాడు. అంతా నా ఖర్మ." అని ఆ
కాయితాన్ని విశాలాక్షి ముఖాన విసిరేశాడు గవర్రాజు.
(ఇంకా ఉంది)




No comments:
Post a Comment