శ్రీథరమాధురి - 134 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 134

Share This

శ్రీథరమాధురి - 134

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృతవాక్కులు)




మన చుట్టుపక్కలంతా మనం బాసులనే చూస్తాము నాయకులను చాలా అరుదుగా చూస్తాము. బాస్ లు చాలా ఎంపికతో, ఇలాగే కావాలంటూ ఉంటారు, నాయకులు సమిష్టిగా, ఎంపిక లేకుండా ఉంటారు. తన టీం చేసిన పని తాలూకు ఘనతనంతా బాస్ ఎల్లప్పుడూ లాగేసుకుంటాడు. నాయకుడు నిస్వార్థమైన వాడు. బాస్ స్వార్థపరుడు, నిస్వార్ధంగా ఉండేలా తనను తాను మెరుగుపరచుకోవడానికి నిరాకరిస్తాడు. నాయకునితో పని చేయటం స్వర్గం. బాస్ తో పని చేయడం నరకం.

  ***
మనం బాసులను చూస్తూనే ఉంటాము, కానీ చాలా అరుదుగా ఒక నాయకుడిని చూడగలుగుతాము. విద్యార్హతలు నాయకత్వపు సామర్ధ్యానికి కొలమానం కావు. నేను ఎంతోమంది విద్యావంతులను చూశాను, వారికి అపారమైన అనుభవం ఉన్నా కూడా నాయకత్వ లక్షణాలు శూన్యం. ఒక నాయకుడికి 360 డిగ్రీల దృష్టి ఉంటుంది. అతను ఒక ద్రష్ట.  ఒక నాయకుడు, విశాలమైన దృక్పథంతో, అతని టీం లో ఉన్న సభ్యులందరూ ఇచ్చే సలహాలను వింటాడు. అవెంత చిన్న విషయాన్ని గురించి అయినా సరే! ఒక నాయకుడు పూర్తి సహనంతో ఉంటాడు. ఒక నాయకుడు చాలా త్వరగా నేర్చుకుంటాడు. ఆ నేర్చుకున్న దాన్నిబట్టి త్వరగా చర్యలు చేపడతాడు. విమర్శలకు గురైనప్పుడు కూడా, అతను ప్రశాంతంగా ఉంటూ, ఆ అంశంపై తన అభిప్రాయాలను సంక్షిప్తంగా వెల్లడించే ధైర్యాన్ని కలిగి ఉంటాడు.
అతడికి తన బృందంపై నమ్మకం ఉంటుంది వారిపై నమ్మకాన్ని కలిగి ఉండడాన్ని, నాయకుడు ఆస్వాదిస్తారు. తన సమర్ధతను, విజయాన్ని బృందం యొక్క చొరవగా అతడు చూపుతాడు.
తన బృంద సభ్యుల పట్ల నిష్పక్షపాతంగా ఉంటూ, వారి పనిని బట్టి వారికి బహుమతులను ఇస్తూ ఉంటాడు. మీరు ఒక నాయకుని కింద పని చేస్తే, మీరు ఎల్లప్పుడూ ఒత్తిడి లేకుండా ఉండేలా ఆయన దారి చూపుతారు. అది మీరు ఆ సంస్థలో గొప్ప సామర్ధ్యంతో పని చేసేందుకు మీకు సహకరిస్తుంది. ఒక నాయకుడు అహంకారం లేకుండా ఉంటాడు, పూర్తి ప్రేమతో నిండి ఉంటాడు. నిజమైన నాయకుడి కింద పని చేయాలంటే ఒకరు జీవితంలో అనుగ్రహాన్ని పొంది ఉండాలి. ఒక బాస్ వీటన్నిటికీ విరుద్ధమైన వారు, అతని కింద పనిచేయడం ఒక శాపం వంటిది.
  
***
అతను ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు, నన్ను చూడాలనుకున్నాడు. కాబట్టి నేను అతన్ని చూడటానికి వెళ్ళాను.
 
అతను - మీరెలా ఉన్నారు?
 
నేను నవ్వి, 'దైవానుగ్రహం వల్ల అద్భుతంగా ఉన్నాను' అన్నాను.

అతనిలా అడిగాడు 'నేను మిమ్మల్ని ఎందుకని రమ్మన్నానో మీకు తెలుసా?'
 
నేనిలా అన్నాను, 'నాకెలా తెలుస్తుంది? నేను చాలా చిన్నవాడిని. ఇటువంటి విషయాలు నాకు తెలియదు. అది ఏదైనా కావచ్చు. బహుశా, మీ శిష్యులలో ఒకరు మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టారు, మీరు దానికి పరిష్కారం వెతుకుతూ ఉన్నారు లేదా మీరు మీకు ప్రియమైన విద్యా ప్రాజెక్ట్ కు నిధులు సమకూరేలా నేను ప్రార్థించాలని మీరు భావిస్తున్నారు లేదా మీ ఆత్మకథను మీరే రాయాలా లేక ఇతరులతో రాయించాలా అన్న సందిగ్ధంలో ఉన్నారు. నాకు ఎలా తెలుస్తుంది?

అతను మాట్లాడలేకపోయాడు. అతని స్వరం ఉద్వేగంతో మూగపోయింది. అతని కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి.

నేను ఇలా అన్నాను 'మీ శిష్యుడు మిమ్మల్ని ఇరుకున పెట్టిన దాని గురించి చింతించకండి. ఒక రెండు వారాల సమయంలో అది పరిష్కారం అవుతుంది. మీ ప్రియమైన విద్యా ప్రాజెక్టు మొదలవ్వడానికి ఒక ఏడాది పడుతుంది. మీ జీవితం గురించి ఇతరులని వ్రాయమని అడక్కండి. అది అసహ్యంగా, ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మీ ఆత్మ కథను మీరే వ్రాయండి. మీ అనుభవాలు మీకే బాగా తెలుస్తాయి. ఇతరులు మీ అనుభవాల గురించిన వారి ఊహాజనితమైన కథలను వ్రాస్తారు. మీ జీవిత చరిత్రను ఒకరు వ్రాసే కంటే మీ ఆత్మ కథను మీరే వ్రాసుకోవడం మంచిది.

అతడు 'కృతజ్ఞతలు' అన్నాడు.
నేను నవ్వి బయటికి వచ్చేసాను. 

అతని శిష్యుడు నాతోపాటు కార్ దాకా వచ్చాడు.
 
అతని శిష్యుడు నన్ను ఇలా అడిగాడు 'మా గురువు ఒక్క మాటైనా మాట్లాడకుండా ఆయన సమస్యలను గురించి మీకు ఎలా తెలుసు?'
 
నేను అతన్ని చూసి నవ్వి, కన్నుగీటి, ఇలా అన్నాను, 'ఆయనకు చాలామంది శిష్యులు ఉన్నారు కదా! బహుశా మీలాగా అతనికి దగ్గరైన వారెవరో ముందుగానే నాకు సమాచారాన్ని ఊదేసారు. నాకు అన్నిచోట్ల గూఢచారులు ఉన్నారు.'

అతను చాలా గందరగోళానికి గురై, వెళ్ళిపోయాడు.
 
****

No comments:

Post a Comment

Pages